విజయ్ దేవరకొండ

11:57 - October 7, 2018

హైదరాబాద్ : బుల్లితెరపై బిగ్ బాస్ ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 ప్రసారమయ్యాయి. ఇందులో బిగ్ బాస్ మొదటి భాగంలో జూ.ఎన్టీఆర్ అలరించగా బిగ్ బాస్ 2లో నేచురల్ స్టార్ నాని ప్రవేశించాడు. తాజాగా బిగ్ బాస్ 3 త్వరలో ప్రసారమవుతోందని తెలుస్తోంది. కానీ ఇందులో హోస్్ట అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 

బిగ్ బాస్ 1లో జూ.ఎన్టీఆర్ అదరగొట్టాడు. వెండితెరపై తన నటనతో విశ్వరూపం చూపెట్టిన యంగ్ టైగర్ బుల్లితెరపై కూడా దుమ్ము దులిపేశాడు. మొదటిసారి బుల్లితెర మీద బిగ్ బాస్ హోస్ట్ గా దులిపేశాడు. తనదైన స్టైల్..మేనరిజంతో బిగ్ బాస్ 1ని సకె్స్ చేయడంలో సఫలం అయ్యారు. ఇందులో ఫైనల్ మ్యాచ్ లో శివ బాలజీ నిలిచాడు. అనంతరం కొద్ది రోజులకు బిగ్ బాస్ 2 మొదలైంది. 

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా పేరొందిన నాని బిగ్ బాస్ 2కి హోస్్టగా వచ్చాడు. సీరియస్..కామెడీ..జోక్్స తదితర వాటిని అనుకరిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు నాని. కానీ ఎన్టీఆర్ లా మాత్రం అలరించ లేకపోయాడని టాక్. ఇక షోలో ఎన్నో ఘటనలు జరిగాయి. ఎలిమేనెట్ అయిన అనంతరం పలువురు వ్యాఖ్యలు చేయడం మరింత వివాదాస్పదమయ్యాయి. చివరకు కౌశల్ విజేతగా నిలిచారు. 

మరోసారి బిగ్ బాస్ 3 వస్తే ఎన్టీఆర్ మరోసారి హోస్్ట గా వస్తారని ప్రచారం అవుతోంది. త్వరలోనే షూటింగ్ కొనసాగిస్తారని తెలుస్తోంది. కానీ దీనికి తారక్ నో చెప్పాడని మరో ప్రచారం జరుగుతోంది. ఆడియన్స్ ని అలరిస్తూనే ఇంటి సభ్యుల పట్ల సమయస్ఫూర్తితో వ్యవహరించిన నాని సీజన్ 3కి కొనసాగే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 3లో ఉంటారని..పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ బిగ్ బాస్ 3 ఉంటుందా ? లేదా ? ఉంటే ఎవరు హోస్్ట అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

10:26 - October 6, 2018
హైదరాబాద్ : టాలీవుడ్ లో తనదైన స్టైల్..నటనతో అలరిస్తున్న విజయ్ దేవరకొండకు బ్యాడ్ టైం ప్రారంభం అయ్యిందా ? వరుసగా విజయవంతమైన చిత్రాలు చేస్తూ దూసుకపోతున్న విజయ్ కు బ్రేక్ పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన తాజా చిత్రం ‘నోటా’పై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కె.ఇ.జానవేల్ రాజా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. విజయ్ దేవరకొండ సరసన మెహరీన్ నటించగా నాజర్, సత్యరాజ్ లు కీలక పాత్ర పోషించారు. 

పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న ఈ నటుడు అర్జున్ రెడ్డితో యూత్ లో ఒక ఐకాన్ గా మారిపోయాడు. అనంతరం వచ్చిన గీత‌ గోవిందంతో అందరి వాడిగా మారిపోయాడు. ఇలా ఏ సినిమా చేసినా వైవిధ్యం కనబరుస్తూ అలరిస్తున్నాడు. ఇతర సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నటించిన నోటా శుక్రవారం రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం రూపొందింది. 

