శిక్ష

14:38 - May 29, 2017

ఇంఫాల్ : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కుమారుడు అజయ్ మీతాయికి ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో రోడ్డు రేసు కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. అజయ్ వాహనాన్ని తన కారతో ఓవర్ టేక్ చేసిన ఇరోమ్ రోజర్ ను గన్ తో అజయ్ మీతాయి కాల్చేశాడు. 

22:18 - March 18, 2017

ఓ అమాయకుడు బందీ అయ్యాడు. ఏడేళ్ల శిక్షకు సిద్ధమయ్యాడు. కానీ అతడు మాత్రం ఏ తప్పూ చేయలేదు. అతనితోపాటు అతని భార్య.. ఆ నవ వధువు నట్టింట్లో శిక్ష అనుభవిస్తుంది. ఆమె కూడా ఏ తప్పు చేయలేదు. ఈ దంపతులు దూరమై, కనీసం మాట్లాడుకునేందుకు కూడా చేసింది నమ్మకం. ఆ నమ్మకమే వారి జీవితాలను నాశనం చేసింది. ఇప్పుడా ఇళ్లాలు కడుపులో బిడ్డను మోస్తోంది. కన్నీళ్లు తాగుతూ బతుకుంతోంది. దీనంతటికీ కారణం నమ్మకమే. భర్త ఏ నాటికైనా తిరిగి వస్తాడన్న ఒకే ఒక నమ్మకం. ఆమెలో ధైర్యాన్ని తెస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:56 - February 16, 2017

ఢిల్లీ : 12 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో పటియాల కోర్టు తీర్పు వెలువరించింది. పేలుళ్ల ప్రధాన సూత్రధారి తారిక్‌ అహ్మద్‌ డార్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు- పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరోపణలు ఎదుర్కొన్న మరో ఇద్దరు మహ్మద్‌ హుసేన్‌ ఫాజిల్, మహ్మద్‌ రఫీక్‌ షాలను నిర్దోషులుగా పేర్కొంది. 2005 అక్టోబర్‌ 29న ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 60 మంది మృతి చెందారు. రెండువందలకు పైగా గాయపడ్డారు. సీరియల్‌ బాంబు దాడికి కుట్ర పన్నారని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది తారిక్‌ అహ్మద్‌తో మరో ఇద్దరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

 

19:42 - February 16, 2017

హైదరాబాద్ : అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళలాగానే... సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ రావులకు శిక్ష తప్పదని బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆధారాలు అందజేశానని స్పష్టం చేశారు.. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టంటూ కోర్టులో అఫిడవిట్‌ వేశారని ఆరోపించారు.. ఈ అఫిడవిట్‌ వల్లే కేవలం తాగునీటికి సంబంధించిన పనులే చేయాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు.. తాను అవినీతికి వ్యతిరేకమని... ప్రాజెక్టులకు కాదని తేల్చిచెప్పారు..

 

20:27 - February 3, 2017

అనంతపురం : కూడేరు మండలం జల్లిపల్లిలో మహిళను చితకబాదిన సర్పంచ్‌ నాగరాజును కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఎమ్మెల్యే వైసీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ సర్పంచ్‌ అయినందుకే నాగరాజుపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ దాడిని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు, మహిళాసంఘాలు జిల్లా ఎస్ పీ రాజశేఖర్‌ బాబును కలిశారు. అంతకుముందు మహిళా సంఘాలు నగరంలో ర్యాలీ చేపట్టాయి. సర్పంచ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశాయి. ఏపీలో టీడీపీ అధికారంలోకివచ్చాక మహిళలపై దాడులు పెరిగిపోయాయని... వైసీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. 

