విజయసాయిరెడ్డి

07:49 - June 14, 2018

చిత్తూరు : టీటీడీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా ఆరోపణలు చేసిన తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శ్రీవారి ఆభరణాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి, శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపి విలువైన సంపద దోచుకున్నారంటూ రమణదీక్షితులు ఆరోపించారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ పాలక మండలి వీరిద్దరిపై చట్టపరమైన చర్యలకు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు 
తిరుమల తిరుపతి దేవస్థానాలపై ఆరోపణలు చేసిన శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంపై  టీటీడీ పాలక మండలి తీవ్రంగా స్పందించింది. శ్రీవారి ఆరభరణాలు దోచుకున్నారని, విలువైన వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని, స్వామికి నిత్యం జరిగే కైంకర్యాల్లో లోపాలున్నాయని విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు చేసిన ఆరోపణలతో టీటీడీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిందని భావించిన పాలక మండలి వీరికి నోటీసులు జారీ చేసింది. 
టీటీడీపై రమణదీక్షితులు ఆరోపణలు 
టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులకు 65 ఏళ్ల వయసు నిండటంతో పదవీ విరమణ కల్పించారు. ఆ తర్వాత నుంచి రమణదీక్షితులు టీటీడీపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. చెన్నైలో మొదలుపెట్టి తిరుమల, తిరుపతి, హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు పాలక మండలి సభ్యులతోపాటు అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపి విలువైన సంపద దోచుకున్నారని ఆరోపణలు చేశారు. శ్రీవారి సొమ్ములకు  లెక్కలులేవని, మణులు, మాణిక్యాలు, రవ్వలు, రత్నాలు, వజ్రాలు పొదిగిన విలువైన ఆభరణాలు మాయమయ్యాయన్న వాదాన్ని లేవనెత్తారు. వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని ఆరోపించారు. దీనిపై టీటీడీ వివరణ  ఇచ్చినా.. తన ఆరోపణల పర్వాన్ని ఆపకపోగా,...మరింత విస్తృతం చేశారు. ప్రధాన అర్చకుడి పదవిలో ఉన్న సమయంలో ఈ అంశాలపై నోరు మెదపని రమణదీక్షితులు.. పదవి నుంచి తొలగించిన తర్వాతే మాట్లాడటంలోని ఔచిత్యాన్ని చాలామంది ప్రశ్నించారు. అయినా రమణదీక్షితుల్లో మార్పు రాకపోవడంతో ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఆ ప్రకారం ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. 
దీక్షితులను వెనకేసుకొచ్చిన వైసీపీ 
మరోవైపు కారణాలు ఏవైనా కానీ... రమణదీక్షితులు వివాదాన్ని వైసీపీ అందిపుచ్చుకొంది.  దీక్షితులు తరుపున వకాల్తా పుచ్చుకొన్నట్టు ఆయన్న వెనకేసుకు రావాడంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆభరణాలు చంద్రబాబు నివాసంలో ఉన్నాయని, కొన్నింటిని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకొన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం, ఢిల్లీలో ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం ప్రభుత్వం వరకు వెళ్లింది. దీక్షితులు, విజయసాయిరెడ్డి వ్యవహారంపై టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఈవో అశోక్‌ కుమార్‌ సింఘాల్‌తో సమీక్షించి.. దేవస్థానాల పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్యలకు తీర్మానించి... ఇప్పుడు విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పరువు, ప్రతిష్ఠతలకు భంగం కలిగించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. 
టీటీడీ నుంచి నోటీసులు అందలేదన్న విజయసాయిరెడ్డి 
టీటీడీ జారీ చేసిన నోటీసులపై విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. నోటీసులు ఇంతవరకు  తనకు అందలేదన్నారు. సమాధానం ఇవ్వాలా... లేదా.. అన్న అంశాన్ని నోటీసులు అందిన తర్వాత పరిశీలిస్తానని చెప్పారు. ఏపీ  దేవాదాయ, ధర్మాదాయ చట్టం పరిధిలోకి వచ్చే టీటీడీకి నోటీసులు ఇచ్చే అధికారం లేదన్న వాదాన్ని వినిపించారు. సీఆర్‌పీసీ కింది దర్యాప్తు అధికారికే నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుందున్నారు. శ్రీవారి ఆభరణాలు దోపిడీకి గురయ్యాయన్న తన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మరోసారి డిమాండ్‌ చేశారు. నోటీసులకు విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి ప్రతిపాదించింది. 
 

 

19:23 - June 13, 2018

టీటీడీ వివాదం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ప్రస్తుత టిటిడి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. రమణ దీక్షితులు కంటే ముందే ప్రధాన అర్చకులు కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా తనను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారని, స్వామి వారి ఆభరణాలు కనబడటం లేదని, ఈ విషయంపై వచ్చే నెల మొదటివారంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని రమణదీక్షితులు అన్న నేపథ్యంలో టీటీడీ కేవియెట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం రమణ దీక్షితులు పిటిషన్‌ వేసినా తాము చెప్పేది కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్న విన్నపంతోనే కేవియెట్‌ పిటిషన్‌ను వేశామని వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈఅంశంపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో ప్రముఖ విశ్లేకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. 

