శకం

21:52 - September 12, 2017

చెన్నై : అన్నాడిఎంకేలో చిన్నమ్మ శశికళ శకం ముగిసినట్లేనా? తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ అన్నాడిఎంకె నిర్ణయం తీసుకుంది. మరోవైపు పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకే మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ వేసింది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పాలని భావించిన చిన్నమ్మ
శశికళ ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ఇప్పటికే అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని జనరల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. ఆ బాధ్యతలను తాత్కాలికంగా చేపట్టిన శశికళను పదవి నుంచి తొలగిస్తూ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం పేర్కొంది. శశికళ మేనల్లుడు దినకరన్‌ చేపట్టిన నియామకాలు, ప్రకటనలను ఆమోదించమని స్పష్టం చేసింది. పార్టీ రెండాకుల గుర్తును తిరిగి కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాలని సమావేశం నిర్ణయించింది.

మరోవైపు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి ప‌ళ‌ని ప్రభుత్వం బ‌ల‌నిరూప‌ణ నిర్వహించాల‌ని డీఎంకే నేత స్టాలిన్ మద్రాస్‌ కోర్టుకు వెళ్లారు. స్టాలిన్‌తో పాటు పీఎంకే పార్టీకి చెందిన బాలు కూడా పిటిష‌న్ వేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబ‌ర్ 10వ తేదీన  మద్రాస్ హై కోర్టు విచారణ చేపట్టనుంది. 

తమిళనాడు ప్రజలను, పార్టీ కార్యకర్తలను పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మోసం చేశారని దినకరన్‌ మండిపడ్డారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు. అన్నాడిఎంకెకు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు దినకరన్‌ వెంట ఉండడంతో పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. 

శశికళకు  కాలం కలిసి రాలేదు. జయలలిత మరణానంతరం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టడం....పన్నీర్‌ సెల్వంను సిఎంను పదవి నుంచి తొలగించడం జరిగిపోయాయి. తదనంతరం జరిగిన పరిణామాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. సిఎంగా బాధ్యతలు చేపడతారు అనుకునే సందర్భంలో అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలుపాలయ్యారు. దీంతో ఆమె మేనల్లుడు దినకరన్‌కు ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం పార్టీలో కొందరికి నచ్చలేదు. ఈ నేపథ్యంలో పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు ఏకమయ్యాయి. శశికళ, దినకరన్‌కు  అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు  తాజాగా తీర్మానం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో శశికళ ఎలాంటి వ్యూహం పన్నుతారో  వేచి చూడాల్సిందే.

09:16 - July 2, 2017

ఢిల్లీ : దేశ ఆర్థికవ్యవస్థలో జీఎస్టీ ఒక నవశకమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జీఎస్‌టీ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన పథాన్ని నిర్దేశించిందని తెలిపారు. సమాజంలో ఆర్థికపరమైన జబ్బులను నయం చేసే బాధ్యత ఛార్టెడ్‌ అకౌంటెంట్లపైనే ఉందన్నారు. ఢిల్లీలో ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ నిలబెట్టే మూలస్తంభాలు ఛార్టెడ్‌ అకౌంటెంట్లు అంటూ ప్రశంసించిన మోదీ.. తప్పులను సరిదిద్ది ఆర్థిక వ్యవస్థను సరైన దిశగా నడిపించాలని కోరారు.

21:36 - May 30, 2017

హైదరాబాద్ : దాసరి మృతి పట్ల సుద్దాల అశోక్ తేజ సంతాపం వ్యక్తం చేశారు. ఒక శకం ముగిసిందని ఆయన ఆవేదన వెలుబుచ్చారు. దాసరి లేకుంటే తను లేను అని అశోక్ అన్నారు. ఓసెయ్ రాములమ్మ సినిమాలో తనతో ఎనిమిది పాటలు రాయించుకున్నారని దాంతో తన జీవితమే మారిందని తేజ గుర్తు చేశారు.  

