లైంగిక వేధింపులు

18:36 - September 14, 2018

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలో దారుణం జరిగింది. ఓ కళాశాల ప్రిన్సిపల్ మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తరచూ వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. సెలవులు కావాలని అడిగితే తనకు లొంగాలని మహిళా అధ్యాపకులను శ్రీనివాస్ వేధింపులకు గురి చేస్తున్నాడు. మహిళలతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మాట్లాడుతున్నాడు. ప్రిన్సిపల్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మహిళా అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. మహిళా అధ్యాపకులకు విద్యార్థి సంఘాలు అండగా నిలిచాయి. శ్రీనివాస్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని..లేనిఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ రేట్ కు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు విన్నవించారు. తనతో పాటు మరో ఇద్దరు మహిళలతో ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అధ్యాపకురాలు తెలిపారు. డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతారని వాపోయింది. శ్రీనివాస్ ను సస్పెండ్ చేసేందుకు కలెక్టర్ దర్యాప్తు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.   

 

11:30 - August 31, 2018

 

నిజామాబాద్‌ : మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో 19 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న సంజయ్‌ బయటికి వచ్చారు. శాంకరి నర్సింగ్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్ధినిలు.. మాజీ మేయర్ సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ హోంమంత్రితో పాటు జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీసులు సంజయ్‌ని అరెస్ట్‌ చేశారు. సంజయ్‌పై లైంగిక వేధింపులతో పాటు నిర్భయ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మంది సాక్ష్యులను విచారించిన పోలీసులు వారి వాంగ్మూలం సేకరించారు.

 

13:30 - August 23, 2018

చిత్తూరు : తిరుపతి టీటీడీకి చెందిన శ్రీనివాస మంగాపురం ఆలయ ఏఈవోపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్రీనివాసులు తనను లైంగిక వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. శ్రీనివాస మంగాపురం ఆలయంలో గతకొంతకాలంగా బాధితురాలి తల్లి పని చేస్తోంది. అయితే తల్లిని కలిసేందుకు వెళ్లినప్పుడు ఆ మహిళపై ఏఈవో శ్రీనివాసులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాను చెప్పినట్లు వినాలని, చెప్పిన చోటుకు రావాలని శ్రీనివాసులు వేధిస్తున్నాడని మహిళ పేర్కొంది. టీటీడీ ఏఈవో, విజిలెన్స్ అధికారులకు యువతి ఫిర్యాదు చేసింది. చంద్రగిరి పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈమేరకు శ్రీనివాసులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

 

12:55 - August 17, 2018

ప్రకాశం : ఒంగోలులోని ఓ బాలసదన్ లో బాలికలపై లైంగిక వేధింపులు కలకలం రేపింది. ఒంగోలుకు చెందిన ప్రముఖ పాస్టర్ జోసెఫ్ నడుపుతున్న బాలికల గృహంలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణ చేపట్టింది. దీంతో బాలిక నుంచి సమాచారం సేకరించిన అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు సంస్థ పై దాడి చేసి పాస్టర్ జోసెఫ్‌ను అరెస్ట్ చేశారు. బాలికలను బాలసదన్ కు తరలించారు.

06:40 - August 4, 2018

నిజామాబాద్ : డి.శ్రీనివాస్‌ తనయుడు.. ధర్మపురి సంజయ్‌పై... లైంగిక వేధింపుల ఉచ్చు బిగుసుకుంటోంది. శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు చర్యలకు శ్రీకారం చుట్టారు. నిర్బయ సహా.. నాలుగు సెక్షన్ల కింద.. కేసులు నమోదు చేశారు. ఇక సంజయ్‌ని అరెస్ట్‌ చేయడమే తరువాయి అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ కుట్ర సాగుతోందని సంజయ్‌ ఆరోపిస్తున్నారు.

నిజమాబాద్‌ నగర మాజీ మేయర్‌, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తనయుడు.. డి.సంజయ్‌ని లైంగిక వేధింపుల ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సంజయ్‌, కాలేజీ హాస్టల్‌కు వచ్చి లైంగిక వికృత చేష్టలకు పాల్పడడం, అసభ్య పదజాలంతో దూషించడం, వేధింపులకు పాల్పడుతున్నారన్నది.. శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినుల ఆరోపణ. వీరి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. సంజయ్‌పై.. నిర్భయ సహా ఐపీసీలోని నాలుగు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

గురువారం, రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి ఫిర్యాదు చేసిన శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినులు, శుక్రవారం, నిజమాబాద్‌ పోలీసు కమిషనర్‌ను కలిసి విషయం వివరించారు. అనంతరం నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశారు. డిసెంబర్‌లో అడ్మిషన్‌లు తీసుకున్న తాము.. మూడు నెలల పాటు ప్రైవేటు హాస్టల్స్‌ ఉంటే.. సంజయ్‌ కాలేజీ హాస్టల్‌లో ఉండాలంటూ ఒత్తిడి తెచ్చారని.. అక్కడ సంజయ్‌ తమను వేధించారన్నది విద్యార్థినుల అభియోగం.

