శృతి హాసన్

10:07 - October 9, 2017

ఒక వుడ్ నుండి వచ్చిన హీరోలు..హీరోయిన్లు..ఇతర వుడ్ లో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతుంటుంటారు. విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తుంటారు. కానీ కొంతమంది ఇతర భాషా చిత్రాల్లో నటించడానికి అంతగా ఇష్టపడరు. ఈ జాబితాలో ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' కూతురు 'శృతి హాసన్' చేరింది.

టాలీవుడ్..బాలీవుడ్..ఇలా పలు భాషా చిత్రాల్లో 'శృతి హాసన్' నటిస్తూ అభిమానులను మెప్పిస్తోంది. ఆమె తెలుగులో నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి కూడా. మెగా స్టార్ 'పవన్ కళ్యాణ్' నటించిన 'కాటమరాయుడు' సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. అనంతరం ఎలాంటి తెలుగు చిత్రానికి సైన్ చేయలేదు. ప్రస్తుతం 'శ్రుతి' తన తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి 'శభాష్‌ నాయుడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగు..తమిళ..హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.

అయితే ఇదిలా ఉంటే కన్నడ చిత్రంలో నటించాలని దర్శకుడు నంద కిశోర్, నిర్మాతలు కోరినట్లు టాక్. 'ధృవ సర్జ' హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'శృతి' హీరోయిన్ గా నటించబోతోందని ప్రచారం జరిగింది. దీనిపై 'శృతి' స్పందించారు. ట్విటర్‌ వేదికగా ఖండించారు. ఇప్పుడు, భవిష్యత్తులో కన్నడ చిత్రంలో నటించే ఉద్దేశం లేదని, కన్నడ చిత్రంలో నటించమని ఎవరూ తనను సంప్రదించలేదని కుండబద్ధలు కొట్లారు. దీనికి సంబంధించిన విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

10:29 - July 9, 2017

ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' కుమార్తెలలో ఒకరైన 'శృతి హాసన్' చలన చిత్ర రంగంలో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకెళుతోంది. టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే 'బిగ్ బాస్' ద్వారా బుల్లితెరపై 'కమల్ హాసన్' కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మీడియా 'శృతి'ని పలు ప్రశ్నలు వేసింది. 'బిగ్ బాస్'గా 'కమల్' బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తారనే నమ్మకం ఉందని, ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుందని పేర్కొంది.
బుల్లితెరపై కనిపిస్తారనే ప్రశ్నకు 'బుల్లితెరపై మెరుస్తానని..’బిగ్ బాస్' లాంటి షో ద్వారా వస్తే చాలా హ్యాపీగా ఫీలవుతాను' అని తెలిపింది. వెండితెర కంటే 'బుల్లితెర' విస్తృతమైందని, సినిమా స్థాయిలోనే టీవీ రంగం కూడా ఎదిగిందన్నారు. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్' ప్రస్తుతం తమిళ భాషలో టెలికాస్ట్ అవుతోంది. ఇందులో 'కమల్' నటించారు. ఈ షో అతి త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకొనేందుకు ముందుకొస్తోంది. ఈ షోతో 'ఎన్టీఆర్' బుల్లితెరపై మెరవనున్నారు.

07:53 - May 30, 2017

తెలుగు చలన చిత్ర సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాల్లో 'బాహుబలి 2’ ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో పలు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందబోతున్నాయి. అందులో 'సంఘమిత్ర' ఒకటి. సుందర్ సి.దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తేనాడాళ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమౌతోంది. ఈ సినిమాలో 'శృతి హాసన్' ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అనివార్య కారణాల వల్ల 'శృతి' కొనసాగించలేకపోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ తేనాండళ్ ఫిలిమ్స్ ప్రకటించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమా కోసం 'శృతి హాసన్' పలు ప్రత్యేకమైన శిక్షణలు తీసుకున్న సంగతి తెలిసిందే. ‘శృతి' సినిమాలో నటించడం లేదనే వార్త హల్ చల్ చేస్తోంది. పూర్తి స్ర్కిప్ట్ ను అందించలేదని, షెడ్యూల్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదని 'శృతి' ప్రతినిధి పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శ్రుతికి, నిర్మాతలకూ మధ్య ఏదో గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఆర్య .. జయం రవి కీలకమైన పాత్రలను పోషించనున్నారు.

