విటమిన్స్

15:14 - June 2, 2018

మనం రోజు తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడటంలోను..మన శరీరానికి శక్తినివ్వటంలోను ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయంపై చాలామందికి పెద్దగా అవగాహన వుండదు. శ్రద్ధ కూడా వుండదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆసక్తి కూడా వుండదు. ఆరోగ్యం వుంటేనే ఆనందం వుంటుంది. శరీరం ఆరోగ్యంగా వుంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధ..మరికొంత సమయం కేటాయింపుతో మనం ఆరోగ్యంగా వుండటమేకాక..భావి తరాలకు కూడా ఆరోగ్యాన్ని వారసత్వంగా ఇవ్వవచ్చు. ఆరోగ్యకరమైన వారసత్వం సమాజానికి చాలా అవసరం. దేశప్రగతిలో ముందుకు సాగాలంటే ఆరోగ్యకరమైన మనుషులు దేశానికి వెన్నెముకలాంటివారు అనటంలో ఎటువంటి సందేహం లేదు..

బరువు బ్యాలెన్స్ కోసం మొలకలు..
బరువు తగ్గాలను కొన్న లేదా బరువు పెరగ కుండా బాలెన్స్‌ చేసుకోవాలన్న క్యాలరీలతో సంబంధం లేకుండా పనికొచ్చే ఆహారం మెలకలు . అందుకే మొలకల్లి సూపర్‌ ఫుడ్‌ అంటారు . క్రమం తప్పకుండా మొలకలు తింటే జీవన శైలిలో ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి.

మొలకల్లో వుండే విటమిన్స్, మినరల్స్..
విటమిన్ సి, కె , లు వుండే ఈ పెసలు శిరోజాల ఎదుగుదలకు సహకరిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. కాబూలీ శెనగలు స్త్రీ పురుషులు ఇద్దరికి మంచి ఆహారం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది . పుష్కలంగా పీచు పదార్ధం ఉంటుంది . డైటింగ్‌ చేసేవాళ్లు కూడా తినవచ్చు. నల్ల శనగలు కూడా బరువును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ ఉండదు. చర్మసమస్యలకు,డయాబెటీస్‌ నియంత్రణకు ఉపకరిస్తాయి. బీన్స్‌ మొలకల్లో ఎమినోయాసిడ్స్‌, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ప్రోటీన్లు,విటమిన్లు జింక్‌ ఉంటాయి కనుక మంచి పోషకాహారం.

మొలకలు ప్రత్యామ్నాయం..
ఇవి తిన లేమనుకొంటే రుబ్బేసి ఏ దోసల్లాగో లేదా పరోటాల్లోనో కలుపుకుని గానీ కూరల్లో వేసి గాని ఎలాగోలా తినవలసిన అవసరం ఎంతోవుంది. మెలకలకు మించిన ఆహారం ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. మనం రోజు వారి తినే ఆహారంలో మెులకలను చేర్చుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు తినవచ్చు. వీటిలో విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శుధ్ది చేస్తాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరం చైతన్యమై నిత్యయవ్వనంగా కనిపిస్తారు. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

గింజలుగా వున్నప్పుడు కంటే మొలకెత్తిన తరువాత పెరిగే శక్తి..
గింజలను మెులకెత్తించినుపుడు వాటిలో పోషక స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా పెసలు, మినుములు, శనగలు, బొబ్బర్లు, గోధుమలు, వేరుశనగ, బఠానీలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

జీర్ణక్రియను పెంచే మొలకలు..
పోషకాల నిధి మెులకెత్తిన గింజలలో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు ఉంటాయి. మెులకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. ఆరోగ్యానికి హానికరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి మొలకల్లో అస్సలు ఉండవు.

ఆరోగ్యవంతమైన బిడ్డలు..
మెులక ధాన్యాలలో ఎ, బి కాంప్లెక్స్, సి విటమిన్లు అత్యధికంగా కనిపిస్తాయి. మెులకలలో క్షార గుణం ఉంటుంది. మెులకలను గర్భిణీ స్త్రీలు తింటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. మెులకలలో పీచు పదార్ధం ఎక్కువుగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. మెులకెత్తేటప్పుడు విటమిన్ ఎ రెండు రెట్లు, విటమిన్ బి,సిలు ఐదు రెట్లు అధికంగా లభ్యమవుతాయి. ఖనిజ లవణాలు అయిన ఇనుము, ఐరన్, ఫాస్పరస్, జింక్ శరీరానికి సులభంగా అందుబాటులో ఉండేలా తయారవుతాయి. పళ్లు, ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. రక్తహీనత కూడా దరిచేరదు.

