రేటింగ్

13:52 - April 27, 2017

ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి--2’ మేనియా పట్టుకుంది. శుక్రవారం విడుదలయ్యే ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి' సినిమాలో ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. ‘బాహుబలి-2’ సినిమా ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కించిన సినిమా రికార్డుల సొంతం చేసుకుంటుందని టాక్. వేయి కోట్ల క్లబ్ లో చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా మొదటి రివ్యూ వచ్చేసిందని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. దుబాయ్ లో సినిమా చూసిన యూఏఈ, యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రశంసల జల్లు కురిపించారు. ఏకంగా 5/5 రేటింగ్ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతోంది.
ఈ సినిమా హాలీవుడ్ సినిమాల సరసన నిలుస్తుందని, అద్భుతంగా తెరకెక్కించారని, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్', ‘హారీపోటర్'లతో సినిమాను పోల్చడం విశేషం. సినిమాలో బలమైన కథ..మహిష్మతి నగరం..జలపాతం..ఎత్తైన శిఖరాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయని పేర్కొన్నారు. అందరూ పోటీ పడి నటించారని, ప్రభాస్ తన జీవితంలోనే అత్యద్భుతమైన నటనను కనబరచారని, భల్లాలదేవ పాత్రలో 'రాణా' తప్ప వేరే వ్యక్తిని ఊహించుకోలేమని పేర్కొన్నారు. భారతీయ సినీ దర్శకుల్లో 'రాజమౌళి' అద్భుతమైన వ్యక్తి అని, కథను తెరకెక్కించే విధానంలో ఆయన ఎవరూ సాటిరారని ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలుసుకోవాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

20:12 - March 31, 2017

సుధా కొంగర డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటించిన సినిమా గురు. ఆల్రెడీ హిట్ టాక్ తో వచ్చిన సాలకడోస్ సినిమాకి రీమేక్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కి జోడిగా రితిక సింగ్ నటించింది. 

సాలకడున్ సినిమా లో మాధవన్ పోషించిన పాత్ర కావడం తో వెంకీ ఈ పాత్రకు ఎంతవరకు న్యాయం చెయ్యగలడు అనే ఆసక్తి అందరిలో ఉంది .ఫామిలీ హీరోగా , మంచి టైమింగ్ ఉన్న కామెడీ హీరోగా ,యాక్షన్ స్టోరీస్ కి జస్టిస్ చేసి  మెప్పించగల వెంకటేష్ ఈ గురు సినిమా లో ఎంతవరకు పాత్రకు ప్రాణం పోసాడో లేదో గురు సినిమా చూస్తే తెలుస్తుంది .
 
గోపాల గోపాల ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మల్టి స్టారర్ సినిమాలు చేసి సోలోగా బాబు బంగారం సినిమా తో వచ్చిన వెంకీ ప్రెజెంట్ కాంపిటీషన్ లో వెనుకబడ్డాడా అనే డౌట్ కామన్ ఆడియన్ కి రాక మానదు .తన వయసుకు తన ఫిజిక్ కి తగ్గట్టు పాత్రలు ఎంచుకుంటూ సినిమా ని ప్లాన్ చేసుకొని  పవర్ఫుల్ బాక్సింగ్ కోచ్ పాత్రలో గురు సినిమాలో కనిపించరు విక్టరీ వెంకటేష్ .

డైరెక్టర్ గా ఆల్రెడీ తానేంటో ప్రూవ్ చేసుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర తీసిన ఈ గురు  సినిమా చుసిన ఆడియన్స్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామా ? గురు సినిమాపై 10టివి పర్ ఫెక్ట్ రివ్యూ ఇప్పుడు చూద్దాం.
ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్ 
రితిక సింగ్ 
కధ, కధనం 
డైరెక్షన్
సినిమాటోగ్రఫీ 
మ్యూజిక్ 
ఎమోషన్స్ 
నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్ 
సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ 

రేటింగ్ 2.75/5

20:07 - March 31, 2017

పూరి జగన్నాధ్ ట్రెండీ ఫిలిం  రోగ్ . ఈ  సినిమా లో  తెలుగు తెరకు కొత్త నటుడు ఇషాన్ హీరోగా పరిచయం అయ్యాడు. మన్నారు చోప్రా, ఎంజీల క్రిస్లింజి హీరోయిన్స్ గా నటించారు. పూరి జగన్నాధ్ తన స్టైల్ అఫ్ మేకింగ్ తో వచ్చిన రోగ్ సినిమా  ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలో ఉంది.

