విన్నర్

11:14 - September 23, 2017

మెగాస్టార్ కాంపౌండ్ నుండి వచ్చి తనదైన స్టైల్లో సినిమాలు చేస్తున్న 'సాయి ధరమ్ తేజ్'...మరో చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇతను బీవీఎస్ రవి దర్శకత్వంలో 'దిల్' రాజు సమర్పణలో తెరకెక్కుతున్న 'జవాన్' సినిమాలో నటిస్తున్నాడు. 'మెహ్రీన్ ఫిర్జాదా' హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన నటించిన 'నక్షత్రం' సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీనితో హిట్ కొట్టాలని 'సాయి ధరమ్ తేజ' భావిస్తున్నాడు.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధిచడంతో మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలతో సినిమా చేయాలని 'వినాయక్' యోచించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 'సాయి ధరమ్ తేజ'తో సినిమా తీయాలని..అందుకు 'ఖైదీ నెంబర్ 150' ముందుగానే కథ సిద్ధం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో సాయి ధరమ్ తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై పోయింది. వినాయక్ తో దిగిన ఫొటోను సాయి ధరమ్ తేజ ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు. 'వినాయ‌క్ గారితో తొలి రోజు ప‌ని చేస్తున్నాను.. క‌ల నిజ‌మైంది.. గొప్ప అవ‌కాశం ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు' అని ట్వీట్ చేశాడు. తేజ స‌ర‌స‌న 'లావ‌ణ్య త్రిపాఠి' నటించనుందని తెలుస్తోంది. ఈ మూవికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

20:30 - September 22, 2017

అరవై కెమేరాలు..అనుక్షణం పరిశీలించే కళ్లు.. కోట్లాది ప్రేక్షకులు.. చివరకు మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు.. వెరసి ఇప్పుడు సీజన్ వన్ టైటిల్ ఎవరిదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. బిగ్ బాస్ షో మొదలయ్యేపుడు..ఈ గందరగోళం తెలుగులోకి కూడా వచ్చిందా అనే వాదనలు వినిపించాయి. ప్రేక్షకుల్లోని వాయరిస్టిక్ ఇంట్రస్ట్ ని రేటింగ్ మార్చుకునే ఈ ప్రోగ్రామ్ ఇతర భాషల కంటే తెలుగులో కాస్త క్లీన్ గానే సాగిందనే ఇంప్రెషన్ తెచ్చుకుంది. 

బతకటానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ నో సెల్‌ఫోన్, నో టీవీ, నో న్యూస్ పేపర్. వర్చువల్ లివింట్ ఎన్వైర్ మెంట్. బయటి ప్రపంచంతో అసలు ఎలాంటి సంబంధాలు లేని పరిస్థితి. కానీ, తలుపుసందులోంచి చూసే వాడికి కలిగే ఆనందాన్ని నిద్రలేపి క్యాష్ చేసుకునే ఈ ప్రోగ్రామ్ ఫార్మాట్ తెలుగులోనూ మంచి ఫాలోయింగే సాధించింది. ఇప్పుడు టెలివిజన్ చరిత్రలో మొదటి సారి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షో బిగ్ బాస్. హిందీలో సల్మాన్ తో నడిచిన ఈ షో కోసం తెలుగులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ తారక్ కు అప్పజెప్పారు. అయితే అప్పటి వరకు బుల్లి తెర మీద ఎలాంటి షోలు చెయ్యని తారక్ బిగ్ బాస్ షోని ఎంతవరకు లాగగలడు అని అందరు అనుకున్నారు. మరి జూనియర్ తన ప్రతిభతో బుల్లి తెరపై కూడా విశ్వరూపాన్ని చూపించాడనిపించుకున్నాడు. బిగ్ బాస్ షోమొదటి సీజన్ లో తారక్ రోల్ కు మంచి మార్కులే పడ్డాయి


