విజయ్ మాల్యా

18:20 - December 10, 2018

ముంబై: ఇండియాలోని బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ వెళ్లిపోయిన మాల్యాను అప్పగించాలంటూ భారత్ చేసిన పోరాటం ఫలించింది. డిసెంబర్ 10వ తేదీ భారత దౌత్యవేత్తల వాదనలు విన్న లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు భారత్‌కు మాల్యాను అప్పగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు ముందు కోర్టులో ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. భారత్‌లోని జైళ్లపై మాల్యా అసంతృప్తి వ్యక్తం చేయటంతోపాటు అక్కడ ఉండలేం అని స్పష్టం చేశారు. దీంతో ముంబైలోని ఆర్థర్ జైలులోని బ్యారక్‌లపై 10 నిమిషాల వీడియోను భారత అధికారులు కోర్టుకు సమర్పించారు.
ఆర్థర్ రోడ్ జైలు బ్యారక్ నెంబర్ 12 :
ముంబైలోనే అతిపెద్ద జైలు ఆర్థర్ రోడ్‌లో ఉంది. ఈ జైలు ఆవరణలో రెండు అంతస్తుల భవనం ఉంది. అందులో బ్యారక్ నెంబర్ 12 మాల్యా కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు అధికారులు. సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది ఈ బ్యారక్. అనారోగ్యం వస్తే వెంటనే పరీక్షించటానికి దగ్గరలోనే క్లీనిక్ కూడా ఉందని అధికారులు కోర్టుకి వివరించారు. వెస్టర్న్ టాయ్‌లెట్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రకృతి సిద్ధంగా గాలి, వెలుతురు చక్కగా బ్యారక్‌లోకి వస్తాయని.. మాల్యాను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాం అంటూ కోర్టుకి వివరించారు. భారత అధికారులు సమర్పించిన వీడియోలు, డాక్యుమెంట్లు పరిశీలించిన లండన్ కోర్టు.. మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

17:58 - December 10, 2018

లండన్: భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న వాదనను కోర్టు సమర్థించింది. అదే సమయంలో తీర్పుపై 14 రోజుల్లో ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం మాల్యాకు ఇచ్చింది. భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి మాల్యా బ్రిటన్‌కు పారిపోయారని ఆరోపణలు ఉన్నాయి. మాల్యాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం యూకేను కోరింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. తుది తీర్పు ప్రకటిస్తున్న సమయంలో మాల్యా నిజాలు దాచారని కోర్టు మండిపడింది. కేసు విచారణకు భారత్ నుంచి సీబీఐ, ఈడీ అధికారులు హాజరయ్యారు.
రూ.9వేల కోట్లు ఎగనామం:
కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం ఎస్‌బీఐ సహా వివిధ భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల మేర రుణాలు ఎగవేశారని, మనీ లాండరింగ్‌‌కు పాల్పడ్డారని మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మాల్యా బ్రిటన్‌కు పారిపోయారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి బెయిల్‌పై ఉన్న మాల్యాపై డిసెంబర్ నుంచి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ జరిగింది.
నేను దొంగను కాను:
మాల్యా మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. తాను ఎలాంటి నేరం చేయలేదని వాదిస్తున్నారు. నేను దొంగను కాను, ఎవరి డబ్బులు దొంగలించలేదు అని అంటున్నారు. బ్యాంకులకు మోసం చేయలేదన్న మాల్యా అప్పులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌ను కాపాడుకోవటానికి తన సొంత డబ్బు 4వేల కోట్ల రూపాయల వినియోగించినట్టు తెలిపారు.