చిత్రం విడుదల కాకముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ సినిమా రిలీజైన అనంతరం భిన్నమైన టాక్్స వినిపిస్తున్నాయి. చిత్రానికి ఎదురుగాలి వీస్తోందని ప్రచారం జరుగుతోంది. అసలు ఈ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు ? పెడితే దానికి సంబంధించిన అంశం ఉండాలి కదా అని ప్రేక్ష‌కులు అంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి విజయ్ కు ఇప్పటి నుండి అసలైన టైం ప్రారంభమైందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి విజయ్ నటించిన నోటా చిత్రంపై రానున్న రోజుల్లో మరిన్ని స్పష్టమైన విషయాలు తెలిసే అవకాశం ఉంది...
15:57 - October 5, 2018

తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ యంగ్ సెన్షేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ మూవీ రూపొందబోతోంది అనే వార్త ఇప్పుడు ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది..
తమిళ్, హిందీ పరశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శకురాలు సుధ కొంగర, సూర్య కాంబోలో మూవీ ఉండబోతోందని గతకొద్ది రోజులుగా ఫిలింవర్గాల్లో చర్చ జరుగుతోంది.. హిందీలో సాలా ఖడూస్‌గా రూపొంది, తమిళ్‌లో ఇరుది సుట్రుగా డబ్ అయి, తెలుగులో గురుగా రీమేక్ అయిన చిత్రాలకి ఆమే డైరెక్టర్... సూర్య, సుధల కాంబోలో రాబోయే మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం  విజయ్ దేవరకొండని సెలెక్ట్ చేసారు.. అది సెకండ్ హీరో టైప్ క్యారెక్టర్ అని అంటున్నారు.. గీత గోవిందంతో తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్.. అక్కడ విడుదలవుతున్న నోటా మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మనోడి క్రేజ్ మామూలుగా ఉండదు...  చూద్దాం మరి... ఏం జరుగుతుందో....

11:59 - October 5, 2018

‘గీత గోవిందం’ మూవీతో యంగ్‌హీరో ‘విజయ్ దేవరకొండ’ క్రేజ్ కొండెక్కి కూర్చుంది.. 100 కోట్ల క్లబ్‌లోనూ చేరడంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.. ఇప్పుడు అందరి చూపు విజయ్ లేటెస్ట్ మూవీ నోటాపైనే ఉంది.. గతకొద్దిరోజులుగా ‘నోటా’ సినిమా రిలీజ్‌పై కొన్నిరాజకీయ పార్టీలు హడావిడి చేసాయి... ఎట్టకేలకు అన్ని అడ్డంకులనీ తొలగించుకుని, శుక్రవారం తెలుగుతో పాటు, తమిళ్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ అయింది ‘నోటా’..మరి సినిమా ఎలా ఉందో చూద్దాం...

కథ :
 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికవుతాడు వాసుదేవ్.. ఒక స్వామీజీ సలహామేరకు తన కొడుకు వరుణ్ని ముఖ్యమంత్రిని చెయ్యాలనుకుంటాడు... అయితే అదే టైమ్‌లో అవినీతి ఆరోపణలతో వాసుదేవ్ జైలుకి వెళ్ళడంతో తప్పక తండ్రి స్ధానంలోకి వచ్చిన వరుణ్ ముఖ్యమంత్రిగా ఏం చేసాడు అనేది నోటా కథ..

నటీనటులు :
విజయ్ దేవరకొండ నటుడిగా సినిమా సినిమాకి డెవలప్ అవుతూ ఉన్నాడు... నోటాలో గంభీరంగా కనిపిస్తూ తన శైలి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు..హీరోయిన్ మెహరీన్‌ది గెస్ట్ అప్పీరియన్స్‌లా అనిపిస్తుంది.. అయినా ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది.. సీనియర్ నటులు నాజర్ అండ్ సత్యరాజ్ తమ అనుభవంతో వారి వారి పాత్రలని రక్తి కట్టించారు... మిగతా ఆర్టిస్టులు కూడా ఉన్నంతలో బాగానే చేసారు...శ్యామ్.సి.ఎస్. సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సో సో‌గా ఉన్నాయి.. సంతాన కృష్ణన్ రవిచంద్రన్ కెమెరా వర్క్ బాగుంది.. రేమండ్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది..దర్శకుడు ఆనంద్ శంకర్ నోటాని పొలిటికల్ థ్రిల్లర్‌గా మలిచిన విధానం బాగానే ఉంది కానీ, ఓవర్ డ్రామాతో కాస్త సాగదీస్తూ.. సహనానికి పరీక్ష పెట్టాడు..‘నోటా’ దాదాపు 25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.. మన దగ్గర విజయ్ మ్యాజిక్‌తో ఆడేస్తుంది కానీ, తమిళ్‌లో ఏమాత్రం స్కోర్ చేస్తుందో చూడాలి.. ఎందుకంటే, తెలుగులో ఎటువంటి పోటీ లేకుండా రిలీజ్ అయింది నోటా‌.. తమిళ్‌లో ఇవాళే రిలీజ్ అయిన, విజయ్ సేతుపతి, త్రిషల 96, ఎస్.జె.సూర్య రాక్షసన్ మూవీస్ కి హిట్ టాక్ వచ్చేసింది... మరి వాటి మధ్య నోటా ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి...

