వైద్యం

10:26 - February 22, 2018

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం తాండవం చేస్తే ప్రైవేటు ఆస్పత్రుల్లో కాసుల కక్కుర్తి ప్రజలను నిండా ముంచుతున్నాయి. డాక్టర్‌ ఫీజు మొదలు కొని స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు, వివిధ రకాల టెస్టులు, మందులు, ఇంజిక్షన్లు ఇలా మొత్తం బిల్లు కలిసి సామాన్యున్ని నిలువు దోపిడీ చేసేస్తుంది. జాతీయ ఔషధ ధరల నియంత్రాధికార సంస్థ ఢిల్లీలో నాలుగు ఆస్పత్రుల్లో తనిఖీ చేయగా విస్తు గొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

అధిక ధరకు విక్రయం
చాలా వరకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మందులను అధిక ధరకు విక్రయిస్తుండడాన్ని ఎన్‌పీపీఏ అధికారులు గుర్తించారు. ఎమ్‌ఆర్‌పీ కన్నా చాలా తక్కువ ధరకు ఔషధ తయారీ సంస్థలు ఆస్పత్రులకు మందులు అందజేస్తున్నాయి. అయితే ఆస్పత్రులు మాత్రం కనీసం డిస్కౌంట్‌ కూడా ఇవ్వకుండా మందులను విక్రయిస్తున్నారు. అంతేకాకుండా... వాటిపై అధిక ధర ముద్రించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక చికిత్స కోసం ఆస్పత్రిలో చేరే వారు అక్కడి మందుల దుకాణంలోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాయి. దీంతో బయట తక్కువ ధరకు మందులు లభిస్తున్నా, పరిస్థితులు అనుకూలించక ఆస్పత్రిలోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఆస్పత్రులు షరతులు
అయితే ఔషధ తయారీ సంస్థలకు ఆస్పత్రులు షరతులు కూడా విధిస్తున్నాయి. మందులపై ధరలను ముద్రించే సమయంలోనే అధిక ధరను ముద్రిస్తేనే అధిక మొత్తంలో కొనుగోలు చేస్తామని చెబుతున్నాయి. కొన్ని ఆస్పత్రులు మూకుమ్మడిగా చర్చించుకొని ఇలా షరతులు విధించడంతో ఔషధ తయారీ సంస్థలకు మరో దారి లేక ఆ షరతును అంగీకరిస్తున్నాయి. ఉదాహరణకు... అడ్రెనార్ 2MG ఇంజక్షన్ ధర 189 రూపాయలు కాగా... బల్క్‌గా కొన్నందుకు కేవలం 15 రూపాయలకే లభిస్తుంది. కాని అది రోగి బిల్లులో మాత్రం 5వేల 310 రూపాయలుగా చూపించి వసూలు చేస్తారు. రెండు వాల్వలున్న త్రీవే స్టాప్‌కాక్ ధర 5రూపాయల 77పైసలకు కొని.. పేపెంట్లకు 106 రూపాయలకు విక్రయిస్తున్నారు. లాభం 1737శాతం. ఇలాంటి అక్రమాలు చాలానే కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. తమ మందులను విక్రయించుకునేందుకు, లభాలు పొందేందుకు ఔషధ తయారీ సంస్థలు మందులపై అధిక ధరలు ముద్రిస్తున్నాయి. దీంతో రోగుల జేబుకు భారీగా చిల్లు పడుతోంది.

డెంగీ, ఇతర వ్యాధులు
ఇటీవల కొందరు డెంగీ, ఇతర వ్యాధుల కారణంగా మరణించడంతో వారి కుటుంబాలకు చెందిన పలువురు ఎన్‌పీపీఏకు ఫిర్యాదు చేశారు. బయట దుకాణాలతో పోలిస్తే ఆస్పత్రులలో మూడు నుండి నాలుగు రెట్లు అధిక ధరకు మందులు విక్రయిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌పీపీఏ అధికారులు తనిఖీలు చేసి ఈ విషయాలను వెళ్లడించారు. ఆస్పత్రుల్లో మందులను విక్రయించడం ద్వారా ఏకంగా 350 నుండి 1737 శాతం అధికంగా లాభం పొందుతున్నాయని గుర్తించారు. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. 

