రైల్వే జోన్

11:25 - July 30, 2018

ఢిల్లీ : విశాఖకు రైల్వే జోన్ వస్తుందా ? ఇప్పటికే దీనిపై కేంద్రం స్పష్టం చేసినా భిన్నమైన వాదనలను వినిపిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ తప్పకుండా వస్తుందని బీజేపీ నేతలు ఇప్పటికీ తెలియచేస్తున్నారు. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలకు వ్యతిరేకంగా టిడిపి ఎంపీలు నిరసన చేపడుతున్నారు. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ ఉభయసభల్లో ఆందోళన చేపట్టింది.

రైల్వే జోన్ ప్రకటిస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ణత తెలుపుతామంటూ... స్థానిక బీజేపీ నేతలు ఢిల్లీ బయలు దేరిన.. 24 గంటల్లోపే కేంద్ర బీజేపీ నేతలు రైల్వే జోన్ సాధ్యం కాదంటూ.. సుప్రింకోర్టుకు ఇఛ్చిన అఫిడవిట్‌లో తేల్చేశారు. దీంతో బీజేపీ వైఖరిపై ప్రతిపక్షాలు మండిపడుతుంటే.. మరోవైపు టీడీపీ వైఖరివల్లే రైల్వేజోన్‌కు అడ్డంకులొస్తున్నాయని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది.

06:33 - July 30, 2018

విశాఖపట్టణం : రైల్వేజోన్ పై మరో సారి రగడ మొదలైంది. రైల్వోజోన్ వస్తుందని ప్రజలు అశపడటం.. నేతలు వెంటనే వారి ఆశలపై నీళ్లు చల్లడం పరిపాటిగా మారింది.. రైల్వే జోన్ ప్రకటిస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ణత తెలుపుతామంటూ... స్థానిక బీజేపీ నేతలు ఢిల్లీ బయలు దేరిన.. 24 గంటల్లోపే కేంద్ర బీజేపీ నేతలు రైల్వే జోన్ సాధ్యం కాదంటూ.. సుప్రింకోర్టుకు ఇఛ్చిన అఫిడవిట్‌లో తేల్చేశారు. దీంతో బీజేపీ వైఖరిపై ప్రతిపక్షాలు మండిపడుతుంటే.. మరోవైపు టీడీపీ వైఖరివల్లే రైల్వేజోన్‌కు అడ్డంకులొస్తున్నాయని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది.

విశాఖ రైల్వే జోన్ అంశంలో ప్రజల ఆకాంక్షలతో నేతలు ఆడుకుంటున్నారు. రైల్వే జోన్ వస్తుందంటూ ఊరించడం.. ఆవెంటనే ఆశలపై నీళ్లు చల్లడం పరిపాటిగా మరింది. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేజోన్‌ను కేంద్రం ప్రకటిస్తోందంటూ.. ఆనందాన్ని వ్యక్తం చేశారు స్థానిక బీజేపీ నేతలు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు అభినందనలు తెలిపేందుకంటూ.. విశాఖ నగర బీజేపీ నేతలు ఢిల్లీ రైలు యాత్ర చేపట్టారు. విశాఖపట్నం నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో 9మంది సభ్యుల బృందం ఢిల్లీకి బయలు దేరింది. స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ ఢిల్లీ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు రాజకీయ నిర్ణయం కొద్దిరోజుల క్రితమే జరిగిందన్నారు విష్ణుకుమార్‌ రాజు. ఇదిలా ఉంటే.. కేంద్రం మాత్రం అసలు రేల్వై జోన్‌ సాధ్యమే కాందని తేల్చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. దీంతో బీజేపీ నేతల డబుల్ గేమ్‌పై వామపక్షాలు మండిపడ్డాయి.

స్థానిక బీజేపీ నేతలు మాత్రం తమ పార్టీ రైల్వేజోన్ ఇచ్చి తీరుతుందనే అంటున్నారు. ఈ మేరకు అమిత్‌షాతో సహా కేంద్ర అధినాయకత్వం హామీ ఇచ్చిందంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అఫిడవిట్లో అధికారులు పాత రిపోర్టుని జత చేయడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. రాజ్‌నాథ్‌ సింగ్ పార్లమెంటులో ఇచ్చిన హామీలను జతపరుస్తూ త్వరలో మరో అఫిడవిట్ దాఖలు చేస్తుందని తెలిపారు. దీంతో బీజేపీ ఎక్కడ రైల్వేజోన్ ఇస్తుందోనన్న భయం టీడీపీలో మొదలైందంటూ ఎదురు దాడికి దిగారు. ఏపీ విషయంలో కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాలు తప్పు మీదంటే.. మీదంటే ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మొత్తానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి ప్రజల మనోభావాలు, ఆకాంక్షలతో ఆడుకుంటున్నాయని ప్రజలు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. 