14:56 - June 12, 2017

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు..వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఏదో ఒకటి అల్పాహారం కాకుండా విటమిన్స్..పోషకాలు అందించే టిఫిన్ తీసుకుంటే బెటర్. అందులో 'గోధుమరవ్వ' ఒకటి. దీనితో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇందులోని పోషకాలు పుష్కలమైన ఆరోగ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు..పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే రోజాంతా ఉత్సాహంగా ఉంచుతుంది. చాలా సమయం పాటు ఆకలిని తగ్గిస్తుంది. షుగర్ ఉన్న వారికి ఇది సరైన ఆహారం అని చెప్పవచ్చు. దీన్లోని తక్కువ గ్లైసేమిక్‌ ఇండెక్స్‌, కాంప్లెక్స్‌ కార్బ్స్‌ శరీరం లోకి గ్లూకోస్‌ ను నియంత్రిస్తాయి. దీనితో షుగర్‌ లెవెల్స్‌ సమతూకంలో ఉంటాయి.

12:25 - May 17, 2017

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలు రకాల ఆకు కూరల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయి. అలాంటి ఆకు కూరల్లో పొన్నంగంటి కూడా ఒకటి. ఇందులో విటమిన్ ఏ, బి 6, సి, ఫొలేట్, రైబో ఫ్లెవిన్, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఆహారంలో దీనిని భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కంటి చూపుకు ఎంతో దోహదం చేస్తుంటుంది. గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే. పొన్నగంటి ఆకులను ఓ
గ్లాస్‌ నీటిలో ఉడికించి, మిరియాల పొడిని కలుపుకొని తాగితే ఆ సమస్య నుండి దూరం కావచ్చు.
శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు.
పొన్నగంటి కూరలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ..ఆస్టియో పోరోసిస్ ను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులో లభించే నూనె పదార్థాలు రక్తపోటును తగ్గించి, గుండె సమస్యలను అదుపులో ఉంచుతాయి.
బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

15:12 - October 31, 2016

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు పరుగులే..పరుగులు. కాలంతో పాటు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భార్య..భర్తలిద్దరూ ఉద్యోగస్తులయితే పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీనితో వారి శక్తిసామర్థ్యాలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. దీనివల్ల నీరసించిపోయి అనారోగ్యాల బారిన పడుతుంటారు. అలాంటపుడు మహిళలు కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే చాలు...తగ్గిపోయినా ఎనర్జీ లెవల్స్‌ మళ్ళీ పుంజుకుని చురుగ్గా ఉంటారు.
ఆకు కూరలు: పాలకూర, మెంతికూర వంటి వాటిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మహిళల ఎనర్జీకి చాలా అవసరం అయ్యే విటమిన్‌ ఎ, విటమిన్‌ సి లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
ఆపిల్స్: ఇందులో ఫైబర్‌, విటమిన్‌ సి, యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి ఎక్కువ ఎనర్జీని అందిస్తాయి. ఈ పండుని మహిళలు తమ రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
గుడ్లు: ప్రోటీనులు అధిక మోతాదులో ఉంటాయి. మాంసాహారంలో ఉండే ప్రోటీన్లు, బి విటమిన్స్, ఐరన్‌ కంటే గుడ్లలో అధికంగా ఉంటాయి. గుడ్లను మహిళలు ప్రతిరోజూ బ్రేక్‌ ఫాస్ట్ గా తీసుకుంటే కావల్సిన ఎనర్జీని పొందుతారు.
అరటి పండ్లు: పొటాషియం, బి విటమిన్‌ అధిక మోతాదులో నిల్వ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను నిదానం చేయడంతోపాటు బ్లడ్‌ షుగర్‌ను స్థిరంగా ఉంచుతాయి.
వీటితో పాటు పుచ్చకాయ, గుమ్మడి, సాల్మన్‌ ఫిష్‌, అల్లం టీ, సిట్రస్‌ పండ్లు, నట్స్, డార్క్‌ చాక్లెట్‌, పప్పులు, బ్రౌన్‌ రైస్‌, పెరుగు, లీన్‌ మీట్‌ తదితరాలు మహిళల్లో ఎనర్జీని పెంచడానికి దోహదపడతాయి. 

13:37 - August 14, 2016

బెండకాయ...ఈ కూరగాయన్ని వివిధ రకాలుగా వండుకోవచ్చు. కొంతమంది బెండకాయలంటే అయిష్టంగా ఉంటారు. కానీ ఈ బెండలో ఎన్నో పోషక పదార్థాలు లభిస్తాయి. బెండ ఔషధపరంగా కూడా ఎంతో ఉపయోగిస్తుంది. ఐరన్..జింక్..ఫైబర్..విటమిన్ ఎ.సి.ఇలు..బీటా కెరోటిన్..పెక్టిన్, ఫోలిక్ యాసిడ్..యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దామా...
శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడమే కాకుండా జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుంది.
గుండకు రక్షణగా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది.
డయేరియా ఉంటే బెండకాయ రసం తీసుకోవాలి. బెండరసం ద్వారా బ్లడ్‌షుగర్ తగ్గేలా చేస్తుంది. అంతేగాకుండా అల్సర్ వ్యాధికి ఔషధంగా పనిచేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది.
శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ పని తీరుకు సాయపడుతుంది.