11:07 - April 21, 2017

ఒక సినిమా కోసం హీరో..హీరోయిన్లు ఎంతో కష్టపడుతుంటారు. పాత్రలో లీనమై పోవాలని వారు భావిస్తుంటారు. అందుకనుగుణంగా శిక్షణలను సైతం తీసుకుంటుంటారు. అందులో హీరోయిన్లు కూడా శిక్షణలను పొందుతుండడం గమనార్హం. ఇటీవలే వచ్చిన 'బాహుబలి', ‘రుద్రమదేవి' చిత్రాల్లో 'అనుష్క' యుద్ధ విద్యలలో శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. తరువాత 'సంఘమిత్ర' కోసం 'శృతి హాసన్' ఏకంగా కత్తి విన్యాసాలు నేర్చుకొంటోంది. తాజాగా 'సమంత' ఇందులో చేరింది. ఈమె కర్రసాము నేర్చుకొంటోంది. ‘సమంత' చేస్తున్న కర్రసాము వీడియో సోషల్ మీడియాలో వైరల అవుతోంది. ప్రస్తుతం 'రాజు గారి గది -2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా 'రామ్ చరణ్' - ‘సుకుమార్' కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో కూడా 'సమంత' నటిస్తోంది. కర్రసాము ఏ చిత్రంలో ఉండనుందో తెలియరావడం లేదు. ‘నాకు సవాళ్లంటే ఇష్టం..కర్రసాము నేర్చుకోవడం ఓ సవాల్ గా తీసుకున్నా..ఇప్పుడు దీనితోనే నా సహవాసం' అంటూ సమంత పేర్కొంది. మరి ఆమె సమంత కర్రసాము ఎలా చేసిందో..ఏ చిత్రంలో చేసిందో చూడాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

13:25 - April 20, 2017

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె 'శృతి హాసన్' 'కత్తి' పట్టారు. తన తదుపరి చిత్రం కోసం ఆమె విన్యాసాలు నేర్చుకొంటోంది. సుందర్ సి.డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. పాత్రలో ఒదిగిపోవాలనే ఉద్ధేశ్యంతో 'శృతి' బాగా కష్టపడుతున్నారంట. పోరాట యోధురాలైన యువరాణి పాత్రను ఆమె పోషించనుంది. దీనితో యుద్ధవిద్యలో నిపుణుడైన ప్రత్యేక శిక్షకుడి పర్యవేక్షణలో కత్తి యుద్దాలకు సంబంధించిన మెళుకవులను నేర్చుకొంటోంది. శృతి విన్యాసాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

10:43 - March 21, 2017

అంతటా 'పవన్' ఫీవర్ పట్టుకుంది. ఆయన నటించిన 'కాటమరాయుడు' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్..ట్రైలర్..పోస్టర్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. ఉగాది సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఉగాది పండుగకు చిత్రం రిలీజ్ అవుతుందా ? లేదా ? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉగాదికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానుల సందేహాలు పటాపంచలయ్యాయి. తాజగా ఈనెల 24వ తేదీన చిత్రం వస్తోందంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. మాస్ ఆడియన్స్ ను.. యూత్ ను.. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ చిత్రం రూపొందిందని తెలుస్తోంది. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, అలీ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

18:39 - March 12, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న 'కాటమరాయుడు' రికార్డులు నెలకోల్పోతుంది. ఇటీవలే చిత్ర టీజర్ కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర పాటలను రెండు రోజులకొకసారి యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా మూడో పాటను విడుదల చేశారు. ‘రాజులైనా, బంటులైనా.. కూలి అయినా, యాపారులైనా’..అని సాగే ఈ పాట మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. డాలీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 4న యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్‌ ఆదివారానికి కోటి వ్యూస్‌ను క్రాస్‌ చేయగా, 2.52 లక్షల మంది లైక్‌లు పొందింది. పవన్‌కల్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గా ఇది నిలిచినట్లు సమాచారం. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. శివ బాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, అలీ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

14:36 - March 10, 2017

నౌ ఏ డేస్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా ఏదైనా కొంచం ఎంటర్టైన్మెంట్ ఉంటె బెటర్ అనుకుంటున్నారు. మన ఫిలిం మేకర్స్ కూడా ఆడియన్స్ కి ఎం కావాలో అదే ప్రిపేర్ చేస్తున్నారు. వెరీ సూన్ స్క్రీన్ ని టచ్ చెయ్యబోతున్న పెద్ద స్టార్ సినిమా లో కూడా ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కొంచెం గట్టిగానే పెట్టారట. 'సునీల్' లాంటి కమెడియన్ తో సీరియస్ సబ్జెక్టు ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కిషోర్ కుమార్. 'తడాకా' సినిమా తో నాగచైతన్యని, సునీల్ ని మల్టీస్టారర్ చేసి స్క్రీన్ మీద యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫన్ మిస్ కాకుండా జాగర్త పడ్డాడు కిషోర్ కుమార్. 'తడాకా' సినిమా పోలీస్ డిపార్ట్మెంట్ కి లోకల్ మాఫియాకి జరిగే ఒక యాక్షన్ లైన్. ఇలాంటి లైన్ ని కూడా తెలుగు ప్రేక్షకుల పల్స్ తెల్సుకొని ఎంటర్టైన్మెంట్ ని ఎక్కడ తగ్గకుండా ప్రెజెంట్ చేసాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాలో ఫన్ ఆడ్ చెయ్యడానికి 'సునీల్' కు క్రేజ్ కూడా ఆడ్ అయింది.

