శరీరం

12:45 - March 9, 2018

ఎండాకాలం వచ్చేసింది..ఇప్పటి నుండే ఎండలు మండిపోతున్నాయి. దీనితో ఆరోగ్యంపై ఒకింత శ్రద్ధ కనబర్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. నీరు ఎక్కువగా దొరికే వాటిలో 'కీర' ఒకటి. ఇది ఆరోగ్యానికి మంచి ఔషధం అని చెప్పవచ్చు.

  • కీరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో బాగా పనిచేస్తుంది.
  • పాస్పరస్‌, విటమిన్లు, పోటాషియం, నీటి శాతం, మెగ్నీషియం, మినరల్స్‌, జింక్‌, ఐరన్‌, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి.
  • ప్రతి రోజు రెండు గ్లాసుల కీరా జ్యూస్ తాగితే కడుపు నొప్పి..అల్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
  • కీరలో 95 శాతం నీరు ఉండడం వల్ల శరీరానికి చల్లదనం అందిస్తుంది.
  • వేసవిలో కీర ముక్కలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదిని వైద్యులు పేర్కొంటుంటారు. 
12:25 - September 22, 2017

శరీరంలో అన్ని భాగాలు ముఖ్యమే. అందులో వెన్ను కూడా ఒకటి. శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం అని పేర్కొన్నవచ్చు.ఇది 33 వెన్నుపూసలతో ఉంటుంది. మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ లు సహాయపడతాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ బిజి బిజీగా గడిపేస్తుంటారు. దీనితో శరీరంలోని పలు అవయావాలపై ప్రభావం చూపిస్తాయి. అందులో వెన్ను ముక ఒకటి. పలు సందర్భాల్లో వెన్ను నొప్పి బాధిస్తుంటుంది. గంటల కొద్ది కంప్యూటర్స్..ఇతర పనులు చేయడం దీనికి కారణమౌతున్నాయి.

వెన్నునొప్పి వస్తే ఆముదాన్ని వేడి చేసి రాసి చూడండి. అలాగే వెల్లుల్లి పాయలను కొన్నింటిని తీసుకుని కొద్దిగా నువ్వుల నూనెల వేసి బాగా కాచాలి. అనంతరం గోరువెచ్చగా ఉన్న సమయంలో వెన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి చూడండి. కారు..బైక్ నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దిండ్లను వాడడం బెటర్. వేడిగా ఉన్న నువ్వుల నూనెతో మసాజ్ చేయించకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది. మునగాకు రసం..పాలు..సమపాళ్లుగా తీసుకుని సేవించాలి. వెన్ను నొప్పి అధికంగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తడం, ఒకేసారి హఠాత్తుగా వంగటం వంటివి చేయకూడదు. పిల్లల స్కూలు బ్యాగుల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. బ్యాగులకు పట్టీలు..బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి. శరీర బరువు అధికంగా ఉంటే వెంటనే తగ్గించుకొనే విధంగా చూసుకోండి. 

14:09 - June 23, 2017

శరీరానికి తగిన పోషకాలు అందుతున్నాయా ? లేదా ? తెలుసుకోవడం ఎలానో చదవండి..
పోషకాలు..ఇవి సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని ప్రత్యేకమైన పోషకాలు మాత్రం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. గోర్లు ఆరోగ్యంగా కనపడట్లేదా? లేదా గోళ్లపై తెల్లటి మచ్చలు, చీలికలు వంటివి ఉంటే ఐరన్ అందలేదని అర్థం చేసుకోవాలి. ఐరన్‌ లోపం వలన చేతి గోళ్లపై చీలికలు.గీతలు ఏర్పడతాయి.
శరీర భాగాలపై మొటిమలు అధికంగా వస్తుంటాయి. ఇలా వస్తే విటమిన్ ‘ఇ’ లోపం ఉందని గ్రహించాలి. చర్మ రంధ్రాలు మూసుకపోయి..బ్యాక్టీరియా పేరుకపోవడం వల్ల మొటిమలు వస్తాయి.
శరీరానికి సరిపోయేంత అయోడిన్‌ను తీసుకోవాలి. అయోడిన్‌ను సరైన మోతాదులో తీసుకుంటే థైరాయిడ్‌ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
పొటాషియం అధికంగాగల అరటిపండు, స్పినాచ్‌, బ్రోకలీ, ద్రాక్ష పండ్లను తినాలి. ముఖం లేదా ఈ విటమిన్‌ అధికంగాగల క్యారెట్‌, చిలకడదుంపలని ఎక్కువగా తినాలి.

