రోహింగ్యాలు

21:50 - September 29, 2017

ఢాకా : బంగ్లాదేశ్‌ సముద్ర తీర ప్రాంతంలో రోహింగ్యాలను తీసుకెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. బోటు మునిగిపోయిన ఘటనలో 60 మంది రోహింగ్యాలు మృతి చెందారు. 23 మంది మృతదేహాలను వెలికితీసినట్లు యునైటెడ్‌ నేషన్స్‌ మైగ్రేషన్‌ ఏజెన్సీ ధృవీకరించింది. మరో 40 మంది మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు. పడవలో మొత్తం 80 మంది రోహింగ్యాలు ఉండగా...ఇందులో 50 మంది పిల్లలు. భారీ వర్షం, బలమైన ఈదురు గాలుల కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. రాత్రంతా సముద్రంలో ప్రయాణించామని తినడానికి తిండి కూడా లేదని బాధితులు చెప్పారు. గత కొన్ని వారాలుగా మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రంలో రోహింగ్యాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడి నుంచి తప్పించుకుని భద్రత కోసం పొరుగున ఉన్న  బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.  5 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌లో శరణార్థులుగా ఉన్నారు. రోహింగ్యాల సమస్యను పరిష్కరించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఎంతోనియో గుతారెస్‌ మయన్మార్‌ నేతలకు విజ్ఞప్తి చేశారు.


 

20:59 - September 13, 2017

కాళ్లకింద భూమి కదిలిపోతోంది. తలపైన ఆకాశం నిప్పుల వర్షం కురిపిస్తోంది. సంద్రం వైపు ఆశగా చూసే కళ్లను తీరం తిరస్కరిస్తోంది. వెరసి ఎవరికీ చెందని అభాగ్యులయ్యారు. మాతృభూమికి, పరాయిదేశానికి మధ్య బతుకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. భూమిపై గీతలు గీసుకున్న సరిహద్దులు, నిబంధనలు పేరుతో నిరాకరించి అపహసిస్తున్న పౌరసత్వాలు.. అణచివేతకు పరాకాష్టగా మారిన పరిస్థితులు.. వెరసి రోహింగ్యాలు ఇప్పుడు లెక్కల్లో లేని మనుషులు.. దేశం లేని పౌరులు.. ఉనికి నిరాకరించబడిన దీనులు..ఆధునిక ప్రపంచంలో అణచివేతకు నిజమైన ఉదాహరణగా కనిపిస్తున్న రోహింగ్యాల పరిస్థితిపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
సొతగడ్డకు బరువయ్యారు.. 
సొతగడ్డకు బరువయ్యారు.. చదువుకునే అర్హతలేదు.. ఉద్యోగాలకు అవకాశం లేదు.. అసలు బతికే పరిస్థితే లేదు.. ఏం చేయాలి? ఎటు పారిపోవాలి..? ఎక్కడ తలదాచుకోవాలి? ఇప్పుడది భూమీ ఆకాశాలు ఏకమైన సుదీర్ఘ విలాపం.  చావుకీ బతుక్కీ మధ్య తేడా తెలియని లక్షలాది ప్రజల దీనత్వం.. జాతులపేరుతో, మతాల పేరుతో విద్వేషాలు పెంచుకునే మానవజాతి హీనత్వం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss

Subscribe to RSS - రోహింగ్యాలు