వర్మ

15:39 - October 13, 2018

హైదరాబాద్ : ఏంటీ చంద్రబాబును పట్టిస్తే లక్ష రూపాయలు ఇస్తానని వర్మ అంటాడా ? ఎందుకు అంటూ ఏవోవో ఊహించుకోకండి..ఎందుకంటే పట్టియాల్సింది ఆ బాబును కాదు వేరే బాబుని...వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ..ఎప్పుడు వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాస్త తగ్గించాడనే చెప్పవచ్చు. ఆయన తీస్తున్న తాజా చిత్రం ‘లక్ష్మీ పార్వతి’. ఈ సినిమా గురించి తెలియచేస్తూ వర్మ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేశారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా డూప్ చంద్రబాబు నాయుడు వీడియో సంచలనం సృష్టిస్తోంది. హోటల్ పని చేస్తున్న ఆయన్ను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వదిలారు. దీనితో కొద్ది రోజుల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. 
ఈ వీడియో లింక్‌ను వర్మ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. బాబును మొద‌ట గుర్తించి అడ్రస్ చెప్పిన వాళ్ల‌కు ల‌క్ష రూపాయ‌లు ఇస్తాన‌ని వర్మ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. అడ్ర‌స్ laxmisntr@gmail.com కి పంపిస్తారో వాళ్ల‌కు డబ్బులిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన తీస్తున్న ’ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’‌లో చంద్ర‌బాబు పాత్ర‌కు అతడిని తీసుకుంటారా ? అనే దానిపై చర్చ జురుగుతోంది. ఈ సినిమాలో చంద్ర‌బాబు పాత్రే కీల‌కం కానుందని తెలుస్తోంది. మరి నిజంగానే పంపించిన అతనికి వర్మ రూ. లక్ష ఇస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

12:35 - September 23, 2018

హైదరాబాద్‌ : ’అర్జున్‌ రెడ్డి’ చిత్రం విజయ్‌ దేవరకొండని ఓవర్‌ నైట్‌ స్టార్‌ని చేసింది. టాలీవుడ్‌లో ఇదో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో షాలిని పాండే కథనాయికగా నటించారు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళం, హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ప్రముఖ నటుడు విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ ఈ సినిమా రీమేక్‌తో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు ‘వర్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం ఈరోజు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ చిత్రానికి బాలా దర్శకత్వం వహిస్తున్నారు. మరి తెలుగులో ‘అర్జున్‌ రెడ్డి’ సృష్టించినన్నిరికార్డులు ఈ చిత్రం సృష్టిస్తుందో? లేదో? వేచి చూడాలి. మరోపక్క బాలీవుడ్‌లోనూ ఈ సినిమాను రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ పాత్రలో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. హిందీ చిత్రానికి కూడా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.

 

16:49 - April 19, 2018

హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమ ఉడుకుతోంది. కాచింగ్ కాస్ట్ పై శ్రీరెడ్డి లేవనెత్తిన వివాదం మరింత ముదురుతోంది. సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ మాట్లాడాలని తానే పేర్కొన్నట్లు వర్మ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీపై పలు విమర్శలు వస్తుండడంతో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు స్పందిస్తున్నారు. మొన్న నాగబాబు స్పందించగా గురువారం నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. సినీ ఇండస్ట్రీ అంటే తమకు ఎంతో గౌరవమని, పరిశ్రమ అనేది తమకు తల్లిలాంటిదన్నారు. పరిశ్రమలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయని, మూడు తరాలుగా సినీ ఇండస్ట్రీనే నమ్ముకున్నామని పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీలో తాను సీనియర్ మెంబర్ అని, కొంతమంది మీడియాలో ఎంతమంది మాట్లాడినా నిగ్రహంగా ఉంటూ వచ్చానన్నారు. కానీ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై స్పందించాల్సి వస్తోందని, తట్టుకోలేక ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లైంగిక వేధింపులపై ఎన్జీవోలు, మహిళలతో కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వేధింపులపై ఫిర్యాదులు వస్తే ఈ కమిటీ విచారించి చర్యలు తీసుకుంటుందన్నారు.

ఇక తన టార్గెట్ రామ్ గోపాల్ వర్మ అని, ఇతను ఎంత నికృష్టుడో చెప్పడానికే తాను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారుర. సినీ పరిశ్రమలో పెరిగి..గొప్ప సినిమా తీసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి ముంబాయిలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడన్నారు. రాంగోపాల్ వర్మకు సంబంధించిన ఒక వీడియో చూడడం జరిగిందని, వీడియో చూడటానికంటే ముందు తాను తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండే హీరో..ఇద్దరు దర్శకులతో మాట్లాడినట్లు తెలిపారు. పవన్ ను ఉద్ధేశిస్తూ ఒక అసభ్యకరమైన మాట మాట్లాడించే విధంగా చేయడం...పవన్ ను టార్గెట్ చేయాలని వర్మ పేర్కొనడం దుర్మార్గమన్నారు. నికృష్టుడు అయిన వర్మ శ్రీరెడ్డి కి రూ. 5 కోట్లు ఇప్పించాలని ప్రయత్నించినట్లు, సురేష్ ఒప్పుకోలేదని పేర్కొనడం దారుణమన్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు, రూ. 5కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాడని తెలిపారు. వర్మ చేస్తున్న కుట్రలో ఎవరు వెనుక ఎవరున్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. వర్మ వెనుక ఏ పార్టీ ఉందో తెలిస్తే వారినే ప్రశ్నించే వాడినని పేర్కొన్నారు. వర్మలాంటి కుట్రలు పీఆర్పీలోనే తమకు ఎదురయ్యాయని, ఇలాంటి కుట్రల పట్ల పవన్ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇంకా ఏమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

