వర్సిటీలు

09:23 - January 22, 2018
17:30 - January 11, 2018

వరంగల్ : కాకతీయ విశ్వ విద్యాలయం గొడవలకు నిలయంగా మారింది. పలువురు ఆందోళనలు..నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిజిష్ట్రార్ కార్యాలయంలో పార్ట్ టైం లెక్చరర్లు బైఠాయించారు. తమ సమస్యలు పట్టించుకోకుండా అధికారులు తప్పించుకుంటూ తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు సమయానికి ఇవ్వకుండా కాంట్రాక్టు లెక్చరర్లుగా గుర్తించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:30 - November 14, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 123 విద్యాసంస్థలు యూనివర్సిటీ ట్యాగ్‌లైన్‌ను కోల్పోయాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. విశాఖకు చెందిన గీతం, గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, తిరుపతికి చెందిన రాష్ట్రీయ సాంస్క్రీట్‌ విద్యాపీఠ్‌, అనంతపురంకు చెందిన శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌, గుంటూరుకు చెందిన విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్‌ టెక్నాలజీ రీసెర్చ్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు. వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు కొత్త పేరు కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ ఆదేశించింది. 

19:08 - November 3, 2017

ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు ఉన్నత విద్యాశాఖ మొత్తం ఆరు యూనివర్సిటీలకు 651 ఎకరాలను కేటాయించింది. మరోవైపు ప్రభుత్వ యూనివర్సిటీల్లో వసతులు కల్పించకుండా ప్రైవేట్‌ యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారంటూ విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన ప్రత్యేక చర్చలో బాబురెడ్డి (యూటీఎఫ్), రామకృష్ణ (టిడిపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ), నూర్ అహ్మద్ (ఎస్ఎఫ్ఐ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:31 - November 3, 2017

విజయవాడ : ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో అమెటీ యూనివర్సిటీకి 90 ఎకరాలు, సవితా యూనివర్సిటీకి 166 ఎకరాలు, విజయనగరంలో సెంచూరియన్ యూనివర్సిటీకి 125 ఎకరాలు, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో వెల్‌ టెక్ యూనివర్సిటీకి 50 ఎకరాలు, విశాఖపట్నంలో ప్రపంచ శాంతి యూనివర్సిటీకి 70 ఎకరాలు, అకార్డ్ యూనివర్సిటీకి 150 ఎకరాల చొప్పున భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు ఉన్నత విద్యాశాఖ మొత్తం ఆరు యూనివర్సిటీలకు 651 ఎకరాలను కేటాయించింది. మరోవైపు ప్రభుత్వ యూనివర్సిటీల్లో వసతులు కల్పించకుండా ప్రైవేట్‌ యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారంటూ విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

21:42 - October 6, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలను గాడిన పెట్టేందుకు గవర్నర్‌ నరసింహన్‌ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమైన ఆయన వర్సిటీల పనితీరుపై ఆరా తీశారు. అకాడమిక్‌ క్యాలెండర్‌ని వర్సిటీల్లో అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు చేసిన గవర్నర్‌ వాటిని వర్సిటీల్లో అమలు చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్‌ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో తెలంగాణలోని 15 యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ నర్సింహన్ భేటీ అయ్యారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్, జేఎన్‌టీయూ, జేఎన్‌ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ ఆర్ట్స్, ఆర్‌జెయూకేటి, తో పాటు జయశంకర్ అగ్రికల్చర్, కాళోజి నారాయణ హెల్త్ యూనివర్సిటీ, పివి నర్సింహరావు వెటర్నరీ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ హర్టికల్చర్ యూనివర్సిటీల వీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్శిటీ వీసీలు తమ విశ్వవిద్యాలయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో గవర్నర్‌కు వివరించారు.

అయితే వర్సిటీల్లో అకడమిక్ క్యాలెండర్ అమలుచేయకపోవడం వల్ల గవర్నర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే అన్ని విశ్వవిద్యాలయాలు 2018-19 సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని సూచించారు. అయితే పది అంశాలను ప్రతిపాదించిన గవర్నర్‌ వాటి అమలుకు అన్ని యూనివర్సిటీలు దృష్టి పెట్టాలని కోరినట్లు మంత్రి కడియం తెలిపారు. వర్సిటీల్లో అవినీతికి తావులేకుండా చూడాలని గవర్నర్‌ సూచించినట్లు చెప్పారు.

