వ్యాధి

14:52 - November 3, 2017

అన్ వాంటెడ్ హేర్..ఈ సమస్యతో మహిళలు బాధ పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. దీనిని తొలగించుకోవడానికి పలు దారులు వెతుకుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయనే దానిపై చర్మవ్యాధి నిపుణులు శంకుతల తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:19 - October 11, 2017

 

ప్రకాశం : జిల్లా గౌనివారిపాలెం, ఉలిచి గ్రామాల్లో గొర్రెలకు వింత వ్యాధి సోకి మరణిస్తున్నాయి. నవరత్నాల ఆకులుతిని గొర్రెలు మృత్యువాత పడుతున్నాయిని కాపరులు చెబుతున్నారు. రెండు గ్రామాల్లో ఇప్పటి వరకు 200 గొర్రెలు మృతి చెందాయి. మరో 500 గొర్రెలకు తీవ్ర ఆస్వస్థత గురైయ్యాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:30 - August 14, 2017
17:19 - June 3, 2017

నిర్మల్ : జిల్లాలోని దస్తూరాబాద్ మండలం మున్యాల్ లో వింతవ్యాధి సొకుతుంది. గ్రామంలోని 200 మంది చర్మంపై దద్దుర్లు, మంట, ఎలర్జీతో బాధపడుతున్నారు. గ్రామస్తులు పురుగులు కుట్టడమో...లేక నీటి కాలుష్యమో తెలియక ఇబ్బందిపడుతున్నారు. చర్మంపై దద్దుర్లు రావడంతో రాత్రి నిద్రపోవడం లేదని బాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైద్య క్యాంపు ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:32 - January 17, 2017

హైదరాబాద్‌ : నగరాన్ని స్వైన్‌ఫ్లూ వ్యాధి మళ్లీ వణికిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో రెండు స్వైన్‌ఫ్లూ మరణాలు నమోదయ్యాయి. పాతనగరం జాహనుమాకు చెందిన మహిళ స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో రెండు రోజుల క్రితం మృతి చెందింది. అలాగే మృతురాలి కొడుకు కూడా ఇదే వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మొత్తం స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ముగ్గురు చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. గత సంవత్సరం 17 మంది స్వైన్‌ ఫ్లూకు చికిత్స పొందగా వారిలో ఇద్దరు మరణించినట్టు ఆయన చెప్పారు.

16:52 - September 17, 2016

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌కు డెంగ్యూ వ్యాధి సోకింది. రెస్ట్‌ తీసుకోవాలని ఆమెకు వైద్యులు సలహా ఇచ్చారు. విద్యాబాలన్‌కు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆమె నివసించే అపార్ట్‌మెంట్‌లో బిఎంసి అధికారులు సోదా జరిపారు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ నివాసంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో డెంగీని వ్యాప్తి చేసే దోమలు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. డెంగ్యూను అరికట్టడం విఫలమయ్యారన్న కారణంతో విద్యాబాలన్‌, షాహిద్‌కపూర్‌లతో పాటు మరో అపార్ట్‌మెంట్‌ నివాసికి మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యాబాలన్‌, షాహిద్‌ కపూర్‌ ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉంటున్నారు.

 

19:38 - September 13, 2016

ఢిల్లీ : రాజధాని ఢిల్లీలో చికెన్ గునియా విజృంభిస్తోంది. ఇప్పటివరకు చికెన్ గునియా వ్యాధితో నలుగురు మృతి చెందారు. సర్‌ గంగారాం ఆసుపత్రిలో ఈ వ్యాధితో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. సెప్టెంబర్‌ 1 న ఒకరు చనిపోయారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ ఢిల్లీలో లేకపోవడంపై విపక్షాలు విమర్శించాయి. ఢిల్లీ సిఎం, మంత్రుల వద్ద ఎలాంటి అధికారాలు లేవని, ఒక పెన్ను కూడా తాము కొనలేని స్థితిలో ఉన్నామని కేజ్రీవాల్‌ అన్నారు. అధికారాలన్ని ప్రధాని మోది, ఎల్జీ హస్తగతం చేసుకున్నారని ట్వీట్‌ చేశారు. దోమలను అరికట్టడానికి ఢిల్లీ నగరపాలక సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో 1158 డెంగ్యూ, 1057 చికన్‌గునియా, 21 మలేరియా వ్యాధులు నమోదయ్యాయి.

