శాస్త్రవేత్తలు

15:59 - October 10, 2018

తిరువనంతపురం : ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల చెక్కును అందచేశారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్(76) ను కేరళ పోలీసులు అనవసరంగా గూఢచర్యం కేసులో ఇరికించారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను వేధించినందుకు ఎనిమిది వారాల్లో రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన్ను కలిసి డబ్బును అందచేసింది. 

1994 నాటి గూఢచర్యం కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని, వేధించారని నంబి నారాయణన్(76) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనితో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలో జస్టిస్‌లు ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచూడ్‌తో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.  విచారణ జరిపిన అనంతరం 1994నాటి కేసులో నంబి నారాయణన్ ను కేరళ పోలీసులు అనవసరంగా అరెస్టు చేశారని, దారుణంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలేం జరిగింది ? 
1994 అక్టోబర్ 20న కేరళలోని తిరువనంతపురంలో మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇస్రోకు చెందిన క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని రహస్యంగా సేకరించి పాకిస్థాన్‌కు అందచేస్తున్నట్లు పోలీసులు అభియోగాలు మోపారు. అదే ఏడాది నవంబర్‌లో ఇస్రోకు చెందిన క్రయోజెనిక్ ప్రాజెక్టు డైరెక్టర్ నంబి నారాయణ్, డిప్యూటీ డైరెక్టర్ డీ శశికుమారన్ లను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. నిరాధారమంటూ  పేర్కొంది. 

20:54 - October 1, 2018

అమెరికా : మానవుడి తెలివి రాళ్లు కొట్టుకుని బ్రతికే నాటి నుండి గ్రహాంతరాళలో విహరించే స్థాయికి చేరింది. అయినా మనిషి ఆశ చావలేదు..ఆతడి కాంక్ష కూడా తీరలేదు. ఎన్నెన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్న మనిషి అందని చందమామ కోసం అందిపుచ్చుకోవాలని ఆరాట పడుతున్నాడు. భూమిపై జనాభా పెరుగుతోంది. అంతకంటే ఎక్కువగా మానవుడి మేథస్సు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అంగారకుడిపై ఆహారాన్ని పండించే మార్గాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ముందుగా ఇక్కడ అంగారకుడిపై ఉండే మట్టిని కృత్రిమంగా రూపొందించారు. ఈ మట్టికి వారు సిమ్యులెంట్ గా నామకరణం చేశారు. అమెరికాలోని సెంట్రల్‌ ఫ్లోరిడా వర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ ప్రత్యేక పద్ధతి ద్వారా ఈ మట్టిని రూపొందించారు. 
అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన ‘క్యూరియాసిటీ’ రోవర్‌ సేకరించిన మట్టిలోని రసాయన లక్షణాల ఆధారంగా సిమ్యులెంట్‌ను తయారు చేశారు. అరుణ గ్రహంపై ఆహారాన్ని పండించే మార్గాలపై జరిపే పరిశోధనలకు.. ఈ మట్టి ఎంతగానో తోడ్పడుతుందని పరిశోధకుడు డాన్‌ బ్రిట్‌ అన్నారు. భవిష్యత్ లో అంగారకుడిపై మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే.. ఆహారం, నీరు, ఇతరత్రా నిత్యావసరాలు అవసరమని పేర్కొన్నారు. తాము రూపొందించిన సిమ్యులెంట్‌తో.. అలాంటి మార్గాలను ఇక్కడే పరీక్షించే వీలు చిక్కుతుందని చెప్పారు. మరోవైపు కిలో రూ.1450 చొప్పున ఈ మట్టిని కావలసిన వారికి సరఫరా కూడా చేస్తున్నామని తెలిపారు. 

 