తారాగణం :  విజయ్ దేవరకొండ, మెహరీన్,  నాజర్, సత్యరాజ్..

కెమెరా     :  సంతాన కృష్ణన్ రవిచంద్రన్ 

సంగీతం   :    శ్యామ్.సి.ఎస్.

ఎడిటింగ్   :      రేమండ్ 

నిర్మాత    :   కె.ఇ.జ్ఞానవేల్ రాజా

రేటింగ్  : 2.5\5

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి
 
 
10:46 - October 4, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల హావా కొనసాగుతోంది. కానీ అందరి చూపు మాత్రం ఒక చిత్రంపైనే ఉంది. ఆ చిత్రమే నందమూరి తారకరావు బయోపిక్ పై. ఆయన తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు ఫొటోలు విడుదలై అందర్నీ ఆకర్షించాయి. మిగతా పాత్రల్లో పలువురు నటులు కనిపిస్తుండడం విశేషం. ఇప్పటికే ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్, చంద్రబాబునాయుడు పాత్రలో రానాలు కనిపించనున్నారు.

దీనిపై పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యువహీరో కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో యువ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ కూడా సినిమాలో ముఖ్యపాత్ర పోషించనున్నారని టాక్. తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ పాత్ర కోసం విజయ్ దేవరకొండ చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా కేసీఆర్ ఎన్టీఆర్ అభిమాని అయిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్, కేసీఆర్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయని సమాచారం. 

ఇక ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దివిసీమలోని హంసదీవీ, కొడూరులో షూటింగ్ కు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. షూటింగ్‌లో బాలకృష్ణ, సుమంత్, రానా దగ్గుబాటి తదితరులు పాల్గొంటున్నారని సమాచారం. 

13:22 - September 30, 2018

పశ్చిమ గోదావరి : కట్టుదిట్టమైన చర్యలు ఎన్ని తీసుకున్నా పైరసీ మాత్రం పేట్రేగిపోతోంది. భారీ బడ్జెట్‌తో కట్టుదిట్టమైన ఏర్పాట నడుమ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలయితే కాసేపటికే ఆ సినిమా లీక్ అవుతోంది. దీనితో దర్శక, నిర్మాతలు, హీరోలు, చిత్ర యూనిట్ తీవ్రంగా నష్టపోతోంది. పైరసీలకు పాల్పడవద్దంటూ కోరుతున్నా అక్రమార్కులు మాత్రం ఇంకా చెలరేగిపోతున్నారు. ఇటీవలే జూ.ఎన్టీఆర్ నటించిన అరవింద సమతే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక ఫైట్ సీన్ బయటకు రావడంతో కలకలం రేగింది. తాజగా విజయదేవరకొండ నటించిన ‘ట్యాక్సీ వాలా’ చిత్రం విడుదలకు ముందే విద్యార్థుల సెల్‌ఫోన్లలో ప్రత్యక్షమైంది. ఇతను హీరోగా నటించిన గీతా గోవిందం సినిమా కూడా రిలీజ్‌కు ముందే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో సెల్‌ ఫోన్లలో ఎడిటింగ్ కాని ట్యాక్సీ వాలా చిత్రం దృశ్యాలను చూస్తున్న విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. విడుదలకు ముందే ఫుటేజ్‌ లీకవడంపై నిర్మాత ఎస్‌కెఎన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుటేజ్‌ చెన్నై నుంచి దేవరపల్లిలోని విద్యార్థులకు వచ్చినట్టు తెలుస్తోంది. 

10:31 - September 26, 2018

వైరైటీ స్టైల్‌తో దూసుకపోతున్న నటుల్లో ఒకరు విజయ్ దేవరకొండ. ఇతని చిత్రాలు విజయవంతం కావడంతో పలువురు దర్శకులు ఇతనితో సినిమాలు చేయాలని తహతహలాడుతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘నోటా’ విడుదలకు సిద్ధమౌతోంది. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవలే మృతి చెందిన ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు విజయ్ దేవరకొండతో జత కడుతోందని వార్తలు వెలువడుతున్నాయి. 
అలనాటి అందాలతార శ్రీదేవి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈమె కూతుళ్లను వెండితెరకు పరిచయం చేయాలని శ్రీదేవి భావించింది. 'ధడక్‌' చిత్రంతో బాలీవుడ్‌లోకి జాన్వి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నిర్మాణమయ్యే చిత్రంలో జాన్వీ నటించబోతున్నట్లు టాక్. కానీ దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం జాన్వి 'తఖ్త్‌' అనే చారిత్రక చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో కరీనా కపూర్‌, విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

