విభజన

12:07 - January 19, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ 'విభజన' మాట అందుకున్నారు. శుక్రవారం రెండో రోజు జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని ఏపీపై పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ఏపీకి పోలికే లేదని..తెలంగాణను ఆంధ్ర పాలకులు ధ్వంసం చేశారనడంపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి పలు సమస్యలు ఎదురయ్యాయని, కేంద్రం ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా 20 నుండి 30 శాతం వెనుకబడి ఉన్నట్లు, ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఏపీని కేంద్రం ఆదుకోవాల్సిందేనన్నారు. ఈ విషయంలో అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళతామని వ్యాఖ్యానించడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉందని, ఇందుకు ప్రజలు కారణం కాదన్నారు. 

21:10 - January 12, 2018

విజయవాడ : విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న హామీలను అమలు చేయకపోతే కోర్డును ఆశ్రయించడం మినహా మరో ప్రత్యామ్నాయంలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం చెప్పడంతో ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నానని.. అయితే ఇంతవరకు నిధులు ఇవ్వలేదని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు రాజధాని అమరావతి నిర్మాణం, మంజూరైన విద్యాసంస్థలకు నిధులు ఇవ్వాలని ఢిల్లీలో ప్రధాని మోడీతో జరిపిన భేటీలో చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించారు. విభజన చట్టంలోని అపరిష్కృత హామీలపై 17 పేజీల నివేదిక అందజేశారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు, మోదీ భేటీ అయ్యారు.

ప్రధాని మోదీతో చర్చించిన వివరాలను చంద్రబాబు వెల్లడించారు. అన్నింటినీ అమలు చేయమని మోదీని కోరామని, లేకపోతే కోర్టుకు వెళ్లడం మినహా మరో గత్యంతరంలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు అమరావతి నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరంకు 58 వేల కోట్ల రూపాయలు అవుతుందని చంద్రబాబు ప్రధాని మోదీ దృష్టికి తెచ్చారు. దీని పునరావసం, పునర్నిర్మాణానికే 35 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 16 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉండగా ఇంతవరకు చాలా తక్కువ మొత్తమే ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దీనిని నేరుగా నగదు రూపంలో ఇవ్వకపోతే పాత రుణాలు చెల్లింపునకు సర్దుబాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన 11 కేంద్ర విద్యాసంస్థలకు 2,900 ఎకరాల భూమి ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రధాని దృష్టికి తెచ్చారు. దీని విలువ 16,600 కోట్లని, మరో 133 కోట్లతో వీటన్నింటికీ ప్రహరీగోడలు నిర్మించిన అంశాన్ని ప్రస్తావించారు. హిందూపురంలో కేంద్రీయ విశవిద్యాలయం, విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు. వీటికి 11,673 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటే ఇంతవరకు కేవలం 420 కోట్లు మాత్రమే ఇచ్చారని ప్రధాని దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ సీట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాకినాడ పెట్రో రసాయనాల పారిశ్రామిక సముదాయం, కడప స్టీల్‌ ప్లాంట్‌, విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు, విశాఖ-చెన్నై పారిశ్రామికి నడవాను అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీల అమలుకు టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నింటిని పరిశీలించి, పరిష్కారానికి స్వయంగా చర్యలు తీసుకుంటానని చంద్రబాబుకు మోదీ హామీ ఇచ్చారు. 

14:56 - January 12, 2018

ఢిల్లీ : రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని కొరానన్నరు సీఎం చంద్రబాబు. సేవారంగంలో దక్షిణాదిరాష్ట్రాలకంటే ఏపీ చాలా వెనుకబడిందన్నారు. రాష్ట్రంలో సర్వీస్‌ సెక్టార్‌ అభివృద్ధికి చేయూత ఇవ్వాలని ప్రదాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా రాష్ట్రం రెవెన్యూలోటును ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నదని .. ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లానన్నారు. షెడ్యూల్‌-9, 10 లలో విభజన సరిగా జరగలేదని.. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించడానకి చొరవచూపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానన్నారు చంద్రబాబు.

రాజధాని నిర్మాణానికి మరిన్ని నిధులు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఇచ్చిన 2500 కోట్లు తోడుగా మరో వెయ్యికోట్లు త్వరలో మంజూరు చేస్తామని ప్రధాని చెప్పారన్నారు. విభజన చట్టం 13లో పేర్కొన్న 11 సంస్థల ఏర్పాటుపై చర్చించానన్నారు చంద్రబాబు. ఇప్పటికే 9 సంస్థలను శాక్షన్‌ చేశారన్నారు. ఇంకా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సహకరించాలని కోరామన్నారు. దుగరాజు పట్నం పోర్టును త్వరగా పూర్తి చేయడానికి సాయం చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామన్నారు సీఎం చంద్రబాబు.

15:37 - January 11, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి దేశ రాజధానికి పయనం కానున్నారు. ఈ ఢిల్లీ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే పోలవరం..విభజన సమస్యలపై విపక్షాలు పలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రధాన మంత్రితో ఇటీవలే భేటీ అయ్యారు. ప్రధాన మంత్రితో త్వరలో బాబు భేటీ కానున్నారని ఎంపీలు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అపాయింట్ కేటాయించినట్లు గురువారం పీఎంవో కార్యాలయం నుండి సమాచారం అందించింది.

