విజయన్

16:41 - August 9, 2018

కేరళ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడడంతో 20 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఇడుక్కి జిల్లాలో అత్యధికంగా 11 మంది మృత్యువాత పడ్డారు. మళప్పరంలో 6గురు, కోచికూడిలో ఇద్దరు, వాయునాడులో ఒకరు మృతి చెందారు. పాలక్కాడ్, వాయునాడ్, కోచికూడిలో కొందరు గల్లంతయ్యారు. తెల్లవారుజామునుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెరియార్ నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. ఇడుక్కి రిజర్వాయర్ లో నీటి మట్టం పెరిగిపోవడంతో 22 గేట్లను ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమలమయ్యాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు..కళాశాలలకు సెలవు ప్రకటించారు. 

20:29 - November 14, 2017

నిన్నియాళ్ల ఫేస్ బుక్కులళ్ల.. వాట్సప్ గ్రూపులళ్ల.. ఒక పోట్వ గిర్రా గిర్రా తిర్గుతున్నది.. కేరళ ముఖ్యమంత్రి ఎందుకు గొప్పోడు.. మన తెల్గు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు సన్నాసులైండ్రు అనేది కుద్దు అచ్చరాలు రాశి అండ్లిండ్ల తింపుతున్నరు.. నిజంగ కేరళ ముఖ్యమంత్రి మన సీఎంలకంటె తోపా..? తోపైతె ఎట్ల తోపు అనేది ఒక్కపారి జూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

16:44 - June 19, 2017

కర్నూలు : ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఎం నేత గఫూర్..ఇతర వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ర్యాలీలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మహాసభలో పాల్గొనేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ కర్నూలు జిల్లాకు వచ్చారు. రాష్ట్రంలో పేదలు..వ్యవసాయ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

06:37 - March 20, 2017

హైదరాబాద్ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సామాజిక తెలంగాణ లక్ష్య సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఏమి చేయాలన్న విషయంలో సీపీఎం సూచనలను పరిగణలోకి తీసుకోవాలని విజయన్‌ కోరారు. తమ్మినేని పాదయాత్ర ద్వారా వెలుగులోకి వచ్చిన సామాజిక సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు బంగారు తెలంగాణ సాధన ఏమైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్యమంత్రి కరేసీఆర్ కేసీఆర్ ను ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ సాధనం కోసం సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ముఖ్య అతిథిగా హాయరయ్యారు. ఐదు నెలలపాటు అవిశ్రాంతంగా అలుపెరుగని పాదయాత్ర చేసిన తమ్మినేని వీరభద్రం బృందాన్ని నినరయి విజయన్‌ అభినందించారు. పాదయాత్రను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు పిలుపు ఇవ్వడాన్ని పినరయి విజయన్‌ తప్పుపట్టారు. పాలకులు ఎన్ని కుటియత్నాలు చేసినా..మహాజన పాదయాత్ర విజయవంతం కావడం కమ్యూనిస్టులు, సామాజిక శక్తుల ఘనతని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల అభివృద్ధితోనే సామాజిక తెలంగాణ సాధ్యమన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని పినరయి విజయన్‌ సూచించారు.

హామీల అమలేది..
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణ హామీ అమలుకు నోచుకోలేదని, ఇది కేవలం వాగ్దానంగానే మిగిలిపోయిందని కార్యక్రమానికి హాజరైన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. పాలకులు విస్మరించిన సామాజిక తెలంగాణ సాధన కోసం సీపీఎం పునరంకింతమైందని, ఇందుకోసం భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు తప్పవని ఏచూరి చెబుతున్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం సీపీఎం భవిష్యత్‌లో చేపట్టే ఉద్యమాలకు ప్రజలందరూ సహకరించాలని సీతారాం ఏచూరి విజ్ఞప్తి చేశారు.

12:23 - October 10, 2016

తమిళనాడు : చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు అమ్మ త్వరగా కోలుకోవాలని అభిమానుల పూజలు చేస్తున్నారు. అటు విపక్షాలు మాత్రం తమిళనాడులో పాలన స్తంభిస్తోందని.. తాత్కాలిక సీఎంను నియమించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అన్నాడీఎంకే వర్గాలు మాత్రం.. తాత్కాలిక సీఎం అవసరం లేదని చెబుతున్నాయి. అటు జయలలితకు నేతల పరామర్శలు కొనసాగుతున్నాయి. నేడు కేరళ సీఎం విజయన్‌ జయలలితను పరామర్శించనున్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:37 - May 22, 2016

ఢిల్లీ : కాషాయ మూకలు మళ్లీ దాడులకు తెగబడుతున్నారు. గోల్ మార్కెట్ లో ఉన్న సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ నేతలు దాడులకు దిగారు. కేరళలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ కేరళలో బీజేపీ నేతల హత్యకు సీపీఎం కారణమని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సీపీఎం కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం పార్టీ బోర్డును ధ్వంసం చేసి నల్లరంగు పూసే ప్రయత్నం చేశారు. దాడికి పాల్పడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రజా స్వామ్య బద్ధంగా నిరసనలకు దిగవచ్చు కానీ ఇలాంటి దాడులకు దిగడం సబబు కాదని పలు ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. సమాచారం అందుకున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. దాడి జరగడంతో పొలిట్ బ్యూరో సమావేశం రద్దయినట్లు తెలుస్తోంది. గతంలో కూడా సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. విజయన్ విజయోత్సవ ర్యాలీపై బీజేపీ బాంబు దాడులకు దిగిందని సీపీఎం పేర్కొంటోంది.

దాడిపై బీజేపీ స్పందించాలి - మధు..
సీపీఎం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిపై బీజేపీ స్పందించాలని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కేరళలో బీజేపీ హత్యలకు సీపీఎం కారణమని ఆరోపిస్తూ ఢిల్లీ సీపీఎం కేంద్ర కమిటీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై ఆయన టెన్ టివితో మాట్లాడారు. వామపక్ష కార్యాకర్తలు ఎలాంటి దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. దేశంలో హత్యా రాజకీయాలు ప్రవేశ పెట్టడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోందని, చట్టప్రకారం ప్రభుత్వ యంత్రాగం చర్యలు చేపట్టాలని కోరారు. ఇలాంటి దాడులు చేయడం సహించారని చర్య అని పేర్కొన్నారు. ప్రజాస్వామతంత్ర వాదులు ఈ దాడిని ఖండించాలని, ఇలా చేయడం వల్ల అనేక దౌర్జన్య కార్యక్రమాలకు కారణమౌతుందని వెల్లడించారు. విజయన్ విజయోత్సవ సభ జరుగుతుంటే బాంబు దాడులకు పాల్పడ్డారని, హత్య రాజకీయాలు ప్రవేశ పెడుతున్నది వారేనని మధు తెలిపారు.

Don't Miss

Subscribe to RSS - విజయన్