గబ్బర్ సింగ్..
'పవన్ కళ్యాణ్' లో మంచి హీరోతో పాటు పర్ఫెక్ట్ టైమింగ్ లో కామెడీ ప్రెజెంట్ చెయ్యగల నటుడు కూడా ఉన్నాడు అనడానికి అతని ప్రీవియస్ ఫిలిమ్స్ మంచి ఎగ్జామ్పుల్. 'గబ్బర్ సింగ్' సినిమాలో అన్యాయాన్ని ఎదిరించే పోలీస్ పాత్రలో నటిస్తూనే టైం టు టైం వచ్చే ఎంటర్టైన్మెంట్ సీన్స్ లో కామెడీ టైమింగ్ లో తానేంటో చూపించాడు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో వచ్చే అంత్యాక్షరి సీన్స్ లో విలన్ గ్యాంగ్ తో పాటు బీభత్సమ్ సృష్టించాడు పవర్ స్టార్. ప‌వ‌ర్ స్టార్ 'ప‌వ‌న్ క‌ల్యాణ్‌', 'శ్రుతి హాస‌న్' జంట‌గా న‌టిస్తోన్న `కాట‌మ‌రాయుడు` షూటింగ్ చివ‌రి స్టేజ్ లో ఉంది. ఫ్యాక్ష‌నిస్టు పాత్ర‌లో ప‌వ‌న్ తొలిసారి క‌నిపించ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. టైటిల్ చూసి చాలా సీరియస్ సినిమా అని అందరూ అనుకున్నున్న 'కాటమరాయుడు' సినిమా లో పవన్ కళ్యాణ్ మార్కు ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా ఉండబోతుంది అంట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో పవన్‌ క్యారెక్టర్‌ చాలా హుషారుగా వుంటుందని, సెకండాఫ్‌లో వచ్చే కామెడీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రానికి డాలీకి పూర్తిగా ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చిన 'పవన్‌కళ్యాణ్‌' అతను చెప్పినట్టల్లా చేసాడట. ఏది ఏమైనా డైరెక్టర్లు చెప్పినట్టు వింటే సినిమాలు హిట్టే.

16:31 - March 9, 2017

'లాగే...లాగే మనసు లాగే..నీవైపు లాగే..' అంటున్నాడు 'కాటమరాయుడు'.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్ర పాటలు రెండు రోజులకొకసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలు ఆడియో వేడుకలు నిర్వహించకుండా ఒక్కో పాటను ఒక్కో రోజు యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. 'సరైనోడు’, 'ధృవ’, 'ఖైదీ నెం 150’, 'విన్నర్' చిత్రాలు ప్రీ రిలీజ్ వేడుకని జరుపుకొని మంచి విజయాలు సాధించడంతో 'కాటమరాయుడు' టీం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే 'మిర..మిర..మీసం' అంటూ మొదటి పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం 4గంటలకు 'లాగే.లాగే..మనసు లాగే..నీ వైపు..లాగే' పాటను విడుదల చేశారు. విడుదల చేసిన గంటల్లోనే వేల మంది వీక్షించడం విశేషం. శరత్ మరార్ నిర్మాణంలో 'గోపాల..గోపాల' ఫేండ డాలీ డైరెక్షన్ లో సినిమా రూపొందుతోంది. పవన్ కు జంటగా శృతి హాసన్ నటించారు. పవన్ తమ్ముళ్లుగా శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. 

08:39 - March 9, 2017

సినిమా రిలీజ్ అంటే క్యూరియాసిటీ క్రియేట్ చెయ్యాలి అలా చెయ్యాలంటే హైప్ పెంచాలి. సినిమా హైప్ పెంచే మేజర్ ఎలిమెంట్స్ ట్రైలర్స్, టీజర్స్, ఫస్ట్ లుక్స్ ..వీటితో పాటు సాంగ్ ప్రీ రిలీజ్ లు కూడా ఫిలిం ఎక్స్ పెక్టషన్స్ ని పెంచేస్తున్నాయి. తాజాగా మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలు ఆడియో వేడుకలు నిర్వహించకుండా ఒక్కో పాటను ఒక్కో రోజు యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. 'సరైనోడు’, 'ధృవ’, 'ఖైదీ నెం 150’, 'విన్నర్' చిత్రాలు ప్రీ రిలీజ్ వేడుకని జరుపుకొని మంచి విజయాలు సాధించడంతో 'కాటమరాయుడు' టీం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఆయన నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్ర పాటలను రెండు రోజులకొకసారి యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ‘మిర మిరా మీసం..’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో పాటను సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. 'లగే..లగే' తో పాటను విడుదల చేయనున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మాణంలో 'గోపాల..గోపాల' ఫేండ డాలీ డైరెక్షన్ లో సినిమా రూపొందుతోంది. పవన్ కు జంటగా శృతి హాసన్ నటించారు. పవన్ తమ్ముళ్లుగా శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. మరి రెండో పాట ఎలా ఉందో వినాలంటే సాయంత్రం 4గంటల వరకు వేచి ఉండాల్సిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - శృతి హాసన్