12:06 - May 10, 2017

ముల్తాని మట్టీ..సౌందర్యానికి వాడుతుంటారు. చర్మం పలు రకాలుగా ఉంటుంది. ఒకరికి పొడి చర్మ..మరొకరికి ఆయిల్ చర్మం ఇలా ఉంటుంది. ఈ ముల్తాని మట్టిని ఉపయోగించి వారు మరింత అందంగా తయారు కావచ్చు. ముల్తానీ మట్టి..తేనే..పసుపు..అన్నీ ఒక దగ్గర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ గా వేసుకోవాలి. అనంతరం 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి.
మూడు స్పూన్ల ముల్తాని మట్టీ..ఒక టేబుల్ స్పూన్ పెరుగు..దోసకాయ గుజ్జు..కొద్దిగా శనగపిండిని తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ గా వేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడగాలి.
రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, టేబుల్‌ స్పూన్‌ గంధం పొడి, చిటికెడు పసుపు తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్ర పరచాలి. ఇది ఆయిలీ, పొడి చర్మాలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

11:18 - May 7, 2017

ఎండకాలం వచ్చిందంటే చర్మ సంబంధిత సమస్యలతో పాటు చెమట కాయల సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ చెమట కాయల నుండి బయటపడటానికి వివిధ పౌడర్లు..క్రీములు వాడుతుంటారు. ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో చెమటకాయలకు చెక్ ఎలా పెట్టవచ్చో చూద్దాం...
టిష్యూ పేపర్ ను తీసుకుని వెనిగర్ లో ముంచి చెమటకాయలున్న చోట అద్దాలి. ఇలా చేయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుముఖం పడుతాయి.
బ్లాక్ టీని తీసుకుని చర్మంపై రాసి చూడండి. చర్మానికి సంరక్షణ కూడా అందుతుంది.
కాటన్ బాల్ ని తీసుకుని లవంగనూనెలో ముంచి చెమటకాయలున్న చోట రాయాలి. ఇలా రోజు చేయడం వల్ల చెమట కాయల సమస్య నుండి బయటపడవచ్చు.
చల్లటి పాలలో కాటన్ బాల్స్ ను తడపి చెమటకాయలపై మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ పొక్కుల వల్ల వచ్చే మంట తగ్గే అవకాశం ఉంది.
మజ్జిగ, సబ్జా నీళ్లు, బార్లీ వంటివి రోజూ తాగుతూ ఉంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
గంధం, రోజ్ వాటర్ కలిపి చెమటకాయలు ఉన్నచోట రాయాలి. అనంతరం పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

09:33 - April 19, 2017

న్యూఢిల్లీ : శరీరాన్ని పూర్తిగా కవర్‌చేసేలా దుస్తులు వేసుక రావాలని విద్యార్థినిలకు జారీ చేసిన నోటీసుపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ ఐఐటీ హాస్టల్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఓ మహిళా హాస్టల్ ఈ నోటీసును ఇటీవలే జారీ చేసింది. ఈనెల 20న హౌస్ డే కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ ఐఐటీలో ఏడాదికొకసారి హౌస్‌ డే నిర్వహిస్తారు. దీనికి విద్యార్థినులు గంట పాటు అతిథులను హాస్టల్‌కు ఆహ్వానించవచ్చు. దీనిపై హిమాద్రి హాస్టల్‌ వార్డెన్‌ సంతకంతో నోటీసు పెట్టారు. కార్యక్రమానికి మహిళలంతా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండేలా దుస్తులు వేసుకుని రావాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు విమర్శలు రావడంతో నోటీసుపై వెనక్కి తగ్గారు.

