విభేదాలు

07:29 - November 22, 2017

అహ్మదాబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల టికెట్ల పంపకాలపై పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితికి కాంగ్రెస్‌కు మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రకటనపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. హార్దిక్‌ పటేల్‌ గురువారం నాటి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చే ప్రకటన మళ్లీ వాయిదా పడింది. అంతకు ముందు నవంబర్‌ 18న గాంధీనగర్‌లో జరిపే ర్యాలీలో కాంగ్రెస్‌ మద్దతుపై ప్రకటన చేస్తామని హార్దిక్‌ పటేల్‌ అన్నారు. కానీ ఏకంగా సభనే రద్దు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై పటేల్‌ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ 77 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హార్దిక్‌ పటేల్‌కు సన్నిహితులైన లలిత్‌ వసోయా, అమిత్‌ థమ్మర్‌లకు మాత్రమే టికెట్‌ లభించింది. మరో 20 స్థానాలు కేటాయించాలని పాస్‌ డిమాండ్‌ చేస్తోంది. 

 

17:46 - November 9, 2017

కరీంనగర్ : మంథని టిఆర్ఎస్ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. పట్టు నిలుపుకునేందుకు ఒకరు... పడగొట్టేందుకు ఇంకొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు, అదే పార్టీ యువజన నాయకుడు సునీల్ రెడ్డిల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ మంథని రాజకీయాల్లో సెగ పుట్టిస్తోంది. 
మంథనిలో అధికారపార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్
మంథని రాజకీయాలు అగ్గి లేకుండానే మంటపుట్టిస్తున్నాయి. ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఎమ్మెల్యే పుట్ట మధు, టీఆర్‌ఎస్ యువజన నాయకుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి  మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకే పార్టీలో ఉన్నా ఉప్పు నిప్పులా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుతున్నారు. 
పుట్టమధుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంతో మొదలైన చిచ్చు..
గత ఎన్నికల్లో పుట్టమధుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంతో మొదలైన చిచ్చు..ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సునీల్ రెడ్డి- మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కుమారుడు. సునీల్ రెడ్డికి టికెట్‌ ఇస్తారన్న ఆశతో తండ్రీ కొడుకులు.. స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అయితే మాజీ మంత్రి శ్రీధర్ బాబును ఢీకొట్టే వ్యూహంలో భాగంగా..టిఆర్ఎస్ అధిష్టానం చివరి క్షణంలో పుట్ట మధుకు టికెట్‌ ఇవ్వడంతో.. తండ్రీకొడుకుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. దీంతో ఇద్దరు మూడేళ్ల పాటు పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సునీల్ రెడ్డి మళ్లీ క్రీయాశీలక రాజకీయాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.  
ఎమ్మెల్యే మధుపై ఆరోపణలు 
మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే మధు అలసత్వం వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజక వర్గంలో చోటుచేసుకుంటున్న వివాదాలు మధుకు చెడ్డ పేరు తెస్తున్నాయని..పద్దతి మార్చుకోవాలంటూ సీఎం కెసిఆర్ హెచ్చరించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మంథని మధుకర్ మరణం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణలు రాష్ట రాజకీయల్లో దుమారం రేపాయి. స్థానిక జేఎన్టీయూ కాలేజీలో 132 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం...కమాన్పూర్ మండల టీఆర్‌ఎస్‌ నేతలను సస్పెండ్ చేయడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం...సునీల్ రెడ్డి నేతృత్వంలో హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
శ్రీధర్‌బాబుకు కలిసొచ్చే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మంథనిలో ఏం జరుగుతుంది...   
మధు వ్యతిరేక వర్గంతో పాటు ఉద్యమ సమయంలో పార్టీ కోసం పని చేసిన వారిని ఐక్యం చేయడం.. తమ సామాజిక వర్గం నేతల మద్దతు కూడగట్టడం..స్వచ్ఛంద కార్యక్రమాలు సునీల్‌రెడ్డి చేపట్టడం ఎమ్మెల్యేకు మింగుడుపడటం లేదు. వినాయక చవితి, దసరా పండుగల సందర్భంగా చోటుచేసుకున్న వివాదాలు ఎమ్మెల్యే ఛరిష్మా మసకబారడానికి కారణమని తెలుస్తోంది. ఇక సునీల్ రెడ్డి దూకుడు వెనుక టిఆర్ఎస్ అధిష్టాన వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతుతోంది. ఎమ్మెల్యే మధుకి టీఎఆర్‌ఎస్‌ ఎంపీ కవిత మద్దతు...సునీల్ రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సపోర్టు ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే ప్రాధాన్యమిస్తామని సీఎం కేసీఆర్ చెబుతుండగా..మంథనిలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇద్దరు అధికారపార్టీ నేతల మధ్య జరుగుతున్న అంతర్‌యుద్ధం మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు కలిసొచ్చే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