06:50 - January 5, 2017

విజయవాడ : మైనర్ బాలికలను ట్రాప్ చేసి ఆ తర్వాత దుర్మార్గానికి పాల్పడ్డ గ్యాంగ్‌ పాపం పండింది... రెండున్నరేళ్ల పాటు కొనసాగిన దర్యాప్తు.. విచారణ తర్వాత బెజవాడ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది...అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడమేగాకుండా బ్లూఫిలిం తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసింది గ్యాంగ్..తప్పుదారి పట్టిన యువకులు చేసిన దారుణానికి వారిని జైలుపాలు చేసింది...
మైనర్‌ బాలికలను ట్రాప్ ..అత్యాచారం వీడీయో..బ్లాక్‌మెయిలింగ్
విద్యార్థులను ప్రలోబపెట్టి వారిపై అత్యాచారం చేసి ఆ ఘటనను వీడియో రహస్యంగా చిత్రీకరించి తదుపరి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన కేసులో విజయవాడలోని 3వ అదనపు జిల్లా కోర్టు సంచలనం తీర్పునిచ్చింది....రెండున్నరేళ్లుగా సాగిన వాదోపవాదాలు.. సాక్ష్యాల సేకరణ..విచారణ తర్వాత ఐదుగురు నిందితులకు శిక్ష ఖరారు చేసింది...

1 నిమ్మకూరు సాయిరాంకు జీవితఖైదు
నిందితులకు న్యాయమూర్తి శిక్షలు ఖరారు చేయడంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి...దీంతో పాటు వారికి జరిమానా విధించారు..

2014 ఆగస్టు 22 ముఠా అరెస్టు...
విజయవాడ చెందిన నిమ్మకూరు సాయిరాం తన మిత్రులతో కలిసి ఓ గ్యాంగ్‌గా ఏర్పాటు చేసుకున్నాడు..వీరంతా కలిసి విద్యార్థినీలను ట్రాప్ చేసి వారితో ప్రేమ..లేదంటే మరో ఆశ చూపించి ట్రాప్ చేసేవారు..ఇలా వారిని తీసుకెళ్లి అత్యాచారం చేయడమేగాకుండా ఆ వీడియోను తీసేవారు..వాటిని వారికి చూపించి బెదిరింపులకు పాల్పడేవారు...ఈ ముఠా బారిన పడ్డ ఎందరో అమ్మాయిలు వేధింపులు తట్టుకోలేకపోయారు...దీంతో దాదాపు పది మంది అమ్మాయిల్లో ఒకరు అప్పటి పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వర్‌రావును కలిసి వివరించారు..దీంతో ఆయన ఈ కేసును సీరియస్‌గా తీసుకుని మహిళా స్టేషన్‌లో కేసు నమోదు చేయించి దర్యాప్తు చేయించారు....

2014 ఆగస్టు 22న ముఠా అరెస్టు...
ఈ కేసులో ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో కేసు విచారణ జరిపిన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సహేరా బేగం నిందితులెవరూ తప్పించుకోకుండా వారికి బెయిల్ కూడా రాకుండా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితులకు శిక్ష ఖరారవడంతో బెజవాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు...

నిందితులందరూ చాలా క్రూరంగా వ్యవహారించారు : సీపీ ఏబీ వెంకటేశ్వరరావు
నిందితులందరూ చాలా క్రూరంగా వ్యవహారించారని, కేసు విచారించిన ఆనాటి విజయవాడ సీపీ ఏబీ వెంకటేశ్వరరావు నిందితులు వ్యవహరించిన తీరుతెన్నులపై ఏం మాట్లాడారో చూద్దాం....

ప్రేమ ముసుగుతో  ట్రాప్
దుర్మార్గంగా వ్యవహరించిన ఐదుగురు ఎందరో అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు..బెదిరింపులతో లొంగదీసుకుని వారి బతుకులను చిద్రం చేశారు..ఇలాంటి వారెందరో ప్రేమ ముసుగేసుకుని ఇప్పటికీ ట్రాప్ చేస్తూనే ఉన్నారు.... 

16:00 - October 3, 2016

ఢిల్లీ : 2002లో సంచలనం సృష్టించిన నితీష్‌ కటారా పరువు హత్య కేసులో దోషి వికాస్‌ యాదవ్‌కు పాతికేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఐపిసి 201 సెక్షన్‌ కింద హైకోర్టు అదనంగా విధించిన ఐదేళ్ల శిక్షను కోర్టు తగ్గించింది. మరో దోషి సుఖ్‌దేవ్‌ పహల్వాన్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. నితీష్‌ కటారా హత్యకేసులో 2008లో ట్రయల్‌ కోర్టు జీవిత ఖైదు విధించగా, 2014లో ఢిల్లీ హైకోర్టు- ముగ్గురు నిందితులకు 30 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దీనిపై వికాస్‌, సుఖ్‌దేవ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఐదేళ్ల శిక్ష తగ్గించింది. ఫిబ్రవరి 17, 2002లో గజియాబాద్‌లో స్నేహితుడి పెళ్లికని వెళ్లిన నితీష్‌ కటారాను వికాస్‌, విశాల్‌, సుఖ్‌దేవ్‌ పహిల్వాన్‌లు కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. తన సోదరిని ప్రేమించాడన్న కారణంతో వికాస్‌ యాదవ్‌ స్నేహితులతో కలిసి నితీష్‌ కటారాను హతమార్చారు. ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించాలన్న నితీష్‌ తల్లి నీలమ్‌ కటారా విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