13:47 - May 3, 2018

వయస్సుతో పాటు నేనున్నానంటు వచ్చేస్తుందది. పెట్టింది ఒకచోట వెతికేది మరోచోట. అబ్బా! అన్నీ అందించలేక ఛస్తున్నాం అంటు విసుగులు..ఎన్నిసార్లు చెప్పాలి సమయానికి మందులు వేసుకోమని అంటు విరుపులు..ఏంటండీ! నన్ను గుర్తు పట్టలేదా? నేనూ..ఫలానా అంటు కొత్తగా పరిచయం చేసుకునే పాత పరిచయస్తులు, బంధువుల, స్నేహితులు. ఇలా ప్రతీదీ వయసుతో పాటు సహజంగా వచ్చే మతిమరుకు కుంటుంబ సభ్యులు, బంధువులు విసుగుతో కూడిన మాటలు, మంచిగా వుండే కుటుంబంలో అయితే ప్రేమతో కూడిన మందలింపులు..సర్వసాధారణంగా వినిపిస్తుండే మాటలు. వయస్సు పైబడిన వారికి సర్వసాధారణంగా వచ్చే అల్జీమర్ కు చెక్ పెట్టేదెలా? మనుమలకు తన చిన్ననాటి ముచ్చట్లు, కథలు, అనుభవాలు, అనుభూతులు చెప్పుకునేదెలా? వయస్సుతో పాటు అన్నీ మరచిపోవాలా? అంటే కాదనేంత సహజమైన చక్కని చిట్కా ఒకటి చెప్పేసుకుందాం..అమ్మమ్మలు, తాతయ్యల అనుభవాలను, అనుభూతుల సంగమంతో కూడిన సందేశాలను, సందర్బాలను, జాగ్రర్తలను విందాం తెలుసుకుందాం..మరి ఈ అల్జీమర్స్ కు చెక్ పెట్టే సాధనమేంటో తెలుసా? ఎర్రగా..కంటికింపుగా..భిన్నమైన బీట్ రూట్ తో పెట్టేద్దాం చెక్..

బీట్‌రూట్‌ స్పెషల్ ..
వయసు పైబడటం అనేది సాధారణమే. వయసుతో పాటు మతిమరుపు రావడం కూడా సాధారణమే. సమస్యలు వచ్చిపడే వేగాన్ని తగ్గించే అవకాశాలు కూడా లేకపోలేదు. కొన్ని సమస్యలు కేవలం మందులకు మాత్రమే తగ్గవు. కానీ ప్రకృతి సహజంగా లభించే కొన్ని పదార్ధాలలో కొన్నింటికి చెక్ పెట్టవచ్చు. ప్రకృతి మనిషికి ఇచ్చిన ఎన్నో అమూల్యమైన పదార్ధాలతో ఆరోగ్యాన్ని పెంపొదించుకోవచ్చు. అలాగే వయస్సుతో పాటు వచ్చే అల్జీమర్స్ కు కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు పరిశోధకులు. దీంట్లో ప్రధానమైనది బీట్‌రూట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బీట్‌రూట్‌లో సాధారణ పోషకాలతో పాటు, అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, వ్యర్థపదార్థాలను శరీరంలోంచి తొలగించడంతో పాటు, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది.

మతిమరుపుకు చెక్ పెట్టే బీట్ రూట్ : ఫ్లోరిడా శాస్త్రవేత్తలు
వీటన్నింటికీ మించి మరో విశేష ప్రయోజనం కూడా బీట్‌రూట్‌ వల్ల కలుగుతుందని అమెరికాలోని సౌత్‌ ఫ్లోరిడా యూరివర్సిటీకి చెందిన పరిశోదకులు అధ్యయనంలో కనుగొన్నారు. బీట్‌రూట్‌ వినియోగం వల్ల మతిమరుపు కలిగించే అల్జీమర్‌ వ్యాధి పెరిగే వేగం బాగా తగ్గిపోవడమే ఆ విశేషం. ప్రత్యేకించి మెదడులో తయారై అల్జీమర్‌ వ్యాధిని కలిగించే ఒక ప్రత్యేకమైన ప్రొటీన్‌ చర్యలను బీట్‌రూట్‌ నియంత్రిస్తుందని వీరు కనుగొన్నారు. అలాగే అల్జీమర్‌ వ్యాధి పెరిగేలా చేసే మెదడులోని కొన్ని రసాయన చర్యలను బీట్‌రూట్‌లోని బెటానిన్‌ అనే మూలకం కట్టడి చేస్తుందని పరిశోధకుల్లో ఒకరైన లి-జూన్‌ మింగ్‌ స్పష్టం చేశారు.

14:50 - February 12, 2018

విజ్ఞానాభివృద్ధి వల్ల మానవ భౌతికస్థితి గతులు మెరుగవుతాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో సైన్స్...సాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర ఏ మాత్రం తక్కువ కాదని కొంతమంది మహిళా శాస్త్రవేత్తలు నిరూపించారు. మరి వారి గురించి పెద్దగా తెలియదు. సాధారణంగా శాస్త్రవేత్తలంటే అందరికీ న్యూటన్..ఐన్ స్టీన్...ఇతరులు గుర్తుకొస్తారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా శాస్త్రవేత్తల గురించి తెలుసా ? చరిత్ర గతిని మార్చేవేసిన కొంతమంది మహిళా శాస్త్రవేత్తల కథనాలతో మానవి 'స్పూర్తి' ప్రత్యేక కార్యక్రమం. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

