లోకేష్

16:50 - July 12, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వం చేపడుతున్న..చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు..పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గడిచిన మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని..నూతన టెక్నాలజీతో అరకొటి మందిని సభ్యత్వం తీసుకోవడం జరిగిందన్నారు. 2016లో సభ్యత్వం 70 లక్షల మందికి చేరుకోవడం జరిగిందని..గ్రామ కమిటీలు..మండల కమిటీలు..జిల్లా కమిటీలు ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగిందన్నారు. నాలుగు రీజియన్ సెంటర్స్ ఏర్పాటు చేసి, శిక్షణా శిబిరాలు ఏర్పాటయ్యాయన్నారు. బూత్ కమిటీలను బలోపేతం చేయాలనే దృష్టి బాబులో ఉందని..పటిష్టంగా ఉంటే 175 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందన్నారు. 5162 బూత్ కన్వీనర్ల నియామకం పెండింగ్ లో ఉందని..ఇవి వెంటనే పూర్తి చేసే విధంగా ప్రజాప్రతినిధులు చూడాలన్నారు.

అనంతపురం, కడప, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బూత్ కన్వీనర్ల సమస్యలున్నాయని..వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. సేవా మిత్రలను సాధికారిక మిత్రలతో ట్యాగింగ్ చేయాలని..ఇందులో ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగిందని, కుప్పంలో పైలట్ చేసినట్లు పేర్కొన్నారు. వచ్చేవారంలో 'గ్రామ దర్శిని' కార్యక్రమం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని..ప్రతి ఇంటికి వెళ్లాలని..బూత్ కన్వీనర్లు ప్రతొక్కరినీ కలిసి సమస్యలను గుర్తించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యక్తిని అనుసంధానం చేయడం జరుగుతుందని..పార్టీ ఆఫీసులో ఉంటూ సమాచారం ఇతరులకు తెలియచేస్తారని లోకేష్ పేర్కొన్నారు. 

20:28 - July 11, 2018

అమ్మయ్య మొత్తం మీద థాయ్ లాండ్ బొయ్యారం కథ సుఖాంతమైంది..జేసీ దివాకర్ రెడ్డి అంటె ఫీలైతవ్ గని.. నీది నాల్కెనా తాటి మట్టనా..? అరే నీయక ఆ పోరని పేరేంది ఆ లోకేశం.. ఆ పోరన్ని ఎవ్వలికన్న మంచి డాక్టరుకు సూపెట్టుండ్రివా ఓ తెల్గుదేశమోళ్లు..అనంతపురం కాడ తెల్గుదేశం ఎంపీలు దీక్ష జేస్తున్నరు ఎందుకు..? ఓయమ్మనే ఈ ముచ్చట మూడు రోజులు ముందు దెలిస్తె చంద్రాలు ఆంధ్రరాష్ట్రమంత పండుగ జేసునో ఏమో..?అయ్యో హైకోర్టు ఎంత పనిజేశే.. ఇంకో నాల్గొద్దులు ఆగినా.. ఎన్నికలు అయిపోవు అప్పుడు ఏం జెప్పినా ఏంగాకపోతుండే..మంత్రి జగదీశ్వర్ రెడ్డిగారు తమరేమో గడ్కోపారి రచ్చగెలుస్తాని..పెద్దల పెద్దరికం పర్వు మర్యాదలు.. అన్ని గల్పి నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తేవెధ ఊర్లె ఒక శవాన్ని తయ్యారు జేశ్నయ్..గీ గరం గరం ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ జేయండి...

