లేఖ

08:03 - October 10, 2018

విశాఖపట్నం : మన్యంలో మరోసారి ఉద్విగ్న వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం చినరాజప్పతోపాటు మంత్రి నారా లోకేష్‌ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. మరోవైపు గిరిజన ప్రజాప్రతినిధులు వ్యాపారులు ఏజెన్సీని వదిలి వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ పేరుతో ఓ లేఖ విడుదలైంది. దీంతో ఒక్కసారిగా మన్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.విశాఖ మన్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోన్న టెన్షన్‌ నెలకొంది. నేడు ఏపీ హోంమంత్రి చినరాజప్ప, ఐటీమంత్రి నారా లోకేష్‌ ఇవాళ మావోయిస్టుల చేతిలో హతమైన కిడారి సర్వేశ్వరరావు, సోమ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు  రోడ్డు మార్గంలో పాడేరులోని కిడారి సర్వేశ్వరరావు ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.  అనంతరం అక్కడి నుంచి అరకు వెళ్లి సివేరి సోమా కుటుంబ సభ్యులనూ వారు పరామర్శించనున్నారు.  ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. నారా లోకేష్‌ పర్యటనకు ఒక రోజు ముందు మన్యంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ  కలకలం రేపుతోంది.  టీడీపీకి చెందిన కిడారి  సర్వేశ్వరరావు, సోమ హత్యలకు గల కారణాలను ఆ లేఖలో వెల్లడించారు. గిరిజనులకు   ద్రోహం చేస్తున్నందునే ప్రజాకోర్టులో వారికి శిక్ష విధించామని లేఖలో పేర్కొన్నారు.  బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు వారిని హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదన్నారు.  అందుకే అతడికి ప్రజాకోర్టులో శిక్ష విధించామని స్పష్టం చేశారు.  బాక్సైట్‌ తవ్వకాలకు ఎవరు అనుకూలంగా ఉన్నా వదిలేది లేదని లేఖలో హెచ్చరించారు.  ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి 20 కోట్లకు అమ్ముడుపోయారని అందులో ఆరోపించారు.  బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, పద్దతి మార్చుకోకపోతే కిడారి, సోమలకు పట్టిన గతే ఆమెకు పడుతుందని హెచ్చరించారు.   ఈ నేపథ్యంలో ఇవాళ నారా లోకేష్‌ కిడారి, సోమ కుటుంబాల పరామర్శకు వస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందన్న ఆందోళన గిరిజనుల్లో వ్యక్తమవుతోంది.

13:30 - October 2, 2018

హైదరాబాద్ : అసలే ఫ్రైర్ బ్రాండ్ అనే పేరు. పైగా అధిష్టానం ఎన్నికల వర్కింగ్ ప్రెసిడెంట్ అధికారాలు చేతిలోపెట్టింది. మరోపక్క కాంగ్రెస్ లో ఆధిప్యత ధోరణి కొత్తేం కాదు. వెరసి రేవంత్ రెడ్డిగారి హల్ చల్ టీ. కాంగ్రెస్ లో నిప్పులో ఉప్పుకణికలాగా తయారయ్యాడు. దీంతో పాత నాయకులంతా అటు అధిష్టానం  ముందు నోరు మెదపలేరు. ఇటు రేవంత్ దూకుడు తట్టుకోలేరు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ గెలుపు కోసం ప్రచారానికి వెళ్లి పలు సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ పై పాత నాయకులంతా గుర్రుగా వున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్ మాట్లాడుతు.."మీ నియోజకవర్గంలో షబ్బీర్ అలీని గెలిపిస్తే ఆయన నంబర్-2 పొజిషన్ లో ఉంటారు. మీకు మేలు జరుగుతుంది" అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 'ఇంకా అధికారంలోకి రాలేదు. సీట్ల సర్దుబాటు లేదు, అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండానే ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలేంటని సీనియర్లు అంటున్నారు. ఆయన వ్యాఖ్యలతో సీఎం ఆశావహుల జాబితా పెరిగిపోయే ప్రమాదం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రేవంత్ మాటలపై ఎవరూ బహిరంగంగా విమర్శించకపోయినా, ఈ కొత్త సంస్కృతితో పార్టీకి నష్టమేనని సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీలో ఐక్యతను దెబ్బతీసే ఈ వ్యాఖ్యలు మంచివి కావని, ఎన్నికల వేళ, పదవులు, స్థానాల గురించి మాట్లాడితే, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందంటూ, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒకరు రాహుల్ గాంధీకి లేఖను రాసినట్టు తెలుస్తోంది.