13:38 - July 15, 2018

విశాఖపట్నం : విశాఖ రైల్వే జోన్ పై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని మంత్రి గంటా శ్రీనివాస్ రావు అన్నారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి గంటా ప్రారంభించారు. 200 అడుగుల ఫ్లెక్సీపై గంటా సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈనెల 17న రైల్వేస్టేషన్ లో నాన్ పొలిటికల్ జేఏసీ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈదీక్షకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

 

08:15 - July 7, 2018
21:55 - July 4, 2018
10:14 - July 4, 2018

 

విశాఖపట్టణం : మొన్నటి దాక 'ప్రత్యేక హోదా' కోసం దీక్షలు..నిన్న కడప ఉక్కు పరిశ్రమ కోసం...నేడు విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కోసం దీక్షలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీ, అధికార పార్టీ టిడిపికి చెందిన నేతలు ఈ దీక్షలు చేస్తుండడం గమనార్హం. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలంటూ ఎంపీలు ఒక రోజు దీక్ష చేస్తున్నారు. కాన్వెంట్ జంక్షన్ వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 నుండి సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్షలు చేయనున్నారు. ఇందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. టిడిపి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, టిడిపి విశాఖ ఎమ్మెల్యేలు ఈ దీక్షలో పాల్గొననున్నారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షలు రాసేందుకు ఒడిశా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని...ప్రాంతీయ వివక్షతో తెలుగు అభ్యర్థులను ఒడిశా వాసులు అడ్డుకుంటున్నారని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అని సమస్యలకు పరిష్కారమని టిడిపి పేర్కొంటోంది. 

 

18:50 - June 1, 2018

విశాఖపట్టణం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ మాడుగుల టీడీపీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఐదు వేల మంది కార్యకర్తలతో 9 కిలోమీటర్లు... చౌడువాడ నుండి కె.కోటపాడు వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు తన జనదిన్మాన ధర్మపోరాట దీక్ష చేపట్టారని.. ఆయన స్ఫూర్తితోనే తాను పాదయాత్ర చేశానంటున్నారు. ప్రాణాలర్పించైనా ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ సాధించుకుంటామన్నారు. 

12:46 - February 13, 2018

విజయవాడ : విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇలాంటి హామీలు నాలుగేళ్లుగా నాన్చుతూ వస్తున్నారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున్న ఉద్యమం నిర్మిస్తామన్నారు. రూ. 6600 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంటే రూ. 421 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని, పోలవరం రూ. 971 కోట్లు ఇచ్చిందని, ఇంకా రూ. 3400 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి నిర్మిస్తామని చెప్పారని..కానీ నిర్మాణం నత్తనడకన సాగుతోందన్నారు. రాష్ట్ర మహాసభలో చర్చించడం జరిగిందని, రాష్ట్రంలో కలిసొచ్చే వారితో పెద్ద ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఉద్యమం నడిచిందని, 32 మంది యువకులు పోలీసు కాల్పుల్లో చనిపోతే అప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి నోటి వెంట 'సుప్రీంకోర్టుకు వెళుతాం' అన్న దాని తరువాత రాజకీయ వేడి నెలకొందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నడుమ ఈనెల 8వ తేదీన వామపక్షాలు బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, కానీ బంద్ మంచిది కాదని..ఇబ్బందులు వస్తాయని బాబు పేర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటం అంటూ టిడిపి కొత్త కథలు చెబుతోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు.

స్వతంత్రంగా ఉద్యమాన్ని పైకి తీసుకపోయే విధంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై బుధవారం ఉదయం 11గంటలకు వామపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఉద్యమంపై సుదీర్ఘంగా చర్చిస్తామన్నారు. బిజెపి నిధులు లెక్కలు ప్రస్తావిస్తుంటే ఉన్న విషయాలను టిడిపి స్పష్టంగా చెప్పలేకపోతోందని..రాష్ట్ర ప్రయోజనాలను నేలరాస్తోందన్నారు పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:30 - January 28, 2018

విశాఖపట్టణం : ఫిరాయింపులకు చట్టబద్ధత కల్పిస్తూ చట్టబద్ధత చేయాల్సినవసరం ఉందని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. కొత్త చట్టంతో పార్టీ మారే వారికి ఇబ్బంది కలుగకుండా ఉంటుందని, విశాఖ రైల్వే జోన్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 

07:31 - January 18, 2018

భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన అనంతరం ఏపీకి కష్టాలు వీడడం లేదు. విభజన హామీలు..ఇతరత్రా వాటిపై కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు కొనసాగిస్తున్నారు. కానీ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతున్నారని, ఢిల్లీకి బాబు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బుద్ధా వెంకన్న (టిడిపి), కొండా రాఘవరెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - రైల్వే జోన్