13:12 - July 19, 2016

అవును మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరియైన ఆహారం తీసుకోవాలి. దానితో పాటు కొంత వ్యాయామాలు చేస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంటారు. అయితే కొంతమంది అధిక పని చేస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. నిద్ర కూడా సరిగ్గా పోరు. ఇలాంటి వారికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది.
వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో విటమిన్ 'సి' ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ, బొప్పాయి, జామ, ఉసిరి..విటమిన్ సి ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచింది.
మిటమిన్ బి 12 శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. మాంసకృత్తులు, కూరగాయాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. రోజుకో గుడ్డు తీసుకున్నా సరిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రొటీన్స్ అనేవి ఒత్తిడిని తగ్గిస్తుంటాయి. గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు తీసుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. కొవ్వు అధికంగా ఉన్న ఆహారానికి దూరంగా ఉంటే మంచింది.
జింక్ ఎక్కువగా ఉండే పప్పులు, గింజలు, బీన్స్, చిరు ధాన్యాల్లో ఉంటుంది. ఇది పిల్లల్లో శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఈ పదార్థాలు ఆహారంలో ఉన్నాయో లేవో చూసుకుంటే సరిపోతుంది.

13:18 - June 19, 2016

ఆహారం..పిల్లల ఎదుగుదలకు పునాది. అవును శారీరక ఎదుగదల కూడా పిల్లలో ప్రమాణాల మేరకు ఉంటుంది. పాలపై ఆధారపడిన వయసు దాటిన తరువాత పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం విషయంలో తల్లిదండ్రులు కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సమతుల ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదగడమే కాకుండా దేహధారుఢ్యం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మూడు నాలుగు నెలల వయస్సు దాటితే ఎదుగుదల వేగం పుంజుకుంటుంది. అందువల్ల వారికి తల్లిపాలతో పాటు పళ్ల రసాలు ఇవ్వాలి. వీటివల్ల జలుబు చేస్తుందని కొందరు అనుకొంటూ ఉంటుంటారు. కానీ ఇది కేవలం అపోహ అని వైద్యులు పేర్కొంటున్నారు. ఉడికించిన కూరగాయల రసం, పప్పుతేట, గంజి వంటి పదార్థాలను ఇవ్వాలి. విటమిన్లు, ఇనుమువంటి ఖనిజ లవణాలు పిల్లలకు లభిస్తాయి.
ఇక ఆరు నెలల నుండి పండ్ల రసాలతో పాటు మెత్తగా ఉడికించిన ధాన్యాలు, పప్పులు, చిక్కటి గంజి, ఉడికించిన కూరగాయలు, అరటి, బొప్పాయి, ఆపిల్, మామిడి తదితర పండ్లను గుజ్జుగా చేసిన తినిపించాలి. ఆరు, ఏడు నెలలకు పిల్లలకు ధాన్యం, పప్పు, బెల్లం కలిపి చేసిన మిశ్రమాన్ని ఆహారాన్ని ఇవ్వాలి. మొలకలను ఆరబెట్టి పిండి చేసి అనుబంధంగా ఆహారంగా ఇస్తే బాగుంటుంది.
తొమ్మిది, పది నెలలనుంచి కిచిడీ, అటుకులు, ఇడ్లీ, ఉడికించిన మాంసం, చేపలు తాలింపు, కారం లేకుండా తినిపించాలి.
పదకొండు, పన్నెండు నెలలలో పెద్దలు తీసుకునే ఆహారాన్ని కొంచెం మెత్తగా కారం, మసాలాలు లేకుండా పెట్టాలి. ఈ వయసులోనే అన్ని రకాల ఆహార పదార్థాలను పిల్లలకు అలవాటు చేయాలి.
సరియైన ఆహారాన్ని అందించకుండా లేనిపోని అపోహలు, అర్థం లేని అనుమానాలు పెంచుకుంటూ ఉంటారని, పిల్లల ఎదుగుదలను అడ్డుకోవడం అవివేకమే అవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

15:48 - June 14, 2016

జామపండు..మార్కెట్లో లభించే పండ్లలో అత్యంత పోషక విలువు కలిగినది. దీనిని తరచూ తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.
శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించడానికి ఈ పండు ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు కూడ పెరుగుతుంది.
జామపండు గుజ్జును ముఖానికి రాసుకుని మృదువుగా మర్ధన చేసుకుని ఇరవై నిమిషాల అనంతరం కడిగేయాలి.
జామలో పీచు పదార్థాలు ఉండడం వల్ల జీర్ణక్రియ వృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఇందులో గ్లూకోజ్ స్థాయి చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది బరువు తగ్గేందుకు కూడా సహాయ పడుతుంది.
జామలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహంతో బాధ పడుతున్న వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.