పీహెచ్ డీ అడ్మిషన్లలో పారదర్శకత కోల్పోవడం పట్ల గవర్నర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేసి హాజరు శాతాన్ని పెంచాలని గవర్నర్‌ కోరినట్లు సమాచారం. యూనివర్సిటీల అభివృద్ధి కోసం 420 కోట్ల నిధులు కేటాయించినట్లు కడియం తెలిపారు. 1061 అధ్యాపక ఖాళీలను భర్తీ చేయాలని గవర్నర్‌ ఆదేశించినట్లు చెప్పారు. యూనివర్సిటీలతో మొదటిసారి సమావేశమైన గవర్నర్ వర్సిటీల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తానన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వీసీలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షలు జరపాలని నరసింహన్‌ నిర్ణయించారు. వర్సిటీల పనితీరును ఏకంగా గవర్నరే పర్యవేక్షించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

12:16 - February 5, 2017

విజయవాడ : రానున్న రోజుల్లో ఏపీకి మరిన్ని యూనివర్సిటీలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్ర లయోల కాలేజీ ప్రాంగణంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో చంద్రబాబు సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. విభజనలో పేర్కొన్న ఇనిస్టిట్యూట్స్ ను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని వర్సిటీలు రావాల్సినవసరం ఉందని, ట్రైబల్ యూనివర్సిటీకి రూ. 5 కోట్లు బడ్జెట్ లో పొందుపర్చడం జరిగిందన్నారు. టాప్ యూనివర్సిటీల్లో ఉన్న కొన్ని యూనివర్సిటీలు, పీపీపీ పద్ధతిలో కొన్ని యూనివర్సిటీలు రావడం జరుగుతోందన్నారు. వర్సిటీలు వస్తే ఏపీ త్వరలో నాలెడ్జ్ స్టేట్ గా మారుతుందని ఆకాక్షించారు. పాలన చేపట్టి రెండున్నర సంవత్సరాలే అయ్యిందని, హైదరాబాద్ లో పదేళ్లు ఉండే హక్కును మీకిస్తున్నట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నా మళ్లీ ఇక్కడకే రావాల్సి ఉంటుందన్నారు. బస్సులో నుండే పాలన కొనసాగించానన్నారు. రాజధాని కట్టడం ఒక సవాల్..సంక్షోభం లాంటిదన్నారు. ఈ విషయంలో రైతులు త్యాగం చేయడం జరిగిందన్నారు. 35వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చారని బాబు తెలిపారు.

21:22 - July 19, 2016

హైదరాబాద్ : ఈ నెలాఖరులోపు అన్ని యూనివర్శిటీలకు వీసీలను నియమిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ విద్యాశాఖ అధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు. 42 మంది ప్రభుత్వ టీచర్లు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా పనిచేస్తున్నారని.. తక్షణమే వారు విధుల్లో చేరాలని హెచ్చరించారు. ఫీజుల పెంపుపై 12 ఇంటర్నేషనల్‌ స్కూళ్లతో పాటు 162 ప్రైవేటు స్కూళ్లకు జారీ చేసిన నోటీసులపై ఆయా సంస్థలు స్పందించాయని.. వాటిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని కడియం తెలిపారు. జీవో 42 పైన హైకోర్టు స్టే విధించిందని మంత్రి కడియం తెలిపారు. జీవోపై స్టే ఎత్తివేసినా లేదా ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇచ్చినా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నోటీసులపై వివరణ ఇచ్చాయని త్వరలో తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. కౌన్సెలింగ్ లో అవకాశం ఇవ్వాలని ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయని, ఆ కాలేజీలకు మూడు రోజుల్లో రీ వెరిఫికేషన్ నిర్వహించి అర్హత ఉన్న కాలేజీలకు కౌన్సెలింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. కౌన్సెలింగ్ విధానాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదని మంత్రి కడియం స్పష్టం చేశారు.