17:48 - August 24, 2015

కొలంబో : శ్రీలంక కమ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ...డబుల్ సెంచరీల స్పెషలిస్ట్ కుమార సంగక్కర శకం ముగిసింది. కొలంబో సారా ఓవల్ లో టీమిండియాతో జరిగిన రెండోటెస్ట్ నాలుగోరోజుఆటలో...సంగక్కర 18 పరుగులకు అవుట్ కావడంతో...రిటైర్మెంట్ పరిపూర్ణమయ్యింది. ఇప్పటివకే వన్డే, టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగక్కర టెస్టుల్లో మరే ఇతర క్రికెటర్‌కూ సాధ్యం కాని అసాధారణ ఘనత, పలు అరుదైన ప్రపంచ రికార్డ్‌లు నమోదు చేసి ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచాడు. గత 15 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ కే వన్నె తెచ్చిన కుమార సంగక్కర్‌ టెస్ట్‌ కెరీర్‌పై టెన్‌ స్పోర్ట్స్‌ స్పెషల్‌ ఫోకస్‌.
కుమార సంగక్కర....టెస్ట్ క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ స్టార్ల ముందు వరుసలో ఉండే శ్రీలంక దిగ్గజం. గత 15 సంవత్సరాలుగా ప్రపంచ, శ్రీలంక క్రికెట్ కు అసాధారణ సేవలు అందించిన సంగక్కర కెరియర్ కు కొలంబో సారా ఓవల్ గ్రౌండ్స్ లో టీమిండియాతో ముగిసిన రెండోటెస్ట్ ద్వారా తెరపడింది. టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌గా మరే ఇతర క్రికెటర్‌కూ సాధ్యం కాని ఎన్నో అరుదైన రికార్డ్‌లు నెలకొల్పిన సంగక్కర ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. సొంత గడ్డపై కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ తో సంగక్కర 15 సంవత్సరాల క్రికెట్ జీవితం ముగిసింది.

అరుదైన రికార్డులు..
బ్యాట్స్‌మెన్‌గా టెస్టు ఫార్మాట్లో అరుదైన రికార్డులన్నీ సంగక్కర ఖాతాలోనే ఉన్నాయి. కొలంబో టెస్ట్ వరకూ 134 మ్యాచ్ లు ఆడిన కుమార సంగక్కర 38 సెంచరీలు,52 హాఫ్‌సెంచరీలతో 12400 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో సంగక్కర నాలుగో స్థానంలో నిలిచాడు. అంతే కాదు టెస్టుల్లో అత్యధికంగా డబుల్‌ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లోనూ సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు. 12 డబుల్‌ సెంచరీలతో ఆల్‌ టైం గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌ సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా 11 డబుల్‌ సెంచరీలతో సంగక్కర ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్ట్ మొదటి రెండు ఇన్నింగ్స్ తో పాటు కొలంబో టెస్ట్ లో సైతం టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కే సంగక్కర అవుట్ కావడం విశేషం. 

సచిన్ రికార్డు సైతం బద్దలు..
అంతేకాదు టెస్టుల్లో అత్యం వేగంగా 8,9,10,11,12వేల పరుగుల మైలురాయిని అధిగమించి బ్యాట్స్‌మెన్‌ కూడా రికార్డులు సంగక్కర పేరునే ఉన్నాయి. 224 ఇన్నింగ్స్‌ల్లోనే టెస్టుల్లో అత్యం వేగంగా 12వేల పరుగుల మైలురాయిని అధిగమించిన కుమార...ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. ఇక సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా 190, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కూడా సంగా రికార్డ్‌ సృష్టించాడు. ఈ వెటరన్ బ్యాట్స్‌మెన్‌ టెస్టుల్లో 14 సార్లు 190 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేశాడు.

చివరి టెస్టులో రాణించలేకపోయిన సంగ..
రిటైర్మెంట్‌ వయసు దగ్గర పడుతున్నా గత రెండేళ్లలోనే పలు అరుదైన ఇన్నింగ్స్‌ ఆడిన సంగక్కర తనలో స్టామినా ఏ మాత్రం తగ్గలేదని చాటి చెప్పాడు. క్రికెట్లో ఫామ్‌ ఈజ్‌ టెంపరరీ క్లాస్‌ ఈజ్‌ పర్మనెంట్‌ అని నిరూపించిన సంగక్కర కెరీర్‌లో ఆడుతున్న చివరి రెండు టెస్ట్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆఖరి నాలుగు ఇన్నింగ్స్ లో అత్యధికంగా 40 పరుగుల స్కోరు మాత్రమే నమోదు చేశాడు. క్రికెట్ కు సంగక్కర వీడ్కోలు చెప్పినా...క్రికెట్ చరిత్ర ఉన్నంతకాలం అతని రికార్డులు అభిమానులకు కలకాలం గుర్తుండిపోతాయి.

Don't Miss

Subscribe to RSS - శకం