15:28 - December 10, 2018

బ్యాంకులకు వేల కోట్ల రుణాల ఎగొట్టి విదేశాలకు పారిపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపార వేత్త, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కేసుపై తుది తీర్పు రానుంది. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఇప్పటివరకు ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు... డిసెంబర్ 10న తుది తీర్పు ఇస్తారని భావిస్తున్నారు. విజయ్ మాల్యా కేసుకు సంబంధించి బ్రిటీష్ అధికారులకు మరింత సమాచారం ఇచ్చేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే లండన్‌ చేరుకున్నారు. అవినీతి ఆరోపణల రావడంతో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాను కేంద్రం సెలవుపై పంపింది. దీంతో ఆస్తానా స్థానంలో సాయి మనోహర్‌ లండన్ వెళ్లారు.
రూ.9వేల కోట్లు ఎగనామం:
కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం ఎస్‌బీఐ సహా వివిధ భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల మేర రుణాలు ఎగవేశారని, మనీ లాండరింగ్‌‌కు పాల్పడ్డారని మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మాల్యా బ్రిటన్‌కు పారిపోయారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి బెయిల్‌పై ఉన్న మాల్యాపై డిసెంబర్ నుంచి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ జరుగుతోంది.
తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ:
ఒకవేళ మాల్యాను భారత్‌కు అప్పగించాలని సోమవారం కోర్టు తీర్పు ప్రకటిస్తే 28 రోజుల్లోగా బ్రిటన్‌ విదేశాంగ మంత్రి దానిపై నిర్ణయం తీసుకోవాలి. మాల్యా కూడా ఆ తీర్పును 14 రోజుల్లోపు బ్రిటన్‌ హైకోర్టులో సవాల్‌ చేయొచ్చు. అప్పగింతకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, భారత్‌ కూడా దీనిపై 14 రోజుల్లోగా అప్పీల్‌ చేయాల్సి ఉంటుంది. మరి మాల్యా భారత్‌కు వస్తాడా లేక మళ్లీ బ్రిటన్‌లోనే మకాం వేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. బ్రిటన్ కోర్టు తీర్పుపై బ్యాంకులతో పాటు... భారత అధికారులు, రాజకీయ నేతలు, దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మాల్యా కోసం జైలు సిద్ధం:
విజయ్ మాల్యా కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో సెల్‌ను అధికారులు సిద్ధం చేశారు. మాల్యా అప్పగింత కేసు విచారణలో ఒకవేళ బ్రిటన్ కోర్టు తీర్పు అనుకూలంగా ఇస్తే మాల్యాను ఉంచడానికి హై సెక్యూరిటీ సెల్‌ను సిద్ధంగా ఉంచారు. ముంబై దాడుల దోషి కసబ్‌ను కూడా ఇక్కడే ఉంచిన విషయం తెలిసిందే.
నేను దొంగను కాను:
మాల్యా మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. తాను ఎలాంటి నేరం చేయలేదని వాదిస్తున్నారు. నేను దొంగను కాను, ఎవరి డబ్బులు దొంగలించలేదు అని అంటున్నారు. బ్యాంకులకు మోసం చేయలేదన్న మాల్యా అప్పులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌ను కాపాడుకోవటానికి తన సొంత డబ్బు 4వేల కోట్ల రూపాయల వినియోగించినట్టు తెలిపారు. కోర్టు తీర్పు ఎలా ఎన్నా అంగీకరిస్తానని మాల్యా స్పష్టం చేశారు.

10:55 - December 10, 2018

లండన్: భారతదేశంలోని బ్యాంకులకు రూ.9000 కోట్ల రూపాయల మేర రుణాలు ఎగ్గొట్టి 2016 లో విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ మాల్యాను భారత్ కు అప్పగించే అంశంపై లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు సోమావారం  తీర్పు చెప్పనుంది. ఈకేసు విచారణ నిమిత్తం సీబీఐకు చెందిన అధికారుల బృందం ఇప్పటికే లండన్  చేరుకుంది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం మాల్యా ఎస్‌బీఐతో సహా వివిధ భారతీయ బ్యాంకులలో రూ.9,000 కోట్ల మేర రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయారని ప్రభుత్వం ఆరోపణ చేస్తోంది.మాల్యాపై అక్రమనగదు చలామణి,రుణాల నిధులు  మళ్లింపు ఆరోపణలు ఉన్నాయి. 2017 ఏప్రిల్ నుంచి బెయిల్ పై ఉన్న మాల్యాపై గత ఏడాది డిసెంబరు నుంచి వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. మాల్యాను భారత్‌కు అప్పగించాలని సోమవారం కోర్టు తీర్పు ప్రకటిస్తే 28 రోజుల్లోగా బ్రిటన్‌ విదేశాంగ మంత్రి దానిపై నిర్ణయం తీసుకోవాలి. మాల్యా కూడా ఆ తీర్పును 14 రోజుల్లోపు బ్రిటన్‌ హైకోర్టులో సవాల్‌ చేయవచ్చు.  తీర్పు అప్పగింతకు వ్యతిరేకంగా వస్తే, భారత్‌ కూడా దీనిపై 14 రోజుల్లోగా అప్పీల్‌ చేయ్యవచ్చును.
 

 

11:23 - December 5, 2018

వాయిదాలు లేవు.. వన్ టైం సెటిల్ మెంట్ కూడా లేదు.. మొత్తం అప్పు కట్టేస్తా.. తీసుకోండి అంటూ బ్యాంకులతోపాటు భారత ప్రభుత్వానికి బంపరాఫర్ ఇచ్చారు విజయ్ మాల్యా. అనేక బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించటానికి సిద్ధంగా ఉన్నాననే విషయంగా గతంలోనే చెప్పాను.. అయినా నా మాట ఎందుకు వినిపించుకోవటం లేదు.. దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ట్విట్ ద్వారా ప్రశ్నించారు మాల్యా. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గట్టి పారిపోయాడు అంటూ తెగ గోల చేస్తున్నారని.. ఇదంతా అబద్దం అని స్పష్టం చేశారాయన. 

