వేసవి

13:33 - April 16, 2018

జలం ప్రాణాధారం, జలం జీవాధానం, జలమే జీవం, జలమే ప్రాణం. జలం లేకుంటే ప్రాణికోటి సమస్తం అంతం!! ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ నీటితోనే పని. అది లేకుంటే అన్ని పనులు బంద్! అసలు మానవ మనుగడే బంద్!! మనిషి బతకాలన్నా, పంట పండాలన్నా, జీవకోటి మనుగడ సాగించాలన్నా నీరే ఆధారం! అది లేకుంటే ? అసలు ఆ మాట తలచుకునేందుకే ధైర్యం చాలదు కదూ? నీటి కోసం గ్రామాలకు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కొట్టుకుంటున్నాయంటే కారణం మనుగడ, బ్రతికేందుకు ఆధారం? జీవాధానం. నీటి యుద్ధాలతో దేశాలకు దేశాలకు కొట్టుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. సాధారణంగా నీటికొరత అనేది చాలా ప్రాంతాలలో వుంది. అదీ వేసవి వచ్చిందంటే ఇక చెప్పేదేముంది. స్నేహితులుగా వుండే ఇరుగు పొరుగు వారు కూడా శతృవుల్లా మారిపోతారు. కారణం నీరు.

ప్రాణి మనుగడకు నీరు..
భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనె జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, ద్రవ రూపం వాయు రూపంలో అటే మేఘాలు, ఆవిరి రూపాలలో అన్నమాట. మరి నీరు ప్రాణి మనుగడను సాసిస్తోంది. 

నీటికోసం మైళ్ల దూరం కాలినడక..
నీటికోసం మైళ్లకొద్దీ దూరాలు వెళ్లి తెచ్చుకునే దుస్థితి నేటి కంప్యూటర్ యుగంలో కూడా వుంది అంటే పరిస్థితులు ఎంతటి దారుణంగా వున్నాయో ఊహించుకోవచ్చు..హలో అంటే పొలో మంటు ఇంటి ముంగిట్లో వచ్చి పడిపోయే పదార్ధాలు, వస్తువులు. కానీ వేసవి వచ్చిందంటే మాత్రం లీటరు నీరు రూ.100లు పెట్టి కొనుకునే పరిస్థితులు. బీటలు వారిని నేలమ్మ తల్లి. గంగమ్మ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పంటే వేసిన రైతన్న వరుణుడి కోసం ఎదురు చూస్తున్నట్లు..దాహార్తితో కటకటలాడిపోతున్న నేలమ్మను అభిషేకించేందుకు వానమ్మ కానరాని దుర్భర పరిస్థితులు.

వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు..
నడి వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మంచి నీటి కోసం అలమటించే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం... 404 జిల్లాల్లో గతేడాది అక్టోబర్ తర్వాత వర్షాల్లేకపోవడంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో 140 జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మరో 109 జిల్లాల్లో ఓ మోస్తరు కరువు ఉంది.

156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు..
156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు ఉంది. నిజానికి ఏటా చాలా జిల్లాల్లో ఈ పరిస్థితులు వేసవిలో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ ఏడాది శీతా కాలంలో అసలు వర్షాలే లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశవ్యాప్తంగా 63 శాతం వర్షాభావం ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రిజర్వాయర్లలో తక్కువ నీటి లభ్యత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.

17:02 - March 24, 2018

మనిషికి జిహ్వ చాపల్యం ఎక్కువే. అలాఅని కంటికి ఇంపుగా కనిపించినవల్లా తినేస్తుంటే కడపు డస్ట్ బిన్ లా తయారవుతుంది. తరువాత అల్సర్లు, అజీర్ణం వంటి పలు ఆరోగ్యం సమస్యపాలవుతాం. అంతేకాదు..అవి ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం పడే అవకాశం కూడా లేకపోలేదు..అందులోను ఎండలు మండే వేసవిలో మరింత జాగ్రత్తగా వుండాల్సిన అవసరముంది. అలాగే ఘనపదార్ధాలు తక్కువగా..ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటుండాలి. దీంతో శరీరంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా తేమ మనల్ని కాపాడుతుంది. మరి ఎండల వేసవిలో ఏమేమి తినకూడదో తెలుసుకుందాం..

ఘాటెక్కించే పదార్ధాలు..
ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలాల మోతాదును చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియ రేటు మందగించడానికి కారణమవుతాయి.

అజీర్తి సమస్యల మాంసాహారం..
వేడి వాతావరణంలో మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్.... వంటివి ఈ కాలంలో జీర్ణ సంబంధ సమస్యల్నీ పెంచుతాయి. అరుగుదల మందగించడం, విరేచనాలు, మలబద్దకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ తిన్నా..మంచినీరు ఎక్కువ శాతం తప్పకుండా తీసుకోవాలి. లేదంటే శరీరంలో వుండే తేమను మాంసాహారం హరించివేసి విరేచనాలు అయి డీ హైడ్రేషన్ బారిన పడే ప్రమాదం లేకపోలేదు..తస్మాత్ జాగ్రత్త..

