రోజా

15:18 - July 18, 2017

హైదరాబాద్ : చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి మండిప‌డ్డారు. వైసీప్లీ ప్లీనరీలో ప్రకటించిన నవ పథకాలతో సీఎం బాబు నవనాడులు చిట్లిపోయాయంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. హైద‌రాబాద్‌లోని వైసీపీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో మాట్లాడిన రోజా.. 2014 జూన్‌లోనే రాష్ట్రంలో బెల్టు షాపులు తొలగిస్తామని చంద్రబాబు సంత‌కం పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇన్నేళ్లయినా బెల్ట్‌ షాపులను అరిక‌ట్టలేకపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబుని ఫాద‌ర్ ఆఫ్ బెల్ట్ షాప్ అని అంతా అంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో మ‌హిళ‌లు పోరాటం చేస్తున్నందుకు ఇప్పుడు నెల‌రోజుల్లో బెల్టు షాపుల‌ను అరిక‌డ‌తామ‌ని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్లీనరీతోనే బాబు ప్రభుత్వంలో కదలికలొచ్చాయన్నారు.

13:18 - July 18, 2017
15:14 - July 17, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో నిండు అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఏపీ స్పీకర్ కోడెల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వ్యాఖ్యలపై రోజాకు నోటీసులు ఇవ్వాలని కోడెల అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

ఎందుకు నోటీసులు..
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా అధికార పక్షానికి చెందిన సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం పలువురు సభ్యులు ఓటింగ్ వేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. స్పీకర్ కోడెల తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి నాయకులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ కోడెల ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వచ్చి మాక్ ఓటింగ్‌ లో పాల్గొనడం సరికాదని..స్పీకర్ కూడా అందుకు సహకరించారని ఆరోపణలు గుప్పించారు. స్పీకర్ హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని కానీ స్పీకర్ పదవికి ఆయన గౌరవం లేకుండా చేశారంటూ వ్యాఖ్యానాలు చేశారు.

కోడెల ఆగ్రహం..
స్పీకర్‌ను కించపరిచే విధంగా రోజా మాట్లాడారంటూ స్పీకర్ కోడెలకు విషయాన్ని తెలియచేశారు. దీనితో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజాకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వైసీపీలో మరోసారి టెన్షన్ మొదలైంది.

14:31 - July 17, 2017

గుంటూరు : ఏపీలో రాష్ట్రపతి ఎన్నికలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలోని అసెంబ్లీలో వైసీపీ నేత జగన్‌ ఎమ్మెల్యేలతో కలిసి రోజా తొలి సారిగా ఓటు వేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పినట్టు గా బీజేపీ బలపరిచిన అభ్యర్ధి రామ్‌నాథ్‌ కోవింద్‌కి ఓటు వేసినట్టు తెలిపారు.. తొలిసారిగా రాష్ట్రపతికి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు..స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రితో కలిసి మాక్‌ ఓటింగ్‌లో పాల్గొనడం స్పీకర్‌ పదవికే అవమానకరం అని రోజా అన్నారు.

 

15:42 - July 11, 2017

చిత్తూరు : చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్‌ జగన్ ప్రకటించిన 9 హామీలు అమలుకావని మంత్రులు, ఎమ్మెల్యేలు అనడం ఆశ్చరంగా ఉందన్నారు. ఈ విషయంలో బహిరంగచర్చకు తామూ సిద్ధమని సవాల్ విసిరారు. ఐదేళ్లలో 10 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటుందని..ఆ బడ్జెట్‌తో హామీలన్నీ నెరవేర్చడం సాధ్యమే అన్నారు. చంద్రబాబు రేపు రాజీనామా చేస్తే హామీలు ఎలా అమలు చేయాలో జగన్‌ చేసి చూపిస్తారన్నారు.

 

14:34 - July 11, 2017
17:21 - July 8, 2017
21:49 - July 6, 2017
10:26 - June 24, 2017

హైదరాబాద్: వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పార్టీ మారుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీలైనంత త్వరగా వైసీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటునట్లు తెలుస్తోంది. పలు విషయాలపై రోజాకు జగన్ క్లాస్ పీకారని, పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరించారనే వార్తలు ఇప్పటికే సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే, విశాఖలో జగన్ నిర్వహించిన మహా ధర్నాకు రోజా దూరమయ్యారనే వార్తలు కూడా వినిపించాయి. పార్టీ మైలేజ్ కోసం తనను ఉపయోగించుకున్న జగన్... ఇప్పుడు అవసరం తీరిపోయాక, తనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె భావిస్తున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా, తనను మనస్తాపానికి గురి చేస్తున్నారని రోజా భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో, ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారనే సంచలన వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యారని, త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రోజా విషయంలో ఏం జరగబోతోందో కొన్ని రోజుల్లోనే తేలిపోయే అవకాశాలు ఉన్నాయి.

 

10:40 - June 15, 2017

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నుంచి ఎమ్మెల్యేల వరకు విశాఖను హోల్‌సేల్‌గా దోచుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. నిప్పు అని చెప్పుకునే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తుప్పు పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. భూకబ్జాకు పాల్పడినట్లు సీఎం సహా మంత్రులు లోకేష్‌, గంటాపై ఆరోపణలు వస్తుంటే సీబీఐ విచారణకు ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. 233 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు గల్లంతయ్యాయంటే..అందులో చంద్రబాబు హస్తం లేదా అని ప్రశ్నించారు. సిట్‌ అనేది కాలయాపన కోసమే అని విమర్శించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - రోజా