వ్యాపారి

15:56 - December 6, 2018

పుదుచ్చేరి : మన ఇంటిలోకి పాము వచ్చిందంటే కొట్టి చంపేస్తాం. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తాం. అంతే తప్ప ఏకంగా ముఖ్యమంత్రిగారికి ఫోన్ చేసి రక్షించండి అని అడగం కదా? ఏం ఎందుకు సీఎంను అడగకూడదు అనుకున్నాడో పాము బాధితుడు. పాము నుండి రక్షించండి సీఎంగారూ అంటు ఏకంగా ఫోన్ కొట్టాడు. 
పుదుచ్చేరి రాష్ట్రం, అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారి ఇంట్లోకి ఓ త్రాచుపాము వచ్చింది. భయపడిన రాజా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాడు. స్పందించకపోవటంతో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని ఏకంగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి ఆయన అడ్రస్ తెలుసుకోవటమే కాకుండా రాజాకు ధైర్యం చెప్పారు. 
అంతేకాదు వ్యాపారి రాజా ఇంటికి వెంటనే వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించి రాజా అడ్రస్ ను అటవీశాఖా అధికారులను తెలిపారు సీఎం నారాయణ స్వామి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబర్ 5వ తేదీన రాత్రి జరిగింది. సీఎంగారి ఆదేశాలతో రాజా ఇంటికి వెళ్లిన వారు పామును పట్టుకోవడంతో రాజా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

12:17 - February 12, 2018

హైదరాబాద్ : నగరంలో హవాల గుట్టురట్టైంది. అబిడ్స్, బంజారాహిల్స్, అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పోలీసులు అదుపులో గుజరాత్ చెందిన వ్యాపారి పటేల్ ఉన్నారు. వారి వద్ద నుంచి కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:13 - November 11, 2017

హైదరాబాద్ : నగరంలోని నగల వ్యాపారి సింగపూర్‌లో హత్యకు గురయ్యాడు..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతుంది..కిడ్నాపర్లు పక్కా ప్లాన్‌తో వ్యాపారిని రప్పించి బంధించారు...ఆ తర్వాత మూడు కోట్లు డిమాండ్ చేసి చివరకు చంపారు.. అయితే కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్ పాకిస్థాన్ చెందినవాడుగా తెలుస్తోంది...పాక్ యువకుడికి...నగల వ్యాపారికి లింకులేంటి.???

హైదరాబాద్ కు చెందిన నగల వ్యాపారి వాసుదేవరాజ్ కుషాయిగూడలో ఉంటున్నాడు...కమలానగర్‌లో ఉంటున్న వాసుదేవ్‌ వ్యాపారం విషయమై సింగపూర్ కు తీసుకెళ్లారు దుండగులు...ఆ తర్వాత ఓ గదిలో బంధించారు...వాసుదేవ్‌ను కిడ్నాప్ చేశామని.. విడిచిపెట్టాలంటే మూడు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు...వాసుదేవ్‌ను బంధించిన ఫోటోలు వాట్సాప్ ద్వారా కుటుంబీకులకు పంపారు...జరిగిన ఘటన నుంచి తేరుకునేసరికి కుటుంబ సభ్యుల నుంచి స్పందన లేదని వాసుదేవ్‌ను కిరాతకంగా చంపారు కిడ్నాపర్లు..

గత నెల 31న వాసుదేవ్‌ హత్యకు గురయినట్లు గుర్తించిన సింగపూర్ పోలీసులు ఇండియన్ అంబసీకి సమాచారం అందించారు..దీంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొద్ది కాలంగా ఫేస్ బుక్ లో పరిచయం అయిన పాకిస్థాన్ చెందిన యువకుడితో హత్యకు గురయిన వాసుదేవ్‌ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు...దీంతో ట్రాప్ చేసిన ఆ దుండగులు వ్యాపారం నిమిత్తం వాసుదేవ్ ను సింగపూర్ పిలిపించి ఉంటాడని పోలిసులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్ చెందినవారంటూ పరిచయం చేసుకున్నారా.. లేక మరేదైనా జరిగిందా..? వాసుదేవ్ వారితో వ్యాపార లావాదేవీలు ఏదైనా చేశాడా..?^లేక వారి ట్రాప్‌లో పడి సింగపూర్ వెళ్లాడా..? ఇలాంటి ఎన్నో విషయాలపై అనుమానాలున్నాయి..పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు...

కుషాయిగూడ చెందిన వాసుదేవ్ రాజ్ కన్పించకపోవడంతో కుటుంబ సభ్యులు గతంలో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు...వాసుకు చెందిన పాస్ పోర్ట్, విసా తదితర వివరాలతో సింగపూర్ పోలిసులు భారతీయుడు హత్యకు గురైనట్లు కనుగొని సమాచారం చేరవేశారు...సింగ్ పూర్ నుంచి వాసు డెడ్‌బాడీని హైదరాబాద్ తెప్పించేందుకు కుటుంబీకులు..పోలీసులు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు..మరో రెండ్రోజుల్లో డెడ్‌బాడీ వచ్చే అవకాశం ఉంది...