బిగ్ బాస్ షో..దేశ విదేశాల్లో ఈ షోకున్నంత ఆదరణ.. మరే టీవీ రియాల్టీషో కి రాలేదంటే అతిశయోక్తి కాదు.. అదే సమయంలో దీనిపై విమర్శలూ అదే రేంజ్ లో వచ్చాయి.. తెలుగులో కాస్త ప్రశాంతంగానే నడిచిన బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ వన్ గెలుపెవరిదా అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో రేకెత్తిస్తోందివినోదానికి అర్ధాలు, రూపాలు మారుతున్న కాలం. కొన్ని టీవీ షోలు బూతు డైలాగులను, డబుల్ మీనింగ్ పంచ్ లనే ఎంటర్ టెయిన్ మెంట్ గా భావిస్తున్న పరిస్థితి ఇప్పుడుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. పక్కింటి కబుర్లు తెలుసుకోవాలనుకునే సాధారణ మనిషిలోని ఉత్సాహాన్ని నిద్రలేపటంలో కొంత వరకు సక్సెస్ అయింది. ఇప్పుడీ గేమ్ లో టైటిల్ విజేత ఎవరో త్వరలో తేలనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

11:08 - September 19, 2017

టాలీవుడ్ లో పండుగలకు విశేష స్థానం ఉంటుంది. తమ తమ చిత్రాలను ఆయా పండుగల్లో రిలీజ్ చేయాలని హీరోలు అనుకుంటుంటారు. దసరా..సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రముఖ హీరోల సినిమాలు విడుదలవుతుంటాయి. దీనితో ఆ సినిమాలపై తెగ చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక 2017 దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరోస్ 'మహేష్ బాబు', 'ఎన్టీఆర్' చిత్రాలు కొద్ది రోజుల తేడాతో రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 21న 'ఎన్టీఆర్' నటించిన 'జై లవ కుశ' వస్తుంటే 'మహేష్ బాబు' నటించిన 'స్పైడర్' సెప్టెంబర్ 27న విడుదలవుతోంది. దీనితో వీరి సినిమాల్లో ఎవరిది పై చేయి అవుతుందనే చర్చ జరుగుతోంది.

వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న యంగ్ టైగర్ బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' లో నటించాడు. సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో 'ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలను పోషించడంతో చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. టీజర్స్..ట్రైలర్స్..పోస్టర్ చూస్తుంటే పక్కా మాస్ మసాలా చిత్రమని అర్థమౌతోంది. 'జై లవ కుశ' రొటీన్‌ ఎలిమెంట్స్ తో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో మాస్‌ని నమ్ముకున్నారని తెలుస్తోంది.

ఇక 'స్పైడర్' విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సామాజిక అంశాన్ని ఆయన చిత్రాల్లో సృషిస్తుంటారనే సంగతి తెలిసిందే. స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. రెగ్యులర్ అంశాలకు భిన్నంగా పూర్తిగా భిన్నమైన సెటప్ తో చిత్రం ఉందని టాక్ వినిపిస్తోంది. జేమ్స్ బాండ్ తరహాలో మహేష్ నటించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా అభిమానులను ఆకట్టుకొంటోంది.

ఈ చిత్రాలపై విపరీతమైన నమ్మకంతో బయ్యర్లు కోట్లు ధారపోసేశారంట. రెండింటి మధ్య క్లాష్ ఉన్నా ఆరు రోజుల వ్యవధి అంటే చాలా వరకు ఎఫెక్ట్ తగిస్తుందని తెలుస్తోంది. తొలి వారం కలెక్షన్లు చాలా కీలకమని..ముందుగా వస్తున్న జై లవ కుశపై కానీ..తరువాత వచ్చే 'స్పైడర్' పై కానీ మొదటి వారం వసూళ్ల పరంగా ప్రభావం ఉండకపోవచ్చని టాక్. మరి ఈ బరిలో విజేతగా నిలిచేదెవరు? దసరా బాక్సాఫీస్‌ని గెలిచేదెవరు ? 

21:14 - September 16, 2017

హైదరాబాద్ : ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. షో ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా మొత్తం 14 మంది పార్టిసిపెంట్స్‌తో మొదలైన షోలో మరో ఇద్దరు పార్టిసిపెంట్స్  వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 10 మంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం ఆరుగురు షోలో ఉన్నారు. అయితే వీరిలో  బిగ్‌ బాస్‌ విన్నర్ ఎవరు? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ..

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 1 క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇప్పటికి 60 ఎపిసోడ్‌లను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 14 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 16న ప్రారంభమైన బిగ్ బాస్ జర్నీ 60 ఎపిసోడ్‌కి వచ్చేసరికి కేవలం ఆరుగురు మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వీరిలో నవదీప్, దీక్షలు షో మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటరైనప్పటికీ  మిగిలిన వారికి గట్టి పోటీ ఇస్తున్నారు. 