నిర్భయ సహా.. నాలుగు సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటోన్న సంజయ్‌.. తనపై వచ్చిన అభియోగాన్ని తోసిపుచ్చారు. ఇదంతా రాజకీయ కుట్ర అని అభిప్రాయపడ్డారు. అటు.. సంజయ్‌ సోదరుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌.. దీన్ని టీఆర్ఎస్‌ అంతర్గత వ్యవహారంగా అభివర్ణించారు. సంజయ్‌తో విడిపోయి 20 ఏళ్లు దాటిందని, ఆయనపై వస్తోన్న ఆరోపణలు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి డ్యామేజీ చేయవని అభిప్రాయపడ్డారు.

మరోవైపు.. మహిళా, ప్రజాసంఘాలు సంజయ్‌ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. పదకొండు మంది విద్యార్థినులు సంజయ్‌ వేధింపులపై రోడ్డెక్కితే.. దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించడాన్ని.. మహిళా, ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి. ఆయన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మొత్తానికి సంజయ్‌పై వచ్చిన ఆరోపణలు.. నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలనే సృష్టిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ గూటికి చేరుకుంటారని వస్తోన్న వార్తల నేపథ్యంలో.. ఆయన తనయుడు సంజయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఆసక్తిని కలిగిస్తున్నాయి. కేసులో సంజయ్‌కి శిక్ష పడితే.. ఆయన రాజకీయ భవితవ్యం అంధకారం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు పోలీసులు ఎంత పకడ్బందీగా కేసును కడుతున్నారన్న దానిపై.. సంజయ్‌ భవితవ్యం ఆధారపడుతుంది. 

13:24 - August 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళలు..విద్యార్థులపై లైంగిక వేధింపులు అధికమౌతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రధానంగా సన్మాన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సభ్య సమాజం తలదించుకొనేలా చేస్తున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని డీడీ కాలనీలో చైతన్య స్కూల్ విద్యార్థులపై రమేశ్ అనే ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చైతన్య స్కూల్ కు చేరుకుని రమేశ్ ను చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్కూల్ కు చేరుకుని రమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన రమేశ్ ను ఆసుపత్రికి తరలించి కేసులు నమోదు చేశారు.

19:57 - February 5, 2018

సంగారెడ్డి : జిల్లా పుల్కల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌ మల్లికార్జున్‌కు గ్రామస్తుల దేహశుద్ధి చేశారు. గత కొంత కాలంగా పదో తరగతి విద్యార్థినులను.. మల్లికార్జున్‌ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇవాళ టీచర్‌ను చితకబాదారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:42 - January 31, 2018

చెన్నై : నటి అమలాపాల్‌ లైంగిక వేదింపులకు గురయ్యారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు వ్యాపారవేత్త అలగేశన్‌ను అరెస్ట్ చేయటంతో విషయం వెలుగుచూసింది.  చెన్నైలోని టీనగర్ పాండిబజార్ పోలీస్టేషన్‌లో అలగేశన్‌పై నటి అమలాపాల్ ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధించారని, అంతేకాకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది. సమాజంలో మహిళలకు భద్రత లేదని, చేతలతో మాటలతో నిత్యం వేధింపులకు గురవుతూనే ఉన్నారని ఆమె అన్నారు. నటిగా ఉన్న  తానే వేధింపులకు గురయ్యానని, ఇక సామాన్య మహిళల పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోయారు. తనను వేధించిన  వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:28 - January 5, 2018
09:14 - January 4, 2018

హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ బెయిల్..కస్టడీ పిటిషన్ పై కోర్టు విచారించి తీర్పునివ్వనుంది. ఆయనకు బెయిల్ వస్తుందా ? రాదా ? అనేది ఉత్కంఠ నెలకొంది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో గజల్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. తొలుత నోటీసులు ఇచ్చిన తరువాతే అరెస్టు చేయడం జరిగిందని పోలీసుల తరపు న్యాయవాదులు, కుట్ర పూరితంగా అరెస్టు చేశారని గజల్ శ్రీనివాస్ తరపు న్యాయవాదులు వాదించారు. అన్నీ సెక్షన్లు బెయిలబుల్ కిందకే వస్తాయని గజల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కానీ బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కస్టడీకి అప్పగించాలని పోలీసు తరపు న్యాయవాది పేర్కొంటున్నారు. ఏ 2 నిందితురాలిగా ఉన్న పావని మాత్రం తప్పు చేయలేదని వాదిస్తోంది. ఈమెను పోలీసులు మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ పిటిషన్ కు అనుమతినివ్వకపోతే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - లైంగిక వేధింపులు