వైవీ సుబ్బారెడ్డి

15:07 - October 11, 2018

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసినా.. ప్రధాని మోదీని వైఎస్ జగన్ ఒక్క మాట కూడా అనడం లేదని, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న కారణంగానే జగన్ నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబు ఆరోపిస్తుంటే.. వైసీపీ నాయకులు అంతే ధీటుగా బదులిస్తున్నారు. బీజేపీతో కలిస్తే మాపై కొత్తగా ఈడీ కేసులు ఎందుకు పెడతారని? వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసలు జాతీయ పార్టీలతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారాయన. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడిన వైవీ సుబ్బారెడ్డి.. తమ రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. 

వంగవీటి రాధా ఎపిసోడ్‌పైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వంగవీటి రాధా వైసీపీలోనే ఉన్నారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కొన్ని మార్పులు జరుగుతుంటాయన్నారు. ఇక 2019 ఎన్నికల్లో నేను ఒంగోలు నుంచే పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై అధినేత జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు.

13:08 - April 9, 2018

ఢిల్లీ : హస్తినలో దీక్షచేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన్ను దీక్షా శిభిరం నుంచి ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌కు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు ఇప్పటికీ ఏపీ భవన్‌ వద్ద  ఎంపీలు అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తమ దీక్షను కొనసాగిస్తున్నారు. 

16:17 - April 4, 2018

ఢిల్లీ : చంద్రబాబు ఢిల్లీకి వచ్చి సాధించిందేమిటని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతామంటూ ఎన్డీఏ కూటమి నేతలను కలిశారని చెప్పారు. టీడీపీ డ్రామాలు బయటపడ్డాయన్నారు. విపక్ష నేతలను కలిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. హోదా కోసం తాము రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. ఏపీ ఎంపీలంతా రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందని చెప్పారు. చంద్రబాబు సినిమా నటులతో ఫొటోలు దిగేందుకే వచ్చారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

17:53 - April 2, 2018

ఢిల్లీ : చంద్రబాబు ఢిల్లీకి వచ్చేది తనపై కేసులు రాకుండా చూసుకోవడానికో.. లేక ఏపీ ప్రయోజనాల కోసమో చూడాల్సి ఉందన్నారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేసి నిరహార దీక్షకు కూర్చోవాలన్నారు. రాష్ట్రంలో 23 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం ఖచ్చితంగా దిగి వస్తుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

18:24 - November 4, 2017

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కావడంతో.. ఏపీ రాజకీయాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జగన్‌ పాదయాత్రపై అధికారపార్టీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పనిలో పనిగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. బాయ్‌కాట్‌ చేయడం వల్లే వైసీపీ నేతలు చేజారిపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. జగన్‌ పాదయాత్ర ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో...ఏపీలో పొలిటికల్‌ టెంపరేచర్‌ పీక్‌ స్టేజికి చేరింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇరుపార్టీల నేతలు మాటలతోనే మంటపుట్టిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రను సక్సెస్‌ చేసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాలు పన్నుతుంటే..అధికార పార్టీ నేతలు ఫ్యాన్‌ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. జగన్‌ టార్గెట్‌గా విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

జగన్‌ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తమ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలు ఇంకా మరికొందరు ఉన్నారని చెబుతున్నారు. రాజమండ్రిలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. పాదయాత్ర ఎవరు చేయాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం ఇష్టం లేకనే ముద్రగడ తన పాదయాత్రకు అనుమతి తీసుకోవడం లేదన్నారు.

ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వర్లరామయ్య... జగన్‌మోహన్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్‌ ఎంతమంది దేవుళ్లకి మొక్కినా.. జైలు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమదంలో ఇంటిఇంటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చెలమలశెట్టి రామాంజనేయులు.. జగన్‌పై ఫైరయ్యారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే జగన్‌ ఓర్వలేకపోతున్నారని..రాష్ట్రానికి ఓ శనిగ్రహంలా తయారయ్యారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం జగన్‌ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మరోవైపు అధికార పార్టీ విమర్శలను ప్రతిపక్ష నేతలు తిప్పికొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్‌ పాదయాత్రపై కుట్రలు చేయడం మానుకోవాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన..ప్రధాన ప్రతిపక్షనేతగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్‌కు ఉందన్నారు. ప్రజా సమస్యలు తెలుకోవడానికి చేపడుతున్న పాదయాత్ర కోసం పోలీసుల అనుమతి ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేసినప్పుడు పోలీసుల అనుమతి ఎందుకు తీసుకోలేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా జగన్‌ పాదయాత్ర ప్రారంభానికి ముందే..టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

13:10 - October 18, 2017

ఢిల్లీ : పోలవరం నేషనల్ ప్రాజెక్టా....నేషనల్ స్కాం  అని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందని అన్నారు. కాంట్రాక్టర్ ఒకరైతే పనుల చేసేది మరొకరని పేర్కొన్నారు. రెండు, మూడేళ్లైన పూర్తి అయ్యే పరిస్థితి లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:19 - August 20, 2017

కర్నూలు : చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో విఫలమైయ్యారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అభివృద్ధి పేరిట మోసపూరిత వ్యాఖ్యలు చేశారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకే మొగ్గుచూపుతారంటున్న ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

12:07 - August 20, 2017

కర్నూలు : చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో విఫలమైయ్యారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అభివృద్ధి పేరిట మోసపూరిత వ్యాఖ్యలు చేశారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకే మొగ్గుచూపుతారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss

Subscribe to RSS - వైవీ సుబ్బారెడ్డి