బిగ్‌బాస్‌ హౌస్‌లో మొదట అర్చన, సమీర్, ముమైత్, ప్రిన్స్, మధుప్రియ, సంపూర్ణేష్‌ బాబు, జ్యోతి, కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివబాలాజీ, హరితేజ, ఆదర్శ్‌, ధనరాజ్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో జ్యోతి, సంపూర్ణేష్‌ బాబు, మధు ప్రియ, సమీర్, మహేష్ కత్తి, కల్పన, ధనరాజ్, కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నవదీప్, దీక్ష మిగిలిన కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తూ గేమ్‌ ఆడుతున్నారు. వారం వారం కెప్టెన్ ని ఎంచుకునే ప్రక్రియ, ఎలిమినేషన్ ప్రక్రియలతో పాటు బిగ్ బాస్ ఇచ్చే రకరకాల టాస్క్‌లతో బిగ్‌ బాస్‌ హౌస్‌ ఉత్కంఠ రేపుతోంది. ఇక వారానికో సెలబ్రిటీ గెస్ట్‌గా వచ్చి బిగ్‌ బాస్ హౌస్‌లో సందడి చేస్తున్నారు. 

చివరి దశలో బిగ్ బాస్ షోను మరింత రక్తి కట్టించేందుకు గేమ్ నిర్వాహకులు కంటెస్టెంట్స్  ఫ్యామిలీలను రంగంలోకి దించారు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఒక్కొక్క కంటెస్టెంట్స్  ఫ్యామిలీ మెంబర్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కావడంతో కంటెస్టెంట్స్ అందరూ  తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం బిగ్ బాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఆదర్శ్ , హరితేజ, శివబాలాజీ, దీక్ష, అర్చన, నవదీప్ టైటిల్ పోరు కోసం హోరా హోరీగా తలపడుతున్నారు. వీరిలో ఈ వారం ఆదర్శ్, హరితేజ, దీక్ష, అర్చన ఎలిమినేషన్‌ ప్రక్రియకి ఎంపికయ్యారు. షో చివరి దశకు చేరేవేళకి.. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌ రూల్స్‌ అతిక్రమించకుండా అందరూ విధిగా పాటిస్తున్నారు. 

బిగ్ బాస్ హౌస్‌లో ఓటింగ్ ప్రక్రియ సైతం రంజుగా సాగుతోంది. ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోందని ఎన్టీఆర్ ఇంతకు ముందు చాలా సార్లు చెప్పారు. ప్రతి ఓటును పీడబ్ల్యుసి అనే సంస్థ ద్వారా ఆడిటింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నవదీప్, శివబాలాజీ ఫైనల్‌కి తమ పేరును ఖరారు చేసుకోగా.. ఈ శనివారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో ఆదర్శ్, అర్చన, హరితేజ, దీక్ష ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో? ఎవరు ఫైనల్‌కి చేరతారో? సస్పెన్స్..

ఇప్పటికే ప్రేక్షకుల్లో ఫైనల్ విన్నర్ ఎవరు అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. హరితేజ, శివబాలాజీల్లో ఒకరని.. నవదీప్, ఆదర్శ్ కావచ్చని.. ఇలా రకరకాల పేర్లు వినబడుతున్నాయి. ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తూ.. గేమ్‌ను ఆడుతున్న వీరిలో బిగ్ బాస్ ఫైనల్ విజేత ఎవరన్నది తెలియాలంటే  వచ్చే ఆదివారం వరకూ వెయిట్ చేయాల్సిందే.  

18:41 - February 24, 2017

టుడే అవర్ రీసెంట్ రిలీజ్  "విన్నర్ ’'. 'సాయి ధరమ్ తేజ్'  హీరోగా నటించిన ‘విన్నర్ ’ సినిమా ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది. 'పిల్ల నీవు లేని జీవితం' సినిమాతో తన ఫిలిం కెరీర్ ని స్టార్ట్ చేసిన మెగా ఫామిలీ హీరో 'సాయి ధరమ్ తేజ్'.  యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ తో 'విన్నర్' గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మెగా ఫామిలీలో చాల స్పీడ్ గా సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైన హీరో 'సాయి ధరమ్ తేజ్'. 'విన్నర్' సినిమాలో తన ప్రేమను గెలిపించుకునే ప్రేమికుడిగా యాక్ట్ చేసాడు.

