వడగాల్పులు

20:37 - April 19, 2017

హైదరాబాద్: ఎండలు మండుతున్నాయ్ ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అని వుంటారు... ఎన్ని సార్లు విని వుంటారు. అవును మామూలుగా కాదు మధ్యాహ్నాం రోడ్ల పైకి వెళితే నిప్పుల కొలిమిలో మొహం పెట్టినట్లు, అగ్ని వర్షం కురుస్తున్నట్లు గా అనిపించడం లేదు. ఇంతా రొటీన్ సమ్మర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కాదు. నాగరికంగా మారుతున్న మానవరహిత సమాజ స్వయం కృతాపరాధం అంటే సందేహం అనవసరం. మరి ఏప్రిల్ లోనే ఇలా వుంటే! మే పరిస్థితి ఏంటి? ఇదే నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:57 - February 25, 2017

హైదరాబాద్ : మార్చి కూడా మొదలవకముందే ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే వాతావరణం వేడిక్కెతుండటంతో రాబోయే నాలుగు నెలలు వేసవి భయంకరంగా ఉండబోతుందన్న ఆందోళన అందిరిలో కలుగుతోంది. ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా వడగాల్పులతో పసిపిల్లలు, వృద్ధులు, తీవ్ర ఇబ్బందులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్కార్‌ సూచిస్తోంది. వడగాల్పులను ఎదుర్కొనేందుకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు ఎంసీహెచ్‌ఆర్డీలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. 
ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో వర్క్‌షాప్‌ 
వేసవిలో ఎండలు మండే ప్రమాదం ముంచుకొస్తుండటంతో.. వడగాలులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించారు. వడగాల్పులపై కార్యాచరణ ప్రణాళిక అనే అంశంపై విపత్తుశాఖ అవగాహన కల్పించింది. ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని ఎన్‌డీఎంఏ సభ్యులు ఆర్‌కే జైన్‌ తెలిపారు. 
వడగాడ్పులపై ముందస్తు హెచ్చరికలు 
వాతావరణశాఖ సహకారంతో వడగాడ్పులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని వివిధ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనలు స్వీకరించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. గతేడాది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించాయని, ఉపాధి హామీ కార్మికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. 
మండుటెండలు, వడగాడ్పులపై అవగాహన 
ముఖ్యంగా మండుటెండలు, వడగాడ్పులపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టం నివారించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌లో చర్చించిన అంశాలు, మిగతా ప్రణాళికతో సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే అవి వేడిగాలులని, మన దేశంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే వడగాలులుగా పేర్కొంటామని ఎన్‌డీఎంఏ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతల పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం ద్వారా ఎండల బారిన నుంచి కాపాడుకునేలా చేయవచ్చని, ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం, ధరించాల్సిన దుస్తులు, జీవన విధానంలో మార్పు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని విపత్తు శాఖ అధికారులు నిర్ణయించారు.

 

09:30 - February 21, 2017

భానుడు అప్పుడే మొదలేట్టేశాడు..శివరాత్రి సమయానికి శివ శివా అంటూ చలి వెళ్లిపోతుందని ఓ నానుడి ఉంది. కానీ శివరాత్రికంటే ముందుగానే సమ్మర్ షురూ అయిపోయింది. భానుడి ప్రతాపం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇందుకు సోమవారమే ఉదహారణ. హైదరాబాద్ లో సోమవారం పగలు అత్యధికంగా 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఒక్కసారిగా ఐదు డిగ్రీల వరకు పెరగడంతో నగర ప్రజలు కొంత ఉక్కిరిబిక్కిరయ్యారు. నగరంలో గత పదేళ్లలో ఫిబ్రవరి నెలలో అత్యధిక ఉష్ణోగ్రత 2009 ఫిబ్రవరి 26న 39.1 డిగ్రీలుగా నమోదైనట్లు రికార్డులో ఉన్నట్లు తెలుస్తోంది. శీతాకాలం ముగిసి వేసవి ప్రవేశించిందని పలువురు పేర్కొంటున్నారు. పగలే కాకుండా రాత్రి వేళ సైతం అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంటోందని టాక్. నల్గొండలో సోమవారం తెల్లవారుజామున 14, ఖమ్మంలో 16 డిగ్రీలు నమోదయ్యాయి. సో..ఎండాకాలం..కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..

Don't Miss

Subscribe to RSS - వడగాల్పులు