ఇజం సినిమా తరువాత పూరి నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆలోచన అందరిలో ఉంది .టెంపర్ ,ఇజం లాంటి సోషల్ మెస్సేజ్ తో కమర్షియాలిటీ మిక్స్ చేసి తీసిన పూరి ఈ  రోగ్ సినిమాని ఎలా మలిచాడు అనే ఇంటరెస్ట్ కామన్ ఆడియన్స్ నుండి సినీ క్రిటిక్స్ వరకు అందరిలో ఉంది .

తన సినీ ప్రస్థానం లో హిట్ ఐన ఇడియట్ సినిమా టాగ్ లైన్ ని మళ్ళీ రిపీట్ చేసి మరో చంటిగాడి ప్రేమ కధ అని టాగ్ లైన్ తో రోగ్ సినిమాని వదిలాడు పూరి .మరి రోగ్ సినిమా మీద సినిమా చుసిన ఆడియన్స్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామా ?

ప్లస్ పాయింట్స్ :
పూరి మార్క్ డైలాగ్స్ 
ఇషాన్ 
సినిమాటోగ్రఫీ  
నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్ :
కధ
రొటీన్ స్క్రీన్ ప్లే 
పండని కామెడీ 
ఫీల్ లేని కొన్ని సన్నివేశాలు 

