శంషాబాద్

15:12 - December 13, 2017
12:10 - December 9, 2017
12:01 - October 24, 2017

రంగారెడ్డి : జిల్లా, శంషాబాద్‌ మండలంలో దొంగ హల్‌చల్‌ చేశాడు. తొండుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆటోలో వస్తున్న భార్యాభర్తల వద్ద నుంచి.. బైక్‌పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బ్యాగ్‌ ఎత్తుకెళ్లాడు. దీంతో బ్యాగులో ఉన్న రెండు లక్షల నగదు, నాలుగు తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. శంషాబాద్ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు అబ్దుల్‌ జలీల్, అతని భార్య పర్వానా ఫిర్యాదు చేశారు. వీరు మహబూబ్‌నగర్‌ నుండి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

09:44 - October 24, 2017

రంగారెడ్డి : శంషాబాద్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సుమారు వంద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. ఇందులో నిబంధనలు పాటించని 5 బస్సుల సీజ్ చేయడంతో పాటు... 6 బస్సులపై కేసులు నమోదు చేశారు. సీజ్‌ చేసిన బస్సుల్లోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి తరువాత సమీపంలోని ఆర్టీసీ డిపోలకు తరలించారు.

13:14 - October 21, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో జడ్డా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 612గ్రాముల బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి అండర్ వేర్ కు ప్రత్యేక జేబు ఏర్పాటు చేసుకుని బంగారం తీసుకొచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గత పదిరోజుల్లో 3కిలోల 40గ్రాముల బంగారం పట్టుబడింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:19 - October 16, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ దగ్గర ఆర్టీఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్ బెంగళూరు హైవేపై ప్రైవేట్ బస్సులను అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని 17 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆరు బస్సులను సీజ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:59 - September 19, 2017

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ ఆర్బీనగర్ లో ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. చిన్నారి అనారోగ్యంతో చనిపోయినుట్టు ఆమె తండ్రి చెబుతున్నారు. రెండో భార్యతో కలిసి కూతురిని తండ్రే చంపాడని పాప తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. పాప తల్లి ఏడాది క్రితం చనిపోవడంతో తండ్రి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:23 - September 15, 2017

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కిషన్‌ గూడ వద్ద ఆర్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నిబంధనలు విరుద్ధంగా నడుపుతున్న 5 ప్రైవేటు వాహనాలపై కేసులు నమోదు చేశారు. 

18:04 - September 9, 2017

రంగారెడ్డి : టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీలేదని టీపీపీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.. ప్రతి కార్యకర్త సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ వేధింపులకు భయపడొద్దని చెప్పారు.. కేసీఆర్‌ మాయ మాటలవల్లే 2014 ఎన్నికల్లో ఓడిపోయామని స్పష్టం చేశారు.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కాంగ్రెస్‌ శిక్షణా తరగతులకు ఉత్తమ్‌ హాజరయ్యారు.. మండల, బ్లాక్‌ స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలకు పలు సూచనలు చెప్పారు.. అయితే కార్యక్రమం ప్రారంభంలో వేదికపైకి కోమటిరెడ్డి బ్రదర్స్‌ను పిలవకపోవడం వివాదాస్పదైంది.. తమను వేదికపైకి ఆహ్వనించలేదంటూ అలిగిన కోమటిరెడ్డి బ్రదర్స్‌... కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.

08:47 - August 27, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - శంషాబాద్