రైతు సమన్వయ సమితి

07:24 - May 30, 2018

హైదరాబాద్ : రైతుబంధు పథకం ద్వారా రైతులందరికీ కొత్త  పాసుపుస్తకాలు అందజేయడం, పంట పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవితబీమా పథకం అమలు విషయంలో రైతు సమన్వయ సమితే కీలకపాత్ర పోషించాలని కేసీఆర్‌ అన్నారు. రైతులు అప్పులపాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే పెట్టుబడిసాయం అందిస్తుందన్నారు.  ఈ పథకం ఎన్నికల్లో ఓట్ల కోసం అస్సలు కాదని స్పష్టం చేశారు. రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేయడం కాంగ్రెస్‌కు సాధ్యంకాదని.... అది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ఆపదమొక్కులు  మొక్కినట్లు ఆ పార్టీ హామీ ఉందని విమర్శించారు.
జిల్లా  కో..ఆర్డినేటర్లతో కేసీఆర్‌ సమావేశం
రైతుబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. తాము ఎన్నికల్లో ప్రజలకు చెప్పిన ప్రతీపని చేశామని.. రైతుల సంక్షేమం కోసం మానిఫెస్టోలో చెప్పని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పంటపెట్టుబడి సాయం రెండోవిడత సాయాన్ని నవంబర్‌ నెలలో అందజేస్తామని సీఎం ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో అవలంభించిన విధానాల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని.. రైతులు అన్నివిధాలా నష్టపోయారని ఈ సందర్భంగా కేసీఆర్‌ అన్నారు.
వ్యవసాయరంగాభివృద్ధి కోసం అనేక చర్యలు : కేసీఆర్‌
తెలంగాణ వచ్చినాక రైతుల పరిస్థితి మారాలని అనుకున్నామని.. అందుకే  వ్యవసాయరంగాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.  రైతులకు రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టిపెట్టామన్నారు.  వచ్చే జూన్‌ నుంచి ప్రాజెక్టుల ద్వారా నీరు పుష్కలంగా వస్తుందని.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. రైతులు పెట్టుబడి కోసం అప్పు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తోందన్నారు.  అందుకోసమే ఎకరాకు 8వేలు ఇస్తున్నామన్నారు. రైతులకు జీవిత బీమా కూడా చేయించాలని నిర్ణయించామని....దీన్ని విజయవంతం చేయడానికి రైతు సమన్వయ సమితిలు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.రైతు సమన్వయ సమితుల జిల్లా కో-ఆర్డినేటర్లు ఇజ్రాయిల్‌ సందర్శించాలని.. అక్కడి వ్యవసాయ పద్దతులను చూసి నేర్చుకుని రావాలన్నారు. ఇజ్రాయిల్‌ పర్యటనను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు.
అది ఆచరణ సాధ్యంకాని హామీ: కేసీఆర్‌
ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్‌ 2లక్షల రుణమాఫీ నినాదం ఎత్తుకుందన్నారు. కాంగ్రెస్‌ది ఆచరణ సాధ్యంకాని హామీఅని కొట్టిపారేశారు. ఎన్నికల్లో ఓట్లకోసం ఆపద మొక్కులు మొక్కిన మాదిరిగానే కాంగ్రెస్‌ రుణమాఫీ అంటోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితుల కో-ఆర్డినేటర్లకు ఆయన పలుసూచనలు చేశారు.

 

08:02 - February 28, 2018

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపారు. ఈసందర్భంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన ఏకరవు పెట్టారు. మరోవైపు టి.కాంగ్రెస్ బస్సు యాత్ర పేరిట జనాల్లోకి వెళుతూ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), పున్నా కైలాశ్ (టి.కాంగ్రెస్), కాచం సత్యనారాయణ గుప్త (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:26 - February 27, 2018

రైతు సమన్వయ సమితిలు కావని..టీఆర్ ఎస్ సమన్వయ సమితిలు అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బి.వెంకట్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, టీఆర్ ఎస్ నేత మంద జగన్నాథం పాల్గొని, మాట్లాడారు. రైతు సమన్వయ సమితుల్లో టీఆర్ ఎస్ కార్యకర్తలు తప్ప వేరేవారు లేరని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