15:14 - August 20, 2018

ఎన్నో అంచనాలతో వచ్చిన 'గీత గోవిందం'..అనుకున్న దానికొంటే ఎక్కువ ఫలితాన్నే చూపిస్తోంది. దగ్గరగా పెద్ద సినిమాలు లేకపోవడం ఈ మూవీకంటే యూత్ ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్ మూవీ లేకపోవడం 'గీత గోవిందాని'కి కలిసి వచ్చింది. 'గీత గోవిందం' మూవీ థీయేటర్స్ లో సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెడుతోంది. ఈ వీక్ లో మిడిల్ లో రిలీజ్ అయిన 'గీత గోవిందం' మూడు రోజులకే తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కలిపి 13 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇవి పక్కన పెడితే తమిళనాడు, కర్ణాటక, కేరళ కలిపి నాలుగుకోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఈ రేంజ్ లో దూసుకుపోతుంది.. అంతే కాదు ఈ శని, ఆది వారాలు 60 పర్సంట్ అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా అయిపోయాయట.

'విజయ్ దేవరకొండ', 'రష్మిక మండన్న' హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో... వచ్చిన గీతాఆర్ట్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించారు. అదరిపోయే నటనతో అంతకంతకు ఇమేజ్ పెంచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. రెండు రోజులు డొమెస్టిక్ మార్కెట్ లో మంచి కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు పెట్టింది. అయిదు రోజులకు వరల్డ్ వైడ్ కలెక్షన్లు 23 కోట్ల షేర్ ను దాటిందని అంచనా. మరి రానున్న రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. 

21:22 - August 12, 2018

కేరళ : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అయింది. అనేక ప్రాంతాల్లో వరద ముంపు ఇంకా వీడలేదు. ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా అనేక ప్రాంతాలను వరద ముప్పు వీడలేదు. ఇడుక్కి డ్యాంకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో డ్యాం పరిసర ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. కేరళలో వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా కేరళలో ఇప్పటికే 37 మంది మృతి చెందారు. అనేక ఇళ్లు దెబ్బతినడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 35,874 మంది ప్రజలు కేరళ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 341 సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

కేరళ బాధితుల కోసం ఇప్పటికే నటులు విశాల్‌, సూర్య, కార్తి తదితరులు విరాళాలిచ్చి తమ వంతు సహాయం చేశారు. విశాల్‌ కేరళ రెస్క్యూ పేరుతో అత్యవసర వస్తువులను సేకరిస్తున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కేరళ వాసుల కోసం 5 లక్షల విరాళం ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి విపత్తు నిర్వహణ సంస్థకు విజయవంతంగా డబ్బులు వెళ్లాయని వచ్చిన సందేశాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

10:58 - June 4, 2018

విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన సినిమా నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు మాటల రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేశ్ కాంబినేషన్ లో తొలి సినిమా రాబోతోంది. మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ డైలాగ్స్ ఎంతటి ప్రాచుర్యం పొందాయో చెప్పనక్కరలేదు. ఇక వెంకీ కుటుంబ కథా సినిమాల హీరో. వెంకటేశ్ కామెడీ టైమింగ్ గురించి హిట్ అయిన వెంకీ సినిమాలు చెప్తాయి. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్ అంటే సినిమా పరిశ్రమలోను, ఇటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. పంచ్ డైలాగ్స్ తో త్రివిక్రమ్..టైమింగ్ తో వెంకీ నటనలతో ఇటు అభిమానులకు, ప్రేక్షకులకు నయనానందం..శ్రవణానందం కూడా కలుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'అరవింద సమేత..' చిత్రాన్ని చేస్తున్న త్రివిక్రమ్ ఆ తర్వాత వచ్చే జనవరి నుంచి వెంకీతో చిత్రాన్ని చేస్తాడట.

మరోసారి వాయిదా పడనున్న 'టాక్సీవాలా' ?
విజయ్ దేవరకొండ నటిస్తున్న 'టాక్సీవాలా' చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత నెలలో విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఇప్పటికే ఈ నెలకు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ మరికొంత కాలం వాయిదా పడచ్చని అంటున్నారు. సినిమాకు మరిన్ని మెరుగులు దిద్దవలసి రావడం వల్ల ఆలస్యం అవుతోందట.  

Pages

Don't Miss

Subscribe to RSS - విజయ్ దేవరకొండ