శిశువు

13:35 - July 30, 2018

 బ్రెజిల్ :  ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఓ రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ప్రసం కోసం వెళుతున్న ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఎదురైన సంఘటన వారిని విభ్రాంతికి గురిచేసింది.

ప్రసవం కోసం వెళుతు..రోడ్డు ప్రమాదం..
ఓ ట్రక్కు ఎక్కి ప్రసవం కోసం వెళుతున్న మహిళ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందింది. స్థానికులు సమాచారంతో సహాయక చర్యలకు వెళ్లిన పోలీసులకు అప్పుడే పుట్టిన శిశువు కనిపించింది. దీంతో వారు ఆ పరిసరాలను పరిశీలించారు.ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించిన వారికి పొట్ట పగిలిపోయి వున్న మహిళ కనిపించింది. తమకు కనిపించిన పసిబిడ్డ..పొట్ట పగిలిపోయి వున్న మహిళ..ప్రమాదం జరిగిన ఘటనతో వారు జరిగిన ఘటనను ఊహించారు. ఓ నిండు చూలాలు కాన్పు కోసం వెదురు బొంగుల లోడుతో వెళుతున్న ట్రక్కులో ప్రయాణిస్తోంది. బ్రెజిల్ లోని సావోపాలో నుంచి క్యూరిటీబా మధ్య వాహనం వెళుతుండగా..వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది.
ప్రమాదంలో మరణించిన గర్భిణి..
ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్, ఆ గర్బిణీ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో గర్భిణి పొట్ట పగిలిపోయి శిశువు బయటకు వచ్చింది. ఈ విషయం తెలియని పోలీసులు, వాహనాన్ని తొలగించి గర్భిణి మృతదేహాన్ని బయటకు తీస్తుండగా, పక్కనే కొద్ది దూరంలో గడ్డిలో అప్పుడే పుట్టిన శిశువు ఏడుపు వినిపించింది. ఆ చిన్నారిని సురక్షితంగా ఆసుపత్రికి చేర్చిన అధికారులు, మృతి చెందిన గర్భిణీ బంధువుల కోసం ఆరా తీస్తున్నారు.

13:42 - July 11, 2018

సూర్యపేట : జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. వైద్యం వికటించి బాలింత, శిశువు మృతి చెందారు. సూర్యపేటలోని శ్రీ శివసాయి ఆస్పత్రిలో రామారంకు చెందిన బాలింత మణెమ్మ, శిశువు మృతి చెందారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. అయితే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తల్లి, శిశువు చెందారని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 

 

20:40 - April 16, 2018

సంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును బాత్‌రూంలో వదిలి వెళ్లారు. ఆసుపత్రి సిబ్బంది చూసి సూపరింటెండెంట్‌ పద్మజకు తెలిపారు. అప్పటికే శిశువు మరణించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రామచంద్రాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

08:29 - April 4, 2018

హైదరాబాద్ : కోఠి ప్రసూతి ఆసుపత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు..బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రసూతి ఆసుపత్రిలో శిశువు మృతి చెందడం కలకలం రేగింది. మణెమ్మ అనే గర్భిణీ ప్రసూతి ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. కానీ శిశువు మృతి చెందిందని వైద్యులు పేర్కొనడంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అసలు పట్టించుకోలేదని టెన్ టివితో వాపోయింది. వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

10:20 - January 21, 2018
18:35 - December 6, 2017

భద్రాద్రి కొత్తగూడెం : మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోర్రేడు వాగులోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహాన్ని క్యారీ బ్యాగ్‌లో చుట్టి రాళ్ల మధ్యలో పడేసి పోయారు కొందరు వ్యక్తులు. స్ధానికుల సమాచారంతో పోలీసులు చిన్నారిని తరలించారు.  
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోర్రేడులో దారుణం

 

18:32 - December 6, 2017

హైదరాబాద్‌ : ముషీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకరోజు వయసున్న శిశువు మృతదేహాన్ని పాలిథిన్ కవర్‌లో చుట్టి కొందరు చెత్తకుప్పలో వదిలి వెళ్లిపోయారు. శిశువు మృతదేహాన్ని చూసి చలించినపోయిన స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత శిశువును అక్కడి నుంచి తరలించారు. 

 

20:12 - November 26, 2017

తూర్పుగోదావరి : మూడు రోజుల క్రితం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువు ఆచూకీని పోలీసులు గుర్తించారు. శిశువును అపహరించిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ ఆ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. మూడు రోజుల క్రితం ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ మహిళ ప్రసూతి ఆస్పతి వార్డులో ఉన్న గంటా లక్ష్మి అనే బాలింత నుంచి ఒక్కరోజు వయసున్న ఆడశిశువును వ్యాక్సిన్‌ కోసమని నమ్మబలికి వెంట తీసుకు వెళ్లింది. చిన్నారి అమ్మమ్మ వెళ్లినా.. ఆమె కళ్లుగప్పి..శిశువును ఆగంతకురాలు అపహరించింది. సీసీ పుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితురాలిని ఐ.పోలవరంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

15:07 - November 26, 2017

తూర్పుగోదావరి : జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ గురైన పసికందు ఆచూకీ లభ్యమైంది. శిశువును ఐ.పోలవరం మండలం ఇరగవరంలో పోలీసులు గుర్తించారు. శిశువును తల్లిదండ్రులకు అప్పగించేందుకు కాకినాడకు తరలించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:46 - November 25, 2017

తూర్పుగోదావరి : కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతీ వార్డు ఎదుట కిడ్నాప్‌ అయిన శిశువు బంధువులు ఆందోళనకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో తమ బిడ్డను కిడ్నాప్‌ చేశారని వారు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ గురించి ఇప్పటివరకు ఏ సమాచారం లేదని.. ఆచూకీ తెలిసేవరకూ ఆందోళన చేస్తామని ఆసుపత్రి ఎదుట బైటాయించారు. అయితే సెక్యూరిటీ సిబ్బందికి నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో నైట్‌ షిఫ్ట్‌లో పని చేసే సెక్యూరిటీ సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న సీసీ కెమెరాలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్నాయి. దానికి సుమారు 22 లక్షలు బకాయిలు చెల్లించకపోవడంతో.. కాంట్రాక్టర్‌ నిర్వహణ సరిగా చూడటం లేదనే వాదన వినబడుతోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - శిశువు