శ్రీనివాసరెడ్డి

14:34 - October 25, 2018

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరగడం సంచలనం సృష్టించింది. ఆయనపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. విశాఖ ఎయిర్‌పోర్టులోని వెయిటర్స్ లాంజ్‌లో జగన్ ఉండగా.. కోడిపందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై వెయిటర్ శ్రీనివాస్ దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజంకి గాయమైంది. వెంటనే ఆయనకు చికిత్స చేసి హైదరాబాద్‌కు తరలించారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్‌కు వెళుతున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. 
ప్రభుత్వ లోపం..నిఘా వైఫల్యం కారణంగానే దాడి జరిగిందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. దాడి జరిగిన అనంతరం వైసీపీ నేతలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. దాడి చేసింది శ్రీనివాస్ రెడ్డి అని, పందెం కోళ్లకు ఉపయోగించిన కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. కత్తికి విషం కూడా ఉందని తెలుస్తోందని...అసలు కత్తి ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వం..సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. జగన్ హత్య చేసేందుకు పథకం రూపొందించారని, సీఎం చంద్రబాబు నాయుడికి హత్యా రాజకీయాలు చేసే పేరుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై ఇంకా తీవ్ర విమర్శలు...ఆరోపణలు పెల్లుబికే అవకాశం ఉంది.

17:47 - September 18, 2018

ఖమ్మం : ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన స్థలాల్లో హైదరాబాదులో 6 చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో ఉదయం 9 గంటలకు సోదాలను ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాఘవ ఇన్ ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ సోదాల వెనుక ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవని... ఇవన్నీ సాధారణ సోదాలేనని ఐటీ అధికారులు తెలిపారు. 2014లో వైసీపీ తరపున ఎంపీగా గెలుపొందిన పొంగులేటి... 2016లో టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. 

19:29 - July 10, 2018

సంగారెడ్డి : ఇటీవల కబడ్డీకి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభిస్తోంది. యువత కబడ్డీ క్రీడ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి కబడ్డీ జాతీయ జట్టుకు తెలుగు యువకుడు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గత నెల దుబాయ్‌లో జరిగిన ఇండియన్‌ మాస్టర్స్‌ టోర్నీలో ఇరాన్‌పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించి, కోచ్‌గా వ్యవహరించి.. సొంతగడ్డ సంగారెడ్డికి వచ్చిన శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం లభించింది. గత నెల దుబాయ్‌లో ఇండియన్‌ మాస్టర్‌ టోర్నీలో ఇరాన్‌పై జాతీయ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు.. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తారనీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాఠశాలలు, కాలేజీల్లో చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలన్నారు. క్రీడల పట్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసమని జాతీయ కబడ్డీ జట్టు కోచ్ శ్రీనివాసరెడ్డి సూచించారు. 

10:35 - June 23, 2018
07:08 - November 21, 2017

హైదరాబాద్ : అధికారపార్టీ యువజన నేత శ్రీనివాసరెడ్డి అరాచకాలపై పోరాటం చేస్తున్న రెండో భార్య సంగీత ఆందోళనకు మూడో భార్య తల్లి అండగా నిలిచింది..ఊహించని రీతిలో మలుపు తిరిగిన కేసులో ఇప్పటికే పోలీసులు శ్రీనివాసరెడ్డిని రిమాండ్ తరలించారు..అయితే న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని రెండోరోజు సంగీత ఆందోళన కొనసాగిస్తుంది...ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు..

అధికారపార్టీ యువజన నాయకుడు శ్రీనివాసరెడ్డిపై పోరాటం చేస్తున్న రెండో భార్య సంగీతకు మూడో భార్య దేవీ జగదీశ్వరి తల్లి శిరీష మద్దతుగా నిలిచింది...సంగీత ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న శిరీష బోడుప్పల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరింది...రెండో భార్య సంగీతను ఓదార్చిన ఆమె తమకు అన్యాయం చేశాంటూ ఆమెతో పాటు కలిసి న్యాయపోరాటం చేస్తుంది.. ఈ కేసులో అనుకోని మలుపు తిరగడంతో పోలీసులు...అటు శ్రీనివాసరెడ్డి కుటుంబం కూడా ఖంగుతింది..