21:33 - February 18, 2018
20:25 - February 4, 2018
17:46 - February 4, 2018
16:40 - January 28, 2018
16:47 - December 17, 2017
21:33 - December 16, 2017

నేరేళ్ల బాధితులకు తప్పని తిప్పలు...కలెక్టర్ ఆఫీసుల ఆత్మహత్యాయత్నం, ముప్పై ఎన్మిది వేల ఉద్యోగాలిచ్చినం..తలసానిగారూ.. అవ్వతోడు నిజమేనా?, మైసమ్మ గుడి మీద మానవుల దాడి...ఘట్ కేసర్ కాడ గలీజు గాళ్ల పని, అంబులెన్సును ఆపేశ్న పోలీసులు...వైద్యం అందక అండ్లున్న పేషెంటు మృతి, ఐపీఎస్ ఐడీ కార్డేసుకున్న అవారాగాడు..ట్రైనింగ్ కోసం జైలుకు వంపిన పోలీసులు, నాగుంబాముకు.. జెర్రిపోతుకు పెండ్లి..విశ్వశాంతి కళ్యాణం కథ జూడరాండ్రి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

17:46 - December 9, 2017

మహబూబాబాద్ : తొర్రూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. సరైన వైద్యం అందక నిండు ప్రాణం బలైంది. తొర్రూరు మండలం సోమారం గ్రామానికి చెందిన దశరథ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో పురుగుమందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు తొర్రూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు అందుబాటులో లేకపోడడంతో నర్సులు చెట్టుకిందనే వైద్యం చేశారు. దీంతో సరైన వైద్యం అందక దశరథ చనిపోయాడు. మృతుడి బంధువులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

17:00 - December 3, 2017
15:55 - November 29, 2017

నిజామాబాద్ : పేదరికంలో మగ్గిపోతూనే డాక్టర్‌ అయ్యాడు. తన చదువు పేదలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాడు. అంతటితోనే సంతృప్తి పడలేదు. నిత్యం గిరిజన తండాల్లో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిజామబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్‌ మోతీలాల్‌ ప్రజల చేత శహబాష్‌ అనిపించుకుంటున్నారు.
పేదరికం బాధిస్తున్నా పట్టుదలగా చదువు పూర్తి 
నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం వెంకటాపూర్ తండాకు చెందిన మోతిలాల్ చిన్నప్పటి నుండి డాక్టర్‌ కావాలనే కోరిక ఉండేది. కాని వైద్యవిద్య చదవాలంటే మాములు మాట కాదు. లక్షల రూపాయల ఖర్చవుతుంది. పేదరికంబాధిస్తున్నా   పట్టుదలగా చదివారు.  ప్రభుత్వ హాస్టల్స్‌లో  ఉంటూ స్కూల్‌ విద్యాను పూర్తిచేశారు. యంబిబిస్‌లో ర్యాంక్ సంపాధించారు మోతీలాల్‌నాయక్‌. డాక్టర్‌ అయ్యాక తన చదువు, వైద్యం పేద ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో సేవాసంస్థను స్థాపించారు. శశాంక్‌ఫౌండేషన్‌ పేరుతో ద్వారా నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలో ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.   
వృత్తి వైద్యం..ప్రవృత్తి సమాజ సేవ 
ఓవైపు వైద్యవృత్తిని నిర్వహిస్తూనే..మరోవైపు  తన ప్రవృత్తి అయిన సమాజసేవను ప్రారంభించారు. గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతున్నారు.  నిత్యం జిల్లాలోని పలు తండాల్లో పర్యటిస్తూ గిరిజనుల సమస్యలను తీర్చడానికి కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీపడాలని నిర్ణయించుకున్నట్టు డాక్టర్‌ మోతీలాల్‌ చెబుతున్నారు. వైద్యుడిగా ఎదిగి,  పేదలకు సేవలు అందిస్తున్న గిరిజబిడ్డ  రాజకీయాల్లోనూ రాణించాలని నిజామాబాద్‌జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.  

 

Pages

Don't Miss

Subscribe to RSS - వైద్యం