రుతుపవనాలు

15:33 - November 3, 2017

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైని మరోసారి వరదలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాత్రి ఏకధాటిగా ఐదు గంటల పాటు వర్షం కురవడంతో వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. కొరట్టూరు, చెన్నై ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఎటు చూసినా మోకాళ్ల లోతు నీరు ఉండటంతో అడుగు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. చెన్నై, శివారు ప్రాంతాల్లో స్కూళ్లు, కళాశాలలలు మూసివేశారు. నంగంబక్కం ప్రాంతంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

13:09 - June 11, 2017

మంచిర్యాల : జిల్లాలో జూన్ మొదటి వారం నుండే కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు చెట్లు..విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. దీనితో విద్యుత్ నిలిచిపోతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం జనాలను అతలాకుతలం చేసింది. మహ్మదాబాద్, తపాలపూర్, దండేపల్లి మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లపేట వాగు వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకపోవడంతో ఆదిలాబాద్ -- మంచిర్యాల జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

06:28 - June 4, 2017

హైదరాబాద్‌ : శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచే వాతావరణం చల్లబడగా.. రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. నగరంలోని పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, అంబర్‌పేట, దిల్‌సుక్‌నగర్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎండలు భగభగమండుతుండడంతో రాత్రి కురిసిన వర్షానికి నగరవాసులు ఉపశమనం పొందారు.

08:19 - June 2, 2017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్రో చల్లని కబురు అందించింది. ఎండ వేడిమి..ఉక్కపోతతో అల్లాడుతున్న వారికి ఇది ఉపశమనం కలిగించే వార్తగా భావించవచ్చు. ఇప్పటికే రుతు పవనాలు కేరళలను తాకిన సంగతి తెలిసిందే. ఈ పవనాలు ఈనెల 7వ తేదీన రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని సమాచారం చేరవేసింది. తొలుత రాయసీమ ప్రాంతాల్లోకి ప్రవేశించిన అనంతరం కోస్తాకు చేరుకుంటాయని పేర్కొంది. కోస్తాకు చేరుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుందని తెలిపింది. మరోవైపు ఎండ వేడి మాత్రం కొనసాగుతోంది. దీనితో జనాలు అల్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.

16:41 - May 30, 2017

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో అనుకున్న సమయానికే రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో కేరళలోని దక్షిణభాగంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోని రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

12:18 - May 30, 2017

ఢిల్లీ : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. మంగళవారం ఉదయం కేరళను రుతుపవనావలు తాకాయి. వాతావరణ శాఖ అంచనా వేసినట్లే రుతుపవనాలు విస్తారంగా విస్తరిస్తున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళలో రుతుపవనాలు తాకడంతో దక్షిణ భాగంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరొక రెండు రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అంతటా విస్తారిస్తాయని, దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుపాన్ కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదిలాయని, మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరిస్తాయన్నారు. కోస్తాంధ్రాలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.

20:34 - May 18, 2017

హైదరాబాద్ : పిడుగు పడుద్ది..కానీ అంతకు ముందే మొబైల్ మోగుద్ది. అవును మరి పిడుగు ఆకాశాన్ని చీల్చుకుని రాకముందే అలర్ట్ బీ కేర్ ఫుల్ అంటోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుర్తుచేస్తుంది. ఇప్పటి వరకు ప్రమాద వశాత్తూ ఎన్నో ప్రాణాలు పిడుగుల పాలిట పడ్డాయి. కానీ ఇక ముందు ఆ పరిస్థితి రాదు. ఏపీలో ప్రవేశ పెట్టిన టెక్నాలజీతో ఇపుడు సీన్ మారనుంది. మేఘాలు పిడుగుకు సై అనకముందే ఇక్కడ సేఫ్ ప్లేస్ లో సర్దుకునే అవకాశం వస్తోంది. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

21:25 - May 14, 2017
19:34 - May 14, 2017
09:51 - May 12, 2017

గత రెండు మాసాలుగా ఎండలు..ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కరుబు. త్వరలోనే నైరుతి రుతుపవనాలు వచేస్తాయేని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 15 లోపు దక్షిణ అండమాన్‌, నికోబార్‌ దీవులల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తాయని ప్రకటించింది. దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం తర్వాత వాయుగుండం ఏర్పడే అవకాశముందని అంచనా. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం మూడు రోజుల ముందే కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సాధారణంగా దక్షిణ అండమాన్ లోకి ఈనెల 20 కల్లా నైరుతి రావాల్సి ఉందని..జూన్ 1న కేరళను తాకాలని నిపుణులు పేర్కొంటున్నారు. నైరుతి రుతు పవనాలు హిందూ మహా సముద్రం నుండి బయలుదేరి మడగాస్కర్‌ మీదుగా సాగుతాయి. భూ మధ్య రేఖా ప్రాంతాన్ని దాటిన తర్వాత రెండు శాఖలుగా విడిపోతాయి. ఒకటి నైరుతి శాఖ దక్షిణ అండమాన్‌ మీదుగా బంగాళాఖాతాన్ని, మరోకటి అరేబియా మీదుగా కేరళను తాకుతాయి. తర్వాత ఇవి రెండూ భారతదేశంలో ఏకమవుతాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - రుతుపవనాలు