16:35 - February 26, 2018
08:16 - February 26, 2018

హైదరాబాద్ : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేసీఆర్‌ హాజరయ్యారు. 
తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి
రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సును హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డిని తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా దక్షిణ తెలంగాణ రైతు సమన్వయ సమితి తీర్మానించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్‌  రైతు సమన్వయ సమితుల సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో కోటి 62 లక్షల ఎకరాల భూమి : సీఎం కేసీఆర్ 
రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్‌. భూ ప్రక్షళణ నేపథ్యంలో రాష్ట్రంలో కోటి 62 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం భారతదేశంలో ఇప్పటివరకు లేదని, రైతులకు మేలు చేసే పనులు చేపట్టాలని ప్రధాని కోరినట్లు సీఎం తెలిపారు. అయితే కేంద్రం నుండి ఎలాంటి సహకారం లభించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ మొత్తాన్ని నిజామాబాద్‌జిల్లాలోని అంకాపూర్‌ను మించి తీర్చిదిద్దాలని అప్పుడే రైతు సమన్వయ సమితులు విజయం సాధించినట్లని సీఎం చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత రాష్ర్ట ప్రభుత్వానిదే అన్నారు సీఎం. వ్యవసాయ క్షేత్రంలో రైతే రాజన్నారు. రైతులు బంగారు పంటలు పండించాలని సూచించారు. 
కొత్త మండలాలకు గోదాం నిర్మిస్తాం : మంత్రి హరీష్‌ రావు 
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతి మండలానికి గోదాం నిర్మిస్తామని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. తెలంగాణ వచ్చాక వెయ్యి కోట్లతో 18 లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాంలు నిర్మించామన్నారు. రైతు సమన్వయ సమితుల సూచన మేరకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులకు అనువైన చోటు మార్కెట్ యార్డులు నిర్మిస్తామన్నారు. రైతు సమన్వయ సమితుల తొలి సదస్సులో 13 జిల్లాల నుండి రాష్ట్ర, మండల, జిల్లా సభ్యులు, సమన్వయ కర్తలు పాల్గొన్నారు. 

 

17:40 - February 25, 2018

హైదరాబాద్ : పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సు ప్రారంభానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు సమన్వయ సమితి ఆటం బాంబులాగా పనిచేయాలన్నారు. ప్రపంచంలో ఏదేశం చేయని విధంగా రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత రాష్ర్టప్రభుత్వానదే అన్నారు. ఈ సదస్సులో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, నాయిని నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, 13 జిల్లాల నుంచి తరలివచ్చిన మండల, జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితుల సభ్యులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.

16:22 - February 23, 2018

కరీంనగర్ : ఈనెల 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానున్నారు. ప్రాంతీయ రైతు సమన్వయ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మంత్రి పోచారం శ్రీనివాస్ సదస్సు జరిగే అంబేద్కర్ స్టేడియాన్ని పరిశీలించారు. జరుగుతున్న ఏర్పాట్లను చూసిన పోచారం పలు సూచనలు చేశారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చేందేకే రైతు సమన్వయ సమితీలు ఏర్పాటు చేయడం జరుగుతోందని, మొదటి సమావేశం ఈనెల 25వ తేదీన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో జరుగుతుందన్నారు.

 

21:44 - September 13, 2017

వరంగల్‌ : జిల్లాలో టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య రైతు సమన్వయ సమితి చిచ్చు పెట్టింది. హన్మకొండలో సర్క్యూట్‌ హౌస్‌ వద్ద టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను అడ్డుకున్నారు. తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ నిజమైన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తీరుపై మంత్రి కడియంకు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రైతు సమన్వయ సమితుల్లో తమకు అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

 

Don't Miss

Subscribe to RSS - రైతు సమన్వయ సమితి