08:50 - September 6, 2016

నిజామాబాద్‌ : తన వయస్సు పిల్లలతో ఆడుతూ-పాడుతూ గంతులేయాల్సిన వయస్సులో ఓ చిన్నారి మంచానికే పరిమితమైంది. నడవలేని పరిస్థితుల్లో నిత్యం తల్లడిల్లుతోంది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆ పాపకు చికిత్స చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. నిత్యం పనిచేస్తేగానీ పొట్టగడవని పరిస్థితి ఆ కుటుంబానిది. ఈ పరిస్థితుల్లో తమ కూతురు ప్రాణాలు కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు ఆ నిరుపేద దంపతులు..!

రెండేళ్ల వయస్సులో ఆడుకుంటూ కిందపడ్డ అలేఖ్య
అమ్మ చేత్తో ఎంతో ఇష్టంగా గోరుముద్దలు తింటున్న ఈ చిన్నారికి పెద్ద కష్టమే వచ్చింది. నాన్న సాయంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్న ఈ చిన్నారి ప్రాణంతక వ్యాధితో బాధపడుతోంది.

ఎడమకాలు, చేయి, కన్ను పనిచేయని పరిస్థితి
నిజామాబాద్‌ మండల కేంద్రంలోని గొల్‌హన్మన్‌ ప్రాంతంలో నివసిస్తున్న రవీందర్‌, శారద దంపతుల పాప ఈ చిన్నారి. పేరు అలేఖ్య. రెండేళ్ల వయస్సున్నప్పుడు ఆడుకుంటూ వెళ్లి.. ఐదు అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. దీంతో మెదడు, కుడికాలికి బలమైన గాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రిలో చూపించారు. అయినా చిన్నారి కోలుకోలేదు. డాక్టర్ల సూచనల మేరకు అన్ని ఆస్పత్రులు తిరిగారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో తలకు సర్జరీ చేశారు. అయినా.. అలేఖ్య కోలుకోలేదు. అందరిలా నడవలేకపోతోంది. ప్రస్తుతం కుడిచేయి, కుడికాలు, ఎడమ కన్ను మాత్రమే పనిచేస్తున్నాయి. మరోకాలు, చేయి, కన్ను పనిచేయడం లేదు.

రూ. 8లక్షలు ఖర్చు చేసిన నిరుపేద దంపతులు
చిన్నారి కోలుకోవడం కోసం తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రి లేదు. అలేఖ్యను పరీక్షించిన వైద్యులు.. ట్రామాటిక్‌ బ్రెయిన్‌ సమస్యతో బాధపడుతోందని తేల్చారు. పై నుంచి కిందపడడం వల్ల తలకు బలమైన గాయం అయ్యి.. కండరాల బలహీనతకు గురయ్యిందని చెప్పారు. చిన్నారికి ఆపరేషన్‌ చేస్తే.. కోలుకుంటుందని వివరించారు. శస్ర్తచికిత్సకు కనీసం ఆరు లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. రోజు కూలిపని చేసుకుని జీవించే ఈ దంపతులు ఇప్పటికే 8 లక్షల వరకు అప్పు చేసి.. వైద్యానికి ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరో 6 లక్షలు ఎలా సమకూర్చాలో తెలియక కుమిలిపోతున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి చూసి తల్లడిల్లిపోతున్నారు.

దాతల కోసం నిరుపేద దంపతుల ఎదురుచూపులు
కూతురు వైద్యానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఈ నిరుపేద దంపతులు దాతల కోసం ఎదరుచూస్తున్నారు. అలేఖ్యకు ఆర్థిక సహాయం చేసి.. ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.

మనసున్న మారాజులూ స్పందించండి..
చిన్నారి వైద్యఖర్చులకు మీరిచ్చే ప్రతి రూపాయి అలేఖ్య ప్రాణాలు కాపాడుతాయి. ఒక కుటుంబంలో సంతోషాలు పంచుతాయి. రండి.. మనసున్న మారాజులు ముందుకొచ్చి.. చిన్నారి అలేఖ్య ప్రాణాలు కాపాడండి. ఈ నిరుపేద కుటుంబంలో దీపాన్ని వెలగించండి.

