విశ్వాసం

14:11 - November 8, 2018

తమిళ స్టార్ హీరో, తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో, వీరం, వేదాళం, వివేకం తర్వాత, విశ్వాసం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సెట్‌లో, ఒక డ్యాన్సర్ మరణించిన ఘటన గురించి తెలిసి కోలీవుడ్ ఉలిక్కి పడింది.
ప్రస్తుతం, విశ్వాసం సినిమాలోని ఒక పాట చిత్రీకరణ పూణెలో జరుగుతుంది. రిహార్సల్స్ చేస్తున్న టైమ్‌లో, శరవణన్ అనే డ్యాన్సర్, గుండెపోటు రావడంతో సెట్‌లోనే కుప్పకూలిపోయాడు. యూనిట్ సభ్యులు వెంటనే అతణ్ణి హాస్పిటల్‌కి తీసుకెళ్ళగా, అప్పటికే శరవణన్ మృతిచెందినట్టు డాక్టర్స్ చెప్పడంతో, యూనిట్ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయం తెలిసి, అజిత్ చాలా బాధపడ్డాడట. తనే దగ్గరుండి పోస్ట్‌మార్టం పనులవీ చూసుకున్నాడని మూవీ యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక, శరవణన్ గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, కానీ, ఆసంగతి యూనిట్ వారికి చెప్పలేదని తోటి డ్యాన్సర్స్ అంటున్నారు. శరవణన్ మృతదేహాన్ని చెన్నైలోని అతని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చెయ్యడంతో పాటుగా, మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందచేసింది విశ్వాసం టీమ్.  

10:47 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిసేపట్లో బలబలాలు తేలిపోనున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గవర్నర్ కు ఇచ్చిన వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గరిష్టంగా 15 రోజుల టైం ఇచ్చినా ఈ రోజే పరీక్షను ఎదుర్కోవాలని పళని నిర్ణయించారు. పళని స్వామి బలపరీక్షలో నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతుండాలి. అయితే చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరుగుతుందని పన్నీర్ సెల్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పళని వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. అప్పటి వరకు పన్నీర్ వర్గంలో 11 మంది ఎమ్మెల్యేలున్న సంఖ్య 13కి చేరుకుంది. అంటే పళనీ సెల్వం వద్ద 122 ఎమ్మెల్యేల బలం ఉంది. మిగతా ఎమ్మెల్యేల్లో కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరవేస్తే పళనీ విశ్వాస పరీక్ష ఓడిపోనున్నారు. ఎమ్మెల్యేలకు రహస్య ఓటింగ్ నిర్వహించాలని ఇప్పటికే పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరిన సంగతి తెలిసిందే. రహస్య ఓటింగ్ కు అనుమతినిస్తే తమ వైపు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని పన్నీర్ వర్గం పేర్కొంటోంది. బలనిరూపణ చేయడానికి ఉండాల్సిన ఎమ్మెల్యేల కంటే కేవలం ఐదుగురు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. పన్నీర్ వైపుకు వచ్చే ఎమ్మెల్యేలు ఎంత మంది ? బలపరీక్షలో పళని స్వామి నెగ్గుతారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది.

09:13 - February 18, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం నేటితో తెరపడనుందా ? ఇంకా కొనసాగుతుందా ? అనేది కాసపట్లో తేలిపోనుంది. జయ మరణం అనంతరం రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. సీఎం పదవి కోసం శశికళ..పదవిని దక్కించుకోవడానికి పన్నీర్ సెల్వం పోటీ పడిన సంగతి తెలిసిందే. కానీ అక్రమాస్తుల కోర్టు కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. అనంతరం వారసుడిగా పళనీస్వామి తెరమీదకు రావడం..సీఎంగా ప్రమాణం చేయడం జరిగిపోయాయి. నేడు అసెంబ్లీలో పళనిస్వామి సర్కార్‌ బలపరీక్ష జరగనుంది. కానీ విశ్వాస పరీక్షలో నెగ్గుతారా ? లేదా ? అనేది తెలియడం లేదు. పళనీస్వామి వర్గంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పన్నీర్ సెల్వం వర్గంలో 12 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా కోయంబత్తూర్ అరుణ్ కుమార్ శశికళ శిబిరం నుండి మాయమైపోయారు. తనకు రాజకీయాలు వద్దు..అని తటస్థంగా ఉంటానని పేర్కొనడం కలకలం రేగుతోంది. ఈయన పన్నీర్ వర్గంలో చేరితే బలం 13కి చేరుతుంది. మ్యాజిక్ ఫిగర్ 117 గా ఉన్న సంగతి తెలిసిందే. పళిని స్వామి వర్గంలోని ఎమ్మెల్యేలు ఎవరు చేయి ఇస్తారో ? ఎవరు మద్దతిస్తారో తెలియడం లేదు.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా అన్నాడీఎంకేకి 135 స్థానాలు, డీఎంకేకి 89 ఉన్నాయి. అలాగే కాంగ్రెస్‌కి 8 స్థానాలు ఉన్నాయి. అయితే పళనిస్వామి వర్గంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. పన్నీర్‌ సెల్వం వర్గంలో 13 మంది మాత్రమే ఉన్నారు. డీఎంకే ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

20:30 - October 26, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో రైతులు, యువత తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పుకొచ్చారు. శృతి, సాగర్‌ ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు. వరంగల్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై అభిప్రాయ సేకరణ జరిపారు కాంగ్రెస్ నేతలు.. పార్టీ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు.. ఈనెల 28న అధిష్ఠానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.

 

16:37 - July 2, 2015

ఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో బీజేపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని... కరీంనగర్ ఎంపీ వినోద్ ఆరోపించారు. మోడీ సర్కారు మాట ఇచ్చి మాట తప్పిందన్నారు. ఈ విషయంపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని హెచ్చరించారు. 

Don't Miss

Subscribe to RSS - విశ్వాసం