శైవక్షేత్రాలు

06:33 - February 13, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు.. అన్ని శైవక్షేత్రాలూ.. శివజాగరణకు సమాయత్తమయ్యాయి. ఉదయం నుంచే భక్తుల ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలూ.. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ తదితర ప్రసిద్ధ క్షేత్రాలన్నీ భక్తజన సందోహంగా మారాయి. శివభక్తులు పంచాక్షరీ మంత్రాలతో.. ఆయా క్షేత్రాలు మార్మోగి పోతున్నాయి.

విష్ణు, బ్రహ్మల మధ్య తలెత్తిన ఆధిపత్య తగవును పరిష్కరించే క్రమంలో.. శివుడు లింగరూపంలో అవతరించాడన్నది భక్తుల విశ్వాసం. లింగోద్భవం జరిగిన మాఘ బహుళ చతుర్దశి రోజున.. మహాశివరాత్రి జరుపుకోవడం ఆనవాయితీ. భక్తులు, పగలంతా ఉపవసించి, రాత్రంతా జాగరణ చేసి.. శివధ్యానంలో మునిగితేలుతుంటారు.

శివుడి సన్నిధిలో జాగరణ చేయాలని ఎక్కువమంది భక్తులు భావిస్తారు. అందుకే.. ముఖ్యమైన శైవక్షేత్రాలకు తరలివెళుతుంటారు. ఈ నేపథ్యంలో చారిత్రిక, పౌరాణిక ప్రాధాన్యత ఉన్న ఆలయాలన్నీ శివభక్తుల కోసం సన్నద్ధమయ్యాయి. ఆలయాల నిర్వాహకులు కూడా భక్తులకు ఎలాంటి ఇక్కట్లూ రాకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు. 

11:15 - March 7, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మహా శివారాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి స్వాముల వారి దర్శనానికి భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శివాలయాలు శివనామస్మరణాలతో మారుమ్రోగుతున్నాయి.
విశాఖపట్నంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముక్కంటి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు.
కీసర గుట్టలో శివనామ స్మరణం 
కీసర గుట్ట శివనామ స్మరణ మారుమ్రోగుతోంది. శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పశ్చిమ ముఖాన ఉన్న శివలింగం అత్యంత శక్తివంతమైందని పూజరలంటున్నారు. ఇక్కడ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించి.. తొలిపూజలు చేయడంతో ఈ ఆలయానికి శ్రీరామలింగేశ్వరాలయం అని పేరు వచ్చిందంటున్నారు. 
సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో తొలి పూజ అర్ధరాత్రి ఒంటిగంటకే ప్రారంభమైంది. హోంమంత్రి చినరాజప్ప తొలిపూజ చేశారు. సుదూరు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేటిలో స్నానాలు చేసి.. స్వామివారిని దర్శించుకున్నారు. శివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులకు విశ్వాసం. దీంతో భీమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. 
పశ్చిమగోదావరి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సోమవారం నాడు శివరాత్రి రావడంతో 'శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి'ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేని విధంగా స్వామివారి తలపై అన్నపూర్ణదేవి కొలువై ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 
యాదాద్రిలో శివరాత్రి ఉత్సవాలు
యాదాద్రిపై కొలువైన శ్రీపర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక సేవపై కళ్యాణ మండపానికి చేరుకున్న శివపార్వతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. రకరకాల ఆభరణాలతో స్వామిఅమ్మవార్లను అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 

10:45 - March 7, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మహా శివారాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి స్వాముల వారి దర్శనానికి భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శివాలయాలు శివనామస్మరణాలతో మారుమ్రోగుతున్నాయి.
కీసర గుట్ట
మహాశివరాత్రి సందర్భంగా కీసర గుట్టకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
శ్రీశైలాంలో భక్తుల సందడి 
శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మల్లిఖార్జునస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. 
కోటప్పకొండకు భక్తుల తాకిడి
గుంటూరు జిల్లా కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే ఆలయానికి పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

 

Don't Miss

Subscribe to RSS - శైవక్షేత్రాలు