రెస్టారెంట్

21:12 - February 12, 2018

ఢిల్లీ : దళిత విద్యార్థి హత్యపై అలహాబాద్‌ అట్టుడికింది. దళిత విద్యార్థి మృతిని నిరసిస్తూ ఆందోళనకారులు ఓ బస్సును తగలబెట్టారు. దళిత విద్యార్థి హత్య కేసులో సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దళిత విద్యార్థి హత్యను సిపిఎం, బిఎస్‌పి ఖండించాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థి హత్యను నిరసిస్తూ ఆందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు.....ఓ బస్సును తగలబెట్టారు. హింసను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

లా చదువుతున్న 26 ఏళ్ల దిలీప్‌ శుక్రవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు కర్నాల్‌గంజ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇంతలోనే లగ్జరి కారులో అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులకు దిలీప్‌కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంతే...వారు దిలీప్‌ను రాళ్లు, కర్రలు, హాకీ స్టిక్‌తో చితకబాదారు.

తీవ్ర గాయాలపాలైన దిలీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం కన్నుమూశాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడిలో ప్రధాన ఆరోపితుడు రైల్వే ఉద్యోగి విజయ్ శంకర్ సింగ్‌ పరారీలో ఉన్నాడు. విజయ్‌ శంకర్‌సింగ్‌ డ్రైవర్‌తో దిలీప్‌పై హాకీ స్టిక్‌తో దాడి చేసిన రెస్టారెంట్ వెయిటర్‌ మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దిలీప్‌ను దుండగులు కొట్టిన సమయంలో పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వనందుకు.. రెస్టారెంట్ యజమానిపై కూడా కేసు నమోదైంది.

దళిత విద్యార్థి హత్యపై బిఎస్‌పి చీఫ్‌ మాయావతి దుఃఖాన్ని ప్రకటించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. కుల విద్వేషాలు రెచ్చగొడుతున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని దోషిగా నిలపాలని మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత విద్యార్థి హత్యను సిపిఎం ఖండించింది. దిలీప్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. యూపిలో యోగి సర్కార్‌ పగ్గాలు చేపట్టాక మతతత్వ శక్తుల మనోబలం మరింత పెరిగిందని...భవిష్యత్తులో దళితులపై మరిన్ని దాడులు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.

11:40 - December 16, 2016

టాలీవుడ్..బాలీవుడ్..వివిధ వుడ్ లో నటించే హీరోలు..హీరోయిన్స్ సినిమాల్లో నటిస్తూనే వ్యాపారంలో కూడా అడుగుపెడుతుంటారు. కొంతమంది సక్సెస్ కాగా మరికొంతమంది సక్సెస్ కాలేక పోతుంటారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ యంగ్ హీరో 'సందీప్ కిషన్' వచ్చి చేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో 'వివాహ భోజనంబు' పేరిట ఓ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. గురువారం సాయంత్రం ఈ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది. సినీ నటి 'రెజీనా' ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అచ్చమైన తెలుగు వంటకాల రుచిని ఈ రెస్టారెంట్ లో చూపెట్టనున్నారు. అద్వితీయమైన రుచులను అతిథులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ రెస్టారెంట్ ను ప్రారంభించినట్టు సందీప్ తెలిపాడు. గతంలో ఎన్నడూ చూడని రుచులను ఈ రెస్టారెంట్ లో చూస్తారని చెప్పారు.

12:27 - November 2, 2016

హైదరాబాద్‌ : భోజన ప్రియులకు శుభవార్త.. హైదరాబాదీలకు సరికొత్త రుచులు పరిచయం చేసేందుకు చైనీస్ రెస్టారెంట్ ఏర్పాటైంది. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ఫుడ్ ఉండడం ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ఈ రెస్టారెంట్‌పై ఓ లుక్ వేయండి.

నగరంలో కొత్త హోటళ్లు, రెస్టారెంట్లు
హైదరాబాదీలు భోజన ప్రియులు అని అందరికీ తెలిసిన విషయమే.. అందుకే నగరంలో ఎప్పటికప్పుడు కొత్త హోటళ్లు, రెస్టారెంట్లు పుట్టుకొస్తాయి. తాజాగా చైనీస్ రెస్టారెంట్ ఒకటి నగరవాసుల కోసం ఏర్పాటైంది. కూకట్‌పల్లిలోని సృజనమాల్‌లో టాంగ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు..

200 రకాలకు పైగా చైనా వంటకాలు
అన్ని రెస్టారెంట్‌లతో పోల్చుకుంటే దీనికి ఓ ప్రత్యేకత ఉంది.. ఇందులో కేవలం చైనా నుంచి ఇంపోర్ట్ అయిన ఫుడ్ మాత్రమే ఉంటుంది. దాదాపు 200 రకాలకు పైగా చైనా వంటకాలు భోజన ప్రియులను అలరించనున్నాయి.

చైనా సాంప్రదాయ వంటకాల ప్రత్యేకత
నాణ్యమైన చైనా హత్ &స్వీట్ స్పైసీ,స్నాక్స్, వీటెన్, హమ్ బర్గర్స్, విబిన్న రకాల స్వీట్స్, కేక్స్, స్నాక్ ఐటెమ్స్, స్టార్టస్, ఫ్రూట్ జ్యుసెస్ ఇలా అన్ని రకాల ఇంపోర్టెడ్ చైనా రుచులను అందిచనున్నారు.చైనా సాంప్రదాయ వంటకాలను అందించడమే తమ ప్రత్యేకత అని.. త్వరలోనే మరో 30 రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అందరికి అందుబాటు ధరల్లో ఇక్కడ వంటకాలు లభిస్తాయన్నారు.చైనా వంటకాలను ఇష్టపడే వారికి ఈ రెస్టారెంట్ ఎంతగానే ఉపయోగనడింది. ఇంకెందుకు ఆలస్యం రెస్టారెంట్‌కి వెళ్లి మీకు నచ్చిన వంటకాలను తిని ఆస్వాధించండి.