11:58 - March 7, 2018

విశాఖపట్టణం : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ విశాఖకు వస్తున్నారని తెలుసుకున్న మహిళా సంఘాలు ఎయిర్ పోర్టు వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశాయి. గత కొద్ది రోజుల కింద 'జీఎస్టీ' పేరిట వర్మ షార్ట్ ఫిల్మ్ ను తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో పీఎస్ లో ఫిర్యాదు చేయగా యూ ట్యూబ్ ఛానెల్ లో ఉన్న ఫిల్మ్ ను ఆపుచేయడం..విచారణకు హాజరు కావాలని వర్మకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఏపీ రాష్ట్రంలో మాత్రం వర్మపై కేసు నమోదు చేయకపోవడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. చివరకు ఆయనపై కేసు నమోదు చేశాయి. కానీ మహిళలపై వర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖకు వస్తానని..తాను వచ్చి మహిళలకు సమాధానం చెబుతానని తెలిపారు. దీనితో విశాఖ ఎయిర్ పోర్టుకు మహిళా సంఘాలు చేరుకుని ఆందోళన చేపట్టాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:26 - February 23, 2018

హైదరాబాద్ : దర్శకుడు వర్మకు స్వల్ప ఊరట లభిచింది. వర్మకు నేటి విచారణను వాయిదా వేశారు. మార్చి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని వర్మను పోలీసులు ఆదేశించారు. వర్మ ల్యాప్ టాప్ విషయంలో ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందకపోవడంతో వర్మ విచారణ వాయిదా పడింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:34 - February 22, 2018

విశాఖపట్టణం : జీఎస్టీ సినిమా ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాం గోపాల్ వర్మ 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' బూతు సినిమాను యూ ట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోర్న్ నేపథ్యంలో ఉన్న సినిమా ఉండడంపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే షార్ట్ ఫిలింను నిషేధించాలని మహిళా నేతలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తమపై వర్మ కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు మహిళా సంఘాల నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కానీ ఏపీ రాష్ట్రంలో ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం అక్కడి మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే వర్మపై కేసు నమోదు చేయాలని..అరెస్టు చేయాలని జీవీఎంసీ ఎదుట మహిళా సంఘాలు రెండు రోజుల పాటు నిరహార దీక్షకు పూనుకున్నారు. బుధవారం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ తాము డిమాండ్ చేస్తున్నట్లుగా కేసులు నమోదు చేయలేదని దీక్షలు కొనసాగించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. డ

18:31 - February 21, 2018

విశాఖపట్టణం : జీఎస్టీ షార్ట్ ఫిల్మ్ తీసిన వర్మ ఎన్నో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను అరెస్టు చేయాల్సిందేనంటూ మహిళా సంఘాలు పిడికిలి బిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసును బుక్ చేసినా ఏపీలో మాత్రం అలాంటిదేమి చేయకపోవడం పట్ల మహిళా సంఘాలు కన్నెర్ర చేస్తున్నారు. వర్మపై కేసు నమోదు చేయాల్సిందే..ఆయన్ను అరెస్టు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విశాఖ జీవీఎంసీ ఎదుట 48గంటల పాటు నిరహార దీక్షకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:30 - February 21, 2018

విశాఖపట్టణం : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'జీ ఎస్టీ' సినిమా వివాదం ఇంకా వీడడం లేదు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో యూ ట్యూబ్ లో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' పేరిట పోర్న్ షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి. సామాజిక వేత్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది. కానీ ఏపీ రాష్ట్రంలో ఎలాంటి కేసు నమోదు కాలేదు.

దీనితో మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద మహిళలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను బుధవారం దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవీతో టెన్ టివి మాట్లాడింది. ఐద్వా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు పక్కన పెట్టడం సరికాదన్నారు. జీఎస్టీ సినిమా దర్శకుడు వర్మను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని, మహిళల ఆత్మగౌరవాన్ని వర్మ కించపరిచారని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:10 - February 17, 2018

హైదరాబాద్ : డైరెక్టర్ రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. వర్మ తన లాయర్ తో కలసి విచారణకు హాజరైయ్యారు. సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదుతో వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు సీఆర్పీషీ 41 సెక్షన్ ప్రకారం వర్మకు నోటీసులు ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు వర్మ స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడయో క్లిక్ చేయండి.

15:53 - February 8, 2018

హైదరాబాద్ : ఎప్పుడూ వివాదాల్లో ఉండే 'రాం గోపాల్ వర్మ'కు తెలంగాణ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. ‘జీఎస్టీ' సినిమాపై నమోదైన కేసులో ఆయనకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన సీసీఎస్ ఎదుట హాజరు కాలేదు. సమాచారం తెలుసుకున్న 'వర్మ' పోలీసులకు తన న్యాయవాది ద్వారా సమాచారం అందించారు.

ఇటీవలే 'జీఎస్టీ' షార్ట్ ఫిలింను ఆయన తన యూ ట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళా సంఘాలు..మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. సామాజిక కార్యకర్త దేవి ఏకంగా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో 'జీఎస్టీ' షార్ట్ ఫిలింపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వెబ్ సైట్ నిర్వాహకులతో మాట్లాడి...తెలంగాణలో షార్ట్ ఫిలింను ప్రసారం కాకుండా అడ్డుకున్నారు. దీనిపై సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు.

తమ ఎదుట హాజరు కావాలని..వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ విచారణకు హాజరు కాలేనని న్యాయవాది ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ముంబైలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడమే కారణమని, మళ్లీ నోటీసులు పంపితే వచ్చే వారం హాజరువతానని వర్మ తెలిపారు. దీనిపై టెన్ టివి సామాజిక కార్యకర్త దేవి, ఏపీ మహిళా నేత మణితో మాట్లాడింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - వర్మ