13:30 - October 2, 2018

హైదరాబాద్ : అసలే ఫ్రైర్ బ్రాండ్ అనే పేరు. పైగా అధిష్టానం ఎన్నికల వర్కింగ్ ప్రెసిడెంట్ అధికారాలు చేతిలోపెట్టింది. మరోపక్క కాంగ్రెస్ లో ఆధిప్యత ధోరణి కొత్తేం కాదు. వెరసి రేవంత్ రెడ్డిగారి హల్ చల్ టీ. కాంగ్రెస్ లో నిప్పులో ఉప్పుకణికలాగా తయారయ్యాడు. దీంతో పాత నాయకులంతా అటు అధిష్టానం  ముందు నోరు మెదపలేరు. ఇటు రేవంత్ దూకుడు తట్టుకోలేరు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ గెలుపు కోసం ప్రచారానికి వెళ్లి పలు సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ పై పాత నాయకులంతా గుర్రుగా వున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్ మాట్లాడుతు.."మీ నియోజకవర్గంలో షబ్బీర్ అలీని గెలిపిస్తే ఆయన నంబర్-2 పొజిషన్ లో ఉంటారు. మీకు మేలు జరుగుతుంది" అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 'ఇంకా అధికారంలోకి రాలేదు. సీట్ల సర్దుబాటు లేదు, అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండానే ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలేంటని సీనియర్లు అంటున్నారు. ఆయన వ్యాఖ్యలతో సీఎం ఆశావహుల జాబితా పెరిగిపోయే ప్రమాదం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రేవంత్ మాటలపై ఎవరూ బహిరంగంగా విమర్శించకపోయినా, ఈ కొత్త సంస్కృతితో పార్టీకి నష్టమేనని సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీలో ఐక్యతను దెబ్బతీసే ఈ వ్యాఖ్యలు మంచివి కావని, ఎన్నికల వేళ, పదవులు, స్థానాల గురించి మాట్లాడితే, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందంటూ, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒకరు రాహుల్ గాంధీకి లేఖను రాసినట్టు తెలుస్తోంది.

15:38 - September 30, 2018

విశాఖపట్నం : మావోయిస్టుల మారణకాండకు బలైపోయిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య తెలుగు రాష్ట్రాలల తీవ్ర అలజడి సృష్టించింది. అరుకులో జరిగిన ఈ మారణ కాండకు పక్క రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడ్డాయి. దీంతో ఆయా రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులు కూడా అలర్ట్ అయ్యారు. తెలంగాణలో కూడా మావోయిస్టులతో ప్రమాదం వుందనే అనుమానంతో పోలీసులు పలువురు నేతలను హెచ్చరించారు. కాగా మావోయిస్టులు కాల్చి చంపిన సివేరి సోమ ఆత్మఘోషిస్తోందంటూ ‘జవాబు చెప్పండి’ పేరిట ఓ కరపత్రం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.
ఆ లేఖ సారాంశం ఏలా వుందంటే..‘నేనొక మాజీ ఎమ్మెల్యేని. నాకు ఆరుగురు పిల్లలు. ఎదిగొచ్చిన కొడుకులకు ఉద్యోగం కూడా లేదు. సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. నేనేం తప్పు చేశాను? ఏదైనా తప్పుచేసుంటే ఒక  హెచ్చరిక అయినా చేశారా? నేనేం తప్పు చేసానని నన్ను చంపారు? నేను ఏ వర్గానికి శత్రువుని? మావోయిస్టులారా చెప్పండి, కుహనా హక్కుల సంఘల్లారా..మీరైనా చెప్పండి- సివేరి సోమ’ అని ఆ కరపత్రంలో పేర్కొన్నారు. ఈ కరప్రతంలో సోమ భౌతికకాయం ఫొటోతో పాటు, ఆయన పాస్ పోర్ట్ చిత్రం కూడా కనబడుతుంది.

