విజయనగరం

10:47 - November 14, 2018

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని తామరఖండి నుంచి ప్రారంభమైంది.  297 వరోజు యాత్ర నియోజక వర్గంలోని తామరఖండి నుంచి మొదలై చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి మీదుగా చినరాయుడు పేట వరకు కొనసాగుతుంది.తమ ప్రాంతానికి వచ్చినప్పుడు  అభిమానులు జగన్ మోహన్ రెడ్డి తో సెల్ఫీలు దిగటానికి ఉత్సాహాం చూపిస్తున్నారు.

11:52 - November 12, 2018

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 17 రోజుల విరామం తర్వాత  విజయనగరం జిల్లా సాలూరు మండలం పాయకపాడు నుంచి సోమవారం  పునఃప్రారంభం అయ్యింది. అక్టోబరు25న  విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంలో కలిగిన గాయం కారణంగా ఆయన తన పాదయాత్రను నిలిపివేశారు. వైద్యుల సూచన మేరకు జగన్ మోహన్ రెడ్డి  17 రోజుల విశ్రాంతి తీసుకున్నారు.   విరామం తర్వాత సోమవారం ఆయన తన ప్రజాసంకల్పయాత్ర  తిరిగి చేపట్టారు. వైఎస్ జగన్ ను చూసేందుకు వచ్చిన భారీ అభిమానుల మధ్య  పాయకపాడు నుంచి ఆయన 295 వ రోజు  పాదయాత్ర ప్రారంభ మయ్యింది. పాయకపాడు నుంచి మేలపువలస, మక్కువ క్రాస్ రోడ్డు‌, ములక్కాయవలస మీదుగా కాశీపట్నం క్రాస్‌ రోడ్డు,స పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు ఈరోజు జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. విజయనగరం జిల్లాలో ఇంకా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక చివరిగా జగన్  శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశిస్తారు. గత ఏడాది కాలంగా ఇప్పటి వరకు జగన్‌ 3,211.5 కిలోమీటర్ల దూరం నడిచారు.

11:50 - November 10, 2018

విజయనగరం : నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు కోట్ల డబ్బుతో ఉడాయించాడు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటు యువకులను మోసం చేసిన ఘనానా గంగుల ఉదంతం బైటపడింది. నిరుద్యోగుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేటుగాల్లు మోసం చేసిన పారిపోయారు.  ఒక్కో నిరుద్యోగి నుండి రూ.10 నుండి 17 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసంలో ఓ మహిళా పోలిస్ కానిస్టేబుల్ ప్రధాన సూత్రధారిగా వుండటం విశేషం. 
విశాఖపట్నంలో శ్రీ వెంకటేశ్వరా హెచ్ ఆర్ సర్వీస్ పేరుతో ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా కోణంగి శ్రీనివాసరావు అనే కానిస్టేబుల్ వున్నాడు. ఈ నేపథ్యంలో అన్నగారి అండతో శ్రీనివాస్ తమ్ముడు రమేశ్ కుమార్ యాదవ్, మరో వ్యక్తి కోసూరి సత్తిబాబు అనే వ్యక్తులు దాదాపు 17 నిరుద్యోగుల నుండి భారీ మొత్తాన్ని వసూలు చేశారు. రైల్వేలో లీగల్ ఎడ్వయిజర్ గా పనిచేస్తున్నానంటు రమేశ్ కుమార్ యాదవ్ నిరుద్యోగులను నమ్మించి  గత జనవరిలో నిరుద్యోగులకు నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ట్రైనింగ్ అంటు భువనేశ్వర్ వంటి పలు ప్రాంతాలకు నిరుద్యోగులను తిప్పుతు మోసాన్ని కప్పిపుచ్చేందుకు పలు విధాలుగా యత్నించాడు. అనుమానం వచ్చిన బాధితులు మోసగాళ్లను నిలదీయగా నకిలీ చెక్కులిచ్చి చేతులు దులుపుకున్నారు. చెక్కులు చెల్లకపోవటంతో సెప్టెంబర్ 29న బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేశారు. దీనిపై రంగంలోకి దిగిన డీఎస్పీ విచారణ ముమ్మరం చేయమని ఆదేశించటంతో ఈ విషయం బైటపడినట్లుగా తెలుస్తోంది. 
 

21:06 - October 24, 2018

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బుధవారం 3,200 కిలోమీటర్ల  మైలు రాయిని దాటింది. ఈసందర్బంగా విజయనగరంజిల్లా సాలూరు మండలం బాగువలస వద్ద  జగన్ కానుగ మొక్కను నాటారు. 293వ రోజు ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాసాలూరు మండలంలో జరుగుతున్న సమయంలో రాష్ట్రప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రజలు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగాలు  పర్మినెంట్ చేయాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చారు. 