11:21 - January 12, 2018

నెల్లూరు : పీఎస్‌ఎల్‌వీ సీ 40రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ 40 రాకెట్ ను నింగిలోకి పంపారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ ద్వారా 31 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి పంపారు. మూడు స్వదేశీ ఉపగ్రహాలు, 28 విదేశీ ఉపగ్రహాలు. ఈ ప్రయోగంతో 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డును ఇస్రో సొంతం చేసుకుంది. ఈ ప్రయోగం సక్సెస్ పై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

11:35 - October 4, 2017

నార్వే : భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం దక్కింది. 2017 సంవత్సరానికి గాను అమెరికాకు చెందిన రైనర్‌ వేస్‌, బ్యారీ సి.బ్యారిష్‌, కిప్‌ ఎస్‌ థోర్న్‌లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణ తరంగాలపై చేసిన పరిశోధనలకు గాను వీరికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నోబెల్‌ అసెంబ్లీ వెల్లడించింది. ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో రైనర్‌ వేస్‌ మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆచార్యుడు కాగా, కిప్‌ థోర్న్‌, బ్యారీ బ్యారిష్‌ కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.

11:30 - September 3, 2017

నెల్లూరు : ఇస్రో ప్రయోగించిన 8వ నేవిగేషన్‌ శాటిలైట్ ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ 1హెచ్ విఫలం కావడానికి అధిక బరువే కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. లాంచ్‌ వెహికల్‌ మోతాదుకు మించి ఒక టన్ను బరువు అధికంగా మోయడం వల్లే ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ 1హెచ్ ఉపగ్రహం విఫలమైందని భావిస్తున్నారు. గురువారం శ్రీహరికోట నుంచి  పీఎస్ ఎల్ వీ-సీ 39 ప్రయోగించిన కొద్దిసేపటికే విఫలమైంది.ఉష్ణకవచం నుంచి ఉపగ్రహం వేరుకాకపోవడంతో ప్రయోగం విఫలమైంది. బరువు అధికంగా ఉండడం వల్ల ఎత్తుకు ఎగరలేక పోవడమే కాకుండా.. ప్రతి సెకనుకు ఓ కిలోమీటర్‌  వేగం తగ్గడం కూడా  కారణమని ఇస్రో మాజీ డైరెక్టర్ ఎస్‌కె శివకుమార్‌ చెబుతున్నారు. పీఎస్ ఎల్ వీ సీ39 ప్రయోగం తొలి మూడు దశలు విజయవంతమైనా, చివరి దశలో రాకెట్‌ నుంచి ఉపగ్రహం వేరుకాకపోవడంతో ప్రయోగం ఫెయిలైంది. హీట్‌ షీల్డు తెరుచుకోపోవడంతో ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టలేకపోయినట్లు ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్‌ సొంత దిక్సూటీ నావిక్ సేవలు మరింత మెరగయ్యేవని ఇస్రోవర్గాలు అంటున్నాయి. 

16:48 - February 26, 2017

హైదరాబాద్: మానవ జీవితంలో శాస్త్ర, సాంకేతికత ఎంతో ప్రాధాన్యమున్న అంశాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. యువతలో శాస్త్ర, సాంకేతిక నైపణ్యాలు పెరగాలని.. దేశానికి మరింత మంది శాస్త్రవేత్తలు కావాలన్నారు. 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలిండియా రేడియో ద్వారా దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ఒకేసారి 104 ఉపగ్రహాలు ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో చరిత్ర సృష్టించిందని.. ఇలాంటి ప్రయోగం చేసిన తొలిదేశంగా నిలవడం గర్వంగా ఉందన్నారు. ఇస్రో ప్రయోగించిన కార్టోశాట్‌-2జీ ఉపగ్రహంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నగదు రహిత లావాదేవీల ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములవుతున్నారని మోదీ అన్నారు. సమాజం మొత్తం క్రమంగా సాంకేతిక మార్గం వైపు మళ్లుతోందన్నారు. ప్రజల ప్రోత్సాహంతో నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. భీమ్‌ యాప్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని.. యాప్‌ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో ప్రతి ఒక్కరు కనీసం 125 మందికి అవగాహన కల్పించాలని సూచించారు.