13:51 - February 13, 2017
08:46 - December 19, 2016

శరీరం ధృడత్వంగా ఉండలంటే ఏం చేయాలి ? ఎలాంటి అనారోగ్యాన్నయినా ఎదుర్కొవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? ధృడమైన శరీరం గల వారు ఎలాంటి రోగాలనైనా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. పండ్లు..తాజా కూరగయాలు..విటమిన్స్ తో కూడిన భోజనం తీసుకుంటూ ఉండాలి. శరీరం ధృడంగా ఉండేందుకు వివిధ ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా 'రాగులు'. వివిధ రోగాలకు రాగులు బాగా పనిచేస్తాయి. రాగి మాల్ట్ ను రోజుకు రెండుసార్లు పాలలో గాని, మజ్జిగలో కలిపి తాగాల్సి ఉంటుంది. మొలకెత్తిన ధ్యానపు పిండిని రాగి మాల్ట్ అంటారు. రాగులని నీళ్లలో నానబెట్టి నాలుగు గంటల అనంతరం తరువాత తీయాలి. అనంతరం ఓ బట్టలో వేసి మూటగట్టి దీనిపై బరువు ప పెట్టాలి. రెండు, మూడు రోజుల తరువాత చిన్న చిన్న మొక్కలొస్తాయి. మొలకలొచ్చిన తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత నూనె వేయకుండానే దోరగా వేయించాలి. వేగిన రాగులని మర పట్టించాలి. ఈ పిండినే రాగి మాల్ట్ అంటారు.

15:16 - September 8, 2016

ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన సుగందభరితం సున్నిపిండి. వంటింట్లో దొరికే వస్తువులతోనే ఈ పిండిని తయారు చేసుకోవచ్చు. సున్నిపిండిని వాడడం వల్ల చర్మం నునుపుగా మారుస్తుంది. అంతేగాకుండా వ్యాధుల బారి నుండి రక్షిస్తుంది. ఇప్పటికీ గ్రామాల్లో సబ్బులు వాడరు. స్నానానికి సున్నిపిండిని మాత్రమే ఉపయోగిస్తుంటారు. మరి ఈ సున్నిపిండి వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దామా...
అసలు సున్నిపిండిని ఎలా తయారు చేస్తారు .పెసలు..శనగపప్పు..బియ్యం..వీటన్నింటినీ తగినన్ని మోతాదులో తీసుకుని గిర్నీ పట్టుయోవాలి. ఇందులో అదనంగా పసుపు, ముల్తానీ మట్టి కలుపుకోవాలి. మెంతాకులు..తమలపాకులు..గులాబీ రేకులు..వేపాకులను ఎండలో బాగా ఎండిన తరువాత వాటిని పొడిగా చేసి సున్నిపిండిలో కలుపుకోవాలి. దీనిని ఒక సీసాలా భద్ర పరుచుకోవచ్చు. స్నానం చేసే సమయంలో కొంత పిండిని తీసుకుని నీళ్లు కలుపుకోవాలి. ఈ పేస్టును శరీరానికి పట్టించాలి. పది నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇది చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. పసుపు చర్మంపై సూక్ష్మజీవులను తొలగిస్తుంది. ముఖంపై మెటిమలను నివారిస్తుంది. పసుపు..మినపప్పు వీటి మిశ్రమాన్ని నీటిలో కలుపుకుని రాసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఎలాంటి రంగు చర్మానికైనా సున్నిపిండిని వాడుకోవచ్చు. ట్రై చేసి చూడండి. 

11:33 - August 20, 2016

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితం..ఇంట్లో..బయట వర్క్ లతో మహిళలు అలసిపోతున్నారు. దీనితో వారు ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. పనిచేయడానికి టైం సరిపోవడం లేదు..ఇంక వ్యాయామం ఎక్కడ చేయాలి ? అని పలువురు మహిళలు పేర్కొంటుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు..మానసిక ఆరోగ్యం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. మరి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని టిప్స్ చూద్దాం..
రోజూ కొద్దిసేపైనా వ్యాయామం చేయాలి. సరి సమాన బరువు కలిగి, ఎంతో ఉపయోగకరమైన పరికరాలతోనే వ్యాయామం చేయాలి.
పాల ఉత్పత్తులు..వెన్న..చాక్లెట్లు..వంటి పదార్థాలు లేని ఆహారం తీసుకోవాలి.
అధిక కొవ్వు..క్యాలరీలతో కూడిన ఆహారానికి దూరంగా ఉంటే మంచిది.
ఎక్కువ శాతం నీటిని సేవించాలి. రోజుకు కనీసం ఆరు..ఎనిమిది లీటర్ల నీరు తీసుకోవాలి.
ఆర్ధిక సమస్యలు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. అధికంగా ఖర్చు పెట్టడం మంచిది కాదు.
సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొని అమూల్యమైన మానసిక ఆనందాన్ని సొంతం చేసుకోండి.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఒత్తిళ్ళకు గుడ్‌బై చెప్పండి.
 

Pages

Don't Miss

Subscribe to RSS - శరీరం