ఏపీ,విశాఖపట్నం, మావోయిస్టులు, ఎన్ కౌంటర్,మాజీ ఎమ్మెల్యే, సివేరి సోమ, ఆత్మఘోష, లేఖ, సోషల్ మీడియా,AP, Visakhapatnam, Maoists, Encounter, Former MLA, Sivari Soma, Swagoshosh, Letter, Social Media,

10:42 - August 29, 2018

హైదరాబాద్ : నటుడు, నిర్మాత, టిడిపి నేత హరికృష్ణ మృతి పలువురిని కలిచివేసింది. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కామినేని ఆసుపత్రిలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. ఇదిలా ఉంటే ఆయన రాసిన లేఖ బయటపడింది. తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు, శ్రేయోభిలాషులకు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'సెప్టెంబర్ 2వ తేదీన 62వ రోజు పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపవద్దు. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రులయ్యారు. ఇది మన అందరికి ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. ఇందుచేత జన్మదిన సందర్భంగా బేనరులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్పగుచ్చాలు, దండలు తీసుకరావద్దని, వీటికి అయ్యే ఖర్చు వరదలు..వర్షాలతో నష్టపోయిన వారి కుటుంబాలకు అందచేయాలని కోరుతున్నా. అంతేగాకుండా నిరాశ్రుయలయిన వారికి దుస్తులు, వంట సామాగ్రీ, నిత్యావసర వస్తువులు శక్తి కొలది అందచేయాలని కోరుతున్నా' అంటూ హరికృష్ణ లేఖ రాశారు. 

17:43 - August 20, 2018

పాకిస్థాన్ : ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ లేఖలో ఇరుదేశాల చర్చలకు సంబంధించి మోది ప్రస్తావించలేదు. పొరుగు దేశాలతో మంచి సంబంధాలనే కోరుకుంటామని మోది లేఖలో తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌కు మోదీ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎమ్ ఖురేషి తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ మర్యాదపూర్వకంగానే లేఖ రాసినట్లు సమాచారం. పాకిస్తాన్‌కు 22వ ప్రధానిగా పిటిఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

08:16 - June 28, 2018

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లకు రక్షణ కల్పించమని కోరుతూ ప్రధాని మోది, సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశాడు. మీరట్‌ జిల్లా మవానాలో నలుగురు కూతుళ్లతో కలిసి ఆయన ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఆ ఏరియాలో ఉండే ఆకతాయిలు అమ్మాయిలను నిత్యం వేధిస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక నలుగురు అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లడం మానేశారు. అమ్మాయిలు మదర్సాలకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటున్నప్పకీ ఇరుగు పొరుగున ఉండే ఆ ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగలేదు. ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేస్తుండడంతో ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆకతాయిలు  యాసిడ్‌తో దాడి చేస్తామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదికి విజ్ఞప్తి చేశారు. బాధితుల ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

09:02 - June 27, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  కొన్ని వాస్తవాలను దాస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంకు నిధులు ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి చంద్రబాబు లేఖ రాయడాన్ని కేవీపీ తప్పుపట్టారు.  భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు కేంద్ర ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా అమలు జరిగేలా చూడాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాశారు. ఇలాచేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం కొంతవరకైనా తగ్గుతుందని కేవీపీ సూచించారు. 
 

21:11 - June 25, 2018
11:54 - June 15, 2018

ఢిల్లీ : హస్తిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్రమోదికి లేఖ రాశారు. ఐఏఎస్‌ అధికారుల సమ్మెను విరమింపజేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని మోదిని కోరారు. ఢిల్లీలో మూడు రోజుల నుంచి వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చిందని లేఖలో వివరించారు. సమ్మె కారణంగా కాలుష్య నియంత్రణపై గత 3 నెలలుగా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేకపోయామని తెలిపారు. మురుగు కాలువలను శుభ్రం చేయడానికి వీల్లేకుండా పోయిందని... వీథి క్లినిక్‌ల ఏర్పాటు, వాయు కాలుష్య నియంత్రణ చర్యలు కూడా నిలిచిపోయాయని పేర్కొన్నారు.  రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఏమీ చేయడం లేదని కేజ్రీవాల్‌ ఆరోపించారు.  కేజ్రీవాల్‌, ఆయన మంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో నాలుగు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. పనులు నిలిపేసిన ఐఏఎస్ అధికారులపై చర్య తీసుకోవాలని, వారు విధులు నిర్వహించేలా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆదివారం ప్రధాని కార్యాలయం వరకు మార్చ్‌ నిర్వహిస్తామని ఆప్‌ హెచ్చరించింది. కేజ్రీవాల్ ఆందోళనకు ఆర్జేడి, ఆర్‌ఎల్‌డి, టిఎంసి మద్దతు ప్రకటించాయి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - లేఖ