 

20:48 - September 26, 2017

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కాటారం బతుకమ్మ వేడుకల్లో నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పుట్టా మధు,.. టీఆర్‌ఎస్‌ యూత్‌ లీడర్‌ సునిల్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సునిల్‌రెడ్డి వాహనంపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి చేశారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:44 - September 13, 2017

వరంగల్‌ : జిల్లాలో టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య రైతు సమన్వయ సమితి చిచ్చు పెట్టింది. హన్మకొండలో సర్క్యూట్‌ హౌస్‌ వద్ద టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను అడ్డుకున్నారు. తన అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూ నిజమైన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే తీరుపై మంత్రి కడియంకు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రైతు సమన్వయ సమితుల్లో తమకు అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

 

09:28 - September 8, 2017

కడప : జిల్లాలోని బద్వేల్‌ టీడీపీలో విభేదాలు తార స్థాయికి చేరాయి. పార్టీ నాయకుల మధ్య ఉన్న గొడవలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ నాయకురాలు విజయమ్మ మధ్య వర్గపోరు తీవ్రమైంది. ఇద్దరు జడ్పీటీసీలు రాజీనామా చేసే స్థాయికి పోరు ముదిరింది.

కడప జిల్లా తెలుగు దేశం పార్టీలో ఇద్దరు జడ్పీటీసీ సభ్యుల రాజీనామాలు..  కలకలం రేపాయి. నేతల మధ్య విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.  ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన తమకు పార్టీలో అన్యాయం జరుగుతుందని.. చిన్నచూపు చూస్తున్నారని జడ్పీటీసీలు వాపోతున్నారు. పార్టీ నేతలు, అధికారులు తమకు సహకరించడం లేదంటూ జడ్పీటీసీ సభ్యులు శిరీష, రమణయ్య రాజీనామా లేఖల ద్వారా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని...సమస్య తీర్చాలని కోరారు. 

కొంతకాలంగా బద్వేలు టీడీపీలో ఎమ్మెల్యే జయరాములు, పార్టీ నాయకురాలు విజయమ్మ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇరువురు నేతలు పార్టీని రెండు వర్గాలుగా చీల్చారు. తమ వర్గం వారికే పనులు, కాంట్రాక్టు దక్కేలా అటు ఎమ్మెల్యే జయరాములు, ఇటు పార్టీ నాయకురాలు విజయమ్మ గట్టిగా పట్టుబడుతున్నారు. 

పనులను కేటాయించుకోవడంలో.. తలెత్తిన విభేదాలు ఇప్పుడు పార్టీలో రచ్చగా మారాయి. ఎమ్మెల్యే జయరాములు.. తమ వర్గం వారికి పనులు ఇవ్వడం లేదంటూ.. విజయమ్మ ఆరోపిస్తున్నారు. ఇటీవల పార్టీ ద్వితీయ శ్రేణి పదవుల భర్తీ విషయంలో కూడా ఎమ్మెల్యే జయరాములు.. తమ వర్గానికి అవకాశం కల్పించలేదని విజయమ్మ ఆరోపిస్తున్నారు. విజయమ్మకు పార్టీలో జరుగుతున్న అవమానాన్ని తాళలేమంటూ ఆమె వర్గానికి చెందిన బద్వేలు జడ్పీటీసీ శిరీష, గోపవరం జడ్పీటీసీ రమణయ్య పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్‌ ద్వారా రాజీనామా లేఖను పంపించారు. 

