లక్ష్మీ పార్వతి

09:15 - May 28, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కుట్రలను సీరియల్స్ వెల్లడిస్తానని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఘాట్ కు విచ్చేసి ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...గతంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ మార్గం ఎంతో కళకళలాడుతూ ఉండేదని, ప్రస్తుతం ఈ రోడ్డు అంతా బోసి పోయిందన్నారు. బ్యానర్స్..ఘనంగా స్వాగతం పలికే విధంగా చేయాల్సిన ఏర్పాట్లు టిడిపి ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. ఎన్టీఆర్ ను టిడిపి ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందని, భారతరత్న రాకుండా అడ్డుకొంటోంది బాబేనని కుండబద్ధలు కొట్టారు. 

15:29 - November 14, 2017

హైదరాబాద్ : తన అనుమతి లేకుండా సినిమా తీస్తున్నారంటూ లక్ష్మీస్‌ వీరగ్రంథం నిర్మాతపై లక్ష్మి పార్వతి మండిపడ్డారు. తన పేరు పక్కన తనకు సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టి సినిమా తీయడం, ఎన్టీఆర్‌ను అవమానించడమేనని లక్ష్మిపార్వతి అన్నారు. సినిమా నిర్మాతపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద షూటింగ్ చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధిపై పాలు పోసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతితో టెన్ టివి ముచ్చటించింది. నిర్మాతపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:53 - October 26, 2017

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చేరుకున్నారు. అక్కడ మౌనదీక్ష చేపట్టారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవిత చరిత్రపై 'లక్ష్మీ వీరగ్రంధం' సినిమా తీయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. తన అనుమతి లేక ఉండా సినిమా నిర్మిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో 'లక్ష్మీ వీరగ్రంధం' సినిమా రూపొందనుంది. తన అనుమతి లేకుండా సినిమాను నిర్మించడం చట్ట విరుద్ధమని, దీనిపై పోరాటం చేస్తానన్నారు. తనను ఎవరూ సంప్రదించలేదని, జీవిత చరిత్రను తీయడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. బురదచల్లే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు. వైసీపీకి చెందిన పార్టీ నాయకులు ఆమె వెంట రాలేదు. కేవలం కుటుంబసభ్యులు మాత్రమే లక్ష్మీ పార్వతి వెంట ఉన్నారు. 

16:26 - August 22, 2017

కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో కీలక నేతలు పర్యటిస్తున్నారు. వైసీపీ, టిడిపి పార్టీలకు చెందిన నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆపార్టీ నేత లక్ష్మీ పార్వతి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె టెన్ టివితో మాట్లాడారు. టిడిపికి ఓటు వేసి మోసపోయారని...మూడు సంవత్సరాల్లో 600 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేరిందా అని ప్రశ్నిస్తే ప్రజలు లేదు అని జవాబిస్తున్నారన్నారు. వార్డుల్లో డ్రైనేజీ అస్తవ్యస్థంగా ఉందని, స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఎన్నికలు రాగానే నాయకులు వస్తున్నారని, ఎవరు న్యాయం చేస్తారో వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ సిటీ పక్కకు పోయిందని...భూ కబ్జాలు మాత్రం నిజమయ్యాయని ఆరోపించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:06 - February 9, 2017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసలు విలన్ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కిస్తానని, ఇందులో హీరోగా తానే నటిస్తానని సినీ నటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రకటించడం వివాదాలకు కారణమైంది. ఇందులో అసలు విలన్ లక్ష్మీ పార్వతి అంటూ టిడిపి నేతలు చేసిన ప్రకటనలకు వివాదాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతితో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలు..ఎన్టీఆర్ గత చరిత్ర తెలియచేశారు. బాలకృష్ణ తీయబోయే సినిమాలో నిజాలు ఉండాలని కుండబద్ధలు కొట్టారు. వివాదాల జోలికి వెళ్లకుండా సినీ నటుడు ఎలా ఎదిగాడు..సీఎం పీఠం ఎలా అధిరోహించాడు..? ఎలా కష్టపడ్డారో చూపించాలని సూచించారు. అలా కాకుండా ఉంటే మాత్రం తాను మాత్రం కోర్టుకు వెళుతానని స్పష్టం చేశారు. ఇదంతా తన వ్యక్తిగత వ్యవహారమని, వైసీపీ సహాయం తీసుకోనని తేల్చి చెప్పారు. బాలయ్య ప్రకటన తరువాత టిడిపి నేతల వ్యాఖ్యల నేపథ్యంలో బాలకృష్ణ వివాదాల జోలికి వెళుతారా ? లేదా ? అనేది చూడాలి.