13:59 - July 12, 2017

కామారెడ్డి :  పట్టణంలో విత్తనాల వ్యాపారం చేస్తున్న మోహన్‌ ఊర్లో నుంచి ఉడాయించాడు. తీరా కారణాలు వెలికితీస్తే 16 కోట్ల రూపాయల మేర టోకరా వేసినట్లు బయటపడింది. గత నాలుగు రోజుల నుంచి మోహన్‌ పత్తా లేకుండా పోయాడు. మరోవైపు షాపుకు తాళాలు వేసి ఉండడంతో పాటు.. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. డైలీ మార్కెట్‌లో నివాసం ఉండే మోహన్‌... 20 ఏళ్లుగా కామారెడ్డి జిల్లాతో పాటు.. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో రైతుల దగ్గర నుంచి ధాన్యం, సోయ, పెసర్లు, మినుములు కొనుగోలు చేస్తున్నాడు. ఇతరుల కంటే కొద్దిగా ఎక్కువ ధర ఇస్తానని చెప్పడంతో అందరూ ఈయనకే పంటలు అమ్ముతున్నారు. అయితే.. ఒకేసారి డబ్బులు చెల్లించకుండా విడతలవారీగా చెల్లిస్తానని రైతులను నమ్మించాడు. ఇలా అనేక లక్షల మేర పంటలను రైతుల నుంచి కొనుగోలు చేశాడు. మరోవైపు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఇతర వ్యాపారుల వద్ద కూడా భారీగా అప్పులు చేశాడు. రైతులకు పంటలు వేసుకునే సమయానికి డబ్బులు ఇస్తానన్నాడు. గత నాలుగైదు రోజుల నుంచి మోహన్‌ కనిపించకుండాపోవడంతో... రైతులు షాపు వద్దకు వచ్చారు. తాళాలు వేసి ఉండడంతో ఫోన్లు చేశారు. ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులను అడిగితే తమకు కూడా ఎలాంటి సమాచారం లేదంటున్నారు. దీంతో తామంతా మోసపోయామని బాధితులంటున్నారు.

తన కూతురి పెళ్లి కోసం
ఇదిలావుంటే మరికొంతమంది స్థానికులు కూడా మోహన్‌ వద్ద డబ్బులు దాచుకున్నారు. తన కూతురి పెళ్లి కోసం డబ్బులు దాచుకుంటే... ఇప్పుడు ఇలా జరిగిందని.. ఏం చేయాలో అర్ధం కావడం లేదని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక మోహన్‌ మోసాలపై బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు.. ఇతర ప్రజాప్రతినిధులను కలిసేందుకు కూడా బాధితులు సిద్దమవుతున్నారు. ఎలాగైనా మోహన్‌ను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

08:27 - November 24, 2016

హైదరాబాద్ : సైదాబాద్ లో ఓ వ్యాపారి ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం కలకలం రేగింది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు అనంతరం కొద్ది రోజులకు ఈ సోదాలు జరగడం గమనార్హం. సైదాబాద్ లో వ్యాపారి నర్సరాజు నివాసం ఉంటున్నాడు. ఇతని వద్ద భారీ మొత్తంలో నగదు, పన్నుల ఎగవేతకు పాల్పడ్డారనే సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం నుండి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం కూడా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నర్సారాజు వద్ద రూ. 35 నుండి రూ. 40 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. సోదాలు జరిగే సమయంలో ఇంట్లోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు. సోదాల అనంతరం వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

20:18 - November 19, 2016

అనంతపురం : తాడిపత్రిలో నడిరోడ్డుపై తాగుబోతులు వీరంగం చేశారు. జామపండ్ల వ్యాపారిపై ఆరుగురు మందుబాబులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆ చిరువ్యాపారికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘనస్థలికి చేరుకున్న పోలీసులు దాడి దృశ్యాలను స్థానికంగా వున్న సీసీ కెమెర పుటేజ్ లో పరిశీలించారు. దీంతో మందుబాబుల్లో ఒకరైన నూర్ బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో వున్న మిగతా ఐదుగురికోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. నిందితులపై 325,355,ఎస్సీ,ఎస్టీ కేసును పోలీసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే రోడ్డుపై జామ‌కాయలు అమ్ముకుంటున్న చిరువ్యాపారి వద్దకు గుంపుగా ఆరుగులు మందుబాబులు వచ్చి జామకాయ‌లు తిన్నారు. తిన్న జామకాయ‌ల‌కు డ‌బ్బులివ్వ‌మ‌ని అడిగినందుకు జామపండ్లు అమ్ముతున్న వ్యక్తిని ఇష్టమొచ్చినట్లుగా చితకబాదారు. డ‌బ్బులిచ్చేదిలేదంటూ చిరువ్యాపారిపై అంతాక‌లిసి దాడికి దిగారు. రోడ్డుపై జామకాయ‌ల బండిని తిరగబెట్టేశారు. ఇవన్నీ సమీపంలో వున్న ఓ కెమెరా కంటికి చిక్కాయి. కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓ పార్టీలో ఫుల్ గా తాగిన యువకులు తాగిన మైకంలో పండ్లవ్యాపారిపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. అడ్డుకున్న స్థానికులపై కూడా వీరు దాడికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

