వేదిక

18:38 - August 25, 2018

హైదరాబాద్ : ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ సభాస్థలాన్ని పరిశీలించి జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభకు వచ్చేవారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. అన్నివైపులా 15 నుంచి 20 రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. 480 ఎకరాల్లో ప్రగతి నివేదన సభ జరగనుంది. దాదాపు 25 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికపై 500 మంది కూర్చునేనా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక సమీపంలో సీఎం కోసం హెలిపాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు లక్ష వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్‌కోసం 16 స్థలాలను గుర్తించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడింగ్, రోడ్డు పొడవునా మంచినీటి సౌకర్యం కల్పించడంతోపాటు మైక్, ఎల్‌ఈడీ స్క్రీన్లు సిద్ధంచేస్తున్నారు. 

 

11:17 - April 20, 2018

హైదరాబాద్ : ఏపీ సెక్రటేరియట్ వేదికగా తనపై కుట్ర పన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా టీడీపీపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తన తల్లిని నడిరోడ్డుపై అనరాని మాటలు అనిపించారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న అసత్యప్రచారానికి లోకేశ్ కారణమన్నారు. 'ఏపీ ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఇదా మీరిచ్చే ప్రతిఫలం' అని వాపోయారు. తనపై కుట్రలు రచించి ఇప్పుడు దీక్షకు రమ్మంటారా అని ప్రశ్నించారు. 

 

15:44 - April 17, 2018

కశ్మీర్‌ కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పట్ల పాలకులు అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల తీరును, మతోన్మాదుల వైఖరి నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు... మహిళలపై అత్యాచార ఘటనలు పలు రాష్ట్రాల్లో ఈమధ్యకాలంలో పదేపదే జరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై మానవి వేదిక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు హైమావతి, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య పాల్గొని, మాట్లాడారు. కథువా ఘటన చాలా దారుణమైన ఘటన అన్నారు. ఈ ఘటన మానవ సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

11:55 - April 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి.. తెలంగాణలోని రాజకీయ పార్టీలకు ఒక వేదిక కాబోతుందా..? అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి టీజేఎస్‌ ప్రయత్నాలు చేస్తుందా..? అంటే అవుననే అంటున్నాయి టీజేఎస్‌ వర్గాలు. ఎలాగూ  కాంగ్రెస్‌ వ్యూహం కూడా ఇదే కావడంతో టీజేఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు పొడుపుకు అడుగులు పడుతున్నాయి. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితితో  దోస్తీ కోసం పలుపార్టీలు ఎదురు చూస్తున్నాయి. 
టీజేఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ తహతహ
టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో ఈ మధ్య తెలంగాణ జన సమితి పురుడుపోసుకుంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కోదండరాం టీజేఎస్‌ను ఏర్పాటు చేశారు. తమ ఒక్కరితోనే అది సాధ్యంకాదని .. కలిసొచ్చే పార్టీలతో రాజకీయ లక్ష్యాన్ని సాధిస్తామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీచేయబోమని ఆపార్టీ వర్గాలు స్పష్టపరుస్తున్నాయి. అంటే  పొత్తు దిశగా టీజేఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌తో టీజేఎస్‌ నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.  టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పనిచేయాలని నిర్ణయించారు.  అన్ని పార్టీలు విడివిడిగా పోటీచేస్తే టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు చీలుతుందని..తద్వారా టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ఆ పార్టీలు భావిస్తున్నాయి.  అందుకే టీఆర్‌ఎస్‌ శక్తులన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఒకవైపు టీజేఎస్‌, మరోవైపు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
కోదండరాం పార్టీపై కాంగ్రెస్‌లో లోతైన విశ్లేషణలు
కొత్తగా పెట్టిన కోదండరాం పార్టీ తమకు కలిసోస్తుందా లేక నష్టం చేకూరుస్తుందా అనే దానిపై ఇప్పటికే కాంగ్రెస్‌లో లోతైన విశ్లేషణలు జరిగాయి. పార్టీ అధిష్టానం సైతం ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను తెలుకుంటోంది. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లను దూరం చేసుకోకుండా  సంప్రదింపులు జరపాలని అధిష్టానం నుంచి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి సూచనలు అందుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఉత్తమ్‌ కుమారే స్వయంగా కోదండరాంతో భేటీ అయినట్టు తెలుస్తోంది.  కోదండరాం పార్టీ పెట్టడంతో ఓటుబ్యాంక్‌ చీలే అవకాశం ఉందని... అది అంతిమంగా అధికారపార్టీకే లాభిస్తుందని కోదండకు ఉత్తమ్‌ సూచించినట్టు సమాచారం. యువత, విద్యార్థులు, జేఏసీ నేతలు తనపై తీవ్ర ఒత్తిడి తేవడంతోనే పార్టీ పెట్టాల్సి వచ్చిందని కోదండరాం ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. 
పొత్తుల దిశగా తెలంగాణ జన సమితి
టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఒక సామాజిక వర్గం సైతం కాంగ్రెస్‌, టీజేఎస్‌లకు మద్దతు పలికే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార పార్టీకి వ్యతిరేకంగా సీపీఐ కూడా వీరికి మద్దుతు ప్రకటించింది. ఇక సీపీఎం....  ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించింది. బీఎల్‌ఎఫ్‌తోనే పోటీ చేస్తామని చెబుతోంది. సీపీఎం - బీఎల్‌ఎఫ్‌పైనా కోదండరాం - ఉత్తమ్‌ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే పొత్తులపై ఎన్నికల నాటికి స్పష్టత రావచ్చని కోదండరాం అనడంతో చర్చల ప్రక్రియకు ప్రస్తుతం బ్రేక్‌పడింది. 