11:59 - October 24, 2018

తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.. నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఇప్పటికే తమవంతు సహాయ మందించగా, రామ్ చరణ్ బాధిత ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని తెలిపాడు.. నారా బ్రహ్మణి విరాళంతో పాటు, పది గ్రామాల్ని అడాప్ట్ చేసుకున్నారు..
ఇప్పుడు మరికొంతమంది సినీ ప్రముఖులు ఏపీ సీఎమ్ చంద్రబాబుని కలిసి చెక్కులను అందించారు..
సినీనటుడు రాజశేఖర్ దంపతులు రూ.పది లక్షల విరాళాన్ని చంద్రబాబుకు అందించారు.. సినీ నిర్మాత, భవ్య సిమెంట్స్ అధినేత వి.ఆనందప్రసాద్ రూ.పది లక్షల విరాళమివ్వగా, నిర్మాత కే.ఎస్.రామారావు, అశోక్ కుమార్ తదితరులు చంద్రబాబుని కలిసి చెక్కునందించారు.. అలాగే, విశాఖపట్నం పోర్టు ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించగా, పోర్టు చైర్మన్ కృష్ణబాబు రూ.26.91 లక్షల చెక్కును సీఎమ్‌కు అందించేసారు.. 

 

08:26 - October 22, 2018

విజయనగరం : పట్టణం ఉత్సవాల సందడితో..  కళకళలాడుతోంది. 2 రోజుల పాటు జరిగే విజయనగర్ ఉత్సవ్‌తో పాటు.. సిరిమాను సంబరాలతో పట్టణమంతా పండగ శోభ సంతరించుకుంది. వివిధ ప్రదర్శనలు, సాంస్క్రతిక వేడుకలతో ఎటు చూసినా సందర్శకులతో కిటకిటలాడుతోంది పట్టణం.ఫ్లవర్ షో, ఫోటో ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టు వంటి ప్రదర్శనలు చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు.

విజయనగర్ ఉత్సవ్ వేడుకలతో... విజయనగరంలో ఉత్సాహం ఉరకలేస్తోంది.  శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలతో పాటు.. విజయ్‌నగర్‌ ఉత్సవ్‌ వేడుకలు ఒకేసారి ప్రారంభంకావడంతో.  పట్టణమంతా సందడి నెలకొంది. ఈ ఉత్సవాలను 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఉత్సవాలను రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ఎంపీ పి.అశోక్ గజపతిరాజు జెండా ఊపి  ప్రారంభించారు. 

పలు జానపద కళారూపాలతో కోట నుంచి ప్రారంభమైన ఉత్సవ్ ర్యాలీ ఆనందగజపతి ఆడిటోరియం వరకు సాగింది. అక్కడ కళారూపాల ప్రదర్శన, ఉత్సవ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ వేడుకల ప్రదర్శన కోసం పట్టణంలో ఏడు వేదికలను సిద్ధం చేశారు. ముఖ్యంగా క్షత్రియ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ రకాల జాతుల ఫ్లవర్స్, ఫలాలు, కూరగాయలతో పాటు బోన్సాయ్ మొక్కలను ప్రదర్శించడం సందర్శకులను ఆకట్టుకుంటోంది.  వీటితో వినోదంతోపాటు విజ్ఞానం కూడా పొందుతున్నామని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కోటలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆహుతులను అలరిస్తోంది. ముఖ్యంగా పూసపాటి వంశీయులకు చెందిన అరుదైన ఫోటోలను ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. అయోధ్యా మైదానంలో ఏర్పాటు చేసిన  సాంస్క్రతిక వేదికపై పలు జానపద కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలతో పాటు విజయనగర్ ఉత్సవ్ కూడా ఒకేసారి ప్రారంభంకావడంతో... ప్రజల్లో ఆనందోత్సాహం వ్యకమవుతోంది.
 

