లోక్ సభ

17:14 - October 6, 2018

ఢిల్లీ : డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు అది కూడా ఒకే ద‌శ‌లో జ‌రుగుతాయ‌ని  కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి రావ‌త్ వెల్ల‌డించారు. కాగా ఏపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవ‌ని, సాధారణ ఎన్నికల వరకూ ఈ సీట్లు ఖాళీగానే ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తాజాగా స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు నాలుగు రాష్ర్టాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా ఎంపీల రాజీనామాలను జూన్ 4న ఆమోదించారు. లోక్‌సభ గడువు వచ్చే జూన్ 3తో ముగుస్తుంది. ఇంకా కేవలం ఏడాదిలోపే సమయం ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు నిర్వహించమని తేల్చి చెప్పారు. ఐదుగురు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.
 

 

14:31 - October 1, 2018

ఢిల్లీ : దేశంలో రిజర్వేషన్స్ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. అర్హత, ప్రతిభను బట్టే రిజర్వేషన్స్ వుండాలని కొందరు వాదిస్తుంటే..వెనుకబడిన వర్గాలను అభివృద్ది కోసం రిజర్వేషన్స్ కొనసాగించాలని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో రిజర్వేషన్స్ పై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  దళితులు, ఇతర వెనుకపడిన వర్గాలకు అందజేస్తున్న రిజర్వేషన్లపై జార్ఖండ్ లో జరిగిన ‘లోక్ మానథాన్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న నేపథ్యంలో సామాజిక సామరస్యం సాధించేందుకు వీలుగానే అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. కానీ రిజర్వేషన్ల కారణంగా ఆయా రంగాల్లో తీవ్రమైన శూన్యత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తొలుత పదేళ్లకు మాత్రమే అనుకున్న రిజర్వేషన్లను పెంచుకుంటూ పోవడం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని అభిప్రాయపడ్డారు. సామాజిక ప్రగతి సాధించాలంటే రిజర్వేషన్లు అవసరం లేదనీ..ఆలోచనలను, చేతలను మార్చుకోవాలని మహాజన్ తెలిపారు. అలా చేసినప్పుడే అంబేడ్కర్ కన్న కలలు సాకారం అవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

17:59 - August 30, 2018

బీహార్ : 2019 లోక్‌సభ ఎన్నికలకు గాను బిహార్‌లో ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. ఇందుకోసం బిజెపి ఓ ఫార్మూలాను తయారు చేసింది. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గాను బిజెపి 20 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. జెడియూ 12, ఎల్జేపి 5 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి. జెడియుకు జార్ఖండ్‌లో 1, యూపీలో రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించనున్నారు. ప్రస్తుతం బిహార్‌లో బిజెపికి 22 మంది ఎంపీలు ఉండగా...జెడియుకు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ పార్టీ ఎల్‌జెపికి ప్రస్తుతం ఆరు స్థానాలుండగా...ఒక స్థానంపై కోత విధించే అవకాశం ఉంది. ఉపేంద్ర కుశ్వాకు చెందిన ఆర్‌ఎల్‌ఎస్పీ ఎన్డీయేతో ఉంటే ఆ పార్టీకి 2 స్థానాలు కేటాయించనున్నారు. బిజెపి చీఫ్‌ అమిత్‌ షా, బిహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం సీట్ల పంపకంపై తుది నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.

14:24 - August 13, 2018

ఢిల్లీ : లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ ఛటర్జీ మృతిపై పలువురు సంతాపం తెలియచేస్తున్నారు. కోల్ కతాలోని ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ చికిత్స పొందుతున్న చటర్జీ (89) సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...లోక్ సభ స్పీకర్ గా ఛటర్జీ పార్లమెంట్ విధులను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య విలువల కోసం పరితపించిన ఓ ఛాంపియన్ ను కోల్పోయామన్నారు. సోమ్ నాథ్ ఛటర్జీ కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

10:39 - August 13, 2018

హైదరాబాద్ : లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ (89) కన్నుమూశారు. కోల్ కతాలోని ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చటర్జీ బాధపడుతున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 2004 నుంచి 2009 వరకు లోక్ సభ స్పీకర్ గా పని చేశారు. 10సార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1968లో సోమ్ నాథ్ సీపీఎంలో చేరారు.

16:31 - August 10, 2018

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ((ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు ఆగిపోయింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం లేదు. శుక్రవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టాలని కేంద్రం పలు ప్రయత్నాలు చేసింది. కానీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం లేదని రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిల్లులో సవరణలకు ప్రతిపక్షాలు పట్టుబట్టినప్పటికీ కేంద్రం అందుకు అంగీకరించకుండానే లోక్‌సభలో బిల్లును పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం కీలక సవరణలు చేసింది.

ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లు 2017గా ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లు ప్రకారం భార్యకు మాటల ద్వారా కానీ, రాత పూర్వకంగా కానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా కానీ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం అవుతుందని పేర్కొంది. అందులో భాగంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. దీనిపై ముస్లిం సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సోమవారం వరకు పొడిగించేందుకు కాంగ్రెస్, టీఎంసీ అంగీకరించలేదని సమాచారం.  

07:05 - August 3, 2018

ఢిల్లీ : దేశంలోని ముస్లింలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని లోక్‌సభలో ఎంఐఎం సభ్యులు అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు. ముస్లింలు అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని ఓవైసీ డిమాండ్‌ చేశారు. ఒకవేళ మరాఠాలు, పటేల్‌, గుజ్జర్లు, జాట్‌ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తే ముస్లిం సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్లు కల్పించాలి ఆయన స్పష్టం చేశారు.

07:03 - August 3, 2018

ఢిల్లీ : ఎస్‌సి ఎస్‌టి యాక్ట్‌ సవరణ బిల్లుపై లోక్‌సభలో రగడ జరిగింది. గత నాలుగు నెలలుగా ఈ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ బిల్లును రేపే ప్రవేశపెట్టండి...అందరం కలిసి బిల్లును పాస్‌ చేయిద్దామని ఖర్గే అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి బిల్లుకు మోది క్యాబినెట్‌ బుధవారమే ఆమోదం తెలిపిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతామని హోంమంత్రి పేర్కొన్నారు. 

11:06 - August 1, 2018

ఢిల్లీ : టిడిపి ఎంపీల ఆందోళనలు..నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విభజన హామీలు..ప్రత్యేక హోదా..తదితర అంశాలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ లోక్ సభలో ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బుధవారం రాష్ట్రపతితో టిడిపి ఎంపీలు, కడప జిల్లా టిడిపి ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు. విభజన చట్టం అమలు.. కడప జిలాలలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు..తదితర అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. టిడిపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నేతృత్వంలో రాష్ట్రపతిని బృందం కలువనుంది. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో టిడిపి ప్రతినిధి బృందం భేటీ కానుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:11 - July 30, 2018

ఢిల్లీ : ఏపీలో కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని లోక్‌సభలో టీడీపీ డిమాండ్‌ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన పంపిన బిల్లు కేంద్రం వద్ద అపరిష్కృతంగా ఉందని టీడీపీ సభ్యుడు అవంతి శ్రీనివాస్‌ సభ దృష్టికి తెచ్చారు. తమిళనాడులో రిజర్వేషన్లు 69 శాతం ఉన్నాయని తెలిపారు. తమిళనాడు రిజర్వేషన్ల తరహాలో రాజ్యాంగ సవరణ చేసి, కాపుల రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పించాలని కోరారు. కాపు రిజర్వేషన్లను రాజ్యాంగం 9వ షెడ్యూలులో చేర్చాలన్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - లోక్ సభ