రేటింగ్ 1.5/5

19:30 - September 30, 2016

నేను శైలజ తో ఈ సంవత్సరం హిట్టు బోణికొట్టిన రామ్ అదే ఊపులో చేసిన మరో సినిమా హైపర్. అయితే రామ్ తనకు బాగా ఇష్టమయ్యే మాస్ యాక్షన్ జానర్ నే మళ్లీ ఎంచుకొని హైపర్ గా వచ్చాడు. ఇంతకీ రామ్ హైపర్ గా మెప్పించగలిగాడా లేడా.. ? నేడే విడుదల రివ్యూలో చూద్దాం. 
విశ్లేషణ...1 
ఎనర్టిటిక్ స్టార్  రామ్, మాస్ జానర్ లో మంచి కథతో వెళితే ఈపాటికి ఎన్నో హిట్స్ వచ్చి ఉండేవి. లాస్ట్ టైమ్ కందిరీగ తో  అలా వచ్చే హిట్టు కొట్టాడు. ఆ తర్వాత అదే రూట్లో రొటీన్ గా వెళ్లి దెబ్బతిన్నాడు. అయితే  ఈ సారి మాస్ జానర్ నే ఎంచుకొని  కాస్త మంచి కథతో వచ్చాడు. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్  ఈ సినిమాతో రామ్ ను బాగానే పైకిలేపే ప్రయత్నం చేసాడు. అందులో ఆల్మోస్ట్  సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాకోసం మంచి పాయింట్ ను ఎత్తుకున్నాడు. ముప్పైఏళ్లుగా నిజాయితీ గల ప్రభుత్వాధికారిగా విధులు వ్యవహరిస్తున్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కి తండ్రి ని విపరీతంగా ప్రేమించే ఒక కొడుకుంటే, తన తండ్రికి ఏదైనా ఆపదొస్తే ఆ కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నదే ఈ సినిమా థీమ్. ఈ పాయింట్ ను తెరకెక్కించడంలో మంచి మంచి సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. వినోదంతో పాటు, మంచి డ్రామాని కూడా ఎలివేట్ చేసి మంచి మార్కేలేయించుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్ సరదాగా చాలా ఆసక్తికరంగా సాగుతుంది, సెకండాఫ్ కొంచెం ఓవర్ డ్రామాతో నిండి ఉంటుంది. టోటల్ గా హైపర్ సినిమా బి,సి ప్రేక్షకులకి మాస్ విందే అనిచెప్పొచ్చు. 
కథ...
రిటైర్ మెంట్ కి దగ్గరపడిన నిజాయితీ గల గవర్నమెంట్ ఉద్యోగి నారాయణ మూర్తి .ఆయన్ను ప్రాణంగా ప్రేమించే అతడి కొడుకు సూర్య. తన తండ్రికి చిన్న జ్వరంలాంటిది వచ్చినా అల్లాడిపోతాడు. అలాంటి తండ్రిచేత , ఇల్లీగల్ గా కట్టిన ఒక బిల్డింగ్ విషయంలో ఒక  మినిస్టర్ సంతకం చేయించాలనుకుంటాడు. కానీ నారాయణ మూర్తి నిజాయితీ ఆపని చేయనివ్వదు.  అందుకే ఆయనచేత నయాన్నోభయన్నా సంతకం చేయించాలని ప్రయత్నిస్తాడు మినిస్టర్ . ఆ ప్రోసెస్ లో ఈ విషయం తెలుసుకున్న నారాయణ మూర్తి కొడుకు సూర్య మినిస్టర్ కే వార్నింగిస్తాడు. దాంతో అహం దెబ్బతిన్న మినిస్టర్,  నారాయణమూర్తి కుటుంబాన్ని ఎలా డీల్ చేసాడన్నదే మిగతా కథ.  అయితే ఇందులో సన్నివేశాలన్నిటినీ కొడుకుకి తండ్రి మీద ఉన్న ప్రేమతోనే లింక్ అయి ఉంటాయి. కథ నుంచి డీవియేట్ అయ్యే సీన్స్ ఏమాత్రం కనిపించవు.  ఈ సినిమాకు అదే బలంగా మారింది. చెప్పాల్సిన పాయింట్ ను సూటిగా  డ్రామా తోనూ , కొన్ని ఎమోషన్స్ తోనూ బాగా  చెప్పాడు దర్శకుడు. ఫస్టాఫ్ టెంపోని సెకండాఫ్ కూడా మెయింటెన్ చెయ్యగలిగితే సినిమా ఓ రేంజ్ లో ఉండేది. ఓవర్ డ్రామా వల్ల కొన్ని సీన్లు ఎలివేట్ కాలేదు. బట్..సినిమా మాత్రం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి.
విశ్లేషణ..2
రామ్ పెర్ఫార్మెన్స్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. మంచి పంచ్ డైలాగులతో , మంచి కేరక్టరైజేషన్ త , అతడి కేరక్టర్ ను బాగా డిజైన్ చేసాడు దర్శకుడు. మొత్తానికి రామ్ తన పాత్రను చాలా ఈజ్ తో సమర్ధవంతంగా పోషించాడు. ఇక హీరోయిన్ రాశీఖన్నా గ్లామర్ ఈ సినిమాలో చాలా ఓవర్ డోస్ లో ఉందనిపించింది. రామ్ తండ్రి నారాయణ మూర్తిగా సత్యరాజ్ నటన అద్భుతమని చెప్పాలి. రామ్ తో ఆయన సీన్స్ అన్నీ ఫన్నీగా , అద్భుతంగా సాగుతాయి. ముఖ్యంగా తండ్రి కొడుకుల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌటయింది. చిన్నప్పటినుంచి తండ్రి మీద కొడుకు కు ఎంతప్రేమో చెప్పే సన్నివేశాలు చాలా సరదాగా ఉన్నాయి.  ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సినది మినిస్టర్ గా  రావు రమేష్ పాత్ర. ఆయన మినిస్టర్ గా తన పాత్రను చించి ఆరేసాడు. ముఖ్యంగా ఆయన పలికే డైలాగ్స్  ఫన్నీగానూ, మంచి ఇంటెన్సిటీ తోనూ నిండి ఉంటాయి. ఇక సంగీతం, సినిమాటో గ్రఫీ , నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా మాస్ ప్రేక్షకులే కాదు, తండ్రి కొడుకుల రిలేషన్ బాగా ఎలివేట్ చేయడం వల్ల క్లాస్ పీపుల్ కూడా బాగానే కనెక్ట్ అవుతారు.  
ప్లస్ పాయింట్స్ :
కథ, కథనాలు
రామ్ నటన
సత్యరాజ్, రావురమేష్ నటన
డైరెక్షన్ 
మైనస్ పాయింట్స్ :
కామెడీ లేకపోవడం 
సెకండాఫ్ ఓవర్ డ్రామా 
 

 

18:57 - January 29, 2016

పల్లె వాతావరణంలో ప్రేమ కథలు అరుదుగా తెలుగు తెరపైకి వస్తుంటాయి. వాస్తవానికి ఈ సినిమాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. కథ, కథలోని ఎమోషన్స్ బాగా కుదిరితే....విలేజ్ లవ్ స్టోరీలకు తిరుగుండదు. ఇలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు. మరి ఈ సినిమాకు ఆడియెన్స్ ఎలాంటి రిజల్ట్ నిచ్చారో తెల్సుకుందాం.

