వెంట్రుకలు

14:52 - November 3, 2017

అన్ వాంటెడ్ హేర్..ఈ సమస్యతో మహిళలు బాధ పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. దీనిని తొలగించుకోవడానికి పలు దారులు వెతుకుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయనే దానిపై చర్మవ్యాధి నిపుణులు శంకుతల తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:48 - July 16, 2017
13:44 - August 4, 2016

వర్షాకాలం మొదలై పోయింది. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉద్యోగాలకు వెళ్లే వారు..ఇతరత్రా పనులపై వెళ్లే మహిళలు వర్షం తడవడం సాధారణంగా మారిపోతుంటుంది. వర్షంలో తడవడం వల్ల చర్మం..వెంట్రుకలపై ప్రభావం పడుతుంది. కేర్ తీసుకోకపోతే తడిచిన వెంట్రుకల నుండి చెడు వాసన వస్తుంది. దీనితో చుండ్రు ఏర్పడి వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
చుండ్రు ఉన్న వారు వర్షాకాలంలో డైరెక్ట్ గా తలస్నానం చేయకూడదు. తలస్నానం చేసే ముందు పెరుగు, రీఫైయిన్డ్ ఆయిల్ మాడుకు పట్టించాలి. అనంతరం బాగా మసాజ్ చేసి అరగంట అనంతరం స్నానం చేయాలి.
తడి ఉన్న సమయంలో జుట్టును దువ్వకూడదు. బలహీనంగా ఉండడం వల్ల కురులు రాలిపోతుంటాయి.
తల మాడు చాలా చల్లగా, తడిగా దురద ఉన్న సమయంలో వేప నూనెను ఉపయోగించాలి. వేపలో ఉన్న ఆయుర్వేద గుణాలు కురులు బాగా పెరిగేందుకు సహాయపడతాయి.
ఈ సీజన్ లో హెయిర్ కలరింగ్..స్ట్రేయిట్ హెయిర్ చేయించుకోవడం అంత మంచిది కాదు. తలస్నానం చేయడానికి..జుట్టు ఆరడానికి చాలా సమయం పడుతుంటుంది.
తలస్నానం తర్వాత హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించకుండా పొడి టవల్, మెత్తని టవల్ తో తలను తుడుచుకోవడం వల్ల మసాజ్ లా ఉపయోగపడుతుంది.
పొడి జుట్టు ఉన్నవారు తలస్నానానికి ముందు తప్పనిసరిగా కండిషనర్ ను అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

07:40 - April 26, 2016

జుట్టు నల్లగా లేదని చాలామంది బాధపడుతుంటారు. వాతావరణ ప్రభావ కారణంగా చిన్నవారికి కూడా వెంట్రుకలు తొందరగా తెల్లబడుతున్నాయి. అందుకే జుట్టు నల్లగా ఉండటం కోసం అన్నో రకాల క్రీములను వాడుతుంటాం. కాని ఇవన్ని తాత్కాలికం మాత్రమే. ఈ సమస్య పురుషుల కంటే స్త్రీలలో మరీ ఎక్కువగా కనపడుతోంది. దీంతో నల్లని జుట్టు కోసం మార్కెట్లో దొరికిన ప్రతి హెయిర్‌ డైని ప్రయోగిస్తారు. వాటితో అనేక చిక్కులు. ఇవేవీ లేకుండా నిగనిగలాడే నల్లని కురులు పొందాలనుకునేవారికి కొన్ని చిట్కాలు...
అరలీటరు నీటిలో రెండు చెంచాల ఉసిరిపొడి కలపండి. నిమ్మకాయని సగంగా కోసి, ఒక ముక్కలోని రసాన్ని ఆ నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని రోజూ తలకు రాసుకుని తలస్నానం చేస్తే అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.
ఇది మామిడి కాయలు దొరికే సీజన్‌. కాబట్టి మామిడికాయ రసాన్ని తీసుకుని తలకి పట్టిస్తే మంచి ఫలితాన్నిస్తుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
కరివేపాకు, గోరింటాకును బాగా ఎండబెట్టాలి. ఒక పాత్రలో కొబ్బరి నూనె, ఎండబెట్టిన కరివేపాకు, గోరింటాకు వేసి బాగా కాచి వడగట్టాలి. ఈ నూనెను ప్రతిరోజూ తలకి పట్టిస్తే జుట్టు నల్లగా మారుతుంది.
రెండు కప్పుల పెరుగు, ఒక కప్పు ఎండు ఉసిరి తీసుకుని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇలా వారానికి ఒక సారి క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
ఒక కప్పు ఎండు ఉసిరిని నాలుగు కప్పుల నీళ్ళల్లో మరిగించాలి. ఈ మిశ్రమం ఒక కప్పు వచ్చిన తరువాత ఇందులో రెండు కప్పుల గోరింటాకు పొడి, గుడ్డులోని తెల్ల సొన, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే నల్లని జుట్టు మీ సొంతం.

