శివ

14:11 - November 8, 2018

తమిళ స్టార్ హీరో, తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో, వీరం, వేదాళం, వివేకం తర్వాత, విశ్వాసం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సెట్‌లో, ఒక డ్యాన్సర్ మరణించిన ఘటన గురించి తెలిసి కోలీవుడ్ ఉలిక్కి పడింది.
ప్రస్తుతం, విశ్వాసం సినిమాలోని ఒక పాట చిత్రీకరణ పూణెలో జరుగుతుంది. రిహార్సల్స్ చేస్తున్న టైమ్‌లో, శరవణన్ అనే డ్యాన్సర్, గుండెపోటు రావడంతో సెట్‌లోనే కుప్పకూలిపోయాడు. యూనిట్ సభ్యులు వెంటనే అతణ్ణి హాస్పిటల్‌కి తీసుకెళ్ళగా, అప్పటికే శరవణన్ మృతిచెందినట్టు డాక్టర్స్ చెప్పడంతో, యూనిట్ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయం తెలిసి, అజిత్ చాలా బాధపడ్డాడట. తనే దగ్గరుండి పోస్ట్‌మార్టం పనులవీ చూసుకున్నాడని మూవీ యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక, శరవణన్ గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, కానీ, ఆసంగతి యూనిట్ వారికి చెప్పలేదని తోటి డ్యాన్సర్స్ అంటున్నారు. శరవణన్ మృతదేహాన్ని చెన్నైలోని అతని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చెయ్యడంతో పాటుగా, మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందచేసింది విశ్వాసం టీమ్.  

13:47 - October 26, 2018

తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో ఇంతకుముందు వీరం, వేదాళం, వివేకం సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నాలుగవ చిత్రం చేస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై, టి.జి.త్యాగరాజన్ సమర్పణలో, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న మూవీ, విశ్వాసం.. నయన తార హీరోయిన్. డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు. విశ్వాసంలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు విశ్వాసం సెకండ్‌లుక్ విడుదల చేసింది మూవీ‌ యూనిట్.. సాధారణంగా సాల్ట్‌ అండ్ పెప్పర్ లుక్‌లో ఉండే అజిత్, బ్లాక్ హెయిర్, గెడ్డంతో, బైక్‌పై ఉన్నలుక్ బాగుంది. హెల్మెట్ పెట్టుకుని, రెండు చేతులు పైకెత్తి అభివాదం చేస్తున్నాడు తల.. అతని వెనక జనాలందరూ పరిగెత్తడం చూస్తుంటే, ఈ సన్నివేశం పాటలో వస్తుందేమో అనిపిస్తుంది. కోవై సరళ, తంబి రామయ్య, వివేక్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్న విశ్వాసం, 2019 సంక్రాంతికి  గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

 

07:09 - May 14, 2018

విజయనగరం : జిల్లాలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కాడు. సరస్వతి ప్రియుడు శివను పోలీసులు పట్టుకున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకోగా... అసలు సూత్రధారి శివ ఎస్కేపయ్యాడు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న శివను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లా పార్వతిపురం భర్త హత్య కేసులో కీలక నిందితుడు.. శివను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ నెల 7న కొంత మంది దుండగులు తన భర్తపై దాడి చేసి, తన బంగారాన్ని కాజేశారని సరస్వతి అనే మహిళ పోలీసులకు తెలియజేసిన విషయం విదితమే. అయితే మర్నాడు కేసు ఊహించని మలుపు తిరిగింది. పథకం ప్రకారం భార్య సరస్వతే కిరాయి గుండాలకు సుపారీ ఇచ్చి భర్త శంకర్రావును చంపించిందని పోలీసులు తెలిపారు. సరస్వతి.. ప్రియుడు శివతో కలిసి శంకర్రావు హత్యకు పథకం పన్నారని పోలీసులు చెప్పారు.

సరస్వతి తనకు ఫేస్‌ బుక్‌లో పరిచయమైన శివ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇంతలో పెద్దలు శంకర్రావుతో ఆమెకు వివాహం నిశ్చయిచడంతో, శివతో కలిసి భర్త హత్యకు ప్లాన్‌ వేసింది. విశాఖపట్నంలో శివకు పరిచయం ఉన్న పాత నేరస్తులు.. సారపల్లి రామకృష్ణ, గోపిలతో శంకర్రావు హత్య విషయం మాట్లాడారు. శంకరావును హత్య చేస్తే తన దగ్గర ఉన్న బంగారాన్ని ఇస్తానని సరస్వతి వారికి తెలిపింది. ముందుగా తన నిశ్చితార్థ ఉంగరాన్ని వారికి ఇచ్చి.. తర్వాత మూడు దఫాలుగా తేజ్‌యాప్‌ ద్వారా 18 వేలు ఇచ్చింది. హత్య తరువాత మిగిలిన బంగారాన్ని ఇస్తానని తెలుపడంతో రామకృష్ణ, గోపిలు.. బంగార్రాజు, కిషోర్‌ అనే మరోఇద్దరితో కలిసి హత్యకు రంగం సిద్ధం చేశారు.

