లక్నో

20:05 - April 16, 2018

ఉత్తరప్రదేశ్ : యూపీకి చెందిన బిజెపి ఎంపి, సాధువు సాక్షి మహారాజ్‌ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. లక్నోలో ఓ బార్‌ అండ్‌ నైట్‌ క్లబ్‌ను ప్రారంభించడం వివాదస్పదమైంది. యూపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండే మేనల్లుడు అలీగంజ్‌లో ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌కు ఉన్నావ్‌ ఎంపి సాక్షి మహారాజ్‌ను ఆహ్వానించారు. సాక్షి మహారాజ్ రిబ్బన్‌ కట్‌ చేసి నైట్‌ క్లబ్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు బహూకరించిన గణేషుడి ప్రతిమతో వెనుదిరిగారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ సాధువై ఉండి బార్‌ను ప్రారంభించడమేంటని విమర్శలు వెల్లువెత్తడంతో సాక్షి మహారాజ్‌ స్పందించారు. అది బార్‌ అన్న విషయం తనకు తెలియదని, తప్పుడు సమాచారంతో తనని మోసం చేశారని చెప్పారు. తన గౌరవానికి భంగం కలిగించిన మహేంద్రనాథ్‌ పాండేపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎంపి వెల్లడించారు.  

 

09:18 - March 1, 2018

నెల్లూరు : యశ్వంత్ పూర్ లక్నో ఎక్స్ ప్రెస్ లో దోపిడి జరిగింది. జనరల్ బోగీలోకి ఎక్కిన గుర్తు తెలియని వ్యక్తులు బర్త్ డే అంటూ ప్రయాణీకులకు బిస్కెట్లు, కూల్ డ్రింక్ ఇచ్చారు. వీటిని తీసుకున్న 13 మంది ప్రయాణీకులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం దుండగులు విలువైన వస్తువులను అపహరించారు. రేణిగుంట స్టేషన్ లో సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ప్రయాణీకులు అపస్మారకస్థితిలో ఉండడం గమనించారు. వెంటనే గూడూరు పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు స్టేషన్ లో రైలును ఆపి అపస్మారకస్థితిలో ఉన్న ప్రయాణీకులను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంత విలువైన వస్తువులు చోరీ చేశారో అనేది తెలియాల్సి ఉంది. 

16:13 - January 18, 2018

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో హర్యానా రెయాన్‌ స్కూలు లాంటి కేసు ఒకటి వెలుగు చూసింది. లక్నో త్రివేణినగర్‌లో ఉన్న బ్రైట్‌ల్యాండ్‌ స్కూల్లో ఫస్ట్‌క్లాస్‌ చదువుతున్న విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. సిసిటివి ఫుటేజి ఆధారంగా ఈ దాడికి పాల్పడింది ఓ బాలికగా గుర్తించారు. సిసిటివి వీడియోలో చిన్న జుట్టుతో కనిపించిన ఆ అక్కే నాపై దాడి చేసిందని గాయపడ్డ విద్యార్థి రుతిక్‌ పోలీసులకు చెప్పాడు. ఉదయం పదిన్నరకు ప్రార్థన అనంతరం ఆ అమ్మాయి తనని క్లాస్‌ రూమ్‌ నుంచి తీసుకెళ్లి వాష్‌ రూంలో బంధించిందని రుతిక్‌ తెలిపాడు. రెండు చేతులను చున్నీతో కట్టేసి కత్తితో దాడి చేసినట్లు బాలుడు పోలీసులకు వెల్లడించాడు. ఈ ఘటనపై బాలుడి పేరెంట్స్‌ స్కూలు ముందు ఆందోళన చేపట్టారు. సిసిటివి ఫుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దాడి చేసిన విద్యార్థిని 6 నుంచి 8 వ క్లాస్‌కు చెందినదై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

12:02 - January 6, 2018

లక్నో : యూపీ అసెంబ్లీ ఎదుట రైతులు వినూత్న ఆందోళనకు దిగారు. రైతులు అసెంబ్లీ ముందు అలుగడ్డలను పారబోసి నిరసన తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో అలుగడ్డ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం యూపీ కిలో అలు కు రూ.4 పలుకుతుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:38 - December 30, 2017