కథ..
రాజ్ తరుణ్, ఆర్తన రామచంద్రాపురం అనే పల్లెటూరిలో పెరుగుతుంటారు. ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడతారు. రాజ్ తరుణ్ ని తన కూతురు ప్రేమించడం నచ్చని తండ్రి రాజా రవీంద్ర వీళ్ల ప్రేమకు అడ్డుపడతాడు. ఊళ్లో క్రికెట్ ఆడటం అలవాటున్న రాజ్ తరుణ్ కు రంజీ ప్లేయర్ ఆదర్శ్ బాలకృష్ణతో పోటీ పెడతాడు. ఈ మ్యాచ్ లో గెలిస్తే తన కూతురిని ఇస్తానంటాడు. మరి హీరో ఈ పోటీలో గెలిచాడా లేదా అన్నది మిగిలిన కథ.

పాత్రల అభినయం..
కబడ్డీ కబడ్డీ మొదలు చాలా సినిమాలు ఇలాంటి కథలతో వచ్చినవే. కథ పాతదైనా...కొంత కామెడీని చేర్చి దర్శకుడు మ్యానేజ్ చేశాడు. సెకండాఫ్ లో కథను డ్రాగ్ చేసి ప్రేక్షకులను విసిగించాడు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ ఆర్తనా ఫర్మార్మెన్స్ బాగుంది. ఈ ఇద్దరి జోడీ సినిమాను ఆమాత్రం నిలబెట్టింది. షకలక శంకర్ హాస్య సన్నివేశాలు నవ్వించాయి. పల్లె వాతావరణాన్ని బాగా కాప్చర్ చేశాడు సినిమాటోగ్రాఫర్. గోపీసుందర్ సంగీతం సినిమాకు ఆకర్షణగా నిలిచింది.

ఫ్లస్ పాయింట్స్
రాజ్ తరుణ్, ఆర్తనా జోడీ
సంగీతం
సినిమాటోగ్రఫీ
కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
పాత కథ
డ్రాగింగ్ స్క్రీన్ ప్లే
పండని ఎమోషన్స్
క్లైమాక్స్

21:55 - November 6, 2015

ఈ రోజు నేడే విడుదలలో మనం మాట్లాడుకునే సినిమా స్వాతి నటించిన హార్రర్ థ్రిల్లర్ ఫిల్మ్ త్రిపుర... టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ లేరని అనుకుంటున్న టైంలో తెరపైకి వచ్చింది స్వాతి. కలర్స్ స్వాతిగా ప్రేక్షకులకు పరిచయమైన స్వాతిరెడ్డి....అష్టాచెమ్మా, డేంజర్, లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా స్వామిరారా, కార్తికేయ స్వాతిని ఫేమ్ లోకి తెచ్చాయి. రెండు సక్సెస్ ఫుల్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న స్వాతి...హార్రర్ థ్రిల్లర్ త్రిపురతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో హార్రర్ జానర్ ఓ పెద్ద ట్రెండై పోయిన నేపథ్యంలో త్రిపురపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలను త్రిపుర చేరుకుందా లేదా.. అంజలి డ్యూయెల్ రోల్ లో గీతాంజలి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కిరణ్...త్రిపురను ఆదే ఫార్మేట్ లో రూపొందించాడు. ఐతే గీతాంజలి లో వర్కవుట్ ఐన ఫార్ములా త్రిపురకు పనికొచ్చిందా లేదా అన్నది తేలాల్సిన విషయం...
ఫ్లస్ పాయింట్స్
స్వాతి
సినిమాటోగ్రఫీ
కొన్ని కామెడీ సీన్లు

మైనస్ పాయింట్స్
పాత కథ
ఆకట్టుకోని స్క్రీన్ ప్లే
సంగీతం
ప్రొడక్షన్ వ్యాల్యూస్

టెన్ టివి విశ్లేషణ, రివ్యూ మరియూ రేటింగ్  కు సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss

Subscribe to RSS - రేటింగ్