 

08:41 - May 25, 2016

ముంబై : పది మంది పోలీసులు చేయలేని పనిని ఓ సీసీటీవీ కెమెరా చేస్తుంది. నవీ ముంబైలోని ఓ రెస్టారంట్‌లో జరిగిన దొంగతనమే ఇందుకు నిదర్శనం. దుప్పట్టు కప్పుకుని రెస్టారంట్‌లోకి ప్రవేశించిన ముగ్గురు మహిళలు ఓనర్‌ను మాట్లల్లో పెట్టారు. వీరి వెంట వచ్చిన మరో బాలిక క్యాష్‌ కౌంటర్‌ డ్రాయర్‌ తెరిచి డబ్బులు దొంగిలించిన వైనం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ దృశ్యాలను చూసిన పోలీసులతోపాటు రెస్టారంట్‌ ఓనర్‌ను ఆశ్చర్యానికి గురయ్యారు. క్యాష్‌ కౌంటర్‌ నుంచి బాలిక డబ్బులు దొంగిలిస్తున్న విషయం తెలియకుండా దుప్పట్టా కప్పుకుని మహిళలు కవర్‌ చేశారు. మరో నాలుగు షాపుల్లో వీరు దొంగతనం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వీరిని అరెస్టు చేశారు.

09:19 - September 13, 2015

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలోని జబువా జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. శనివారం ఉదయం రెస్టారెంట్ లో పేలుడు సంభవించడంతో 104 మంది మృతి చెందగా ఎంతో మంది గాయపడిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు..కూలీలున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం భారీ స్థాయిలో జరగడానికి రెస్టారెంట్ లో డిటోనేటర్లు ఉండడమే అని తెలుస్తోంది. మరోవైపు ఆదివారం పేలిన సేఠియా రెస్టారెంటును సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే పేలుడు అనంతరం పరారీలో ఉన్న రెస్టారెంట్ యజమాని ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

07:32 - September 13, 2015

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లో పేలుడు ఘటన తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఓ హోటల్‌లో పేలిన సిలిండర్ ధాటికి భవనం కుప్పకూలింది... ఈ బ్లాస్ట్‌లో ఒకరు కాదు... ఇద్దరు కాదు... 90 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మధ్యప్రదేశ్‌ జబువా జిల్లా కేంద్రంలోని సేఠియా రెస్టారెంటులో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది. గ్రౌండ్ ఫ్లోర్లోని రెస్టారెంట్ వంటగదిలో జరిగిన పేలుడు ధాటికి మొదటి, రెండో అంతస్తు కూలిపోయింది. అంతే... హోటల్‌ ఉన్న మనుషుల హాహా కారాలు మిన్నంటాయి. క్షతగాత్రులను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 82 మంది మృతి చెందారు...మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

జిలెటిన్ స్టిక్స్..
రెస్టారెంట్‌కు ఆనుకుని ఉన్న భవనంలో జిలెటిన్‌ స్టిక్స్ నిల్వ ఉంచడం అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. పేలుడు ధాటికి హోటల్‌ చుట్టు పక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో భారీ స్థాయిలో పేలుడు జరిగి మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని అధికారులు చెబుతున్నారు. జిలెటిన్‌ స్టిక్స్‌ నిల్వ ఉంచడానకి తనకు పర్మిషన్‌ ఉన్నట్టు యజమాని రాజేంద్ర పేర్కొన్నారు.

మోడీ తీవ్ర దిగ్ర్భాంతి..
ఈ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతామని శివా రాజ్‌సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, బాధిత కుటుంబాలకు 50 వేల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీనియర్ అధికారులు రిస్క్‌ ఆపరేషన్‌ పనులు చేపట్టారు. బుల్‌డోజర్లతో భవన శిథిలాలలను తొలగిస్తున్నారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. 

11:16 - September 12, 2015

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లోని ఝాబువా ప్రాంతంలోని ఓ హోటల్ లో పేలిన సిలిండర్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 35 మంది మృతి చెందగా మరో 50మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన 25 అంబులెన్స్ లలో సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా జరిగిన పేలుడు ధాటికి మధ్యప్రదేశ్ ఉలిక్కి పడింది. మృతి చెందిన కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల పరిహారం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాద వార్త తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు పరిస్థితిని సమీక్షించారు.

సేథియా రెస్టారెంట్ లో పేలుడు...
శనివారం ఉదయం పట్లవాద్ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న సేథియా రెస్టారెంట్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సమయంలో టిఫిన్ చేయడానికి వచ్చిన వారిలో కొందరు మృత్యువాత పడగా మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. రెస్టారెంట్ మూడంతస్తులు ఉన్నట్లు సమాచారం. రెస్టారెంట్ కు సమీపంలోని ఓ బాణాసంచా దుకాణం ఉండడంతో విస్పోటనం భారీగా జరిగిందని తెలుస్తోంది. పేలుడు ధాటికి హోటల్ పై కప్పు చెల్లాచెదరైంది. చెల్లచెదురుగా ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేపట్టారు. చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టని విధంగా కాలిపోయినట్లు సమాచారం. 

Don't Miss

Subscribe to RSS - రెస్టారెంట్