09:28 - November 19, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దుతో చాలా ఇబ్బందులు పడుతున్నామని సామాన్యులు వాపోతున్నారు. హైదరాబాద్..తిరుపతిలో పరిస్థితులు తెలుసుకోవడానికి టెన్ టివి ప్రయత్నించింది. హైదరాబాద్ నగరంలో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం సామాన్యుడు రోజు వారి ఇంటికి అవసరమయ్యే సరుకులను తీసుకెళుతుంటాడు. కానీ కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు సామాన్యుడి జీవితంపై పెను ప్రభావం చూపెడుతోంది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసింది. అనంతరం రూ. 2000 నోట్లను కొత్త నోట్లను విడుదల చేసింది. దీనితో సామాన్యుడు అష్టకష్టాలు పడుతున్నారు. చిల్లర దొరక్కపోవడం..పాత నోట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నగర వాసులు పేర్కొంటున్నారు.

తిరుపతిలో...
రోజులు గడుస్తున్నా ప్రజల ఇబ్బందులు మారడం లేదు. పెద్దనోట్ల రద్దుతో తిరుపతి వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, పెట్రోల్ దొరక్క సమస్యలు ఎదుర్కొంటున్నామని టెన్ టివితో సామాన్యులు తెలిపారు. పలువురు బ్యాంకుల ఎదుట వృద్ధులు వేచి ఉన్నారు. 

16:52 - August 22, 2016

హైదరాబాద్ : సంచలనం కలిగించిన గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తరువాత అతను చేసిన కిరాతకాలు..బెదిరింపులు..అక్రమాలు క్రమేపీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాప్రతినిధులను..ఉన్నతస్థాయి పోలీసు అధికారులకు చేతిలో పెట్టుకుని అతను చేసిన అక్రమాలు..భూదందాలు..ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ కు నెలరోజుల ముందు ఒక వ్యాపారికి ఫోన్ చేసిన కోటి రూపాలయలు ఇవ్వాలంటూ బెదిరించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌కౌంటర్‌కు నెల రోజుల ముందు గ్యాంగ్‌స్టర్‌ నయీం ఫోన్‌లో ఓ వ్యాపారిని బెదిరించాడు. భువనగిరికి చెందిన వ్యాపారిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్‌ చేశాడు. నయీం బెదిరింపులతో ఆ వ్యాపారి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నాడు. డబ్బులు ఇవ్వక పోతే నీ కుటుంబాన్ని చంపేస్తా.. నీ ప్రతి కదలిక నాకు తెలుసంటూ వ్యాపారిని నయీం బెదిరించాడు. నెల రోజుల్లో చనిపోతానని అనుకుంటున్నావు.. అది ఎప్పటికీ జరగదని నయీం బెదిరించాడు. వ్యాపారిని బెదిరిస్తూ ఫోన్ లో మాట్లాడిన బెదిరింపులు వినాలంటే ఈ వీడియోను చూడండి..

13:05 - January 12, 2016

నల్లగొండ : జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీలు, ఇతర వ్యాపారాల పేరుతో సాయి స్టీల్స్ యజమాని పోతరాజు నర్సింహా... కస్టమర్ల నుంచి 30కోట్ల రూపాయల మేర వసూలు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు.. ప్రకాశం బజార్‌లోని సాయి స్టీల్స్ ఎదుట ఆందోళనకు దిగారు. 

09:51 - November 15, 2015

హైదరాబాద్‌ : అల్కాపూర్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. బషీర్‌బాగ్‌కు చెందిన ప్రమోద్ కుమార్, అతని బంధువు రమేశ్ కుమార్‌ బైక్‌పై వెళుతుండగా దుండగులు అడ్డుకున్నారు. రమేశ్‌ను తమ కారులోకి ఎక్కించుకొని పారిపోయారు. అడ్డువచ్చిన ప్రమోద్‌పై దాడిచేశారు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రమోద్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దుండగులుకోసం గాలిస్తున్నారు.

 

Don't Miss

Subscribe to RSS - వ్యాపారి