పులకండ్ల శ్రీనివాసరెడ్డి....36 ఏళ్ల శ్రీనివాస్‌రెడ్డి రియల్‌ఎస్టేట్‌ బిజినెస్ చేస్తుంటాడు..ముందునుంచే దూకుడు స్వభావం ఉన్న శ్రీనివాస్‌రెడ్డి అధికారిక పార్టీ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుని యువజన నాయకుడయ్యాడు...ఇక ఖద్దరు ముసుగులో ఎన్నో అరాచకాలు చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నట్టింట్లో కూడా కట్టుకున్న భార్యలకు నరకం చూపించాడు...

ఇక వరంగల్ చెందిన యువతిని పెళ్లి చేసుకున్న శ్రీనివాసరెడ్డి ఎంతోకాలం కాపురం చేయలేదు..భార్యకు నరకం చూపించడంతో ఆమె దూరమైంది...ఆ తర్వాత శేరిలింగంపల్లి చెందిన సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు...రెండేళ్ల కాపురంలో కూతురు పుట్టింది...ఆడపిల్ల పుట్టిందంటూ వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయిన సంగీత అక్కడే ఉంది...న్యాయం చేయాలంటూ సంగీత చందానగర్‌, మేడిపల్లి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసింది. మేడిపల్లి పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అప్పట్లో రిమాండ్‌కు తరలించారు. 


ఇక మూడో పెళ్లి చేసుకున్న శ్రీనివాసరెడ్డి అరాచకాలు ఆగలేదు...మూడో భార్య కుటుంబం వారి పెళ్లిని నిరాకరిస్తే తనకున్న అధికార బలంతో వారిని బెదిరించాడు..కేసులు పెట్టించాడు..చివరకు కాలనీ నుంచి పారిపోయేలా చేశాడు..చివరకు వారు కేసు పెడితే భార్యతో తాను మేజర్‌నంటూ సంతకాలు పెట్టించాడు...ఇలా అరాచకాలు సృష్టిస్తున్న శ్రీనివాసరెడ్డి నుంచి న్యాయం కావాలంటూ రెండో భార్య సంగీత నేరుగా అత్తారింటికి చేరడంతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు.. స్థానికుల సమాచారంతో పారిపోయిన శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని రిమాండ్ తరలించారు...


మరోవైపు సంగీత రెండోరోజు కూడా భర్త ఇంటి ఎదుట తన ఆందోళనను కొనసాగిస్తోంది. తనకు, తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. సంగీత  అంతకు ముందు శ్రీనిసవారెడ్డి ఇంటి గేటుకు వేసిన తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించింది.  మరో వైపు ఆమె ఆందోళనకు మహిళా సంఘాలు అండగా నిలవడంతో ఆందోళన ఉధృతంగా మారింది. తనకు,తన కూతురికి న్యాయం జరిగేవరకు కదలనంటోంది సంగీత... ఆందోళన పెరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు...                           

16:16 - November 20, 2017
16:14 - November 20, 2017

మేడ్చల్ : బోడుప్పల్‌లో ఆడపిల్లపుట్టిందని భార్యపై దాడిచేసి ఇంటి నుంచి గెంటివేసిన భర్త శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తనకు న్యాయం చేయాలంటూ రెండో భార్య సంగీత.. భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తోంది. మూడో భార్య తల్లి కూడా సంగీతకు మద్దతు తెలిపింది. తన కూతురుకు మాయమాటలు చెప్పి శ్రీనివాస్‌రెడ్డి మూడో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. అధికార బలంతో అందరినీ బెదిరిస్తున్నాడని వాపోయింది. సంగీతకు మహిళాసంఘాలు బాసటగా నిలిచాయి.

11:41 - October 11, 2017

కరీంనగర్ : ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. కరీంనగర్ టౌన్, రామడుగు మండలం గోపాలరావు పేట లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. అధికారులు భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్, జ్యువెల్లరీని స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:03 - June 3, 2017
18:50 - May 30, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - శ్రీనివాసరెడ్డి