డైరెక్టర్ గోపిచంద్..
యాక్షన్ లో లవ్ మిక్స్ చేసి మాస్ ని అట్రాక్ట్ చెయ్యగల డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇతని  డైరెక్షన్ లో వచ్చిన విన్నర్ వరల్డ్ వైడ్ గా ఇవాళ  రిలీజ్ అయింది. ఎనర్జిటిక్ హీరో సాయిధరమ్ తేజ్, బ్యూటీ టాలెంటెడ్ రకుల్ ప్రీత్ సింగ్, ట్రెండీ విలన్ జగపతిబాబు   నటించిన ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మాతలు. ఈ సినిమా కి  థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళింది. ఒక క్యూట్ లవ్ స్టోరీకి హార్స్ రేస్ ని కనెక్ట్ చేసి ఆడియన్స్ని కట్టిపడేసే ప్రయత్నం చేసాడు డైరెక్టర్.

మంచి రెస్పాన్స్..
ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లోనే పవర్ఫుల్ డైలాగ్స్ ని చూపించిన 'సాయి ధరమ్ తేజ్' మంచి మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 'రకుల్ ప్రీత్ సింగ్' అథ్లెట్ గా నటించిన ఈ సినిమాలో స్క్రీన్ మీద గ్లామర్ ని స్ప్రెడ్ చేసింది. ఈ సినిమాలో జగపతిబాబుతో పాటు అనూప్ ఠాకూర్ మరో విలన్ గా నటించారు. మరి ఈ ‘విన్నర్ ’ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసింది ? ఎంత వరకు రీచింగ్ అయ్యింది ? టెన్ టివి రేటింగ్ ఎంతో వీడియో క్లిక్ చేయండి.

09:53 - February 14, 2017

మెగాస్టార్ కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో ఒకరు 'సాయి ధరమ్ తేజ'. తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'విన్నర్' విడుదలకు సిద్ధంగా ఉంది. 'సాయిధరమ్ తేజ్', 'రకుల్‌ప్రీత్ సింగ్' జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు లు 'విన్నర్' సినిమాను నిర్మించారు. ఈ చిత్రాల్లోని పాటలను ఒక్కో హీరో..ఇతర ప్రముఖులతో విడుదల చేయిస్తున్నారు. ఇటీవలే హీరో మహేష్ బాబు ఒక పాటను విడుదల చేయగా తాజాగా మరో పాటను మాస్ రాజ 'రవితేజ' విడుదల చేయనున్నారు.
'జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ చిత్రం కథకు సరైన టైటిల్' అని ఇటీవలే గోపీచంద్ మలినేని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో పలు విశేషాలు దాగున్నాయి. హాట్ యాంకర్ గా పేరొందిన 'అనసూయ' ఈ చిత్రంలో ఓ పాటకు నర్తిస్తోంది. 'సుయ..సుయ' అనే పాటనే యాంకర్ 'సుమ' పాడం విశేషం. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు 'విన్నర్' రానుంది. 

15:14 - February 10, 2017

టాలీవుడ్ అయినా..బాలీవుడ్ అయినా..ఇండస్ట్రీ ఏదైతేనేంటి ఐటెం సాంగ్స్ తప్పనిసరి అయిపోయింది. స్టోరీలు లేకపోయినా సినిమాలు తీస్తున్నారు గాని ఐటెం సాంగ్ లేనిదే సినిమా కష్టం అనే పరిస్థితి కొంతమంది డైరెక్టర్స్ లో కనిపిస్తుంది. ఇదే ట్రెండ్ కి ప్రొడ్యూసర్స్ కూడా ఓకె అనేస్తున్నారు. కధ ఏదైనా, కథనం ఎలా ఉన్న ఒక ఐటెం నెంబర్ పడాల్సిందే. ఐటెం సాంగ్స్ అంటే పాపులారిటీ, క్రేజ్, పబ్లిసిటీ ఏ సెంటర్ నుండి సి సెంటర్ వరకు ఆడియన్స్ ని ఎంటెర్టైన్ చేసే మాస్ బాంబ్స్ ఈ ఐటెం సాంగ్స్. సినిమా ఇండస్ట్రీ లో ఇంతకుముందు స్పెషల్ గా ఐటెం సాంగ్స్ లో నటించి, నర్తించడానికి డాన్సర్స్ యాక్ట్రెస్ ఉండే వారు. వారికి ఓన్లీ ఫర్ ఐటెం స్పెషల్స్ గా బ్రాండ్ ఉండేది రాను రాను ట్రెండ్ మారింది. కెరీర్ స్ట్రాంగ్ గా ఉన్న టాప్ హీరోయిన్స్ కూడా ఐటెం నంబర్స్ కి ఓకె చెప్తున్నారు. యాక్టింగ్ లో నెంబర్ వన్ అనిపించుకుంటూనే తమని అభిమానించే ఫాన్స్ కి ఐటెం సాంగ్స్ రూపంలో థాంక్స్ చెప్పుకుంటున్నారు. ఐటమ్స్ సాంగ్స్ తో వచ్చే రీచింగ్ కొన్నిసార్లు కేరక్టర్స్ వేసిన రాదూ అనే ఒక థాట్ కూడా ఉంది.

