లుక్

15:23 - July 5, 2017

టాలీవుడ్ యంగ్ హీరో 'నితిన్' తాజా చిత్రం 'లై' షూటింగ్ సైలెంట్ గా కొనసాగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో 'నితిన్' వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ‘లై' అనే మాటకు 'లవ్..ఇంటలిజెన్స్..ఎనిమీ' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ‘నితిన్' సరసన 'మేఘా ఆకాష్' నూతన అమ్మాయి పరిచయం కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ గా పేరొందిన 'అర్జున్' కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రకి సంబంధించిన ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బాత్ టబ్ లో 'అర్జున్' సేద దీరుతున్నట్లుగా ఉంది. అయితే పోస్టర్లో 'అర్జున్' మెడ భాగంలో ఉన్న టాటూ ఆకటుట్టకొంటోంది. 'అర్జున్' ఫస్టులుక్ ను గురువారం రిలీజ్ చేస్తారని సమాచారం.

15:53 - July 2, 2017

బాలీవుడ్ హీరో 'అక్షయ్ కుమార్' సరికొత్త లుక్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రేమ కథలు..యాక్షన్ లాంటి పాత్రలు పోషించిన 'అక్షయ్' తన స్టైల్ కు భిన్నంగా ఓ పాత్రను పోషిస్తున్నాడు. 1948 లండన్ ఒలింపిక్స్ లో భారత్ సాధించిన తొలి స్వర్ణ పతకం నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. రీమాకట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను 'అక్షయ్' తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. పాతకాలం మనిషిగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. రితేశ్ సిద్దాని, ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్షయ్ కు జోడిగా బుల్లితెర నటి మౌని రాయ్ నటిస్తోంది. సినిమాకు 'గోల్డ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో కునాల్ క‌పూర్ మ‌రియు అమిత్ స‌ద్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌ల టీం అంతా లండ‌న్ వెళ్ళారు. అక్క‌డ తొలి షెడ్యూల్ మొద‌లు పెట్టారు. ఆగ‌స్ట్ లో ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

09:24 - June 28, 2017

బాలీవుడ్ మిస్టర్ ఫర్ పెక్ట్ 'అమీర్ ఖాన్' సాహసాలు చేయడంలో ముందుంటాడు. ఆయన నటించే పాత్ర కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడని ఆయన చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. తాజాగా మరొక సాహసం చేశాడు. ఆయన ఫొటో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ‘అమీర్' ఇటీవలే నటించిన 'దంగల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలోని పాత్రల కోసం సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చాడు..మరో పాత్ర కోసం ఏకంగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెప్పినా 'అమీర్' వినకుండా సాహసం చేసి భళీరా అనిపించాడు. తాజాగా ఆయన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ లు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం ఆయన ఏకంగా ముక్కు..చెవులు కుట్టించేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చెవులు కుట్టించుకోవడంతో 'అమీర్' నొప్పి భరించలేకపోయాడని టాక్. మరి ఆయన పాత్ర ఎలా ఉండనుందో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

16:57 - March 21, 2017

యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఏ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా దూసుకుపోతున్న హీరో 'నిఖిల్'. లాంగ్ బ్యాక్ కెరీర్ ని స్టార్ట్ చేసి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మొదటిలో పెద్దగా గుర్తింపు రాకపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు నిఖిల్. 'శేఖర్ కమ్ముల' డైరెక్షన్ లో వచ్చిన 'హ్యాపీ డేస్' సినిమాలో ఉన్న నలుగురి హీరోల్లో ఒకడిగా నటించాడు 'నిఖిల్'. స్టూడెంట్ లైఫ్ ని స్క్రీన్ మీద చూపిస్తూ తీసిన 'హ్యాపీ డేస్' సినిమా 'నిఖిల్' కి మంచి గుర్తింపు ఇచ్చింది.

స్వామి రారా..
నిఖిల్ ని నటుడిగా కాకుండా హీరోగా ఒక రేంజీకి తీసుకెళ్లిన సినిమా 'స్వామి రా రా'. తెలుగు తెరపై రెగ్యులర్ స్టోరీలు వస్తున్న టైం లో కొత్త స్క్రీన్ ప్లే తో థ్రిల్లర్ లో కామెడీ మిక్స్ చూపించిన సినిమా 'స్వామి రా రా'. ఈ సినిమా కి డైరెక్టర్ సుధీర్ వర్మ. ఈ సినిమాని సుధీర్ వర్మ మలిచిన తీరు చాల ఆసక్తికరంగా ఉంటుంది. కలర్స్ స్వాతి హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా సుధీర్ వర్మకి మంచి హిట్ ఇచ్చిన సినిమా.

సుధీర్ వర్మ, నిఖిల్ కాంబినేషన్ లో..
సుధీర్ వర్మ, నిఖిల్ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'కేశవ'. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఇంటరెస్టింగ్ గా ఉంది. ఈ పోస్టర్ లో మెయిన్ గా 'నిఖిల్' లుక్ గురించే చెప్పుకోవాలి. ఇప్పటివరకూ 'నిఖిల్' ఏ సినిమాలోనూ కనిపించనంత రఫ్ లుక్ తో ఉన్నాడు. డిఫరెంట్ గా షేప్ చేసి బాగా పెరిగిన గడ్డం.. మాసిన తలకట్టు.. బైక్ పై రయ్యిమంటూ దూసుకువచ్చేస్తున్న 'నిఖిల్' ఈ పోస్టర్ లో కనిపిస్తాడు. మార్చి 23న 'కేశవ' టీజర్ రిలీజ్ చేయబోతున్నామని పోస్టర్ ద్వారా చెప్పారు. ఏది ఏమైనా ఈ సారి 'నిఖిల్' లుక్ మాస్ ని టార్గెట్ చేసింది అని చెప్పాలి.

20:06 - October 9, 2016
12:39 - September 17, 2015

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'సుకుమార్' దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమ'తో ఫస్ట్ లుక్ విడుదలైంది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విడుదల చేసినట్లు 'ఎన్టీఆర్' తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ఈ సినిమాలో 'ఎన్టీఆర్' స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. వెరైటీ కటింగ్..వెరైటీ గడ్డంతో స్టైలిష్ గా కనిపించాడు. ఈ సినిమాకు 'దేవిశ్రీ ప్రసాద్' సంగీతాన్ని అందించారు.

Don't Miss

Subscribe to RSS - లుక్