రోహిత్‌ వేముల

17:26 - March 21, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ సీనియర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ అజ్ఞాతం వీడారు. తాను వెనుకబడిన కులంలో పుట్టడం వల్లనే తనకు యూనివర్శిటీ తీవ్ర అన్యాయం చేస్తోందని రాథోడ్ ఆరోపిస్తున్నారు. తనకు అన్ని అర్హతలు ఉన్నా... పీఈ సెట్ కన్వీనర్‌గా నియమించలేదని.. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల, జేఎన్‌యూలో కృష్ణకు జరిగిన అన్యాయమే తనకు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం జరిగేంత వరకూ ఉద్యమస్తానంటున్న ప్రొఫెసర్ రాథోడ్‌ స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయడం...

10:15 - March 14, 2017

ఢిల్లీ : మరో విద్యా కుసుమం రాలిపోయింది. ఢిల్లీ జేఎన్ యూ లో ఎంఫిల్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంఫిల్‌, పీహెచ్‌డీ అడ్మిషన్లలో సమానత్వం లేదని దళిత విద్యార్థి ముత్తుకృష్ణన్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. సమానత్వం నిరాకరించినప్పుడు సమస్తం నిరాకరించబడినట్లేనని సూసైడ్‌ చేసుకునే ముందు ముత్తుకృష్ణన్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు.

చరిత్ర విభాగంలో ఎంఫిల్‌ చేస్తున్న ముత్తుకృష్ణన్‌ ......

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో ఎంఫిల్‌ చేస్తున్న ముత్తుకృష్ణన్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని సేలమ్‌కు చెందిన ముత్తుకృష్ణన్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంఫిల్‌, పీహెచ్‌డీ అడ్మిషన్లలో సమానత్వం లేదని చనిపోయే ముందు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. సమానత్వం నిరాకరించినప్పుడు సమస్తం నిరాకరించబడినట్లేనని ఆయన మెసేజ్‌లో పేర్కొన్నాడు. వైవా వాయిస్‌లో కూడా వివక్ష చూపుతున్నారని, ప్రతిభ గల వారికి మార్కులు వేయాలంటూ ప్రొఫెసర్‌ చెబుతున్నా వినిపించుకోకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

వర్శిటీలో అన్నిచోట్లా సమానత్వం నశించిందని ముత్తుకృష్ణన్‌ ఆందోళన

విశ్వవిద్యాలయంలో అన్నిచోట్లా సమానత్వం నశించిందని తన ఆఖరి మాటగా వాల్‌లో రాసుకొచ్చారు ముత్తు కృష్ణన్‌. ఆ తర్వాత హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య అనంతరం ఉద్యమంలో ముత్తు కృష్ణన్‌ కీలకపాత్ర పోషించాడు.

రోహిత్‌ వేముల, ముత్తుకృష్ణన్‌ స్నేహితులు

గత ఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్న రోహిత వేములకు ముత్తుకృష్ణన్‌ మిత్రుడు. ఇతను కూడా దళిత విద్యార్థే. రోహిత్‌కు, అతని తల్లికి జరిగిన అన్యాయం గురించి అనేకమందిని జాగృత పరుస్తూ ముత్తుకృష్ణన్‌ అనేక ఆర్టికల్స్‌ రాశాడు. రోహిత్‌ వేముల, ముత్తుకృష్ణన్‌ ఇద్దరూ కలిసి అంబేద్కర్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ముత్తుకృష్ణన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఎంఏ చదివారు. రోహిత వేముల ఆత్మహత్య అనంతరం జరిగిన విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.

వర్శిటీల్లో ఆత్మహత్యలను తక్షణమే ఆపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ ...

ఢిల్లీ జేఎన్ యూ లో ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్య ఘటన వర్శిటీల్లోని విద్యార్థులను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆయన ఫేస్‌బుక్‌ 'రజనీక్రిస్‌' వాల్‌పై వేల సంఖ్యలో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్శిటీల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కేంద్రం వెంటనే స్పందించాలని, వర్శిటీల్లో ఆత్మహత్యలను తక్షణమే ఆపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

07:04 - February 17, 2017

ఖమ్మం: కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమ్మినేని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఎత్తేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం పూనుకుంటోందని, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, డబ్బున్న అధికారులే రాష్ట్రాన్ని మేసేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. అందరికి సమాన అవకాశాలు కావాలన్నదే సీపీఎం మహాజన పాదయాత్ర ఉద్దేశమని తమ్మినేని అన్నారు. కులవివక్షకు గురైన రోహిత్‌ వేముల కుటుంబానికి న్యాయం చేయకుండా...కేంద్ర మంత్రులను కాపాడేందుకే.. అతని కులాన్ని వివాదస్పదం చేస్తున్నారని తమ్మినేని అన్నారు. రోహిత్‌ వేముల కులాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రతి ఇంటిలో పిల్లలందరిని చదివించినప్పుడే.. ..