21:42 - July 8, 2018

విశాఖ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... రాష్ట్ర మంత్రి లోకేశ్‌పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ లక్ష్యంగా సవాళ్లు విసురుతూ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే  ఎమ్మెల్సీగా రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని విశాఖ పర్యటనలో జనసేనాని సవాల్‌ విసిరారు. లోకేశ్‌ను దొడ్డిదారిన ముఖ్యమంత్రిని చేయాలని చూస్తే జనసేన సహించబోదని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. 
ముగిసిన పవన్‌ కల్యాణ్‌ విశాఖ జిల్లా పర్యటన   
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ జిల్లా పర్యటన ముగిసింది. రంజాన్‌ సందర్భంగా గత నెలలో పర్యటనకు బ్రేక్‌ ఇచ్చిన పవన్‌.. జూన్‌ చివరి నుంచి పునఃప్రారంభించారు. విశాఖ జిల్లాలోని పలు నియోజవర్గాలతోపాటు విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట పోరాట యాత్ర నిర్వహించారు. విశాఖ పర్యటనలో చివరి రోజు పలువురు ప్రముఖులు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. అందరికీ పార్టీ కండువాలు కప్పి.. జనసేనలోకి ఆహ్వానించారు.
లోకేశ్‌, చంద్రబాబు లక్ష్యంగా పవన్ విమర్శల దాడి 
ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మంత్రి లోకేశ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి పెంచారు. లోకేశ్‌ను దొడ్డి దారిన ముఖ్యమంత్రిని చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. మంత్రి లోకేశ్‌కు ఏ అంశంపైనా విషయ పరిజ్ఞానం, సమస్యలపై అవగాహనలేదని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. అవగాహన ఉంటే ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు ఏ సమస్యపైనా చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. లోకేశ్‌, చంద్రబాబు, జగన్‌.. వస్తే కూర్చుని సమస్యలపై చర్చించడానికి సిద్ధమని జనసేనాని ప్రకటించారు. 
సామాజిక విప్లవం పోరాటం : పవన్ 
అణగారిని వర్గాలకు అందలం ఎక్కించేందుకే జనసేన అవిర్భవించిందన్న పవన్‌ కల్యాణ్‌... ఆర్థిక, రాజకీయ, సామాజిక విప్లవం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు డబ్బు, పదవిపై వ్యామోహం పోలేదని  వపన్‌ విమర్శించారు. చంద్రబాబు ఒక్కరే ఎదుగుతూ మిగిలిని వారిని అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. 
 

06:33 - June 20, 2018

ప్రకాశం : కర్నాటక ఎన్నికలు బీజేపీ ప్రభుత్వానికి ట్రైలర్‌ మాత్రమేనని ఏపీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. బీజేపీకి అసలైన సినిమా 2019లో ఉంటుందన్నారు. తెలుగు జాతితో ఎవరు పెట్టుకున్నా.. మాడిమసై పోతారని... ప్రధాని మోదీకి కూడా అదే గతిపడుతుందని ఆయన హెచ్చరించారు. దేశంలో బీజేపీ భవిష్యత్‌ గల్లంతైందన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పర్యటించిన లోకేష్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా చీరాలలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. చీరాలకు ఉదయమే చేరుకున్న లోకేష్‌.... మధ్యాహ్నం వరకు తన పర్యటనను కొనసాగించారు. తొలుత చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం చేనేతపురి కాలనీలో చేనేత కార్మికుల గృహాలను పరిశీలించారు. చేనేత మగ్గం నేసిన లోకేష్‌... చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం రామాపురంలో మత్స్యకారులకు బోట్లు, వలలు పంపిణీ చేశారు. 50ఏళ్లు దాటిన మత్స్యకారులకు వెయ్యి రూపాయల చొప్పున పించను పంపిణీ చేశారు.

