వంటిళ్లు

12:50 - September 5, 2018

గృహిణులకు వంటింట్లో పిడుగులాంటి వార్త పడబోతోందంట. వంటింట్లో కీలక భాగమైన 'గ్యాస్' ధర మరోసారి పెరగబోతోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. భవిష్యత్ లో ఏకంగా రూ. 1000 ధరకు ఎగబాకనుందని టాక్. 'అచ్చే దిన్' అని చెబుతున్న పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

రికార్డు స్థాయిలో సబ్సిడీ లేని సిలిండర్ ధర. రూ. 820కి చేరింది. మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు మళ్లీ సబ్సిడీ లేని సిలిండర్ రేటు రూ.30.50 పెంచేశారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు పలువురు సబ్సిడీని వదులకున్న సంగతి తెలిసిందే.

ఆగస్టు మాసంలో రూ. 790 ఉన్న నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 820.50కి చేరిపోయింది. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ? అంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని..గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. రెండు..మూడు నెలల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పైన పేర్కొన్నట్లు రూ. 1000 కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పెరుగుతున్న ఎల్పీజీ సిలిండర్ రేటు జనం గుండెల్లో గుబులురేపుతోంది. అతి త్వరలో సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు చేరుకోనుందని అభిప్రాయం వెల్లడవుతోంది. 

13:02 - March 9, 2018
  • పకోడీ..సమోసాలు రుచికరంగా...కరకరలాడుతూ రావాలంటే...కొద్దిగా పాలు పోసి పిండి కలుపుకుని..ఆ తరువాత చిటికెడు ఉప్పు వేసి నూనెలో వేయించుకురని చూడండి.
  • వేపుడు కూరలు చేసుకుంటున్నారా ? అయితే రుచికరంగా ఉండడం లేదా ? మీ సమస్య ఇదే అయితే వేపు కూర దించే ముందు కొద్దిగా శనగపిండి చల్లి చూడండి.
  • పాలు మరిగే సమయంలో విరగకుండా ఉండాలంటే కొద్దిగా తేనే..లేదా సోడా వేయవచ్చు.
  • బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే అందులో కరివేపాకు ఆకులు బియ్యంలో వేస్తే సరిపోతుంది.
  • కూరలు రుచిగా ఉండాలంటే దించే ముందు కొత్తిమీర తురుము, ధనియాల పొడి చల్లి దించితే కూర రుచిగా ఉంటుంది.
  • కూరగాయ ముక్కల్లో క్రిములు..దుమ్ము ఉంటుంటాయి. కూరగాయ ముక్కలు కడిగే సమయంలో నీళ్లలో పసుపు వేసి కడిగి చూడండి.
  • నెయ్యి త్వరగా పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.

Don't Miss

Subscribe to RSS - వంటిళ్లు