విఫలం

21:30 - January 11, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. అసలు దొంగలను వదలి.. పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ కరెన్సీని అరికట్టడంలో.. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. నల్లడబ్బు స్విస్‌ బ్యాంకుల్లోనే కాకుండా.. బంగారం, రియల్‌ ఎస్టేట్‌ రూపంలో ఉందన్నారు.

20:26 - January 4, 2017

హైదరాబాద్ : నల్లధనాన్ని వెలికి తీయడంలో ప్రధాని మోడీ విఫలం అయ్యారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. నోట్లరద్దుపై మోడీ తీరును నిరసిస్తూ హిసాబ్‌ దో.. జవాబ్‌ దో అంటూ హైదరాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ఆయన హాజరయ్యారు. నోట్లరద్దుతో నల్లధనాన్ని అరికడతామని ప్రకటించిన మోడీ... దాన్ని నల్లకుబేరుల నుంచి రాబట్టడంలో విఫలం అయ్యారన్నారు. నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. చేసిన తప్పులపై మోడీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సురవరం డిమాండ్‌ చేశారు. 

21:14 - December 4, 2016
21:44 - November 25, 2016

చెన్నై : నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఆచరణలో ఘోరంగా విఫలమైందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ విమర్శించారు. నోట్ల రద్దును నిరసిస్తూ చెన్నైలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో బృందా కరత్‌ పొల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఐదొందలు, వెయ్యి నోట్లు రద్దు చేసి పదిహేడు రోజులైనా కరెన్సీ కష్టాలు ఇంకా తగ్గలేదన్నారు. పెద్ద నోట్ల మార్పిడికి డిసెంబర్‌ వరకు గడువు ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని బృందా కరత్‌ డిమాండ్‌ చేశారు.

 

19:14 - November 25, 2016

సంగారెడ్డి : నల్లధనం అరికట్టేందుకు కేంద్ర తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా, పర్యవసానాలను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. ఈమేరకు కోదండరామ్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తగినన్ని నగదు నిల్వల్ని రాష్ట్రానికి తెప్పించి సామాన్య ప్రజల కష్టాలను ప్రభుత్వం తీర్చాలని కోరారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:31 - September 4, 2016

హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్‌ పనిచేయడం లేదని తెలంగాణ ప్రజా వేదిక అధ్యక్షులు జస్టిస్‌ చంద్రకుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రజలు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ముఖ్యమైన అంశాలతో మొదలైందని ఆయన గుర్తుచేశారు. ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ ప్రజావేదిక పనిచేస్తుందని జస్టిస్‌ చంద్రకుమార్‌ తెలిపారు. 

15:45 - August 6, 2016

జైపూర్ : గోసంరక్షణకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే బిజెపి ప్రభుత్వాలు వాటిని కాపాడడంలో మాత్రం విఫలమవుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో రెండు రోజుల్లో 90 ఆవులు మృతి చెందడం కలకలం రేపింది. గత రెండు వారాల్లో 5 వందలకు పైగా గోవులు మరణించడంపై హైకోర్టు సీరియస్‌ అయింది. దీనిపై రిపోర్టు ఇవ్వాలని రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆధ్వర్వంలో నిర్వహించే హింగోనియా గోశాలలో 8 వేలకు పైగా ఆవులున్నాయి. వీటి సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రతియేటా 20 కోట్లు బడ్జెట్‌ కేటాయిస్తోంది. గత రెండు వారాలుగా కార్మికులు సమ్మెకు దిగడంతో ఆవులను చూసే దిక్కులేక ఆకలితో అలమటిస్తూ మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయని వైద్యులు చెబుతున్నారు. 

 

19:48 - August 2, 2016

హైదరాబాద్ : బంద్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. బంద్‌ విజయవంతం కావడానికి రాష్ర్ట ప్రభుత్వంపైనా పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఏపీ బంద్‌ను విజయవంతం చేయడానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు. బంద్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు జగన్‌ తెలిపారు. 

 

21:21 - July 2, 2016

హైదరాబాద్ : 'ఆరోగ్యశ్రీ'పై ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో టీసర్కార్ చర్చలు విఫలం అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలతో మంత్రి లక్ష్మారెడ్డి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. రూ. 100 కోట్లు విడుదల చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో హాస్పిటల్స్ ఖాతాలో చేరతాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ప్రకటనపై ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని గత రెండో రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

22:16 - June 26, 2016

హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఆ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సురవరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల పేరుతో ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులు నుంచి వివిధ అంశాంపై విరుచుకుపడ్డారు. ఫిరాయించిన  వివిధ పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ శాసనసభ్యులుగా పరిగణిస్తూ.. స్పీకర్లు నోటిఫికేషన్లు జారీ చేయడాన్ని  సుధాకర్‌రెడ్డి తప్పుపట్టారు. దేవరకొండ సీపీఐ... ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను మభ్యపెట్టి టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారని సురవరం విమర్శించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - విఫలం