13:21 - January 30, 2016

జుట్టు రాలడం ఇప్పుడు ప్రధాన సమస్య. జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే.. ముందుగా తలపై చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. జుట్టు రాలడానికి కారణాలేమైనా కావచ్చు.. కానీ కొన్ని పద్ధతులను పాటించడం వల్ల... రాలటం తగ్గి ఆరోగ్యకరమైన మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది. అవేంటో చూద్దాం..
ఆరోగ్యకర ఆహారం: జుట్టు రాలకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కావలసిన విటమిన్స్‌, మినరల్స్‌ ఉండేలా చూసుకోవాలి. మీ ఆహారంలో పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, ఓట్స్‌, హోల్‌ గ్రైన్స్‌, తృణధాన్యాలను కలుపుకోండి. విటమిన్స్‌తోపాటు ప్రోటీన్‌, అయోడిన్‌ వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి తప్పని సరి. 
రెండు రోజులకోసారి: రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి. అయితే వేడి నీరు జుట్టుకు ప్రమాదం కలిగిస్తుంది. తలస్నానానికి గోరు వెచ్చని లేదా చల్లని నీటిని వాడటం మంచిది. మీ తలపై చర్మానికి ఆయిల్‌ లేదా స్నానం చేసే సమయంలో చేతి గోళ్ళు మాడుకు తాకకుండా, కేవలం వేళ్ళు మాత్రమే తాకేలా చూడండి.
జుట్టును ఆరబెట్టడం: తడిగా ఉన్న జుట్టును సహజంగా ఆరబెట్టండి. డ్రయర్‌లను వాడటం వలన జుట్టు మరింత పాడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వేడితో డ్రయర్‌ను వాడి జుట్టును ఆరబెట్టడం వలన జుట్టు బలహీనంగా, అనారోగ్యంగా మారుతుంది.
జుట్టును ఎలా దువ్వటం: జుట్టు దువ్వేందుకు ఎక్కువ ఖాళీలు(దూరం దూరం పళ్లు) ఉన్న దువ్వెనలను వాడండి. దువ్వెనను కూడా కింది వైపు నుంచి దువ్వండి. జుట్టు తడిగా ఉన్నపుడు మాత్రం దువ్వకూడదు. ఇలా చేస్తే జుట్టు తొందరగా తెగిపోయే అవకాశం ఉంది.
కండీషనర్ల వాడకం: జుట్టుకు కండీషనర్ల వాడకం తప్పని సరే అని చెప్పవచ్చు. కండీషనర్‌ను వాడటం వలన వెంట్రుకలపై ఒక పొరలా ఏర్పడి క్లోరిన్‌ కలిగి ఉన్న నీటి నుండి హానికర సూర్యకిరణాల నుండి కాపాడుతుంది.
జుట్టు ఆరోగ్యానికి వ్యాయామాలు: శారీరక వ్యాయామాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వ్యాయామాల వలన ఒత్తిడి తగ్గి, తలపై చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. జీవక్రియ పెరిగి.. ఆహారంలోని పోషకాలకు జుట్టుకు అందుతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

07:32 - December 17, 2015

వాతావరణ కాలుష్యం, రకరకాల షాంపూల వాడకంతో చిన్నవారి నుండి పెద్దల వరకు అందరికీ తెల్ల జుట్టు సర్వసాధారణమైంది. దాంతో డై వేసుకోవడం తప్పని సరైపోయింది. చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. అయితే జుట్టుకు రంగు వేసుకునే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మసమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

  • జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు.
  • ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్‌ లేదా నూనె రాసుకొని తర్వాత డై వేసుకోవాలి.
  • తలంటుకునేటప్పుడు కూడా డై చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి.
  • డై ఎంపికలో, నాణ్యత విషయంలో రాజీ పడకూడదు.
  • జుట్టు మంచి స్మెల్‌ రావాలంటే హెయిర్‌ సీరమ్‌ లేదా హెయిర్‌ స్ప్రేలను వాడాలి. అయితే ఈ సీరమ్స్‌, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.

అందుకే జుట్టుకు డై వేసుకునేటప్పుడు తప్పకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

Don't Miss

Subscribe to RSS - వెంట్రుకలు