ఈనెల 7వ తేదీన సరస్వతి ఆమె భర్త శంకర్రావు మోటర్‌ వాహన సర్వీసింగ్‌ కోసం పార్వతిపురం వచ్చారు. అయితే వీరిని నిందితులు రామకృష్ణ, గోపి, బంగార్రాజు, కిషోర్‌లు ఆటోలో ఫాలో అయ్యారు. తాము ఏ ప్రాంతంలో ఉన్నామో తెలిసేలా నిందితులకు, సరస్వతి జీపీఎస్ ద్వార లొకేషన్‌ను పంపింది. భార్యభర్తలిద్దరూ తోటపల్లి ఐటీడీఏ పార్కు వద్దకు చేరుకోగానే నిందితులు రామకృష్ణ, గోపి, బంగార్రాజు, కిషోర్‌లు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత తన భర్తపై, తనపై కొంతమంది దాడి చేసి బంగారాన్ని కాజేశారని సరస్వతి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. అయితే సంఘటన తీరును నిశితంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ పాలరాజు..నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశాడు.

సరస్వతిని వివరాలు అడిగి తెలుసుకొని తిరిగి బయలు దేరిన ఎస్పీకి మానపురం వద్ద ఆటోలో నిందితులు తారసపడ్డారు. విషయం ఆరా తీయడంతో అసలు పథకం బయటపడింది. భార్య సరస్వతే ప్రియుడు శివతో కలిసి కిరాయి గూండాలతో భర్తను చంపించిందని వెల్లడైంది. కిరాయి గూండాలు పోలీసులకు దొరకడంతో శివ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసు బృందాలు గాలింపును తీవ్ర చేయడంతో శివ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు.

శివ పోలీసులకు దొరకడంతో మరో ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. శంకరావుతో వివాహం ఇష్టం లేని సరస్వతి పెళ్లికి ముందే శంకర్రావు హత్యకు పథకం వేసింది. శంకర్రావు బెంగళూర్‌లో పనిచేస్తుండటంతో అక్కడే అతన్ని మట్టుబెట్టాలని కిరాయి గూండాలతో మాట్లాడింది. అందుకు గాను శివ వారికి 25 వేలు చెల్లించాడు. బెంగళూరులో సరస్వతి ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదు. దీంతో విజయనగరంలో మర్డర్‌ప్లాన్‌ చేసి.. కటకటాల్లో ఊచలు లెక్కిస్తోంది. 

12:49 - August 18, 2017

అజిత్ చిత్రం వివేగం రిలీజ్ కు సిద్ధమౌతోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతోంది. సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్ విడుదలై హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చిత్ర ట్రైలర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. 2.24 నిమిషాల పాటు ట్రైలర్‌ సాగింది. 
నేను ఎవరనేది.. ఎదుటివాడిని బట్టే ఉంటుంది.. అంటూ అజిత్‌ చెప్పే ప్రారంభ డైలాగు ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ట్రైలర్ లో రోమాంటిక్ సన్నివేశాలు కూడా చూపించారు. అజిత్ సరసన కాజల్ నటిస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 18 గంటల్లో ఏకంగా 40 లక్షల మంది వీక్షించడం విశేషం. 24వ తేదీన విడుదలవుతున్న సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందా 

09:22 - December 21, 2016

‘రాంగోపాల్ వర్మ'..వివాదాలకు కేరాఫ్ అడ్రస్..ఎప్పుడు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో తెలియదు. ఆయన ట్విట్టర్ ద్వారా పలు ట్వీట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇదే నా చివరి సినిమా అని...బై టాలీవుడ్..అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా గర్వపడే సినిమాలు చేస్తానంటూ 'రాంగోపాల్ వర్మ' ప్రకటించారు. చివరి తెలుగు సినిమా 'వంగవీటి' అని చెప్పడం జరిగిందని, కానీ అన్నమాట మీద నిలబడనని అందరికీ తెలిసిందేనంటూ వ్యాఖ్యానించారు. ఆయన దర్శకత్వం వహించిన 'వంగవీటి' సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నగరంలో 'శివ' టు 'వంగవీటి' అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు సినీ అతిరథ మహారథులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. ఈ సందర్శంగా 'వర్మ' మాట్లాడుతూ...ప్రస్తుతం తనలో నిజాయితీ మెరుగవుతోందని, ముందు ముందు గర్వంగా చెప్పుకొనే సినిమాలు తీస్తానన్నారు. 'రాజమౌళి'కి ప్రామిస్ చేస్తున్నట్లు, తన మీద తానే ఒట్టేసుకుని చెబుతున్నట్లు తెలిపారు. విజయవాడలో చదువుకునేప్పుడు వంగవీటి రంగా ర్యాలీ చూసినట్లు , గాంధీని హత్యచేసినప్పుడు అక్కడికి వెయ్యి గజాల దూరంలోనే ఉన్నానన్నారు. సినిమాల్లో నేను వయోలెన్స్ ను టేకప్‌ చేయడానికి ఉన్న కారణాలవని చెప్పుకొచ్చారు. 'శివ' కథకూ, 'వంగవీటి' కథకూ సంబంధం లేదు. హిట్‌ తీసినంత మాత్రాన అది రాదని, 'నాగార్జున' నన్ను నమ్మి, నా వెనుక నిల్చొని 'శివ' చేశాడని తెలిపారు.