 

16:05 - March 13, 2018

భారతదేశంలో డయాబెటిక్ సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇటీవలికాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతొక్కరు ఈ డయాబెటిక్ బారిన పడుతున్నారు. అసలు డయాబెటిక్ రావడానికి ప్రధానమైన కారణమేంటి ? ఇది వంశపారపర్యంగా వచ్చే అవకాశముందా? ఇది నెక్ట్స్ జరేషన్ కు కూడా కంటిన్యూ అయ్యే అవకాశముందా ? దీన్ని పూర్తిగా నివారించవచ్చా? అసలు నిపుణులు ఏమని చెబుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.... ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో డయాబెటిక్ ఎడ్యుకేటర్ వసుధరాణి, న్యాచురోపతి మరియు ఆక్యుపెంచర్ వైద్య నిపుణులు సాగర్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డయాబెటిక్ అనేది రోగం కాదన్నారు. డయాబెటిక్ తో వచ్చే రోగాలే అనారోగ్యానికి గురిచేస్తాయన్నారు. డయాబెటిక్ ఉన్నవారు అధిక నిద్ర, ఎప్పుడూ నీరసంగా ఉంటారని తెలిపారు. పలు విలువలైన సలహాలు, సూచనలు చేశారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:16 - February 7, 2018

ఖాప్ పంచాయతీలు అంటే ఏమిటీ ? దీనిపై ఇటీవలే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై టెన్ టివి మానవి 'మై రైట్' కార్యక్రమంలో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో లాయర్ పార్వతి పాల్గొని విశ్లేషించారు. ఖాప్ పంచాయతీలు అంటే...కమ్యూనిటీ ఎల్డర్స్ పంచాయతీ అంటారని పేర్కొన్నారు. ఇవి ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటాయని, కుల పెద్దలు పెద్దగా వ్యవహరిస్తూ సమాంతరమైన పోలీసు, న్యాయవ్యవస్థగా మార్చివేశారని పేర్కొన్నారు. వీరు ఎక్కువగా మహిళలను టార్గెట్ చేస్తుంటారని, కులాంతార..మతాంతర వివాహం చేసుకోవడం తప్పుగా పరిగణిస్తారని తెలిపారు. ఇలాంటి ఎన్నో వాటిల్లో తలదూరుస్తుండడంతో పరువు హత్యలు పెరుగుతున్నాయన్నారు. 'శక్తి వాహిని' అనే సంస్థ ఖాప్ పంచాయతీపై సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. ఖాప్ పంచాయతీలపై కొన్ని ఆంక్షలు విధించినట్లుగా అర్థమౌతుందని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

14:58 - February 6, 2018

వ్యవసాయం..ఈ పనుల్లో దాదాపు 80 మంది మహిళలే. మరి మహిళలు రైతులుగా గుర్తింపబడుతున్నారా ? ప్రభుత్వాలు ప్రకటిస్తున్న లబ్దిని వారు అందుకోగలుగుతున్నారా ? వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర..స్థితి గతులు ఎలా ఉన్నాయి ? 2018-19 వ్యవసాయ బడ్జెట్ లో మహిళా రైతులకు లబ్ది చేకూరుతుందా ? ఈ అంశంపై టెన్ టివి 'వేదిక' చర్చను చేపట్టింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:09 - February 1, 2018

ప్రభుత్వ స్కూల్స్ ను ఎత్తివేసేందుకు ప్రభుత్నాలు ప్రయత్నాలు చేస్తున్నాయని వక్తలు అన్నారు. ప్రభుత్వం పాఠశాలల మూసివేత బాలిక విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఇదే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో నేషనల్ ఉమెన్ టీచర్స్ ఫోరమ్ కన్వీనర్ సంయుక్త, తెలంగాణ టీచర్స్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ మళ్లీశ్వరీ పాల్గొని, మాట్లాడారు. విద్య వ్యాపారమయం అయిందని వాపోయారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

14:52 - January 10, 2018

వినియోగదారులు అంటే అందరూ వినియోగదారుల కిందకే వస్తారని..అనేక రకాల వస్తువులను కొనుక్కోవడం..అనేక సర్వీసులను పొందుతుంటామని లాయర్ పార్వతి పేర్కొన్నారు. వినియోగదారుల చట్టం అంటే ఏమిటీ ? ఈ చట్టం ఏ పరిస్థితుల్లో ఆశ్రయించవచ్చనే దానిపై టెన్ టివి మానవి 'వేదిక'లో లాయర్ పార్వతి పాల్గొని విశ్లేషించారు. డబ్బులు ఇచ్చి వస్తువులను కొనుక్కొనే వారు..డబ్బులు ఇచ్చి సర్వీసులను పొందే వారు వినియోగదారులంటారని తెలిపారు. పూర్తిగా డబ్బు చెల్లించడం..ఇన్ స్టాల్ మెంట్ ద్వారా..ఇతరత్రా దారుల్లో వస్తువులను కొనుక్కోవడం జరుగుతుందని తెలిపారు. నిత్య జీవితంలో అనేక సమస్యలు..మోసాలను ఎదుర్కోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే వినియోగదారుల రక్షణ చట్టం రూపొందించబడిందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:16 - January 8, 2018

భద్రత లేని సంచార జీవితం.... గంగిరెద్దు కుటుంబాల కష్టాలు... ఇదే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో గంగిరెద్దు కుటుంబ సభ్యులు రజిని, పద్మ పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని కుల వృత్తుల వారికి సహాయం చేస్తూ తమ కుల వృత్తిని మానేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందన్నారు. తమపై లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. షీ టీమ్స్ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Pages

Don't Miss

Subscribe to RSS - వేదిక