20:34 - February 8, 2017

ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బాలయ్య బయోపిక్ సందర్భంగా లక్ష్మీ పార్వతితో 10 టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. వివాదాంశాల జోలికి బాలయ్య వెళ్తాడకోను.. వెళ్తే ఖచ్చితంగా ఆధారాలతో న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. సినిమాలో తనను విలన్ చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారని.. అసలు విలన్ చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే..
'ఎన్ టీఆర్ మహానుభావుడు.. ఆయన చరిత్రను పూర్తిగా చెబితేనే న్యాయం. చంద్రబాబు వెన్నుపోటే ఎన్టీఆర్ ను బాగా బాధ పెట్టిన ఘటన. ఆ విషయాన్ని సినిమాలో ప్రస్తావించకపోతే అర్థమే లేదు. నన్ను విలన్ గా ప్రస్తావిస్తారన్న అనుమానం ఉంది. టీడీపీ నేతల వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఏపీలో పాలన కుంటుపడింది. ప్రజలను ఏమార్చడానికే బాబు డైరెక్షన్ లో బాలయ్య ఎత్తుగడ ఇది. ఎన్టీఆర్ కు సంబంధించిన ఎవ్వరికి తెలియని ఎన్నో విషయాలు నాకు తెలుసు. బయోగ్రఫీ సందర్భంగా ఎన్నో అనుభవాలను ఆయన పంచుకున్నారు. నేనే బయోగ్రఫీని సినిమాగా తీద్దాం అనుకున్నాను. చంద్రబాబే జామతా దశమ గ్రహమంటూ ఎన్టీఆరే అన్నారు. ఇప్పటికే ఆ వీడియో క్లిప్పులే సజీవ సాక్ష్యాలు. చంద్రబాబును హీరోగా చూపిస్తే ఒప్పుకోను ఖచ్చితంగా నా ప్రస్తావన కూడా ఉండాలి. ఎన్టీఆర్ పార్టీ పెట్టి సీఎం ఎలా అయ్యారో చూపిస్తే అభ్యంతరం లేదు. నా బయోగ్రఫీ పుస్తకాలను ఇప్పటికే బాలయ్యకు ఇచ్చాను. నేనంటే బాలయ్యకు అభిమానమే. హరికృష్ణ, దగ్గుబాటి ఇలా ఎందరో బాబు బాధితులు. నేను పవర్ సెంటర్ పాలిటిక్స్ నడపలేదు. పవర్ సెంటర్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు లోకేష్ నడుపుతున్నది. నన్ను తెలుగు తల్లి అన్న సోమిరెడ్డి ఇప్పుడు విలన్ అంటున్నాడు. ఎన్టీఆర్ వివాహమాడిన వెంటనే నెల్లూరులో సోమిరెడ్డి. వేలాది మంది మహిళలతో నాకు సన్మానం చేశాడు. అధికారికంగా ఇప్పుడు నేనే ఎన్టీఆర్ భార్యను లక్ష్మీపార్వతిని తక్కువగా అంచనా వేయొద్దు. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. అనారోగ్యంపాలై ఎన్టీఆర్ ఇంట్లో ఉంటే కొడుకులు పట్టించుకోలేదు. ఒకానొక సందర్భంలో బాలయ్యపై ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు. బాబుతో కుటుంబ చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అనారోగ్యంతో ఉంటే పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కు కష్టకాలంలో అన్ని తానైయ్యాను. బాలకృష్ణ బయోపిక్ పై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఫైర్. చరిత్రను వక్రీకరించారో కోర్టు మెట్లు ఎక్కిస్తా'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:22 - January 18, 2016

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ మరణించి 20 ఏళ్లయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఎన్టీఆర్‌ ఉంటే రెండు రాష్ట్రాల్లో ప్రజలు సుభిక్షంగా ఉండేవారన్నారు. టీడీపీతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆశయాలు కొనసాగే పరిస్థితులు లేవన్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ను సైతం సరిగా అలంకరించలేదని లక్ష్మీపార్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Don't Miss

Subscribe to RSS - లక్ష్మీ పార్వతి