జయరాములు.. గడచిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచారు. అయితే ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా, ఆయన టీడీపీలోకి వలసొచ్చారు. అప్పటినుంచే విజయమ్మకు, ఆయనకు పొసగడం లేదు. ప్రారంభ స్థాయిలోనే వీరిద్దరి మధ్య విభేదాలను పరిష్కరించడంలో అధినేత చంద్రబాబు.. శ్రద్ధ చూపలేదు. దీంతో.. బద్వేలు టీడీపీలో విర్గ వైరుధ్యాలు ముదురుపాకాన పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా నుంచి అత్యధిక సీట్లు గెలుచుకోవాలనుకుంటున్న టీడీపీ అధినాయకత్వానికి, బద్వేలు లాంటి చోట్ల తలెత్తుతున్న పరిస్థితులు ఇబ్బందిగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఈ తరహా ఇబ్బందులను ఎప్పుడు.. ఎలా.. పరిష్కరిస్తారోనని కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

21:35 - August 8, 2017
22:01 - August 6, 2017

హైదరాబాద్‌ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి కార్యక్రమంలో.. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ కార్యకర్తపై దాడి చేసుకోవడంతో వివాదాస్పదమైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తమపై.. కొత్తగా పార్టీలో చేరినవారు పెత్తనం చలాయిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపినాథ్‌ కావాలనే డివిజన్‌ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అంటున్నారు. 

 

13:47 - August 4, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ పనులు అరకొరగా సాగుతున్నాయి. వ్యయాలు మాత్రం అంచనాలను మించిపోతున్నాయి. ప్రస్తుతం పోలవరం అంచనా వ్యయం 60వేల 431 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రాజెక్ట్‌ పనుల కూడా ఆలస్యంగా సాగుతున్నాయి. దీంతో పనుల జాప్యంపై కేంద్రం .. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. అలాగే ప్రాజెక్ట్‌ కోసం గతంలో విడుదల చేసిన నిధులు ఖర్చుపై...స్పష్టమైన నివేదికలు పంపాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేరకు పంపిన నివేదికల్లో కేంద్రం లోపాలు ఎత్తిచూపడంతో .. రాష్ట్ర ప్రభుత్వం ఖంగుతిన్నది. ఈ తరుణంలో...పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయం పెరుగుతున్న కారణంగా... మరిన్ని నిధులు కావాలంటూ.. రాష్ట్రం ....కేంద్రాన్ని కోరేందుకు సిద్ధమైంది. ప్రాజెక్ట్‌ నీటి పారుదల విభాగానికి 48వేల 231 కోట్ల 74 లక్షలు అవసరమంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని చూస్తోంది. కానీ పోలవరానికి నిధుల విడుదల చేసే విషయంలో కేంద్రం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.

పరిహారం చెల్లింపులో వ్యత్యాసాల
అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి.. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులో ఉన్న వ్యత్యాసాలపై కూడా పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ... రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 1,61,857 ఎకరాల భూమిని సేకరించాలి. ఇప్పటికే 4వేల 115కోట్ల 34లక్షలను పరిహారంగా చెల్లించి 97వేల 269.58 ఎకరాలను సేకరించారు. అయితే పోలవరం రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే భూమికి ఎకరం లక్ష రూపాయల నుంచి 9 లక్షల వరకు పరిహారంగా చెల్లించారు. కుడి కాలువ భూ సేకరణలో వీరవల్లిలో ఎకరానికి 52 లక్షల 90వేల చొప్పున, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో ఎకరాకు 44లక్షల 90 వేల చొప్పున, ఎడమ కాలువ భూ సేకరణలో తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం ఆరెంపూడిలో ఎకరానికి 18 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించి భూ సేకరణ చేశారు. దీనిపై పీపీఏ అభ్యంతరం తెలిపింది.

