వరంగల్

18:24 - September 25, 2017

వరంగల్ : తెలంగాణ వచ్చాక గిరిజన గూడాలపై దాడులు ఎక్కువయ్యాయని టీడీపీ నేతలంటున్నారు. జలగలంచలో గుత్తికోయలపై జరిగిన దాడి అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీ-టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అంటున్నారు. తాండూరులో అయూబ్‌ఖాన్‌,.. మానకొండూరులో శ్రీనివాస్‌ ఆత్మహత్యలకు.. డిప్యూటీ సీఎంలిద్దరూ బాధ్యత వహించి రాజీనామా చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. గుత్తికోయల దాడిపై అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు సీతక్క. ప్రభుత్వ వైఖరిపై అవసరమైన అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామని రేవంత్‌రెడ్డి, సీతక్క అన్నారు, మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:34 - September 24, 2017

వరంగల్ : ఓరుగ‌ల్లు ఇల‌వేల్పు శ్రీ భ‌ద్రకాళీ అమ్మవారి ఆల‌యంలో దేవి న‌వ‌రాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరాయి. మ‌హాల‌క్ష్మీ అవతారంలో అమ్మవారు భక్తుల‌కు ద‌ర్శనం ఇచ్చింది. అర్చకులు అమ్మవారికి ఉదయం సూర్యప్రభ వాహ‌న సేవతో పాటుగా ప్రత్యేక పూజ‌లు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి ద‌ర్శనం కోసం భ‌క్తులు ఆల‌య ప్రాంగ‌ణంలో బారులు తీరారు. సాయంత్రం హంస‌వాహ‌న సేవ‌ నిర్వహించ‌నున్నట్లు ఆల‌య ప్రధాన అర్చకులు తెలిపారు.

19:05 - September 23, 2017

వరంగల్ : జిల్లా పరకాల కంచె ఐలయ్యను ఆర్యవైశ్యులు అడ్డుకున్నారు. ఆర్యవైశ్యల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఐలయ్య ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఆర్యవైశ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరకాల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:27 - September 23, 2017

వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా.. పరిధిలోని భూపాలపల్లి జయశంకర్ జిల్లా, మహబూబాబాద్, వరంగల్‌ అర్బన్‌, వరంగల్ రూరల్‌, జనగాం జిల్లాల పరిధిలో వివిధ రంగాలలో.. విశిష్ట సేవలందించిన వారికి లయన్స్‌ క్లబ్ అవార్డులను అందజేసింది. హన్మకొండలోని నయీంనగర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ సామాజికాంశాలపై ఉత్తమ కథనాలను రాసిన 10టీవీ వరంగల్ సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ కెంచ కుమారస్వామి లయన్స్‌ క్లబ్ అవార్డు ప్రకటించింది. మీడియా గొంతు లేని వారి గొంతుక కావాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా చురుకైన పాత్ర పోషించాలని మాజీ వీసీ గోపాల్ రెడ్డి అన్నారు. 

16:39 - September 23, 2017

 

వరంగల్ : ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గాయత్రి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు అమ్మవారికి వేదమంత్రోచ్ఛరణ నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయ ప్రాంగణలో బారులు తీరారు. అమ్మవారిని ఇవాళ సింహ వాహనంపై ఊరేగించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు. 

17:30 - September 21, 2017

వరంగల్ : భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో గొత్తికోయ మహిళలపై ఫారెస్ట్ అధికారుల పాశవిక దాడిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

16:11 - September 20, 2017

వరంగల్ : నగరంలో బతుకమ్మ సందడి మొదలైంది. స్థానిక పాఠశాలల్లో ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. త్రినగరిలోని పాఠశాలలు తీరొక్కపూలతో కనువిందు చేస్తున్నాయి. ఆటపాటలతో విద్యార్థులు, టీచర్లు సందడి చేశారు. 

12:54 - September 20, 2017
15:23 - September 19, 2017

వరంగల్ : వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వరంగల్‌ రూరల్‌ జిల్లాలో చెరువులు, వాగులు జలకళతో కళకళలాడుతున్నాయి. వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతన్నలు ఆనందంలో మునిగితేలుతున్నారు. వాగులోని చెక్‌ డ్యాంలు నిండి ఉధృతంగా దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయి. చెక్‌ డ్యాంల వద్ద వరదల్ని చూడటానికి గ్రామస్థులు తరలివస్తున్నారు. 

08:27 - September 19, 2017

వరంగల్ : తెలంగాణ అంతా బతుకమ్మ సందడి నెలకొంది. కాలేజీలకు సెలవులు ఇస్తుండడంతో కేయూలో విద్యార్థినులంతా ముందే బతుకమ్మ పండుగ చేసుకున్నారు. అందమైన బతుకమ్మలను పేర్చి... కోలాటాలతో ఆడిపాడారు. వందలాది విద్యార్థుల ఆటపాటలతో కేయూ పీజీ ఆర్ట్స్‌ కాలేజీ కొత్త సందడిని సంతరించుకుంది. 

రోజు పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులంతా కాస్తా రిలీఫ్‌ పొందారు. తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ సంబరాలను వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ ఉమెన్‌ ఆర్ట్స్‌ పీజీ కాలేజీ విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు. 

యువతులంతా తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబై వచ్చారు. అందంగా పూలతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మలను ఒకచోట పేర్చి ఆటపాటలాడారు. వందలాది మంది విద్యార్థులతో కోలాటాలతో ఆడిపాడారు. 

ఇక ప్రొఫెసర్లు సైతం విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ కాలేజీలో ఆడడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థినులు. స్నేహితులతో సంబరాలు చాలా ఆనందాన్ని ఇచ్చాయంటున్నారు. 

ఈ బతుకమ్మ సంబరాలకు కేయూ వీసీ ముఖ్య అతిధిలో పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి సంబరాల్లో పాలు పంచుకున్నారు. 

ఇక బాగా ఆడిపాడిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కాలేజీల్లో జరుగుతున్న బతుకమ్మ ఆటలను చూస్తుంటే తన బాల్యం గుర్తుకు వస్తుందన్నారు వీసీ సాయన్న. మొత్తానికి కాకతీయ యూనివర్సిటీలో ముందే వచ్చిన బతుకమ్మ విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - వరంగల్