కొత్తపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన జంజనం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారోత్సవ సభలో లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ, వైసీపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్నాటక ఎన్నికలు బీజేపీకి ట్రైలర్‌లాంటివని... 2019లో అసలైన సినిమా ఉంటుందన్నారు. ఏపీ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నిక చేసిన వారే దేశ ప్రధాని అవుతారని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని లోకేష్‌ అన్నారు. వైసీపీ బీజేపీతో చేతులు కలిపి ఆ అభివృద్ధిని అడ్డుకునేందుఉ ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

07:06 - April 27, 2018

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం యువతలో పెద్దఎత్తున ఆందోళన నెలకొని ఉంది. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని.. ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా... అది ఆచరణలో కనబడటంలేదన్న విమర్శ.. విద్యార్థి, యువజన సంఘాలనుంచి వినబడుతోంది... ఇంటికో ఉద్యోగమిస్తామని, ఉద్యోగం ఇప్పించలేని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో.. ఇచ్చిన హామీ ఇప్పుడు అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై టెన్ టివి జనపథంలో ఎస్ఎఫ్ఐ ఏపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నూర్‌ మహ్మద్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

10:27 - April 11, 2018

చిత్తూరు : తిరుపతికి షియామీ కంపెనీ తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఆ కంపెనీ ప్రతినిధులతో బాబు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో మంత్రులు నారా లోకేష్, అమర్ నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎంపీలు..ఎమ్మెల్యేలు..ఇతర ప్రజాప్రతినిధులకు ఈ చర్చల్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వలేదు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన..అవకాశాలపై బాబు వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తిరుపతిలో కంపెనీ ఏర్పాటు చేయాలని షియామీ కంపెనీని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. వంద మంది షియామీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం తిరుపతికి చేరుకున్నారు. వారు బస చేసిన హోటల్ కు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుని చర్చలు ప్రారంభించారు. శ్రీసిటీ, తిరుపతి ఈఎంసీ 2 ప్రాంతాల్లో పరిశ్రమ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రూ. 4వేల కోట్లతో సెల్ ఫోన్ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని షియామీ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. యూపీ, ఏపీ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. 

17:44 - February 25, 2018

విశాఖ : కొత్త ఆలోచనలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉందన్నారు మంత్రి నారాలోకేష్‌. ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో ఏపీ దూసుకుపోతుందన్నారు. రిలయన్స్‌ సహకారంతో ఏపీలో సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీ చేపడతామన్నారు. కేంద్రం మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని తీసుకువస్తే, తాము మేక్‌ ఇన్ ఆంధ్రప్రదేశ్‌ తీసుకువచ్చామన్నారు. 

18:47 - February 13, 2018

కృష్ణా : రిలయన్స్‌ అధిపతి ముఖేశ్‌ అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ సందర్శిస్తారు. ఆర్‌టీజీఎస్‌ పనితీరును ముఖేశ్‌ అంబానీ పరిశీలిస్తారు. ఏపీలో జియో ఫోన్ల తయారీ పరిశ్రమ, ఐటీ సంస్థల ఏర్పాటుపై చర్చిస్తారు.  మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:57 - January 23, 2018

దావోస్ : దావోస్‌లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు దృష్టిమాత్రం రాష్ట్రంపైనే ఉంది. రైతులు పండించిన పంటలకు ముఖ్యంగా వరికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. దావోస్‌ పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు... అధికారుతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా రైతులకు పుష్కలంగా పంటలు చేతికొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గిట్టుబాటు ధరలు వస్తే రైతులకు మేలు జరుగుతుందని, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రైతులకు నష్టం కలిగితే సహించేదిలేదని హెచ్చరించారు. 

06:45 - January 21, 2018

విజయవాడ : ఢిల్లీలో ' ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌ అవార్డు'ను ఏపీ మంత్రి నారా లోకేష్‌ అందుకున్నారు. రాష్ర్టంతో పాటు తనకూ ఈ అవార్డు రావడంపట్ల మంత్రి లోకేష్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఏపీలో ఎన్నో ఆవిష్కరణలు చేపట్టామన్నారు. రాష్ర్టంలో ప్రతి ఇంటికీ చౌకగా టెలిఫోన్, ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను అందించడం దేశంలోనే రికార్డ్‌ అని చెప్పారు.. అలాగే కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను లోకేష్‌ కలిశారు. విశాఖలో పంచాయతీరాజ్‌ మంత్రుల సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - లోకేష్