రోడ్డు ప్రమాదం

21:22 - June 24, 2018

కర్నూలు : ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం తొమ్మిది మంది మృతికి కారణమైంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెలో... రాంగ్‌ రూట్‌లో ఆటోను నడపడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కంటి చూపు కోసం నాటు వైద్యం చేయించుకునేందుకు తెల్లవారు జామున మహానందికి ఆటోలో బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు, గూడూరు, డోన్‌ మండలాల పరిధిలోని కాళ్లపరి, చనుగొండ్ల, రామళ్ల కోట గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది కలిసి 4 ఆటోలలో బయలుదేరారు.  ముందుగా వెళ్లిన 3 ఆటోలు సురక్షితంగా వెళ్లాయి. చివరగా బయలుదేరిన ఆటో రోడ్డు క్రాస్‌ చేసేందుకు రాంగ్‌ రూట్‌లో వెళ్లగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో కాళ్లపరి గ్రామ సర్పంచ్‌ సంజ పోగు గౌరమ్మ కూడా ఉంది. 

ఘటనా స్థలాన్ని ఓర్వకల్లు ఎస్సై మధుసూదన్‌, ఉలిందకొండ ఎస్సై శరత్‌ కుమార్‌లు సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ సత్యనారాయణ ఆర్‌డీఓ హుస్సేన్‌ సాహెబ్‌ ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై నివేదికను సిద్ధం చేయాలని కర్నూలు రేంజ్ డి ఐ జి ఘట్టమనేని శ్రీనివాస్,అడిషనల్ ఎస్పి షేక్షావలిలు పోలీసు యంత్రాగానికి ఆదేశించారు. 

బాధితులను పలువురు రాజకీయ పార్టీనేతలు సందర్శించారు. మృతదేహాలను సందర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి గురైన కుటుంబీకులను 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గౌస్‌ దేశాయ్‌ షడ్రక్‌ డిమాండ్‌ చేశారు. గాయపడ్డవారికి ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వమే భరించాలన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్పీలను ఆదేశించారు. 

 

08:56 - June 24, 2018

కర్నూలు : అతివేగం..డ్రైవింగ్ లో నిర్లక్ష్యం...తో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధిక మంది ప్రయాణీకులను ఎక్కించుకొని ప్రయాణీంచవద్దని చ చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. దీనితో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ తనిఖీలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోడుమూరు మండలంకల్లపాడుకు చెందిన 13 మంది నాటు వైద్యం కోసం మహానందికి ఆటోలో బయలుదేరారు. ఓర్వకల్లు మండలం సోమయాజుపల్లె వద్దకు రాగానే మహానంది నుండి హైదరాబాద్ కు వెళుతున్న హై టెక్ బస్సు - ఆటోలు ఢీకొన్నాయి. దీనితో అక్కడికక్కడనే ఏడుగురు మృత్యువాతపడగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక వ్యక్తి మృతి ఉన్నారు. అధిక మందిని ఎక్కించుకోవడం..ఆటో వేగంతో ప్రయాణించడం..ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా అధిక వేగంతో ప్రయాణించడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 

16:13 - June 13, 2018

విజయనగరం : ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాశీ యాత్రకు వెళ్లి వస్తున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతి చెందారు. భోగాపురం మండలం పాలపల్లి వద్ద ట్రావెల్స్ బస్ ను ఎదురుగా వస్తున్న ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో కాశీకి వెళ్లి తిరిగు ప్రయాణమైన భక్తులు మరికొద్ది సేపట్లో విశాఖ చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలవగా పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాదం సయమంలో బస్ లో చిక్కుకున్న 20మంది ప్రయాణీకులను రక్షించేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. మృతులు విశాఖ వాసులుగా తెలుస్తోంది. 

08:08 - June 7, 2018

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీంపలోని ఎన్ సీసీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున హనుమంతు అనే వ్యక్తి బైక్ పై వెళుతున్నాడు. విద్యానగర్ బ్రిడ్జిపై బైక్ పై వెళుతుండగా వర్షం కారణంగా బైక్ అదుపుతప్పింది. బ్రిడ్జిని ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలయి అక్కడికక్కడనే మృతి చెందాడు. హెల్మెట్ పెట్టుకొంటే ప్రాణాలు నిలిచేవని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

08:46 - June 6, 2018

జగిత్యాల : అతి వేగం ప్రమాదకరమనీ..అది మీ కుటుంబాలకే కాక పలువురి కుటుంబాలలో విషాదాలను నింపుతుందనీ ఎంతగా చెప్పినా వినని వాహనదారులు వేగంగా నడిపి ప్రాణాలను కోల్పోతున్నారు. అంతేకాదు పలువురి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. అతి వేగంగా వాహనాలను నడిపి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది. గొల్లపల్లి మండలం చిల్లకూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్థానికులు అందించిన సమచారంతో సంఘనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రక్కల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి గల కారాణాలను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. మృతులు నిన్న అర్థరాత్రి ఓ పుట్టిన రోజు వేడుకకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు చిప్ప రాములు, చిప్ప సందీప్, చిప్ప వినోద్ లుగా గుర్తించారు. కాగా ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతి ప్రమాదమే కారణంగా స్థానికులు పేర్కొంటున్నారు.

21:08 - June 2, 2018
17:20 - June 2, 2018
14:46 - June 1, 2018

మహబూబ్‌ నగర్‌ : జిల్లా భూత్‌పూర్‌ మండలం దివిటిపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పనులు చేస్తున్న ఎల్‌ఎన్టీ కార్మికులు ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డిసియం అదుపు తప్పి ఎల్‌ఎన్టీ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డీసీఎం డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు.

08:39 - June 1, 2018

నెల్లూరు : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చెందారు. మరో రెండు ఎద్దులు మృతి చెందాయి. గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన నవీన్, నర్సింహులు అనే ఇద్దరు వ్యక్తులు సంతలో ఎద్దులను కొనుగోలు చేసి ఆటో ట్రాలీలో ఎద్దులను తీసుకొని గ్రామానికి వస్తున్నారు. మార్గంమధ్యలో నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఆటో ట్రాలీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నవీన్, నర్సింహులు మృతి చెందారు. ఆటో ట్రాలీలో ఉన్న మరో రెండు ఎద్దులు మృతి చెందాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

13:22 - May 29, 2018

కరీంనగర్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మానకొండూరు మండలం చెంజర్ల వద్ద ఆర్డీసీ -లారీ ఢీకొన్నాయి, ఈప్రమాదంలో  7గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో  15 మంది తీవ్రంగా గాయపడ్డారు.  వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రమాదంపై మంత్రి ఈటల రాజేందర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి మంత్రి  బయలు దేరివెళ్లారు. మృతులు కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు.  

 

Pages

Don't Miss

Subscribe to RSS - రోడ్డు ప్రమాదం