అంచనా వ్యయాలపై స్పష్టత కరవు
భూ సేకరణకు సహకరించకుండా కుడి కాలువ పనులకు అడ్డు తగులుతూ 2006లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతులకు ఒకలా... మిగతా రైతులకు మరో విధంగా పరిహారాన్ని చెల్లించడాన్ని ఎత్తిచూపింది. అలాగే మిగిలిపోయిన 62వేల 455.33 ఎకరాల భూమికి 7వేల 331 కోట్లు అవసరమవుతాయని ఏ ప్రాతిపదికన అంచనా వేశారో తెలియజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్ట్‌లో మునిగిపోయే 371 గ్రామాలకు చెందిన కుటుంబాలకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు 20వేల 678 కోట్లు అవసరమని పంపిన ప్రతిపాదనలపైనా అనుమానం వ్యక్తం చేసింది.అసలు పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాలపై స్పష్టత ఉండడం లేదని స్థానిక నేతలు అంటున్నారు. ఇప్పటికైనా.. వీలైనంత తొందరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా... ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుద్యం నడుస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌ కోసం మరిన్ని నిధులను కేంద్రం విడుదల చేస్తోందా? లేదా? అనేది సందిగ్ధంగా ఉంది.  

18:04 - August 1, 2017

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అభివృద్ధి నత్తనడకన నడుస్తోంది. మున్సిపల్‌ కమిషనర్‌, చైర్‌పర్సన్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో.. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే... అసలు విభేదాలకు కారణమేంటో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. అందరిని సమన్వయం చేసుకోవడంలో కమీషనర్‌ విఫలమయ్యాడని అన్ని పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. 
విభేదాలతో కుంటుపడుతోన్న పట్టణాభివృద్ధి 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పురపాలక సంఘంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పులి గీత, కమిషనర్‌ షఫీ ఉల్లా మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. వీరిద్దరి మధ్య విభేదాలతో పట్టణాభివృద్ధి కుంటుపడుతోంది. ఇలాంటి వివాదాల నేపథ్యంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గీత కార్యాలయానికి రావడమే మానేశారు. ఏ కార్యక్రమాలు ఉన్నా... అలా వచ్చి వాటిలో పాల్గొని మళ్లీ పోతున్నారు. కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేందుకు కూడా ఆమె సుముఖత వ్యక్తం చేయడంలేదంటే వారిద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయో అర్ధం చేసుకోవచ్చు. వీరిద్దరి విభేదాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలంటున్నారు. 
విభేదాలకు కారణమేంటి..?
అయితే... వీరిద్దరి మధ్య విభేదాలకు కారణమేంటి అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. లక్షలాది రూపాయల పనులు జరుగుతున్న నేపథ్యంలో కాంట్రాక్టులలో కమీషన్‌ కుదరకపోవడమే కారణమా ? అని పలువురు అనుమానిస్తున్నారు. మరోవైపు కమిషనర్‌ వైఖరిపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కౌన్సిలర్లను పట్టించుకోకపోవడం, పనుల్లో నిర్లక్ష్యం వహించడంతో అన్ని వర్గాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తమ విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రథమ శ్రేణి పురపాలక సంఘానికి గ్రూప్‌-1 అధికారిని నియమించాల్సి ఉన్నప్పటికీ... ప్రజాప్రతినిధులు, తోటి సిబ్బందితో సమన్వయం లేని ఇలాంటి వ్యక్తిని కమిషనర్‌గా నియమించడం పట్ల పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చైర్‌పర్సన్‌, కమిషనర్‌ మధ్య సమన్వయం లేకపోవడంతో పట్టణాభివృద్ధి కుంటుపడిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్తగూడెం పురపాలక సంఘానికి గ్రూప్‌-1 అధికారిని నియమించాలని పలువురు కోరుతున్నారు. 

 

15:42 - July 15, 2017

పెద్దపల్లి : రామగుండం టీఆర్ఎస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రామగుండం కార్పొరేషన్ లో వేసిన పార్టీ కమిటీలను రద్దు చేశారు. దీంతో కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఎమ్మెల్యే కార్పొరేషన్ లో అధికారులు లంచం అడిగితే చెప్పుతో కొట్టండని తెలిపారు. కార్పొరేటర్లకు పార్టీకి నష్టం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss

Subscribe to RSS - విభేదాలు