ఉదయం 10.40గంటలకు ప్రధానితో బాబు భేటీ కానున్నారు. ఇక ఈ భేటీలో విభజన హామీలు, పోలవరం హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక సాయం..నియోజకవర్గాల పెంపు అంశాలపై ప్రధానితో మాట్లాడనున్నారు. మరి ఈ భేటీలో ప్రధాన మంత్రి ఎలాంటి హామీలు ఇస్తారో చూడాలి. 

08:03 - January 8, 2018

ఈనెల 12వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీనితో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పోలవరం నిర్మాణం..విభజన సమయంలో ఇచ్చిన హామీలు..అమలు చేయాలని..నిధులు కేటాయించాలని తదితర వాటిపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. దీనిపై టెన్ టివి చర్చలో శేఖర్ రెడ్డి (టీఆర్ఎస్), ఉమా మహేశ్వరరావు (సీపీఎం), కోటేశ్వరరావు (బీజేపీ), దుర్గా ప్రసాద్ (టిడిపి), జంగా గౌతమ్ (ఏపీ పీసీసీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:41 - January 6, 2018

టీడీపీ ఎంపీలు ఈ రోజు నిద్రలేచరని, విభజన హామీలు ఇంతవరు అలాగే ఉన్నాయని, శంకుస్థాపనకు వచ్చిన మోడీ మట్టి నీళ్లు ఇచ్చారు తప్ప ఏమీ ఇవ్వలేదని, టీడీపీ ఎంపీలు ఖాళీగా ఉన్నారని, వారి అసెంబ్లీ పెంచడమనేది తప్ప వేరే విషయం లేదని, ప్రభుత్వం ఏది కట్టిన తాత్కలికంగా నిర్మిస్తున్నారని వైసీపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విభజన హామీలు అమలు జరగలేదని మంత్రి సుజన చౌదరితో సహా బీజేపీ నేతలు అంగీరించారని, వారు ప్రధాని నుంచి ఒక్క హామీ పొందారు అదేంటంటే సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడమని, 20 వేల కోట్లు రావాలని సీఎం చెప్పారని, ఇంతవరకు రైల్వే జోన్ రాలేదని, రాయలసీమకు ప్యాకెజీలు కూడా రాలేదని సీపీఎం ఏపీ రాష్ట్ర నాయకులు బాబురావు అన్నారు. రాష్ట్ర నేతలు మోడీని అనేక దఫాలుగా కలిశారని, సీఎం చంద్రబాబు అనేక సార్లు ప్రధానిని కలిశారని, తాడేపల్లిగూడెంలో నీట్ వచ్చింది, తిరుపతిలో వచ్చింది కానీ కొంత జాప్యం జరిగిందని, నిర్ధిష్టమైన సమయంలో ఇవ్వన్ని వస్తాయ అని అంటే చెప్పలేమని టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:58 - December 29, 2017

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రప్రభుత్వం అలసత్వం వహిస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్, విశ్లేషకులు ఎస్.వీరయ్య, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్ వి.సుభాష్ పాల్గొని, మాట్లాడారు. ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కేంద్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శించారు. విభజన ప్రక్రియను కేంద్రం సజావుగా జరిపించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:26 - December 28, 2017

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై లోక్ సభలో చర్చ జరిగింది. హైకోర్డు విభజనకు టీఆర్ ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈమేరకు సభలో అందోళన చేపట్టారు.ఉమ్మడి హైకోర్టులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి వాపోయారు. అందుకే ఉమ్మడి హైకోర్టు విభజన చేయాలని కోరారు. 

 

14:28 - November 17, 2017

హైదరాబాద్ : తనపై సీఎం కేసీఆర్..కు అందరికీ ఎందుకంత కోపం ఉంటదని టి.కాంగ్రెస్ సభ్యుడు సంపత్ సభలో ప్రశ్నించారు. జిల్లాల విభజన అంశంపై శుక్రవారం టి. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవాంతరాలు అధిగమించే విధంగా డీ లిమిటైజేషన్ ఉండాలని సూచించారు. కుల్వకుర్తి నియోజవకర్గం మూడు డివిజన్ లలో ఉందని..ఒక సమస్యను పరిష్కరించాల్సి వస్తే ముగ్గురు ఆర్డీవో లతో మాట్లాడాల్సి వస్తోందని..ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో మార్పులు..చేర్పులు చేస్తున్నట్లు చెబితే తాము ప్రిపేర్ అవుతుండే వారమన్నారు. 

21:15 - November 3, 2017

ఢిల్లీ : హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పోలవరం నిధుల అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. వీటితో పాటు రాష్ట్రానికి రావల్సిన ఇతర నిధుల అంశాన్ని జైట్లీ ముందు ప్రస్తావించారు. అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను చంద్రబాబు కలిశారు. విభజనచట్టం వేగవంతం చేయమని రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు. విభజన చట్టం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి అమిత్‌షాతో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు చంద్రబాబు చెప్పారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - విభజన