18:01 - June 13, 2016

ఢిల్లీ : గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో దోషులకు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. సిట్‌ ప్రత్యేక కోర్టు తీర్పును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ నెల 2న 66 మంది నిందితుల్లో 24 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దోషులుగా తేల్చిన 24 మందిలో 11 మందిపై హత్య కేసును నమోదు చేయగా, 13 మందిపై సాధారణ కేసులు నమోదు చేశారు. గుల్బర్గ్ సొసైటీలో జరిగిన దాడికి ఎటువంటి ప్రణాళికలు రచించలేదని, అప్పటికప్పుడు దాడి జరిగినట్లు కోర్టు తెలిపింది.11 మందిని ఉరి తీయాలని కోర్టులో వాదించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. నిందితులకు కోర్టు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తొమ్మిదేళ్ళ క్రితం గోద్రా రైలు దుర్ఘటన అనంతరం 2002 ఫిబ్రవరి 28న గుల్బర్గా సొసైటీ అల్లర్లలో కాంగ్రెస్ నేత ఎహసాన్‌ జాఫ్రితో సహా 69 మంది మరణించారు. 

11:57 - June 6, 2016

గుజరాత్ : 2002 గుజరాత్‌ అల్లర్ల తర్వాత జరిగిన గుల్మార్గ్‌ సొసైటీ నరమేధం కేసులో దోషులుగా తేలిన 24 మందికి అహ్మదాబాద్‌ ప్రత్యేక న్యాయస్థాని ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది. గుల్మార్గ్‌ అల్లర్లలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఈషన్‌ జాఫ్రీతో సహా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో 66 మంది నిందితులపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం... 24 మందిని దోషులుగా ప్రకటిస్తూ ఈనెల 2న తీర్పు చెప్పింది. కేసు విచారణలో ఉండగా నిందితుల్లో ఆరుగురు మరణించారు. వీరిలో 11 మందికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌ కోరే అవకాశం ఉంది. అయితే నిందితుల తరపున కేసు వాదించిన న్యాయవాది జీవిత ఖైదుకు విజ్ఞప్తి చేయొచ్చని భావిస్తున్నారు. ఈ కేసులో నేరపూరిత కుట్రకు సాక్ష్యాధారాలు లేవని తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం...ఐపీసీ లోని 120-బి సెక్షన్‌ కింది చార్జ్‌షీటులో ప్రస్తావించిన నేరాభియోగాలను పక్కన పెట్టింది.  

12:41 - June 2, 2016

గుజరాత్ : అహ్మదాబాద్ లోని గుల్బర్గ్ సొసైటీ ఊచకోత కేసులో శిక్ష ఖరారు అయింది. 66 మంది నిందితుల్లో 24 మందిని దోషులుగా అహ్మదాబాద్ కోర్టు నిర్దారించింది. బీజేపీ మాజీ కార్పొరేటర్ బిపిన్ పటేల్ ను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. గోద్రాలో సబర్మతి ఎక్స్ ప్రెస్ దహనం తర్వాతి రోజున కాలనీపై దాడి జరిగింది. గుల్బర్గ్ సొసైటీ గృహసముదాయంలో 20 వేలమంది మైనారిటీలు నివసిస్తున్నారు. మైనారిటీలు నివసించే సొసైటీ కాలనీలో పెట్రోల్ క్యాన్లతో దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో 39 మృతదేహాలను గుర్తించినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. 2009 సంవత్సంలో కేసు ట్రయల్ ప్రారంభం అయింది. 2015 సెప్టెంబర్ లో కేసు విచారణ ముగిసింది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - శిక్ష