15:27 - March 29, 2016

పరిశోధనలు జరగాల్సిన విశ్వ విద్యాలయాల్లో లైంగిక వేధింపులు అధికమౌతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో ఉన్న 32 వర్సిటీల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. 2014-2016 సంవత్సరంలో దాదాపు 376 లైంగిక వేధింపులు నమోదయ్యాయి. ఇదంతా మీడియా చెప్పడం లేదు. సాక్షత్తూ రాష్ట్ర మహిళా కమిషణ్ లెక్కలు చెప్పి భయంకర వాస్తవాలు. మరి ఎందుకు వర్సిటీల్లో ఈ పరిస్థితి నెలకొంది ? దీనిని నివారించలేమా ? దీనిపై టెన్ టివి 'వేదిక' కార్యక్రమంలో చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో కావేరి (ఓయూ), రవళి (హెచ్ సీయూ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

10:18 - November 29, 2015

ప్రైవేటు రంగంలో ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, ముఖ్యంగా విద్యా రంగంలో ఫీజు నియంత్రణ చట్టం ఉండాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రైవేటు విశ్వ విద్యాలయాల రాకతో విద్యారంగ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది. నిజానికి ప్రైవేటు విశ్వ విద్యాలయాల వల్ల సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా ? అసలు ఎందుకీ ప్రైవేటు విశ్వ విద్యాలయాలు ? ఈ అంశంపై 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొని రాఘవులు మాట్లాడారు. ఆయన మాటల్లోనే...

విద్య వ్యాపారమయం..
''ఇలాంటి విశ్వ విద్యాలయాలు చాలా వచ్చాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు తెస్తున్నారా ? విద్య అనేది వ్యాపారమై పోయింది కనుక కొంతమంది వత్తిడి తెస్తున్నారా ? విద్యా వ్యాపార వేత్తలు చాలామంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి ప్రయోజాల కోసం చేస్తున్నారా ఆలోచించాలి. నాణ్యమైన ఉన్నత విద్య ఉండే దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. ఉన్నత విద్య లేని దేశం ఇతర దేశాలతో పోటీని తట్టుకోవడం కష్టం. ప్రభుత్వ రంగాన్ని హీనంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. విద్యారంగం నుండి తప్పుకోవాలనే ఆలోచన నుండే ఇది వస్తోంది.

1990 సంస్కరణలు...
1990 సంవత్సరంలో దేశంలో సంస్కరణలు ప్రారంభం తరువాత రాజకీయ ప్రధాన పార్టీల ఆలోచనలు మారిపోయాయి. ప్రభుత్వం ఉత్తత్తి..వ్యాపారం ఎందుకు చేయాలనే ఆలోచన వచ్చింది. విద్యారంగాన్ని అశ్రద్ధ చేయడం ప్రారంభించారు. అన్ని రంగాలు వ్యాపారంగా మారాయో అందులో భాగంగా విద్య...వైద్య రంగాలను కూడా వ్యాపారంగా మార్చేస్తున్నారు. 

విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాలు ఎక్కడ ?
విశ్వ విద్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో జిల్లాకో యూనివర్సిటీ పెడుతున్నారు. పేర్లు మాహత్తరంగా పెట్టారు. భవనాలు..ఫ్యాకల్టీ, సౌకర్యాలు లేవు. ఉస్మానియా యూనివర్సిటీ క్షీణించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో ఉంటే పరిశోధన ఏం చేస్తారు ? ఉన్నత విద్య అంటే కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం అని ఇతర తరగతుల వారిని ప్రోత్సాహించాలనే దృక్పథాన్ని వదిలేశారు. 1.44 కోట్ల వ్యాపారం కోచింగ్ జరగుతోందంట.

ఫీజు నియంత్రణ చట్టం ఉండాలి..
ఫీజు నియంత్రణ చట్టంలో ఉండాలి. సివిల్ సొసైటీ సంఘటితమై చట్టాన్ని రూపొందించాలని వత్తిడి చేయాలి. ఇందులో మీడియా వైపు సహకారం కూడా తక్కువగా ఉంది. 58 యూనివర్సిటీలున్నాయి. వీటి అనుభవాలు ముందున్నాయి. బంగారు తెలంగాణ నిర్మిస్తామన్నారు. ప్రవేటు రంగంలో ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. విద్య..వైద్యం చాలా అవసరం'' అని రాఘవులు పేర్కొన్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో చూడండి..

Don't Miss

Subscribe to RSS - వర్సిటీలు