15:57 - June 30, 2016

హైదరాబాద్ : సిమెంట్‌ రోడ్లు విన్నాం..తారు రోడ్లు విన్నాం...కానీ కరెంట్‌ రోడ్లను ఎప్పుడైనా విన్నారా...లేదు కదూ. కరెంట్‌తో నడిచే కార్లకు, ట్రక్కులకు విద్యుత్‌ ఉత్తత్పి కోసం ఏకంగా కరెంట్‌ రోడ్లే తయారు చేస్తున్నారు స్వీడన్‌ శాస్త్రవేత్తలు. ఇక నుంచి కరెంట్‌ రోడ్లపై కార్లు రయ్యిరయ్యిమని దూసుకెళ్లేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.
రోడ్డు మీద కరెంటు 
కరెంటుతో నడిచే కార్లు గురించి విన్నాం. మరి వాటికి కరెంటు ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ బ్యాటరీ ఛార్జ్‌ చేసుకొని ఎక్కడైనా వెళ్తుంటే మధ్యలో బ్యాటరీ అయిపోతే... కష్టమే కదా. అందుకే స్వీడన్‌ శాస్త్రవేత్తలు ఏకంగా కరెంటు రోడ్లే తయారు చేస్తున్నారు. అంటే కరెంటుతో పని చేసే కారు... రోడ్డు మీద కరెంటు అందుకొని రయ్యి రయ్యిమని దూసుకుపోతుందన్నమాట. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న సాంకేతికతను 2030 కల్లా అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. 
భారీ వాహనాలను నడపొచ్చు.. 
ఈ రోడ్లపై ఏకంగా ట్రక్కుల్లాంటి భారీ వాహనాలను కూడా నడపొచ్చంటున్నారు. ఇప్పటికే ట్రయల్‌ రన్స్‌ జరుగుతున్నాయి. ఈ కరెంటు రోడ్లపై ఎలక్ట్రిక్‌ రైళ్లకు ఉన్నట్లుగా విద్యుత్తు కేబుళ్లు ఉంటాయి. ఆ కేబుళ్లను తాకేలా ట్రక్కుకు పైన హ్యాంగర్‌ లాంటి ఏర్పాట్లు చేశారు. దాని నుంచి విద్యుత్తు అందుకొని వాహనం నడుస్తుంది. మరోవైపు రోడ్డుకింద ప్రత్యేక ఏర్పాట్లు చేసి... ఆ రోడ్డు నుంచి వచ్చే విద్యుత్తు శక్తితో కారు నడిచేలా మరో ప్రయోగం కూడా జరుగుతోంది.

 

10:45 - June 22, 2016

నెల్లూరు : శ్రీహరికోట మరో అద్భుతానికి వేదికగా నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టాన 'షార్' ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. విదేశీ పరిజ్ఞానానికి భారత్ ఏమాత్రం తీసిపోదని మరోసారి నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరో భారీ ప్రయోగానికి శ్రీహరికోటలోని ' షార్ ' సాక్ష్యంగా ఇస్రో మరో రికార్డు సృష్టించింది.. అంతరిక్ష చరిత్రలో భారత్‌ పేరు రెపరెపలాడేలా చేసింది.. ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించింది.. సరిగ్గా 9గంటల 26 నిమిషాలకు శ్రీహరికోటనుంచి సీఎస్ఎల్వీ-సీ 34 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.. ప్రయోగించిన నాలుగు నిమిషాల్లో మొదటి దశపూర్తిచేసుకుంది... 9గంటల 32 నిమిషాలకు రెండో దశ దాటింది.... 9గంటల 35 నిమిషాలకు మూడో దశ విజయవంతమైంది.. 9గంటల 44 నిమిషాలకు నాలుగోదశను పూర్తిచేసింది.. 9గంటల 46నిమిషాలకు ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్‌ ప్రకటించారు.. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నశాస్త్రవేత్తలను ఛైర్మన్‌ అభినందించారు.

ఒకేసారి 20 ఉపగ్రహాలు  ప్రయోగం...

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగంలో 17 విదేశీ, 3 స్వదేశీ ఉపగ్రహాలు రాకెట్‌ ద్వారా నింగిలోకి దూసుకెళ్లాయి.. ఇందులో భారత్‌కుచెందిన కార్డోశాట్‌-2తో పాటు విదేశాలకు చెందిన 17 ఉపగ్రహాలున్నాయి.. భౌగోళిక సమాచార సేవలకు కార్డోశాట్‌-2 సహకారం అందించనుంది.. అలాగే పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీరప్రాంత సమాచారం... రోడ్డు నెట్‌వర్కింగ్‌, మ్యాపుల తయారీలో కీలకపాత్ర పోషించనుంది.. ఇక భారత్‌నుంచి ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించడం ఇదే తొలిసారి.. ఈ ప్రయోగాల్లో ఒకేసారి 37 ఉపగ్రహాలను ప్రయోగించి రష్యా మొదటి స్థానంలో ఉంది.. 2014లో ఈ ప్రయోగం జరిగింది.. ఆ తర్వాత 2013లో ఒకేసారి 29 ఉపగ్రహాలను అమెరికా ప్రయోగించింది.. భారత్‌ విషయానికొస్తే 2008లో 10 ఉపగ్రహాల ప్రయోగం జరిగింది.. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రయోగం..

Pages

Don't Miss

Subscribe to RSS - శాస్త్రవేత్తలు