13:45 - November 14, 2015

'డయాబెటిస్‌ జబ్బు కాదు. కానీ ఎన్నో జబ్బులకు కారణం. ఇది ఒక శారీరక స్థితి.. డైజెస్టివ్‌ డిజార్డర్‌. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. 1985లో ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల డయాబెటిస్‌ కేసులుంటే 2013 నాటికి 382 మిలి యన్లకు పెరిగాయి. 2035 నాటికి 592 మిలియన్‌ డయాబెటిస్‌ కేసులు నమోదయ్యే ప్రమాదముందని అంచనా. దాదాపుగా మన దేశంలో ప్రతీ కుటుంబంలో ఒక్కరైనా డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ప్రతీ నలుగురిలో ఒకరు డయాబెటిస్‌ బాధితులు. ప్రపంచ వ్యాప్తంగా మనదేశమే డయాబెటిస్‌కి కేపిటల్‌ గా ఉంది. ప్రస్తుతం దేశంలో సుమారు 50 మిలియన్ల డయాబెటిస్‌ కేసులున్నాయని తెలుస్తోంది. 2025 నాటికి 60 మిలియన్లు దాటే అవకాశాలున్నాయి. సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా డాక్టర్‌తో చెకప్‌ చేయిస్తూ, సూచనలు పాటిస్తే డయాబెటిస్‌ పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

డయాబెటిస్‌ వ్యాధి కాదు...
డయాబెటిస్‌ వ్యాధి కాదు. జీర్ణమైన ఆహారం శరీరానికి సరిగ్గా వంట బట్టని స్థితి. మనం తీసుకున్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారుతుంది. ఈ గ్లూకోజ్‌ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది. కానీ కణాలు రక్తంలోని గ్లూకోజ్‌ని తీసుకోలేక, ఆహారం సరిగ్గా అందక బాధపడుతుంటాయి. కారణం ఇన్సులిన్‌ అనే ఎంజైమ్‌ కావలసినంతగా ఉత్పత్తి కాకపోవడమే.

మధుమేహ వ్యాధి లక్షణాలు..
ఎక్కువ దాహం, ఎక్కువగా మూత్ర విసర్జన కావడం, అలసట ఎక్కువగా ఉండడం, తగిలిన గాయం త్వరగా మానకపోవడం, చూపు మందగిం చడం వంటివి వ్యాధి లక్షణాలుగా గుర్తించవచ్చు. జీర్ణమవడం, మల విసర్జ నలో తేడాలు వస్తుంటాయి. సెక్స్‌ సామర్ధ్యం తగ్గుతుంది. కాళ్లు, చేతులు మొద్దుబారుతుంటాయి.

డయాబెటిస్‌లో టైప్‌1, టైప్‌ 2
ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకున్నా శారీరక కదలికలు కావలసినంతగా లేకపోవడం వల్ల ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ శరీరంలో పెరిగి వచ్చే డయాబెటిస్‌ని టైప్‌2 డయాబెటిస్‌ అంటారు. ఎక్కువ కేలరీలున్న ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ అంటే వ్యాయామం పెంచడంతో టైప్‌2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.శరీరంలో తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చే డయాబెటిస్‌ టైప్‌1 డయాబెటిస్‌. వీళ్లకి కృత్రిమ ఇన్సులిన్‌ని కండరాలలోకి తగిన మోతాదులో పంపడమే టైప్‌ 1 డయాబెటిస్‌ని అదుపులో ఉంచడానికి సరైన మార్గం.

14:08 - October 17, 2015

ఫొటోలో ఉన్న వ్యక్తిని చూశారా ? ఇతను ఎక్కువ కాలం బతకడంట. చూడటానికి ముసలివాడిగా కనిపిస్తున్న చిన్నారి వయస్సు 14 ఏళ్లే.  ఏ చిన్నారికి రాని వ్యాధి ఇతనికి సోకింది. ఇతని పేరు నిహాల్ భిట్లా. అందరిలాగానే అన్నింటిలోనూ ముందుంటున్నాడు. విద్య..సోషల్ యాక్టివిటీస్..తనకు వచ్చిన ప్రతి పనిలో ముందుంటున్నాడు. కానీ భిట్లా ఓ రకమైన జెనటిక్ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఎక్కువ కాలం బతికే అవకాశాలు లేవని తెలుసుకున్న తల్లిదండ్రులు నిహాల్ చివరి కోరికలు తీర్చడానికి సిద్ధమయ్యారంట. తాను చనిపోయే లోపు 'హోండా' కంపెనీ తయారు చేసిన ఆసియా 'రోబో'..కాలిఫోర్నియా 'డిస్నీల్యాండ్' చూడాలని అనుకుంటున్నాడంట. ఇతని కోరికలను నెరవేర్చాలని తండ్రి భావిస్తున్నాడంట. నిహాల్ కోరికలు నెరవేరుతాయని ఆశిద్దాం. 

Don't Miss

Subscribe to RSS - వ్యాధి