10:32 - July 14, 2016

అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'తలా 57' చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రంలో అజిత్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించనున్నారు. 'తలా 57' చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు, పక్కా స్ర్కిప్ట్ తో హిట్ కొట్టాలనే ముందుకు వెళుతున్నట్లు నిర్మాత టి.జి.త్యాగరాజన్ పేర్కొన్నారు. త్వరలోనే టైటిల్ ను..నటీనటుల వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే అజిత్ సరసన అనుష్క లేదా కాజల్ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్. అజిత్..శివ కాంబినేషన్ లో గతంలో 'వీరమ్', వేదాలమ్' చిత్రాలు మంచి విజయాలు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

17:59 - June 17, 2016

హైదరాబాద్ : నగరంలో 15వ తేదీన సాయంత్రంలో ఎమ్మెల్యే కాలనీ రోడ్ నం: 12 బంజారాహిల్సలో ఓ రియల్టర్ నివాసంలో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందుతుడు శివను అతనికి సహకరించిన దామోదర్ లను అరెస్ట్ చేశామని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ శివ అనే వ్యక్తి మధుసూధన రెడ్డికి మోహన రెడ్డి అనే వ్యక్తి ద్వారా దాదాపు ఒక సంత్సరన్న క్రితం పరిచయమయ్యాడని తెలిపారు. మోహన రెడ్డి కి అతీత శక్తులున్నాయని మధుసూధన్ రెడ్డికి తెలిపాడు. శివ గతంలో మధుసూధన్ రెడ్డికి ఒక మ్యాజిక్ చేసిన లక్ష రూపాయల్ని రెండు లక్షలు చేసిన చూపించాడు. దాంతో శివను నమ్మిన మధుసూధన్ రెడ్డి లక్ష్మీ పూజ ద్వారా నగదును డబుల్ చేయటమే కాక ఒక పురాతన నాణాన్ని విదేశాలలో విక్రయిస్తే కోట్లల్లో డబ్బు వస్తుందని నమ్మబలికాడు. దీంతో శివను పూర్తిగా నమ్మిన మధుసూధన్ బెంగుళూరు నుండి శివను హైదరాబాద్ కు రప్పించి ఓ హోటల్ లో బస ఏర్పాటు చేశాడు. 15వ తేదీన మధుసూధన్ రెడ్డి నివాసంలో పూజను ఏర్పాటు చేశారు. పూజకు ముందుగా తమమీద నమ్మకం పెరగటానికి శివ పూనుకున్నాడు. ఈ క్రమంలోనే రూ. 1.5 లక్షలు పూజలో పెట్టమన్నాడు. వారు ఆ విధంగానే చేశారు. దీంతో వారిని ఏమార్చి వారు కూడా తీసుకువచ్చిన రూ.3లక్షలను పూజలో పెట్టారు. నగదును ఎక్కువ మొత్తంలో పెడితే ఎక్కువ అవుతుందనీ మరింత నమ్మించాడు. దీంతో కుటుంబ సభ్యులు రూ.1.3కోట్లు పూజలో పెట్టారు. మధ్యహ్నాం రెండు గంటల వరకూ పూజ కొనసాగింది. ఈ నేపథ్యంలో తాను తయారు చేసిన ప్రసాదాన్ని తినిపించాడు. అనంతరం మినిస్టర్ క్వార్డర్స్ లో వుండే దేవాలయానికి మధుసూధన్ రెడ్డి కుమారుడ్ని తీసుకుని వెళ్లాడు. తరువాత సందేశ్ ను తీసుకుని శివ బస చేసిన హోటల్ కి తీసుకువెళాడు. నగదుని కారులోనే వుంచి కార్ లాక్ చేసిన రూమ్ కు తీసుకువెళ్లి మెడిటేషన్ చేయటానికి సందేశ్ వద్ద వున్న మెటల్స్ ని తీసి పక్కన పెట్టమన్నాడు. కార్ తాళాలు పక్కన పెట్టి సందేశ్ మెడిటేషన్ లోకి వెళ్లాడు. ఈక్రమంలో కారు కీస్ తీసుకుని శివ కారులో వున్నటువంటి క్యాష్ ను తీసుకుని కిందికి వెళ్లి సందేశ్ కారులో వున్న క్యాష్ ను తన కారులోకి మార్చుకున్నాడు. మిగతా వివరాల కోసం ఈ వీడియో చూడండి. బురిడీ బాబా ఎలా బురిడీ కొట్టించాడో తెలుసుకోండి...

Don't Miss

Subscribe to RSS - శివ