ప్రతి ఇంటిలో పిల్లలందరిని చదివించినప్పుడే.. అభివృద్ధి సాధ్యమవుతోందని, కానీ..కేసీఆర్‌ సర్కార్‌ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు పూనుకుందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో విద్యా రంగాన్ని కాపాడేందుకు సీపీఎం పోరాటం చేస్తోందని తమ్మినేని తెలిపారు. సంస్కరణల్లో భాగంగానే మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకం కోసం అప్పులు చేసి ప్రజలపై మోయలేని భారం వేస్తోందని పాదయాత్ర కోఆర్డినేటర్‌ వెంకట్‌ ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న కోదండరామ్‌పై కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు అక్కసు వెళ్లగక్కుతోందని ఆయన ప్రశ్నించారు.

సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన...

సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 123వ రోజుకు చేరుకున్న పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఖమ్మం జిల్లాలోని రాయనపేట, ఆళ్లపాడు, బోనకల్లు, ముష్టికుంట్ల, నాగులవంచలో పాదయాత్ర బృందం పర్యటించింది. ముష్టికుంట్ల గ్రామంలో రెండు కిలోమీటర్ల పొడవునా తమ్మినేని బృందానికి పూలవర్షంతో స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు పాదయాత్ర బృంద సభ్యులకు సాదరంగా ఆహ్వానిస్తూ.. యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు తమ సమస్యలను తమ్మినేని బృందానికి విన్నవిస్తున్నారు. ఇప్పటికే 3వేల 300 కిలోమీటర్ల మేర యాత్రను పూర్తిచేశారు.

19:26 - February 16, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల దళితుడు కాదని ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రకటించడాన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను నిరసిస్తూ సీపీఎంతో పాటు దళిత, గిరిజన సంఘాల నేతలు ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ముందుగా దళితుడని ధృవీకరణ పత్రం జారీ చేసి, ఇప్పుడు బీసీగా ప్రకటించడాన్ని ప్రజా సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రని విమర్శించారు. 

 

11:33 - February 15, 2017

విజయవాడ: రోహిత్‌ వేముల బీసీ అంటూ గుంటూరు కలెక్టర్‌ ధృవీకరణపత్రం ఇవ్వడం దారుణమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. ఎస్సీ ధృవీకరణ పత్రంతోనే రోహిత్‌ హెచ్‌సీయూలో చేరారని గుర్తు చేశారు. రోహిత్‌ వేముల దళితుడని అందరికీ తెలుసన్నారు. బీజేపీ, టీడీపీ ఒత్తిడిలోనయ్యే కలెక్టర్‌ బీసీ సర్టిఫికెట్‌ ఇచ్చారన్నారు. తక్షణమే రోహిత్‌ వేముల చట్టాన్ని తీసుకొచ్చి.. కుల వివక్షను రూపుమాపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

13:14 - March 24, 2016

హైదరాబాద్ : 'అఫ్జల్ గురు మాకు ఐకాన్ కాదు..రోహిత్‌ వేములే మా ఐకాన్' అని జెఎన్‌యు విద్యార్థి నేత కన్హయకుమార్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడటమే తమ లక్ష్యం తప్పించి.. హింసకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ తరహాలో సమస్యలపై పోరాడుతామని చెప్పారు. మోడీ మీద ఉన్న భక్తినే దేశ భక్తి అనుకుంటున్నారు..దేశభక్తి పూర్తిగా వేరన్నారు. రోహిత్ వేములకు న్యాయం జరిగేలా పోరాడేందుకే తాను హైదరాబాద్‌ వచ్చినట్లు  అన్నారు. 

16:37 - February 23, 2016

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న రోహిత్‌ ఆత్మహత్య, జెఎన్‌యూ వివాదంపై రేపు రాజ్యసభలో చర్చ చేపట్టేందుకు అధికార, ప్రతిపక్షాలు అంగీకరించాయి. ఈ సమావేశాల్లో ఏయే అంశాలను చర్చించాలనే దానిపై సమావేశమైన నేతలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజ్యసభ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. 

15:48 - February 23, 2016

ఢిల్లీ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ పేరిట విద్యా చట్టం తీసుకురావాలన్న డిమాండ్‌తో విద్యార్ధి సంఘాల కార్యకర్తలు ఢిల్లీలో భారీ రాలీ నిర్వహించారు. జంతర్‌ మంతర్‌ దగ్గర జరిగిన ఈ ర్యాలీకి హెచ్‌సీయూలోని అంబేద్కర్‌ విద్యార్ధి సంఘం నాయకులు నేతృత్వం వహించారు. ఢిల్లీలో వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్ధి సంఘాల నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోహిత్‌ పేరిట విద్యా చట్టం తీసుకొచ్చే వరకు ఉద్యమం ఆగదని విద్యార్ధి నేతలు తేల్చి చెప్పారు. దీనిలో భాగంగా జంతర్‌ మంతర్‌ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. చలో పార్లమెంటు నిర్వహిస్తారు. రోహిత్‌ తల్లితో కలిసి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి రోహిత్‌ విద్యా చట్టం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరతారు. 

Don't Miss

Subscribe to RSS - రోహిత్‌ వేముల