15:39 - June 13, 2018

అమరావతి : టీటీడీ బోర్టు తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై విజయసాయిరెడ్డి స్పందించారు. తాను నిప్పుని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడని, మంత్రి లోకేశ్ లను పప్పు నాయుడు అనీ..అటువంటివారు ఇప్పించిన నోటీసులకు తాము భయపడేది లేదని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవాచేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పించిన నోటీసులకు తాము భయపడేది లేదన్నారు. టీటీడీ జారీ చేసిన నోటీసులను నోటీసులు అనటానికి వీల్లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు దొంగతనం, దోపిడీ చేసి..అతని కుమారుడు టీటీడీ ఆస్తులను విదేశాలను తరలించారని విజయసాయిరెడ్డి మరోసారి ఆరోపించారు. తాను చంద్రబాబు పై చేసిన ఆరోపణలకు కట్టుబడి వుంటారని..తాను ఇచ్చిన 13 గంటల సమయంలో స్పందించకుండా వారాలు గడిచిపోయిన తరువాత స్పందించి నోటీసులిప్పిస్తే తాము భయపడేది లేదని విజయసాయరెడ్డి పేర్కొన్నారు. అటువంటివారు ఇచ్చిన నోటీసులకు ఏమాత్రం భయపడేది లేదని ధీమా వ్యక్తంచేశారు. కాగా టీటీడీ ఆస్తులు, విలువైన ఆభరణాలు చంద్రబాబు నాయుడు కాజేశారనీ గతంలో విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ఆరోపణలు చేసిన విషయం తెలిసందే. అలాగే తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులకు కూడా టీటీడీ నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే.తాము చేసిన ఆరోపణలపై నోటీసులు ఇచ్చే అధికారం టీటీడీకి లేదన్నారు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నోటీసులు ఇచ్చే అధికారం సీఆర్‌పీసీ నిబంధలన ప్రకారం ఇన్వెస్టిగేషన్‌ అధికారులకు మాత్రమే ఉంటుందన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు టీటీడీ సంపదను దోచుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరగాల్సిందిపోయి.. తమనే ముద్దాయిలుగా చూడటం సరికాదన్నారు. 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు, లోకేష్‌ల ఇళ్లలో దాచిన టీడీపీ సంపదను వెలికి తీస్తామన్నారు విజయసాయిరెడ్డి. 

 

08:34 - May 16, 2018

విశాఖపట్నం : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెంపపెట్టని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కర్నాటకలోని తెలుగు ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయాలన్న చంద్రబాబు పిలుపును ఓటర్లు బేఖాతరు చేశారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు అబాసుపాలయ్యారని విజయసాయిరెడ్డి విమర్శించారు. 

08:16 - April 30, 2018

విశాఖపట్నం : వైసీపీ వంచన దీక్ష ప్రారంభమైంది. హోదా విషయంలో చంద్రబాబు నాలుగేళ్లపాటు ప్రజలను వంచించారన్న ఆరోపణలతో.. విపక్ష వైసీపీ విశాఖపట్నంలో వంచన దీక్షకు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి దీక్షను ప్రారంభించారు. సాయంత్రం 7 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది. కేంద్ర, రాష్ట్ర మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఈ దీక్షను చేపట్టింది.ఈ దీక్షకు హాజరయిన వారంతా నల్ల రంగు దుస్తులతోహాజరయ్యారు. ఈ దీక్షకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సీనియన నేతలు కూడా హాజరుకానున్నారు. 

12:59 - April 16, 2018

విశాఖపట్టణం : ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నేతలు ఆందోళన కొనసాగించారు. వామపక్ష నేతలతో పాటు, వైసీపీ, జనసేన నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో మద్దిపాలెం జాతీయ రహదారిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో 2004-2014 వరకు అధికారంలో లేని సమయంలో ఎన్ని బంద్ లకు పిలుపునిచ్చారో చెప్పాలని, ఎందుకు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:44 - April 13, 2018
21:59 - March 28, 2018

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు పారేసుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ముప్పేట దాడి మొదలుపెట్టింది. విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను చంద్రబాబు సహా మంత్రులు, పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.  విజయసాయిరెడ్డి సంస్కారంలేకుండా మాట్లాడారని చంద్రబాబు మండిపడ్డారు. ఆర్థిక నిందితుడి అనుచిత ప్రవర్తన బాధించిందన్నారు. విజయసాయిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఎంపీగా ఉండటం దురదృష్టకరమని వర్ల రామయ్య అన్నారు. 

18:11 - March 28, 2018

గుంటూరు : విజయసాయిరెడ్డిపై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. తనను, తన తల్లిదండ్రులను కించపరిచేవిధంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు. ఇది పద్ధతేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరినీ కించపర్చలేదని... ఎప్పుడూ హుందాగానే ప్రవర్తించానన్నారు. 

 

17:13 - March 27, 2018

ఢిల్లీ : ఈ ఉదయం రాజ్యసభ 15 నిమిషాలపాటు వాయిదా పడిన సమయంలో... సభలో ఉన్న నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి, ఆయన కాళ్లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొక్కారంటూ వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డితో పాటు వైసీపీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. మోదీ కాళ్లు మొక్కి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారంటూ విమర్శిస్తున్నారు. ఈ వార్తలను ఇప్పటికే విజయసాయి ఖండించారు. మోదీకి తాను నమస్కరించానే తప్ప, కాళ్లు మొక్కలేదని చెప్పుకొచ్చారు. తాజాగా పార్లమెంటు సెక్రటరీ జనరల్ కు ఆయన లేఖ రాశారు. వీడియో ఫుటేజీని బయటపెట్టాలని ఆ లేఖలో ఆయన కోరారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - విజయసాయిరెడ్డి