కాఫీలు, టీలు..
వేసవిలో ప్రధానంగా బాధించేది డీహైడ్రేషన్. కొంతమందికి ఉదయం లేవగానే కాఫీ, టీలు తప్పకుండా తాగే అలవాటు వుంటుంది. కానీ వేసవిలో వాటిని సాధ్యమైనంత వరకూ తగ్గించి తీసుకుంటే మంచిది. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని నీటి శాతం తగ్గిపోయే ప్రమాదముందని నిపుణులు చెబుతుంటారు. డీహైడ్రేషన్ తో శరీరం కూడా తేమటమే కాక శరీరం కాంతిని కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.

డీప్ ఫ్రైలతో డీప్ ప్రాబ్లమ్స్..

నూనెలో వేయించినవి తగ్గించాలి. వేపుళ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటి వాటిని దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటి జోలికి వెళ్లకుండా వుంటే మరీ మంచిది. లేదంటే ఒకపక్క ఎండ తీవ్రతతో వికారం, అతిగా దాహం,నోరు పిడచకట్టుకుపోవటం వంటి సమస్యలు వస్తాయి.

జంక్ ఫుడ్స్..
ప్రస్తుత కాలంలో చాలామంది జంక్ ఫుడ్ బారిన పడి ఒబెసిటీబారిన పడటం చూస్తున్నాం, వింటున్నాం. కడుపు నింపడం తప్ప దేనికీ పనికి రాని ఈ ఫుడ్ మాత్రం ఒకదానికి బాగా పనికి వస్తుంది.అదేమంటి మనిషి ఆరోగ్యాన్ని చెడగొట్టటం. జంక్ ఫుడ్ కు ఎంత దూరంగా వుంటే అంత మంచిది..అందులోను వేసవిలో అస్సలు మంచిది కాదు. ఇందులో అధికంగా కేలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. పైగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటివి ఎదురవుతాయి.దీంతో తీసుకున్న అరగక, వాటర్ కూడా తాగలేకక ఆయాసం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి.

మన ఆరోగ్యం మనచేతిలోనే..
ఏ కాలంలోనైనా ప్రకృతి సహజమైన ఆహారం తీసుకుంటే ఇంటికి, ఒంటికి కూడా మంచిది. ఏ కాలంలో మనిషి ఏం తినాలో ప్రకృతే నిర్ణయించింది. అందుకే ఏకాలం తినాల్సిన పండ్లను, కూరగాయలను ఆ కాలంలో అందుబాటులో వుంటుంటాయి. అలాగే వేసవిలో లభించే పండ్లలో ఎక్కువ శాతం నీరు వుంటుంది. ఉదా: పుచ్చ,ద్రాక్ష,నిమ్మ, చెరకు, ఖర్బూజ వంటివి లభిస్తుంటాయి. అమ్మలాంటి ప్రకృతి మాత అందించే ఆహారాన్ని తీసుకుని వేసవిలో వచ్చే సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకుందాం..

 

15:40 - March 3, 2018
13:37 - March 2, 2018

వచ్చే వేసవి మండిపోనుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ఎండ ఎక్కువగా ఉందని పని చేయడం మానెస్తామా లేదు పని చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో బయటకు వెళ్లే ముందు కడుపు నిండ తినాలి. అది కూడా మసాల, ఫ్రై కర్రీస్ కాకుండా నీరు ఉండే పదార్థలు తీసుకోవాలి. అలాగే నల్లటి దుస్తువులు కాకుండా తెల్లవి కానీ ఇతర రంగు దుస్తువులు ధరించాలి. దుస్తువులు కూడా పలుచగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎండలో ఎక్కువ సేపు ఉంటే శీతాల పనీయలు కాకుండా కొబ్బరి నీళ్లు, చెఱకు రసం, సోడ, జ్యూస్,కరబుజ, కీరదోస వంటివి తీసుకోవాలి. ప్రతి అర గంటకు నీరు తాగాలి ఇలా చేస్తే శరీరానికి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. 

19:51 - May 18, 2017
11:47 - April 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు నేటి నుండే సెలవులను ప్రకటించారు. ఎండలు తీవ్రతరం అవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి విద్యాసంవత్సరం ఈ నెల 22తో ముగియనుంది. దీంతో ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కావాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు తీవ్రతరమౌతున్నాయి. ఉష్ణోగ్రతలు ఏకంగా 40-43 డిగ్రీలకు చేరుకుంటుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లకు వెళ్లే వారి పరిస్థితి అంతా ఇంతా కాదు. బుధవారం సీఎం కేసీఆర్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుండే స్కూళ్లకు సెలవులివ్వాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యాశాఖ నుంచి సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల కానుంది.

