వేములవాడ

16:28 - October 11, 2018

కరీంనగర్ : చొప్పదండి టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్న శోభ ఆశలు నెరవేరడం లేదా ? ఆమెకు టికెట్ దక్కదా ? ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. తనకు టిక్కెట్ ఇవ్వకుండా పెండింగ్‌‌లో ఉంచడంతో బొడిగే శోభ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా అపదర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలువడానికి బొడిగె శోభ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం సిరిసిల్లలో కేటీఆర్‌ను కలువడానికి ప్రయత్నించినా అంతగా సమయం ఇవ్వలేదని ప్రచారం జరిగింది. 
ఈ నేపథ్యంలో గురువారం సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ రాకకోసం శోభ గంటపాటు ఎదురు చూశారు. వేములవాడకు చేరుకున్న కేటీఆర్..చెన్నమనేని రమేష్ నివాసంలో భోజనం చేశారు. ఈ భోజనానికి వారితో పాటు శోభ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య చొప్పదండి టికెట్ పెండింగ్ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కానీ మంత్రి కేటీఆర్ ఎలాంటి స్పష్టమైన హామీనివ్వకపోడంతో భోజనం మధ్యలో నుండే శోభ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తనకు టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలు ఎంత మాత్రం లేకపోవడంతో ఆమె తుదినిర్ణయానికి తీసుకొనే అవకాశం ఉందని, బీజేపీలో చేరుతారని పుకార్లు షికారు చేస్తున్నాయి.

19:31 - August 15, 2018

కరీంనగర్ : కాంగ్రెస్‌ పార్టీపై మరోసారి మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారంటూ ధ్వజమెత్తారు. కరీంనగర్ వేములవాడ 4 లైన్ల రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు వస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో రాని వాళ్లు ఇప్పుడు ఓట్ల కోసం మళ్లీ తెలంగాణకు వస్తున్నారన్నారు. 

 

09:12 - March 26, 2018
08:31 - March 26, 2018

సిరిసిల్ల : వేములవాడ ఆలయ ప్రాంగణంలో కోడెలు ఒక బాలుడి ప్రాణాలు తీశాయి. ఈ విషాదకర ఘటనతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆదివారం ఆయలంలో శ్రీరాముడి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుండి కల్యాణం వీక్షించేందుకు తరలివచ్చారు. రాత్రి సమయంలో ఆలయ పార్కింగ్ స్థలంలో కొంతమంది భక్తులు నిద్రించారు. గాఢ నిద్ర ఉన్న సమయంలో కోడెల గుంపు ఘర్షణ పడుతూ నిద్రిస్తున్న భక్తులవైపుకు వచ్చాయి. భక్తులను తొక్కుకుంటూ వెళ్లిపోయాయి. దీనితో మనీష్ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడనే మృతి చెందాడు. 

06:43 - March 4, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి కల్యాణ్య మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించేందుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం ఉదయం కళ్యాణ మహోత్సవం.. మంగళవారం రథోత్సవం, బుధవారం స్వామివారి ధర్మగుండం నందు త్రిశూల యాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో చెప్పారు. 

15:01 - February 13, 2018

సిరిసిల్ల : జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆలయా అభివృద్ధికి ఇప్పటికే భూమిని సేకరించమని ఆయన అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

06:42 - February 13, 2018

హైదరాబాద్ : శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు.. అన్ని శైవక్షేత్రాలూ.. శివజాగరణకు సమాయత్తమయ్యాయి. ఉదయం నుంచే భక్తుల ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలూ.. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ తదితర ప్రసిద్ధ క్షేత్రాలన్నీ భక్తజన సందోహంగా మారాయి. శివభక్తులు పంచాక్షరీ మంత్రాలతో.. ఆయా క్షేత్రాలు మార్మోగి పోతున్నాయి.
కోటప్పకొండ...పశ్చిమగోదావరి..వేములవాడ తదితర జిల్లాల్లో శివరాత్రి ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియో చూడండి.

09:15 - January 31, 2018

వరంగల్ : మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడారానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సుమారు కొన్ని కిలోమేటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చూస్తామన్న అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని తెలుస్తోంది.

బుధవారం సారలమ్మ..పగిడిద్దరాజు..గోవిందరాజు..గద్దెలపైకి తీసుకొని రానున్నారు. గురువారం సమ్మక్క - పగిడిద్దరాజు పెండ్లి వేడుక కార్యక్రమం జరుగనుంది. ఇందుకు ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వద్ద 300 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది.

మంగళవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి బయల్దేరారు. ఆయన తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి మేడారం చేరుకుంటారు. సారలమ్మతో కలిసి ముగ్గురు గద్దెల మీదకు చేరుకుంటారు. శుక్రవారం సమ్మక్క, సారలమ్మతోపాటు పగిడిద్దరాజు ఆయన తమ్ముడు గోవింద రాజులు గద్దెలమీదే ఉంటారు. జాతర చివరి రోజైన శనివారం సమ్మక్క వన ప్రవేశం చేస్తుంది. ఈ జాతరలోనూ పగిడిద్ద రాజు సమ్మక్కను పెళ్లాడతారు.

10:16 - January 8, 2018

కరీంనగర్ : వేముల వాడ ఆలయం వద్ద ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆలయం పార్కింగ్ వద్ద ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు..బ్లేడు..కత్తులతో దాడులు చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత దుండగులు పరారయ్యారు. చనిపోయిన వ్యక్తి మెదక్ జిల్లా ఘన్ పూర్ కు చెందిన బాలయ్యగా గుర్తించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇతను కుటుంబసభ్యులతో వచ్చాడా ? స్నేహితులతో వచ్చాడా ? అనేది విచారణలో తెలియనుంది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

17:45 - January 5, 2018

హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో కొంత ఊరట లభించింది. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై 6 వారాల పాటు హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై మళ్లీ వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని డిసెంబర్‌లో కేంద్రం రద్దు చేసినట్లు ఆగస్టు 31 న హోంశాఖ తీర్పు ఇవ్వగా చెన్నమనేని రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. సంవత్సరం పాటు భారత్‌లో ఉండాలనే నిబంధనను రమేశ్‌ పాటించనందున పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. దీనిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Pages

Don't Miss

Subscribe to RSS - వేములవాడ