 

నన్ను విలన్‌గా చిత్రీకరించేందుకు మీడియా ప్రయత్నిస్తోందని ట్వీట్స్ చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అకస్మాత్తుగా నష్టాల్లో కూరుకపోయిందని.. అప్పులు పెరిగాయని చెప్పుకొచ్చారు. బ్యాంకులకు 100 శాతం ఇస్తానని చెప్పాను.. దయచేసి తీసుకోండి అంటూ వేడుకున్నారు. ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై స్టే విధించాలన్న మాల్యా విజ్ఞప్తిని ముంబై ప్రత్యేక కోర్టు కొటివేసిన సంగతి తెలిసిందే. భారత్ దాఖలు చేసిన నేరస్తుల అప్పగింత కేసుపై యూకే కోర్టు త్వరలో తీర్పు వెలువరించనున్న సమయంలో మాల్యా స్పందించడం విశేషం.

Politicians and Media are constantly talking loudly about my being a defaulter who has run away with PSU Bank money. All this is false. Why don’t I get fair treatment and the same loud noise about my comprehensive settlement offer before the Karnataka High Court. Sad.

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018

Airlines struggling financially partly becoz of high ATF prices. Kingfisher was a fab airline that faced the highest ever crude prices of $ 140/barrel. Losses mounted and that’s where Banks money went.I have offered to repay 100 % of the Principal amount to them. Please take it.

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018

For three decades running India’s largest alcoholic beverage group, we contributed thousands of crores to the State exchequers. Kingfisher Airlines also contributed handsomely to the States. Sad loss of the finest Airline but still I offer to pay Banks so no loss. Please take it.

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018

I see the quick media narrative about my extradition decision. That is separate and will take its own legal course. The most important point is public money and I am offering to pay 100% back. I humbly request the Banks and Government to take it. If payback refused, WHY ?

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018
19:33 - October 20, 2018

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ  దేశానికి కాపలాదారులా కాకుండా అంబానీలకు కాపలా దారులా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావనా యాత్రలో పాల్గొన్న ఆయన కేసీఆర్ పైనా విమర్శలు చేశారు. కేంద్రంలో మోడీ తీసుకున్ననిర్ణయాల వల్ల అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ అన్నారు. దేశంలో అమలు చేస్తున్న జీఎస్టీ వల్ల చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయారని ఆయన ఆరోపించారు. రైతుల రుణాలు మాఫీచేయని బీజేపీ ప్రభుత్వం విజయ్మాల్యాకు చెందిన 9వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీచేసిందని రాహుల్ ఆరోపించారు. బ్యాంకులను మోసంచేసి విజయ్మాల్యా, నీరవ్మోడీలాంటి ఆర్ధికనేరగాళ్లు దేశం విడిచిపారిపోవటానికి మోడీ ప్రభుత్వం సహకరించిందని ఆయన చెప్పారు. రక్షణమంత్రి ప్రమేయం లేకుండా యుధ్దవిమానాల తయారీని రిలయన్స్కు అప్పగించారని, హెచ్ఏఎల్ తయారు చేయాల్సిన యుధ్దవిమానాలను అంబానీలకు అప్పగించి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని రాహుల్ గాంధీ మోడీని విమర్శించారు. మోడీ అవినీతిని గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పాల్సిన పరిస్దితి వచ్చిందని చెపుతూ రాహుల్ గాంధి, రాఫెల్ కుంభకోణం వ్యవహారాలను చెప్పుకొచ్చారు. ధనికులైన తన మిత్రులు లబ్ది పొందేందుకే మోడీ  పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్రమోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్నికేసీఆర్ సమర్ధించారని, పార్లమెంట్లో కూడా టీఆర్ఎస్ బీజేపీకి మద్దతిస్తోందని రాహుల్  చెప్పారు.