06:27 - April 7, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా జరిగిన కేబినెట్‌ భేటీలో కొత్త పాత మంత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మిర్చికి గిట్టుబాటుధర, వేసవిలో తాగునీటి సమస్యలపై ప్రధానంగా చర్చించారు. వర్షాకాలం వచ్చేనాటికి చెరువులు, కుంటలు, కాలువల మరమ్మతులు పూర్తి చేయడంతోపాటు... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెక్‌డ్యాంల్లో పూడికను తీయాలని నిర్ణయించారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 వేల చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని కూడా నిర్ణయంచారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పనులు చేపట్టాలని మంత్రి వర్గంలో చర్చించినట్టు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ కేబినెట్‌ చర్చించింది. దీనికోసం పంచాయతీరాజ్‌ శాఖలో టోల్‌ఫ్రీనంబర్‌ ఏర్పాటు, కమాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కేంద్రాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల మంచినీటి సమస్యలపై రాష్ట్రంలో ఏప్రాంతం నుంచైనా ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు కు వీలుకలుగుతుందన్నారు మంత్రి కాల్వశ్రీనివాసులు. అటు వేసవిలో వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక సదుపాయలు కల్పించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ మంత్రి వర్గం చర్చిందింది. గుంటూరు మిర్చియార్డును సందర్శించి.. పరిస్థితిని సమీక్షించాలని వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి, ధరల నియంత్రణశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా ఏపీ క్యాబినెట్‌ నిర్ణయించింది.

08:39 - March 28, 2017

చిత్తూరు : టీటీడీ  వేసవి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై నియంత్రణ విధించింది. వచ్చే నెల 7 నుంచి పది వారాల పాటు శుక్ర, శని, ఆదివారాల్లో  ప్రముఖుల ఉత్తరాలపై మంజూరు చేసే బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. ఈ మూడు రోజుల్లో ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోటులో పని చేస్తున్న 332 మంది, ఉగ్రాణంలో సేవలు  అందిస్తున్న  మరో 65 మంది కాంట్రాక్ట్‌  కార్మికులతోపాటు,  172 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సర్వీసులను ఏడాది పాటు పొడిగించారు. పలు కార్యక్రమాలకు నిధుల మంజూరు చేస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 
 

13:30 - March 21, 2017

వేసవి కాలం వచ్చేసింది..ఇక ఉక్కపోత..చెమట..వడదెబ్బ..ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఎండల ప్రభావం వల్ల శారీరకంగా..మానసికంగా..కృంగి పోతుంటారు. మరి ఈ సమస్య నుండి బయటపడడం ఎలా ? కొన్ని చిట్కాలు..

 • వేసవిలో నీడలోనే గడిపితేనే మంచిది. ఉద్యోగులు..బయటకు వెళ్లే వారు సన్ స్ర్కీన్, టోపి, సన్ గ్లాసెస్, గొడుగులు వంటివి ఉపయోగించాలి.
 • వేసవికాలంలో తగినంత నిద్ర ఉండి తీరాల్సిందే. సమయానికి నిద్ర పోవడం వల్ల మానసిక ప్రశాంతత చేరుకుంటుందనడంలో సందేహం లేదు.
 • వేసవిలో నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. ఇలా చేయడం వల్ల నీరసం రాదు. అంతేగాకుండా శరీరంలోని నరాలు..ఎముకలు బలంగా ఉంటాయి.
 • రోజు ఉదయం..సాయంత్రం వ్యాయామం చేయండి. కనీసం 20 నిమిషాలైనా నడవాలి.
 • తాజా ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
09:38 - February 23, 2017

ఎండకాలం వచ్చేస్తోంది. శివరాత్రికి చలి..శివ..శివ..అంటూ వెళ్లిపోతుందని పెద్దలు పేర్కొంటారు. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికం కావడంతో చాలా మంది డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. చాలా మంది చల్లగా ఉండటానికని మార్కెట్లో దొరికే శీతలపానీయాలు సేవిస్తుంటారు. కానీ ప్రకృతి నుండి లభించిన 'కొబ్బరి బొండాం' అయితే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు. ఈ కొబ్బరి బొండాం సేవించడం వల్ల పలు ప్రయోజనాలు దాగున్నాయి.

 • కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
 • చర్మంపై ముడతలు తగ్గిపోతాయి. గర్భిణీలకు కొబ్బరి బొండాం నీళ్లు ఎంతో మంచిది.
 • డీ హైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గించుకోవచ్చు.
 • నిత్యం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
 • టాక్సిన్స్ తొలగడమే కాకుండా కిడ్నీల్లో రాళ్లు కూడా క్రమేపీ తగ్గుతాయి.
 • కొబ్బరి బొండాం తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 • శరీరంలోని బ్యాక్టీరీయాను బయటకు పంపి యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి తొడ్పడుతుంది.
 • శీతాకాలంలో కూడా కొబ్బరి బొండాం సేవించవచ్చు. జలుబు రాకుండా ఉంటుంది.
 • వారం రోజుల పాటు కొబ్బరి బొండాం నీళ్లు తీసుకుంటే ముందులేని ఉత్సాహం వస్తుంది.
 • తెల్లవారుజామున పరగడుపున కొబ్బరి బొండాం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
 • కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉండాలంటే రోజూ ఓ కొబ్బరి బొండాంను తీసుకోవడం మంచిది.

Pages

Don't Miss

Subscribe to RSS - వేసవి