07:36 - April 18, 2016

కాపర్‌ శరీరానికి అత్యంత ముఖ్యమైన మినరల్‌. రాత్రంతా రాగి పాత్రలో నీటిని ఉంచి ఉదయాన్నే తాగడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పురాతన కాలం నుంచి మన ఇండియన్స్ పాటిస్తున్న అద్భుతమైన చిట్కా. కనీసం ఎనిమిది గంటలపాటు రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కాపర్‌ నీటిని ప్యూరిఫై చేసి.. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే ఆ నీళ్లు సహజంగా శుద్ధి అయినట్టు.
థైరాయిడ్‌ సంబంధిత సమస్యలకు కాపర్‌ డెఫిసియెన్సీ ప్రధాన కారణం. కాబట్టి రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్‌ సమస్యలు నివారించవచ్చు.

  • కాపర్‌లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది జాయింట్‌ పెయిన్స్‌ నివారించడంలో సహాయపడుతుంది.
  • కాపర్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి. అలాగే కొత్త కణాలు ఉత్పత్తి చేయడంలో సహకరిస్తాయి. కాబట్టి రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల ఎలాంటి గాయాలైనా త్వరగా తగ్గిపోతాయి.
  • మెదడులో అనేక రకాల ఎంజైమ్స్‌ పనిచేయడానికి కాపర్‌ చాలా అవసరం. అలాగే రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు రాకుండా నివారించి చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
  • రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల శరీరానికి కావాల్సిన కాపర్‌ అంది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. రాగి పాత్రల్లో నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఈ పద్ధతి పాటిస్తారు.
  • గర్భధారణ సమయంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి రాగి పాత్రలో నీళ్లు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్, అనారోగ్య సమస్యలు రాకుండా హెల్దీగా, యాక్టివ్‌గా ఉంటారు.
  • కాపర్‌ శరీరానికి కావల్సిమైన చాలా ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్‌ ప్రాపర్టీస్‌ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది క్యాన్సర్‌ కణాలతో పోరాడుతుంది.
  • చర్మంపై ముడతలు, గీతలు, ప్యాచ్‌లను నివారించి చర్మం నవ యవ్వనంగా కనిపించడానికి కాపర్‌ ఉపయోగపడుతుంది.
  • రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిపోతాయి. ఇది బరువు తగ్గడానికి, అల్సర్‌ నివారణకు సహాయపడుతుంది. అల్సర్‌కు కారణం అయ్యే బ్యాక్టీరియాను డైజెస్టివ్‌ ట్రాక్‌ నుంచి తొలగిస్తుంది.
  • అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ ప్రకారం రక్తపోటు, హార్ట్ రేట్‌ నియంత్రించడానికి రాగి సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలు తగ్గిస్తుంది. గుండెకు రక్తం సజావుగా అందడానికి సహాయపడుతుంది. 
15:18 - April 1, 2016

ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి. రష్యాలో గొర్రెలు,మేకలు పాలనించి కూడా పెరుగు తయారుచేస్తారు. పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మనం తీసుకున్న తర్వాత 1 గంటలో పెరుగు 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.

పెరుగులో వాము కలుపుకుని సేవిస్తే మలబద్ధకం తగ్గి ఉపశమనం కలుగుతుంది. వేసవి కాలంలో పెరుగుతో చేసిన మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని లస్సీలాగా సేవిస్తే శరీరంలో వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఎండల్లో తిరిగేవారు లస్సీని సేవిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్య నిపుణులు.

పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు పెరుగును సేవించడం వలన ఉదరసంబంధిత జబ్బులు మటు మాయమౌతాయి. జలుబు, శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడేవారికి పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది.

అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నోట్లో పొక్కులు ఏర్పడి నోరుపుండైతే పెరుగును నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు..

చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.

ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.

పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.

ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.

పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.

చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

పెరుగు ప్రతి రోజు ముఖానికి రాసి ఒక పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మృదువుగా అందంగా కాంతివంతంగా అవుతుంది.

పెరుగులో పోషకపదార్థాలు

నీటిశాతం 89.1%

ప్రోటీన్ 3.1%

క్రొవ్వులు 4%

మినరల్స్ 0.8%

కార్బొహైడ్రేట్స్ 3%

కాల్షియం 149 మి.గ్రా

ఫాస్పరస్ 93 మి.గ్రా

ఇనుము 0.2 మి.గ్రా

విటమిన్ - ఎ 102 ఐ.యు

విటమిన్ - సి 1 మి.గ్రా

Pages

Don't Miss

Subscribe to RSS - విటమిన్స్