టాప్ హీరోయిన్స్ సైతం..
ఒక సినిమాలో కనీసం ఐదు పాటలు ఉంటె అందులో ఒక పాట కచ్చితంగా ఐటెం సాంగ్ అవ్వాలన్నది రూల్ లా మారిపోయింది. ఫేమస్ హీరోయిన్ల ఐటెం సాంగ్స్ అంటే ఫాన్స్ కి పండగే. బి సి సెంటర్స్ లో టిక్కెట్స్ తెగే ఫార్ములాలో ఐటెంసాంగ్ కూడా ఒకటి. పాటలో ఊపు, స్టెప్పుల్లో స్పీడ్, ఫుల్ ఎనర్జీతో ఉండే ఐటెం సాంగ్స్ కి సినిమాలో స్పెషల్ ప్లేస్ ఉంది అని ఒప్పుకోవాల్సిందే. ఐటమ్స్ సాంగ్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన రీసెంట్ హీరోయిన్స్ లో శృతిహాసన్, తమన్నా, అంజలి లాంటివారు ఉంటే, జనతా గ్యారేజీ సినిమాతో కాజల్ కూడా ఐటెం నెంబర్లోకి ఎంట్రీ ఇచ్చింది.

అనసూయ..
ఇలా హీరోయిన్స్ తో ఐటెం సాంగ్ చేయించటం ఒక ఫార్ములా అయితే ఇప్పుడూ టివి యాంకర్లతో స్టెప్పులు వేయించడం నయా ట్రెండ్ గా మారింది. యాంకర్ ఉదయభాను, యాంకర్ రేష్మి ఆల్రెడీ తమ సత్తా చూపించేశారు. అదే వే లో వచ్చిన అనసూయ కూడా సోగ్గాడే చిన్నినాయనా లో నాగ్ తో కలిసి స్టెప్పులు వేసిన నలుగురు హీరోయిన్స్ లో కలిసిపోయింది తప్ప సోలోగా సాంగ్ చేసే ఛాన్స్ రాలేదు. కానీ ఇప్పుడూ సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న 'విన్నర్' సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోంది యాంకర్ అనసూయ. సాంగ్ కూడా తన పేరుతోనే మొదలవ్వటం ఈ సాంగ్ ని మరో టివి యాంకర్ సుమ పాడటం సినీ వర్గాల్లో స్పెషల్ టాపిక్ గా మారింది.

08:58 - February 9, 2017

మెగాస్టార్ చిరంజీవితో తీసిన 'ఖైదీ నెంబర్ 150’ సినిమా విజయం వి.వి.వినాయక్ కు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. చిరంజీవి 150వ చిత్రం కావడంతో అభిమానులు..టాలీవుడ్ లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అందరి అంచనాలకు తగ్గట్టే చిత్రం ఘన విజయం సాధించింది. కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే చిత్రం రూ. 150 కోట్లు సాధించిందని తెలుస్తోంది. అనంతరం వి.వి.వినాయక్ తదుపరి చిత్రంపై కసరత్తులు ప్రారంభించాడు. అందులో భాగంగా మెగా కౌంపౌండ్ నుండి వచ్చిన 'సాయి ధరమ్ తేజ్' తో వినాయక్ చిత్రం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కంటే ముందుగానే వినాయక్ ఓ కథను రూపొందించారంట. ప్రస్తుతం 'తేజ్' తో చిత్రాన్ని చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో త్వరలోనే విడుదల కానుంది. అంతేగాకుండా 'జవాన్'..'నక్షత్రం'..సినిమాల్లో నూ కూడా 'తేజ్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల తరువాత వినాయక్ చిత్రం ఉంటుందా ? లేక ముందే ఉంటుందా ? అనేది తెలియరావడం లేదు.