13:53 - October 13, 2018

విజయనగరం: ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుపాను కారణంగా విరామం ఇచ్చిన ప్రజా సంకల్పయాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శనివారం  ఉదయం తిరిగి గజపతి నగరం  నియోజక వర్గంలోని మదుపాడు నుంచి మొదలు పెట్టారు.  284 వ రోజు  ప్రారంభమైన  పాదయాత్రలో  ప్రతి చోట  ప్రజలు ఆయనకు బ్రహ్మరధం పడుతూ తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని అర్హతలున్నా, సక్రమంగా పింఛన్లు రావటంలేదని, రాజకీయ కారణాలు చూపి తమకు పింఛన్లు రాకుండా చేస్తున్నారని వృధ్దులు, వికలాంగులు, జగన్ మోహన్ రెడ్డి ఎదుట తమ బాధను చెప్పుకున్నారు. వైెస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అర్హులైన అందరికీ పింఛన్లు సక్రమంగా వచ్చేవని, ఆ మంచి రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు వారు  జగన్‌తో చెప్పారు. కోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించారని, ఉపాధి లేకపోవటంతో కుటుంబాలు  వీధిన పడుతున్నాయని తమకు న్యాయం చేయమని  ఉపాధి హామీ  ఫీల్డ్ అసిస్టెంట్లు జగన్ కు వినతి పత్రం అందచేశారు. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించిందని సాక్షర భారత్‌ కోఆర్డినేటర్లు కూడా తమ సమస్యల్ని వైఎస్‌ జగన్‌ జగన్‌కు చెప్పారు. ఉద్యోగం కోసం ఎన్ని ఆందోళనలు  చేసినా ప్రభుత్వం హామీ ఇవ్వడం తప్ప ఫలితం లేకుండా పోయిందని,పెండింగ్‌ జీతాలు కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వారు వినతిపత్రం అందజేశారు. గజపతినగరం నియోజకవర్గంలోని మదుపాడు వద్ద ప్రారంభమైన  ప్రజా సంకల్పయాత్ర భూదేవీపేట క్రాస్‌, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్‌, గుడివాడ క్రాస్‌, మానాపురం, మానాపురం సంత మీదుగా కోమటిపల్లి వరకు కొనసాగుతుంది.  

10:09 - October 13, 2018

విజయనగరం : తిత్లీ తుపాను కారణంగా ఆగిన వైస్ జగన్ పాదయాత్ర శనివారం తిరిగి ప్రారంభం కానుంది. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రజాసంకల్పయాత్ర 284వ రోజు కొనసాగనుంది. విజయనగరం జిల్లాలో తుపాను కారణంగా నిలిచిపోయిన పాదయాత్ర ఉదయం నైట్‌క్యాంపు నుంచి ప్రారంభం కానుంది. గజపతినగరం నియోజకవర్గంలోని మదుపాడు, భూదేవీపేట క్రాస్‌, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్‌, గుడివాడ క్రాస్‌, మనపురం, మనపురం సంత, కోమటిపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుందని  వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు.

 

20:26 - October 11, 2018

శ్రీకాకుళం : ఉత్తరాంధ్రను తిత్లీ తుపాన్ వణికిస్తోంది. బీభత్సం సృష్టిస్తోంది. తిత్లీ తుపాన్ ధాటికి 10 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలోని సరబుజ్జిలి మండలం రొడ్డివలస గ్రామానికి చెందిన మూడడ్ల సూర్యారావు, వంగర మండలం వన్నే అగ్రహారంకు చెందిన తాడి అప్పల నర్సమ్మ, మందస మండలం సువర్ణపురంకు చెందిన ఇప్పిలి కన్నయ్య, మన్నెన సంతోష్ కుమార్, సంతబొమ్మాలి మండలం సున్నపల్లికి చెందిన బొంగు దుర్గారావు, టెక్కలిలోని ఆంధ్రవీధికి చెందిన కొల్లి లక్షమ్మ మృతి చెందారు. విజయనగరం జిల్లాకు చెందిన సూరాడ రాము, వాసుపల్లి లక్ష్మణ్ రావు, బడే సత్తయ్యలు మృతి చెందారు. భారీగా పెను గాలులు వీస్తున్నాయి. పెనుగాలులకు కొబ్బరిచెట్లు విరిగిపడుతున్నాయి. ఇళ్ళల్లో నుంచి భయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. 

 

 

15:10 - September 30, 2018

విజయనగరం : ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు వాగ్ధానాల పర్వం ఏపీలో కూడా ఊపందుకుంది. మహిళా ఓటు బ్యాంకులను ఆకర్షించేందుకు నేతలు వాగ్ధానాల పరంపర కొనసాగుతోంది. గన ఎన్నికల్లో విజయం చేతివరకూ వచ్చి చేజారిపోయిన జగన్ రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో మహిళలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్, మరో కీలక హామీ ఇచ్చారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి అక్కకూ రూ. 75 వేలను నాలుగు దఫాలుగా అందిస్తానని హామీ ఇచ్చారు. కోరుకొండ వద్ద తనను కలిసిన విశ్వబ్రాహ్మణులతో మాట్లాడిన ఆయన, వైఎస్ఆర్ చేయూత ద్వారా ఈ పథకాన్ని అమలు చేయిస్తానని, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళ ఏ ఇంట ఉన్నా, వారికి డబ్బు అందించేలా చర్యలు చేపడతానని అన్నారు. విశ్వబ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, బంగారం వ్యాపారంలో కార్పొరేట్లను తగ్గిస్తూ, తాళిబొట్లను కేవలం విశ్వబ్రాహ్మణులే తయారు చేసేలా చట్ట సవరణ తీసుకువస్తానని అన్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని, జీవో 272లోని అభ్యంతరకర క్లాజులను తొలగిస్తానని చెప్పారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - విజయనగరం