06:39 - September 25, 2018

ఢిల్లీ : భారత్‌లో దోచుకున్నవాడికి దోచుకున్నంతగా అన్న చందంగా మారిపోయింది. స్కామ్ లు, ప్రజాధనాన్ని దోచుకునే తెలివితేటలు వుంటే చాలు లక్షలాది కోట్లు దోచేసుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా నేతల అండదండులంటే చాలు. మరే పెట్టుబడి అవరమేలేదు. వేలాది, లక్షలాది కోట్లు దోచేసుకుని బడా వ్యాపారస్తులా చలామణి అవుతు విదేశాలకు చెక్కేస్తున్నారు. దీని ప్రభుత్వం కూడా తమ వంతుగా సహకరిస్తున బడాబాబులు కొమ్ముకాస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో మరో విజయ్ మాల్యా ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
వ్యాపారవేత్త విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తరహాలోనే మరో వ్యాపారవేత్త ప్రభుత్వ రంగ బ్యాంకులకు షాకిచ్చాడు. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర భారత్ నుంచి నైజీరియాకు చెక్కేశాడు. ఇప్పటికే సీబీఐతో పాటు ఈడీ కేసులు ఉన్నప్పటికీ నితిన్ భారత్ నుంచి చల్లగా జారుకోవడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.
గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో నితిన్‌తో పాటు కంపెనీలో భాగస్వాములుగా ఉన్న అతని కుటుంబ సభ్యులపై సీబీఐ, ఈడీలు కేసును నమోదుచేశాయి. దీంతో విచారణను తప్పించుకునేందుకు నితిన్ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. తొలుత నితిన్‌ను దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదనీ, ఇప్పటికే నితిన్ కుటుంబం నైజీరియాకు వెళ్లిపోయిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. బ్యాంకుల నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న నితిన్ ఈ మొత్తాన్ని 300 డొల్ల కంపెనీల ద్వారా దేశవిదేశాల్లోని అకౌంట్లలోకి అక్రమంగా మళ్లించాడని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే రూ.4,700 కోట్ల విలువైన స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తులను జప్తు చేసింది. కాగా, ప్రస్తుతం నైజీరియాలో తలదాచుకున్నారని భావిస్తున్న నితిన్ కుటుంబాన్ని భారత్ కు రప్పించేందుకు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులను జారీచేసే అవకాశముందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

 

09:30 - July 6, 2018

ఢిల్లీ : బ్యాకులకు కోట్లాది రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాకు యూకే హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌ లోని మాల్యా ఇంట్లోకి వెళ్లి అక్కడున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టు వీలు కల్పించింది. 13 భారతీయ బ్యాంకులు వేసిన కేసును హైకోర్టు విచారణ జరిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, ఆయన ఏజెంట్లు హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని మాల్యా ఉంటున్న భవనాల్లోకి సోదాలు నిర్వహించడానికి అనుమతించింది. టెవిన్‌లోని లేడీవాక్, బ్రాంబిల్ లాడ్జ్‌లలో మాల్యా ఆస్తులు ఉన్నాయి. 9 వేల కోట్ల రుణాలను రికవరి చేసేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ బ్రయాన్ జూన్ 26న ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం కల్పించాలని కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లో మాల్యా పిటిషన్ దాఖలు చేశాడు.

20:27 - June 18, 2018

దొంగలకు సర్ధి కడుతున్న దేశం..భారతదేశపు దొంగలకు ఆశ్రయమిస్తున్న ఇంగ్లండ్..ఎమ్మార్వో ఆపీసుకాడికి ఇనిపించేత దూరంలో వున్న చెరువు. అక్కినేని నాగార్జునను గతంతో గ్రీకు వీరుడు కాదు తెలంగాణ గీకుల వేరుడు అన్న కేసీఆర్ ఇప్పుడు తండ్రీ,కుమారుడు కలిసి అలయ్ బలయ్ తిరుర్గతన్నరు. అధికార పార్టీ ఎంపీపీ కావరం..మహిళలను గుండెలపై తన్నిన ఎంపీపీ ఇమ్మడి గోపి..బహుజనులంతా ఒకటైన బహుజనులు..నిజామాబాద్ జిల్లాల ఏకతాటిపైకొచ్చి 30ఏళ్ల సంది బహుజనులే సర్పంచులుగా నెగ్గుతుండట..తొవ్వంటా బోయే జనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న వసూలు రాజా..వసూలు రాజాగా మారిన ఏఆర్ కానిస్టేబులు బాలూ నాయక్.

21:52 - December 4, 2017

లండన్ : భారత్‌కు అప్పగింత కేసుకు సంబంధించి కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా లండన్‌ కోర్టుకు హాజరయ్యారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఈ సందర్భంగా మాల్యా అన్నారు. కోర్టు ముందే తాను అన్ని విషయాలు వెల్లడించినున్నట్లు పేర్కొన్నారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యా విచారణ కొనసాగుతోంది. సీబీఐ, ఈడీకి చెందిన అధికారులు విచారణకు హాజరయ్యారు. భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా గత రెండేళ్ల నుంచి లండన్‌లో తలదాచుకుంటున్నారు

Pages

Don't Miss

Subscribe to RSS - విజయ్ మాల్యా