ఉత్తరప్రదేశ్‌లో : ఓ మదర్సాపై పోలీసులు దాడి చేసి 51 మంది అమ్మాయిలకు విముక్తి కల్పించారు. మదర్సా మేనేజర్‌ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలతో పోలీసులు అధికారులతో కలిసి సంయుక్తంగా దాడి నిర్వహించారు. లక్నోలోని షహాదత్‌గంజ్‌లో ఉన్న మదర్సాపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించి మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు. మదర్సాను నిర్వహిస్తున్న కారీ తైయబ్‌ జియా అమ్మాయిలను తన ఆఫీసు కార్యాలయానికి పిలిపించుకుని కాళ్లను ఒత్తమని బలవంతం చేసేవాడు. లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని లాఠీలతో బాదేవాడు. ఆ కీచకుడి చర్యలతో విసిగిపోయిన అమ్మాయిలు ఓ లేఖ ద్వారా స్థానికులకు తెలియజేయడంతో ఈ వ్యవహారం బయటపడినట్లు పోలీసులు చెప్పారు. మేనేజర్‌తో పాటు మదర్సాలోని మిగతా సిబ్బంది కూడా తమను లైంగికంగా వేధించినట్లు బాధితులు తెలిపారు.

21:25 - November 1, 2017

లక్నో : బాలీవుడ్‌ క్వీన్‌, రాజ్యసభ సభ్యురాలు రేఖ రాయబరేలీలో అభివృద్ధి పనుల కోసం తన ఎంపీ ఫండ్‌ నుంచి రెండున్నర కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో సోలార్‌ లైట్లు, ఇంటర్‌ లింకింగ్‌ రోడ్లు, హ్యాండ్‌ పంప్‌లు, సిసిరోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. రాయబరేలీకి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అనంతరం రేఖ ఈ ఏడాది జనవరిలో కోటి 44 లక్షల నిధులు కేటాయించారు. అక్టోబర్‌ 2017 మరో కోటి 42 లక్షలు రెండో విడతగా నిధులు మంజూరు చేశారు. రాయబరేలీలో ఇప్పటికే కోటి రూపాయల పనులు పూర్తయ్యాయి.

19:40 - November 1, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీలోని ఎన్టీపీసీ ప్లాంట్‌లో భారీ ప్రమాదం సంభవించింది.బాయిలర్‌ పైపు పేలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో సుమారు 100 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:44 - September 19, 2017

 

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన రుణమాఫీ ఓ జోక్‌లా తయారైంది. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు వస్తున్న ప్రమాణ పత్రాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మధురలో ఓ రైతుకు నయాపైసా మాఫీ అయినట్లు ఓ లెటర్‌ వచ్చింది. గోవర్ధన్‌ తహసిల్ పరిధిలోని ఛిద్దీలాల్‌ తండ్రి డాల్‌చంద్‌ 2011లో లక్షా 55 వేల రుణం తీసుకున్నాడు. ఆ బకాయి ఇంతవరకు తీర్చలేదు. లక్షా 55 వేలకు బదులు ఒక పైసా మాఫీ అయినట్లు ఆ పత్రంలో ఉంది. అధికారులను మూడు సార్లు కలిసినా నయాపైసా రుణమాఫీపై నోరు మెదడపం లేదని ఆ రైతు తెలిపాడు. అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని యుపి ఎన్నికల సమయంలో బిజెపి ప్రకటించింది. ఇంతకు ముందు కూడా 90 పైసలు, రూపాయిన్నర, రెండు రూపాయలు రుణమాఫీ అయినట్లు రైతులకు సర్టిఫికెట్లు వచ్చినట్లు వార్తలొచ్చాయి.  

06:58 - September 15, 2017

లక్నో : యూపీలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బాగ్ పత్ ప్రాంతంల్నోఇ యమునా నదిలో పడవ బోల్తా పడి 19 మంది జలసమాధి అయ్యారు. మరో 12 మందిని పోలీసులు రక్షించారు. ప్రమాదసమయంలో పడవలో 60 మంది ప్రయాణికులు ప్రయణిస్తున్నారు. ప్రస్తుతం ఇంక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:14 - September 7, 2017

లక్నో : యూపీలో మరో రైలు ప్రమాదం జరిగింది. సాంభద్ర జిల్లాలో శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్ 7 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనం ఉదయం 6గంటలకు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. యూపీలో వరుస ప్రమాదాలతో ప్రజలు రైలు ఎక్కాలంటే భయపడుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - లక్నో