08:58 - February 8, 2017

బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా వెలిగిపోతోంది సుమ. ఎంతమంది కొత్త కొత్త యాంకర్స్ వస్తున్నా బుల్లితెరపై ఆమె స్టార్ డమ్ ఏమాత్రం తగ్గడం లేదు. పాపులర్ యాంకర్ గా కొనసాగుతున్న 'సుమ' ప్రముఖులు నటించిన చిత్ర ఆడియో..విజయోత్సవ వేడుకల్లో యాంకర్ గా కూడా సందడి చేస్తోంది. తన అందమైన నటనతో..చలాకీతనంతో ఈ కేరళ అమ్మాయి ఆకట్టుకొంటోంది. తన మాటలతో ఆకట్టుకొనే 'సుమ' పాటలతో కూడా ఆకట్టుకుంటానని అంటోదంట. తొలిసారిగా 'సుమ' పాట పాడింది. గోపిచంద్ మలినేని తీస్తున్న 'విన్నర్' సినిమాకు గాత్రం అందించింది. ఈ సినిమాలో 'సాయి ధరమ్ తేజ' హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హాట్ యాంకర్ గా పేరొందిన 'అనసూయ' ఈ చిత్రంలో ఓ పాటకు నర్తిస్తోంది. 'సుయ..సుయ' అనే పాటనే 'సుమ' పాడింది. ఈ సినిమాలోని పాటలను ఒక్కో స్టార్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటను మంగళవారం సంగీత దర్శకుడు అనిరుథ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు 'విన్నర్' రానుంది. 

20:55 - February 1, 2017

మెగా మేనల్లుడు కోసం తమిళ హీరో విలన్ గా మారాడు. రీసెంట్ గా స్టార్ట్ అయిన 'సాయిధరమ్ తేజ్' కొత్త సినిమాలో కోలీవుడ్ హీరో విలన్ గా నటిస్తుండడం విశేషం.ఇంతకు ముందే తెలుగులో ఓ రాయివేసిన ఆ తమిళ హీరో, తేజు మూవీతో ఇక్కడే సెట్ అయివాలని ప్లాన్ చేస్తున్నాడు. 'సాయిధరమ్ తేజ్' చడీచప్పుడు లేకుండా కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. రైటర్ టర్న్ డైరెక్టర్ బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో మెగా మేనల్లుడు 'జవాన్’ అనే సినిమా చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ తో ఘనంగా ఆరంభమైన ఈ చిత్రానికి డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. అంతేకాదు ఈ చిత్రంలో తమిళ హీరో విలన్ గా నటించబోతుండడం మరో విశేషం.

ప్రసన్నకు ఛాన్స్.
'జవాన్' సినిమా దర్శకుడు బి వియస్ రవి ఓపెనింగ్ రోజే కాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలిపాడు. ఈ చిత్రంలో తమిళ హీరో 'ప్రసన్న' విలన్ గా నటిస్తున్నాడు. ఈయన ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ 'స్నేహ' భర్తనే. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ 'ప్రసన్న'కు తమిళంలో అవకాశాలు రావడం లేదు. అందుకే తమిళ హీరో ప్రస్తుతం టాలీవుడ్ విలన్ గా రాణించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంతకు ముందు ఆయన 'భాయ్' సినిమాలో 'నాగార్జున'కు తమ్ముడిగా నటించాడు. ఈ సినిమా ప్లాప్ కావడంతో 'ప్రసన్న'కు ఇన్నాళ్లకు మరో అవకాశం వచ్చింది.

విన్నర్..జవాన్..
మెగా కాంపౌండ్ హీరో సినిమా కావడంతో ఇక్కడ పేట్ మారిపోతోందని 'ప్రసన్న' భావిస్తున్నాడు. ఈ సినిమా కనుక హిట్టు అయితే ఆయనకు మెగా హీరోలు వరుసగా ఛాన్స్ లు ఇచ్చి ఎంకరేజ్ చేసినా చేస్తారు. త్వరలోనే షూటింగ్ కి వెళ్లనున్న ఈ చిత్రంలో 'సాయి ధరమ్ తేజ్ ' పక్కన్న 'మెహ్రీన్' కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మెగా హీరో నటిస్తున్న 'విన్నర్' కంప్లీట్ స్టేజ్ కి చేరుకుంది. త్వరలోనే ఈ మూవీ ఆడియోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'జవాన్' గా 'తేజ్' ఎలా కనిపించబోతున్నాడో చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - విన్నర్